Which soil is also known as ‘Brick Soil’ | ఏ నేలలను ‘బ్రిక్ సాయిల్’ అంటారు?
# తెలంగాణ జాగ్రఫీ- గ్రూప్స్ ప్రత్యేకం
# నేలలు, అడవులు, నదులు – నీటిపారుదల ప్రాజెక్టులు
-భూమి ఉపరితలంపై వదులుగా ఉన్న పొరనే ‘నేల’ అంటారు.
-నేలను గురించి అధ్యయనం చేసే శాస్త్రాన్ని ‘పెడాలజి’ అంటారు.
-శిలలు శైథిల్యం చెందగా ఏర్పడే పదార్థాన్ని ‘మృత్తిక అంటారు.
-తెలంగాణ రాష్ట్రం భారత ద్వీపకల్పంలోని ఈస్ట్రన్ సీ బోర్డ్ మధ్య పేలికలో దక్కన్ పీఠభూమిపై ఉంది.
-తెలంగాణ రాష్ట్రం అధిక సారవంతమైన ఒండ్రు నేలల నుంచి నిస్సారమైన ఇసుక నేలల వరకు పలు రకాల నేలలను కలిగి ఉంది.
-తెలంగాణలో ఎగుడు, దిగుడులుగల పెనిప్లేయిన్లు కలిగి ఉన్నప్పటికీ ఎర్ర నేలలు, నల్ల నేలలు, లాటరైట్ నేలలు విస్తరించి ఉన్నాయి.
-రాష్ట్రంలో ప్రధానంగా ఎర్ర నేలలు, ఒండ్రు నేలలు, నల్లరేగడి నేలలు, లాటరైట్ నేలలు విస్తరించి ఉన్నాయి.
ఎర్ర నేలలు
-రాష్ట్రంలో అధిక భాగం ఎర్ర నేలలు ఉన్నాయి.
-ఈ నేలల్లో.. మొక్కలకు కావాల్సిన పౌష్టిక, సేంద్రియ పదార్థాలు తక్కువ, భాస్వరం అధికంగా ఉంటుంది.
-తెలంగాణలో ఈ నేలలను చెల్క, దుబ్బ నేలలుగా వర్గీకరించారు. అందులో చెల్క నేలలు క్వార్ట్జైట్, ముడి గ్రానైట్ రాళ్లు రూపాంతరం చెందడంవల్ల ఏర్పడుతాయి. చెల్క నేలలు చాలా దిగువగా అంటే గుట్టల మధ్య భాగం వాలు భూముల్లో ఎక్కువగా ఉంటాయి.
-దుబ్బ నేలలు తక్కువ సారవంతం కలిగి ఉండి పాలిపోయిన బూడిద రంగులో ఉంటాయి.
-ఈ ఎర్ర నేలల్లో ప్రధానంగా వేరుశనగ పండుతుంది.
-ఎర్ర నేలలు వదులుగా ఉంటాయి.
-ఈ ఎర్ర నేలలు రాష్ట్రంలోని మహబూబ్‌నగర్, నల్లగొండ, ఖమ్మం, వరంగల్, కరీంనగర్, రంగాడ్డి, నిజామాబాద్‌లలో ఎక్కువగా విస్తరించి ఉన్నాయి. ఆదిలాబాద్ జిల్లాలో ఈ నేలలు తక్కువగా ఉన్నాయి.
-ఈ నేలలు రాష్ట్రంలో 48 శాతం విస్తరించి ఉన్నాయి.
నల్లరేగడి నేలలు
-అర్ధశుష్క పరిస్థితులు ఉండే దక్కన్ పీఠభూమిలో లావా, నీస్, గ్రానైట్ శిలలపై ఈ మృత్తికలు ఏర్పడుతాయి.
-ఇవి ఎక్కువగా బంకమట్టితో ఉండి, తేమను నిల్వ ఉంచుకునే శక్తి కలిగి ఉంటాయి.
