జాతీయస్థాయిలో వ్యవసాయ సగటు కమతం?
1. ఐక్యరాజ్యసమితి 2017ని ఏ సంవత్సరంగా ప్రకటించింది?
1) సుస్థిర పర్యాటక అభివృద్ధి ఏడాది
2) శరణార్థుల ఏడాది
3) పేదరిక నిర్మూలన ఏడాది
4) బాలికల సంవత్సరం
2. సర్క్యులేషన్లో ఉన్న మొత్తం కరెన్సీలో రద్దు చేసిన పాత రూ. 500, రూ. 1000 నోట్లు సుమారు ఎంత శాతం ఉన్నాయి?
1) 15 2) 35
3) 56 4) 86
3. కేంద్ర ప్రభుత్వం గోధుమ పంటకు కనీస మద్దతు ధర ఎంత ప్రకటించింది (క్వింటాలుకు)?
1) రూ. 3200 2) రూ. 1625
3) రూ. 1985 4) రూ. 2300
4. రిజర్వ్ బ్యాంక్ ప్రకటన ప్రకారం భారతదేశ గ్రాస్ వ్యాల్యూయాడెడ్ వృద్ధిరేటు 2016-17 లో ఎంత ?
1) 7.1 శాతం 2) 5.9 శాతం
3) 8.9 శాతం 4) 9.2 శాతం
5. దేశంలో అత్యధికంగా బియ్యం ఉత్పత్తి చేసే రాష్ట్రం?
1) పంజాబ్
2) పశ్చిమ బెంగాల్
3) తమిళనాడు
4) ఆంధ్రప్రదేశ్
6. ప్రపంచంలో మొదటి కేంద్ర బ్యాంకు ఏది?
1) రిక్స్ బ్యాంక్
2) ఫెడరల్ బ్యాంక్ అమెరికా
3) లండన్ బ్యాంక్
4) స్విస్ బ్యాంక్
7. హైదరాబాద్‌లో డీబీటీ (నేరుగా లబ్ధిదారునికి బదిలీ) పద్ధతిని ఎవరు ప్రారంభించారు?
1) నరేంద్రమోదీ 2) ప్రకాశ్ జవదేకర్
3) కే తారకరామారావు
4) ఈటల రాజేందర్
8. తెలంగాణలో తొలి ఆర్నెళ్లలో నమోదైన వృద్ధిరేటు?
1) 10.8 శాతం 2) 10.2 శాతం
3) 9.2 శాతం 4) 8.2 శాతం
9. రాష్ట్రంలో తొలి ఆర్నెళ్లలో వ్యవసాయరంగంలో నమోదైన వృద్ధి రేటు ఎంత?
1) 4.7 శాతం 2) 2.6 శాతం
3) 4.3 శాతం 4) 3.9 శాతం
10. జాతీయస్థాయిలో 2016-17 ఆర్థిక ఏడాది తొలి ఆర్నెళ్లలో నమోదైన వృద్ధిరేటు ఎంత?
1) 10.8 శాతం 2) 7.2 శాతం
3) 9.2 శాతం 4) 8.2 శాతం
11. కింది వాటిలో జాతీయస్థాయిలో తొలి ఆర్నెళ్లలో వివిధ రంగాల్లో నమోదైన వృద్ధిరేటు లో సరైనవి?
1. ప్రాథమికరంగం ఎ) 7.2
2. ద్వితీయరంగం బి) 6.3
3. తృతీయరంగం సి) 9.2
4. మొత్తం వృద్ధిరేటు డి) 1.9
1) 1. డి 2. బి 3. సి 4. ఎ
2) 1. ఎ 2. సి 3. బి 4. డి
3) 1. డి 2. సి 3. బి 4. ఎ
4) 1. బి 2. సి 3. ఎ 4. డి
12. 2014 గణాంకాల ప్రకారం మన దేశంలో రోజూ కనీస పోషకాహారం కింద తలసరి పప్పు ధాన్యాల లభ్యత ఎంత?
1) 50 గ్రాములు
2) 47.2 గ్రాములు
3) 64 గ్రాములు
4) 83.5 గ్రాములు
13. 2014 గణాంకాల ప్రకారం ప్రపంచంలో పండే మొత్తం కందుల్లో మన దేశం వాటా?
