Involve .. Root for employment | ఇన్వల్యూట్.. ఉపాధికి రూట్
ఇన్వల్యూట్.. గేర్లాంటి ఓ పరికరం. గేర్ ఉంటేనే కదా! యంత్రం ముందుకు నడిచేది. జీవితం కూడా ముందుకు నడవాలంటే ఇన్వల్యూట్ లాంటి ఓ గేర్ కావాలి. విద్యార్థులు, నిరుద్యోగులు జీవితంలో స్థిరపడేలా ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పిస్తున్నది ఇన్వల్యూట్ టెక్నికల్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్. నిరుద్యోగ సమస్యను అధిగమించేం దుకు, దేశంలోని పేరొందిన పారిశ్రామిక సంస్థలకు నిపుణులను అందించేందుకు కృషి చేస్తున్నది. 2011 ఎన్ఎస్డీసీ సహకారంతో ప్రారంభమైన ఇన్వల్యూట్ సంస్థ ఉపాధి అవకాశాలు కల్పిస్తూ పారిశ్రామికాభివృద్ధికి బాటలు వేస్తున్నది. ఒకప్పుడు చిన్న స్టార్టప్‌గా ప్రారంభమైన ఈ ఇన్వల్యూట్ నేడు ఎంతోమందికి శిక్షణ ఇస్తున్నది.
పారిశ్రామికాభివృద్ధి..
మనదేశంలో నిపుణుల కొరత ఉంది. పది, ఇంటర్ ఫెయిలైన వారు, చదువును మధ్యలో ఆపేసినవారు చాలామంది ఉన్నారు. అందుకే యువతకు నైపుణ్యాలను అందించి పారిశ్రామిక రంగంలో రాణించేలా తోడ్పడుతున్నది. ఇన్వల్యూట్లో శిక్షణ పొందిన చాలామంది పెద్ద పెద్ద పరిశ్రమల్లో వాహనాల తయారీ, విడి భాగాలు, భారీ మెషిన్లు తయారు చేసే వృత్తుల్లో పనిచేస్తున్నారు. పరిశ్రమలకు కావాల్సిన నిపుణులను అందిస్తూ ఆ రంగంలోని వ్యక్తుల కొరతను అధిగమిస్తున్నది ఇన్వల్యూట్. ఏడాదికి మూడు బ్యాచ్‌ల చొప్పున ఆరువేల మందికి శిక్షణ ఇస్తున్నది.
కోర్సులు
-మెషినింగ్ టెక్నీషియన్, మెయింటెనెన్స్ టెక్నీషియన్ – సర్వీస్ వర్క్‌షాప్, ఫిట్టర్ మెకానికల్ అసెంబ్లీ, ఫిట్టర్ ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్ అసెంబ్లీ, ఆటోమేషన్ ఇన్ పి.ఎల్.సి. ఈ కోర్సులు పూర్తిచేసినవారికి సెక్టార్ స్కిల్ కౌన్సిల్ సహకారంతో కేంద్ర ప్రభుత్వ ధ్రువీకరణ పత్రం అందిస్తారు.
ఎలాంటి సంస్థల్లో?
జీఎంఆర్, మారుతి, రాణే క్యాస్టింగ్, మేధా ఇండియా, భారత్ బయోటెక్, మైక్రొమాక్స్ లాంటి సంస్థల్లో ఉద్యోగ అవకాశాలు
-అర్హత: టెన్త్, ఇంటర్, ఐటీఐ, డిప్లొమా పాస్/ఫెయిల్
-శిక్షణ కాలం: 45 రోజులు
-బ్రాంచీలు: హైదరాబాద్, నల్లగొండ, వరంగల్, మహబూబ్‌నగర్, పుణె, వైజాగ్, గుంటూరు
-ఉద్యోగ ఉపాధి అవకాశాలు: శిక్షణ అనంతరం నైపుణ్యాన్ని బట్టి (పారిశ్రామిక సంస్థల్లో రూ. 9,000 నుంచి రూ.11,000 వరకు వేతనాలు)
మరిన్ని వివరాలు..
-ఇన్వల్యూట్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నికల్ ట్రైనింగ్, బాలానగర్, హైదరాబాద్. 040-40192468
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
తాత్వికతను తెలిపేది.. రాజ్యాంగానికి గుండెలాంటిది
ఎలకానిక్ రికార్డులు.. ప్రాథమిక సాక్ష్యాలు
శుక్రకణాలు తాత్కాలికంగా నిల్వ ఉండే ప్రాంతం?
సెకండరీ ఎడ్యుకేషన్ కమిషన్‌కు మరోపేరు?
‘వెయ్యి ఉరిల మర్రి’ గా పేరుగాంచిన ఊడలమర్రి ఏ జిల్లాలో ఉంది?
రక్షణ దుర్గాలు – నాటి పాలనా విభాగాలు
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?