-ఈ నేలలను ‘రేగర్ నేలలు’ అంటారు.
-ఈ నేలల్లో ఇనుము, కాల్షియం శాతం ఎక్కువగా, భాస్వరం, నైట్రోజన్, సేంద్రియ పదార్థం శాతం తక్కువగా ఉంటాయి.
-ఈ నేలలు ఆదిలాబాద్, రంగాడ్డి, నిజామాబాద్‌లలో ఎక్కువగా.. కరీంనగర్, వరంగల్, మహబూబ్‌నగర్‌లలో తక్కువగా విస్తరించి ఉన్నాయి.
-ఈ నేలల్లో ప్రధానంగా పత్తి, పొగాకు, పసుపు, మిరప, సజ్జ, జొన్న పంటలు అధికంగా పండుతాయి.
-రాష్ట్రంలో ఈ నేలలు 25 శాతం విస్తరించి ఉన్నాయి.
-ఈ నేలలు తేమను చాలా కాలం నిల్వ ఉంచుకుంటాయి.
రాతి నేలలు (లాటరైట్ నేలలు)
-ఈ నేలలు దేశంలో 4.3 శాతం విస్తరించాయి.
-రాష్ట్రం మొత్తంగా అన్ని జిల్లాల్లో ఈ నేలలు 25 శాతం విస్తరించి ఉన్నాయి.
-ఈ నేలలు తడిసినప్పుడు మెత్తగా ఉండి, ఎండినప్పుడు గట్టిగా ఉంటాయి. అందుకే వీటిని ‘బ్రిక్ సాయిల్’ అంటారు.
-ఈ నేలలు ఆమ్ల లక్షణాలను కలిగి ఉంటాయి.
-ఈ నేలలు అల్యూమినియం, ఇనుముల హైడ్రైడ్ ఆకై్సడ్ మిశ్రమం.
-ఈ నేలలు వర్షానికి తడిచి నల్లగా మారుతాయి.
-ఇవి ఎక్కువ వర్షపాతం, అధిక తేమ, ఎక్కువ ఉష్ణోక్షిగతగల ప్రాంతాల్లో ఏర్పడుతాయి.
-ఈ నేలలు మెదక్, ఖమ్మం జిల్లాల్లో మాత్రమే విస్తరించి ఉన్నాయి.
-ఈ నేలలు పీత వర్ణం, గోధుమ, ఎరుపు రంగులను కలిగి ఉంటాయి.
-ఈ నేలతో ఇటుకలు తయారు చేస్తారు.
-ఈ నేలలో కాఫీ, తేయాకు, రబ్బరు, జీడి మామిడి, సుగంధ ద్రవ్య పంటలు ఎక్కువగా పండుతాయి.
ఒండ్రు నేలలు
-ఈ నేలలు నదులు అనేక ఏండ్లుగా తమ ప్రవాహ క్రమంలో తీసుకొచ్చిన ఒండ్రుమట్టిని నిక్షేపణం చేయటం వలన ఏర్పడుతాయి.
-ఈ నేలలు తెలంగాణ విస్తీర్ణంలో 3వ స్థానాన్ని ఆక్రమించాయి.
-ఈ నేలలు నీటిని నిలువ చేసుకుంటాయి.
-ఈ నేలలు అత్యంత సారవంతమైనవి.
-ఈ నేలల్లో పొటాష్ శాతం ఎక్కువగా ఉండి, నైట్రోజన్, పాస్ఫరస్‌లు తక్కువ శాతంలో ఉంటాయి.
-ఈ నేలలు అధికంగా గోదావరి, కృష్ణా, పెన్నా నదుల డెల్టా ప్రాంతాల్లో ఉన్నాయి.
-ఈ నేలలు వరి, చెరకు, అరటి, మామిడి, నిమ్మ, బత్తాయి పంటలకు శ్రేష్ఠమైనవి.