1) 65 శాతం 2) 43 శాతం
3) 36 శాతం 4) 31 శాతం
14. డిజిటల్ చెల్లింపులకు సంబంధించిన కమిటీ సమర్పించిన నివేదికలో సరైనవి?
1) బ్యాంకుల నుంచి రూ. 50 వేలు దాటితే రుసుము చెల్లించాలి
2) ఆదాయ పన్ను పరిధిలోకి రాని వారికి స్మార్ట్‌ఫోన్, బయోమెట్రిక్ యంత్రాల కొనుగోలుపై రూ. 1000 రాయితీ ఇవ్వాలి
3) డిజిటల్ చెల్లింపులపై చెల్లించే రుసుములను రద్దు చేయాలి
4) పైవన్నీ సరైనవే
15. అన్నదాతల ఆదాయాన్ని ఏ సంవత్సరం లోపు రెట్టింపు చేస్తానని ప్రధాని మోదీ ప్రకటించారు?
1) 2021 2) 2018
3) 2019 4) 2022
16. ప్రస్తుత ఆర్థిక ఏడాది ఆరు నెలల్లో తెలంగాణలో వివిధ రంగాల్లో వృద్ధిరేటు ఎంత?
ఎ. ప్రాథమిక రంగంలో వృద్ధిరేటు 4.9% బి. ద్వితీయ రంగంలో వృద్ధిరేటు 7.7%
సి. తృతీయ రంగంలో వృద్ధిరేటు 11.9% డి. రాష్ట్ర స్థూల విలువ జోడింపు (జీఎస్వీఏ) 7.2%
1) ఎ, బి, సి 2) ఎ, సి, డి
3) బి, సి, డి 4) ఎ, బి, సి, డి
17. 2015-16 ఆర్థిక ఏడాదికి సంబంధించి రాష్ట్రంలో కింది వాటిలో సరైనవి?
ఎ. సాగునీటి వసతి గల భూమి 14.86 లక్షల హెక్టార్లు
బి. రాష్ట్రంలో ఆహార ధాన్యాల దిగుబడి 51.45 లక్షల టన్నులు
సి. రాష్ట్రంలో నూనె గింజల దిగుబడి 5.79 లక్షల టన్నులు
డి. రాష్ట్రంలో వ్యవసాయ సగటు కమతం 1.12 హెక్టార్లు (2.8 ఎకరాలు )
1) ఎ, బి, సి 2) ఎ, సి, డి
3) బి, సి, డి 4) పైవన్నీ
18. జాతీయస్థాయిలో వ్యవసాయ సగటు కమతం?
1) 1.4 హెక్టార్లు 2) 1.16 హెక్టార్లు
3) 1.8 హెక్టార్లు 4) 1.3 హెక్టార్లు
19. షుగర్ బౌల్ ఆఫ్ ది వరల్డ్ అని ఏ దేశాన్ని పిలుస్తారు?
1) క్యూబా 2) బ్రెజిల్
3) భారత దేశం 4) చైనా
20. స్వల్పకాలిక పంట రుణాలకు గతేడాది నవంబర్-డిసెంబర్ కాలానికి ఎంత మొత్తం వడ్డీని మాఫీ చేశారు?
1) 606.50 కోట్లు 2) 660.50 కోట్లు 3) 600.50 కోట్లు 4) 616.50 కోట్లు
21. కేంద్ర ప్రభుత్వం ఉద్యోగుల కనీస పింఛన్‌ను ఎంతగా నిర్ణయించింది?
1) రూ.7,000 2) రూ. 8,000
3).రూ.8,000 4) రూ. 9,000
22. అటల్ అమృత్ యోజనను ఎక్కడ ప్రారంభించారు?
1) అసోం 2) గుజరాత్
3) ఛత్తీస్‌గఢ్ 4) మధ్యప్రదేశ్
23. డిజిటల్ చెల్లింపులకు సంబంధించిన కమిటీ ఏది?