-ఈ నేలలు మెత్తటి రేణుయుత అవక్షేపాలు నిక్షేపించడంవల్ల ఏర్పడ్డాయి.
-ఈ మృత్తికల్లో ఇసుక పాలు ఎక్కువ.
-ఈ నేలలు పసుపు రంగులో ఉంటాయి.
-ఈ నేలల్లో పొటాష్, సున్నపురాయి సమృద్ధిగా ఉంటాయి. నత్రజని తక్కువగా ఉంటుంది.
-రాష్ట్రంలో ఈ నేలలు 20 శాతం విస్తరించి ఉన్నాయి.
-మృత్తికల నిర్మాణం ఎలా జరుగుతుందో తెలిపే శాస్త్రం – లిథాలజి
-ఐసీఏఆర్ (ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ అగ్రికల్చరల్ రిసెర్చ్) న్యూఢిల్లీ సంస్థ దేశంలో నేలలను 8 రకాలుగా వర్గీకరించింది.
తెలంగాణ – అడవులు
-Forest అనే ఆంగ్ల పదం ‘Fores’ అనే లాటిన్ భాషా పదం నుంచి వచ్చింది.
-‘Fores’ అంటే గ్రామం వెలుపలి ప్రాంతం అని అర్థం.
-ప్రపంచ అటవీ దినోత్సవం – మార్చి 21
-1952 జాతీయ అటవీ విధాన తీర్మానం ప్రకారం మొత్తం దేశ భూభాగంలో 33.3 శాతం అడవులు కలిగి ఉండాలి. కానీ దేశ భూభాగంలో 20.5 శాతం మాత్రమే అడవులున్నాయి.
-2011ను UNO అటవీ సంవత్సరంగా ప్రకటించింది.
-రాష్ట్రంలో ఎక్కువ విస్తీర్ణం అడవులుగల జిల్లా ఖమ్మం, తర్వాత స్థానం ఆదిలాబాద్ జిల్లాది. అడవులు లేని జిల్లా హైదరాబాద్.
-నల్లగొండ జిల్లాలో 6.03 శాతంతో అతి తక్కువ అడవులున్నాయి.
-ప్రస్తుత ధరల ప్రకారం 2014-15లో రాష్ట్ర GSDPలో అటవీ సంపద, కలప రంగం 0.9 శాతం వాటాను కలిగి ఉండగా, వ్యవసాయ రంగం 5.02 శాతం వాటాను కలిగి ఉంది.
-రాష్ట్రంలో సామాజిక అడవులతో కలిపి అటవీ విస్తీర్ణం 29,242 చ.కి.మీ.
-అటవీ విస్తీర్ణంలో రాష్ట్రం 12వ ర్యాంకులో ఉంది.
అడవులు – రకాలు
1. ఆర్థ్ర ప్రాంతంలోని ఆకురాల్చే అడవులు
-ఈ అరణ్యాలు 125-200 సెం.మీ వర్షపాతంగల ప్రాంతాల్లో పెరుగుతాయి.
-ఈ అడవుల్లో పెరిగే ముఖ్యమైన చెట్లు వేగి, మద్ది, జిట్టగి మొదలైనవి. అనేక రకాల కలప కూడా లభ్యమవుతుంది.
-ఈ అడవులు ఖమ్మం, వరంగల్, ఆదిలాబాద్, కరీంనగర్, నిజామాబాద్, మహబూబ్‌నగర్‌లలో విస్తరించి ఉన్నాయి.
2. అనార్థ్ర ప్రాంతంలోని ఆకురాల్చే అడవులు
-ఈ అడవులు 75-100 సెం.మీ వర్షపాతంగల ప్రాంతాల్లో అభివృద్ధి చెందుతాయి.
-ఈ అడవుల్లో ముఖ్యమైన చెట్లు వెలగ, వేప, దిరిశెన, బూరుగు, వెదురు మొదలైనవి. కలప కూడా లభ్యమవుతుంది.
-ఈ అడవులు ఆదిలాబాద్, వరంగల్, ఖమ్మం, నిజామాబాద్, కరీంనగర్ జిల్లాల్లో ఎక్కువగా విస్తరించి ఉన్నాయి.
ముళ్లతో కూడిన పొద అడవులు
-వర్షపాతం తక్కువగా ఉన్న ప్రాంతాల్లో పెరుగుతాయి.
-ఈ అడవులు నల్లగొండ, రంగాడ్డి జిల్లాల్లో విస్తరించి ఉన్నాయి.
-ఈ అడవుల్లో తుమ్మ, రేగు చెట్లు పెరుగుతాయి.
-ఫారెస్ట్ డిపార్ట్మెంట్ రిపోర్ట్ 2013 ప్రకారం తెలంగాణలో అడవుల శాతం
అత్యధికం
జిల్లా చ.కి.మీ
ఖమ్మం 42.13 శాతం
ఆదిలాబాద్ 37.48 శాతం
వరంగల్ 23.66 శాతం
అత్యల్పం
నల్లగొండ 1.08 శాతం
మెదక్ 5.98 శాతం
రంగాడ్డి 5.02 శాతం
-రాష్ట్రంలో సామాజిక అటవీ విస్తీర్ణ శాతం – 30 శాతం
-రిజర్వ్డ్ అటవీ విస్తీర్ణం – 21,024 చ.కి.మీ.
-రక్షిత అటవీ విస్తీర్ణం – 7,468 చ.కి.మీ.
-అత్యధిక అటవీ విస్తీర్ణంగల జిల్లాలు – 4 (1. ఖమ్మం 2. ఆదిలాబాద్ 3. వరంగల్ 4. మహబూబ్‌నగర్)
-అత్యల్ప అటవీ విస్తీర్ణంగల జిల్లాలు – 4 (1.హైదరాబాద్ 2. రంగాడ్డి 3. నల్లగొండ 4. మెదక్)
-ప్రస్తుత ధరల ప్రకారం వ్యవసాయ రంగంలో అటవీ వాటా – 5.02 శాతం.
సంరక్షణ కేంద్రాలు
జిల్లా – సంరక్షణ కేంద్రాలు
-ఆదిలాబాద్ – లంజమడుగు మొసళ్ల సంరక్షణ కేంద్రం, కవ్వాల్ వన్యవూపాణి సంరక్షణ కేంద్రం
-ఖమ్మం – కిన్నెరసాని మొసళ్ల సంరక్షణ కేంద్రం
-వరంగల్ – ఏటూరు నాగారం వన్యవూపాణి సంరక్షణ కేంద్రం
-హైదరాబాద్ – మహావీర్ హరిణ వనస్థలి
-నల్లగొండ – నాగార్జున సాగర్ మొసళ్ల సంరక్షణ కేంద్రం
-మహబూబ్‌నగర్ – పిల్లలమర్రి
-మెదక్ – మంజీరా మొసళ్ల సంరక్షణ కేంద్రం
-నిజామాబాద్ జిల్లాలో దొరికే రూసా గడ్డి నుంచి సుగంధ తైలాన్ని తీస్తారు. ఏజెన్సీ ప్రాంతాల్లోనూ తెలంగాణ అడవుల్లో అడ్డాకులు, బంక, తేనె, చింతపండు, ఉసిరి, కుంకుడు లభ్యమవుతున్నాయి.
-రాష్ట్రంలోని నిజామాబాద్ నుంచి ఆదిలాబాద్, కరీంనగర్, వరంగల్ గుండా ఖమ్మం జిల్లా వరకు గోదావరి నది ఒడ్డు వెంట దట్టమైన అడవులున్నాయి.