1) రంగరాజన్ కమిటీ
2) వైవీ రెడ్డి కమిటీ
3) వర్మ కమిటీ
4) రతన్ వతల్ కమిటీ
24. నగదు రహిత ఎకానమీ/డిజిటల్ పేమెంట్స్ ఎకానమీ అధ్యయనం చేయటానికి నియమించిన కమిటీకి అధ్యక్షుడు?
1) రంగరాజన్
2) చంద్రబాబునాయుడు
3) అరవింద పనగరియా
4) నితీష్ కుమార్
25. విఠల్ వీ ఆచార్య ఎవరు?
1) యూపీఎస్సీ చైర్మన్
2) ఆర్బీఐ డిప్యూటీ గవర్నర్
3) ఎల్ఐసీ చైర్మన్
4) సీబీడీటీ చైర్మన్
26. ప్రపంచంలో అతిపెద్ద ఎక్సే స్టాక్ ఇండియా ఐఎన్ఎక్స్ ఎక్కడ పారంభమైంది?
1) గుజరాత్ 2) ఢిల్లీ
3) హర్యానా 4) ముంబై
27. తెలంగాణలో పాఠశాలలో చేరని బాలికల (11-14 వయస్సుగలవారు) శాతం?
1) 4.7 శాతం 2) 3.8 శాతం 3) 2.4 శాతం 4) 6.1శాతం
సమాధానాలు
1-1, 2-4, 3-2, 4-1, 5-2, 6-1, 7-2, 8-2, 9-1, 10-2, 11-1, 12-2, 13-1, 14-4, 15-4, 16-4, 17-4, 18-2, 19-1, 20-2, 21-3, 22-1, 23-2, 24-2, 25-2, 26-1, 27-1
ఆర్థిక సర్వే విశేషాలు
- ఆర్థికవృద్ధిపై సర్వే స్పందిస్తూ భారతదేశానికి 8-10 శాతం వృద్ధిరేటును సంపాదించే సామర్థ్యం ఉందని, మనం పూర్తి సామర్థ్యంతో పనిచేయకపోవడం వల్ల తక్కువ వృద్ధిరేటులోనే ఆగిపోవాల్సి వస్తుందని పేర్కొంది.
- 2017-18 ముందస్తు అంచనాలుగా వృద్ధిరేటును 6.75 నుంచి 7.5 శాతం మధ్య ఉంచింది.
ఆర్థికవృద్ధిని GDP, GNP, NNP అనే అంశాలతో లెక్కిస్తారు. - వాణిజ్యాన్నే ఇంధనంగా తీసుకుని వృద్ధిరేటును కొనసాగిస్తున్న చైనాను సైతం వెనక్కినెట్టి భారత్ ముందంజ వేసింది.
- 2011 నాటికి జీడీపీలో వాణిజ్యం వాటా చైనాను దాటింది. దేశీయ వాణిజ్యం వాటా కూడా విపరీతంగా పెరిగి చైనాకు సవాలు విసురుతున్నది.
- రుతుపవనాల మందగమనం వల్ల గతేడాది అతి తక్కువ వృద్ధిరేటును నమోదు చేసిన వ్యవసాయరంగం ఈసారి మాత్రం అనుకోనివిధంగా 4 శాతానికిపైగా నమోదైంది.
- 2015-16లో కేవలం 1.2 శాతం వృద్ధిరేటును నమోదు చేయగా అది 2016-17కి 4.1 శాతంగా సర్వే అంచనావేసింది.
- 2014-15లో 5.9 శాతంగా ఉన్న పారిశ్రామిక వృద్ధి 2015-16కి 7.4 శాతానికి పెరిగిందని, మళ్లీ డీమానిటైజేషన్, తక్కువ ద్రవ్యోల్బణం వల్ల అది 5.2 శాతానికి పడిపోయిందని సర్వే పేర్కొంది.
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?
దేశాల అనుసంధానం.. వాణిజ్య అంతఃసంబంధం
కణ బాహ్య జీర్ణక్రియ
ఇంటి పని వద్దన్నవారు.. స్వీయ శిక్షణ ఉండాలన్నవారు
జీవావరణ వ్యవస్థకు కావలసిన మూలశక్తి దారులు?
మౌజియన్ అనే గ్రీకు పదానికి అర్థం?
సమాజ మేధో కేంద్రాలు.. నాగరికతకు చిహ్నాలు