-సవరించిన 2002 రాష్ట్ర విధానం ‘విజన్ 2020’ ప్రకారం అటవీ శాఖ ప్రస్తుతం ఉన్న అడవుల సంరక్షణ, అభివృద్ధి, ఉత్పాదకత, ఆర్థిక విలువ పెంపుదల కోసం పలు రకాల అభివృద్ధి కార్యక్షికమాలను అమలు చేస్తోంది.
-రాష్ట్రంలో 2,939కి పైగా మొక్క జాతులు, 365 పక్షి జాతులు, 103 క్షీరద జాతులు, 28 సరీసృపాలు, 21 ఉభయచర జాతులు వీటితోపాటు పెద్ద సంఖ్యలో అకశేరుకాలు ఉన్నాయి.
-అటవీ అభివృద్ధి ఏజెన్సీలు మూడంచెల వ్యవస్థ ద్వారా నిర్వహించబడుతున్నాయి.
1. రాష్ట్ర స్థాయిలో రాష్ట్ర అటవీ అభివృద్ధి ఏజెన్సీ (స్టేట్ ఫారెస్ట్ డెవలప్మెంట్ ఏజెన్సీ – SFDA)
2. డివిజన్ స్థాయిలో ఫారెస్ట్ డెవలప్మెంట్ ఏజెన్సీ (ఫాస్ట్ డెవలప్మెంట్ ఏజెన్సీ – FDA)
3. గ్రామ స్థాయిలో వన సంరక్షణ సమితి (VSS)
రాష్ట్రంలో అటవీ సంబంధిత సంస్థలు
సంస్థ ప్రదేశం
1. తెలంగాణ ఫారెస్ట్ అకాడమీ దూలపల్లి (రంగాడ్డి)
2. అటవీ క్షేత్ర పరిశోధన కేంద్రం దూలపల్ల్లి (రంగాడ్డి)
3. ఫారెస్ట్ రిసెర్చ్ డివిజన్ హైదరాబాద్, వరంగల్
4. స్టేట్ ఫారెస్ట్ రిసెర్చ్
అండ్ డెవలప్మెంట్ సర్కిల్ హైదరాబాద్
5. ప్రాంతీయ అటవీ
పరిశోధనా కేంద్రం ములుగు (మెదక్)
నదులు – నీటిపారుదల ప్రాజెక్టులు
-మహాసమువూదాల గురించి అధ్యయనం చేయటాన్ని ‘ఓషియాలజి’ అంటారు.
-నదుల గురించి అధ్యయనం చేసే శాస్త్రం – పోటమాలజి
-నీటిని గురించి అధ్యయనం చేసే శాస్త్రం – హైడ్రాలజి
-రాష్ట్ర భూ భాగం మొత్తం వాయవ్యాన ఎత్తుగా ఉండి ఆగ్నేయ దిశగా వాలి ఉండటంతో.. రాష్ట్రంలో ప్రవహించే నదులన్నీ వాయవ్య దిశ నుంచి ఆగ్నేయ దిశకు ప్రవహిస్తూ బంగాళాఖాతంలో కలుస్తున్నాయి. గోదావరి, కృష్ణా, పెన్నా, తుంగభద్ర, భీమ, మంజీర, ప్రాణహిత తప్ప రాష్ట్రంలో ప్రవహించే మిగతా నదులన్నీ తూర్పు కనుమల్లో పుట్టి బంగాళాఖాతంలో కలుస్తున్నాయి.
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
తాత్వికతను తెలిపేది.. రాజ్యాంగానికి గుండెలాంటిది
ఎలకానిక్ రికార్డులు.. ప్రాథమిక సాక్ష్యాలు
శుక్రకణాలు తాత్కాలికంగా నిల్వ ఉండే ప్రాంతం?
సెకండరీ ఎడ్యుకేషన్ కమిషన్‌కు మరోపేరు?
‘వెయ్యి ఉరిల మర్రి’ గా పేరుగాంచిన ఊడలమర్రి ఏ జిల్లాలో ఉంది?
రక్షణ దుర్గాలు – నాటి పాలనా విభాగాలు
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?