Sagar mala project | సాగరమాల ప్రాజెక్టు
సువిశాల తీరప్రాంతం భారతదేశం సొంతం
-దేశాభివృద్ధిలో ఈ తీరప్రాంత ప్రాధాన్యాన్ని పెంచేందుకు కేంద్రంలోని ఎన్డీయే ప్రభుత్వం కొత్తగా రూపొందించిన పథకమే సాగరమాల
-ఈ ప్రాజెక్టు ద్వారా దేశ తూర్పు, పశ్చిమ తీరంలోని నౌకాశ్రయాలను అభివృద్ధిచేసి రోడ్డు, రైలు, వాయు మార్గాలతో అనుసంధానిస్తారు. తద్వారా తీరప్రాంతాల అభివృద్ధితోపాటు దేశాభివృద్ధికి జల రవాణాను చోదకశక్తిగా మార్చటం ఈ పథకం ఉద్దేశం.
-దేశంలో 12 నౌకాశ్రయాలను అభివృద్ధి చేసేందుకు ఉద్దేశించిన ఈ పథకానికి కేంద్ర క్యాబినెట్ 2015 మార్చి 25న ఆమోదం తెలిపింది.
-ఈ ప్రాజెక్టును బెంగళూరులో 2015 జూలై 31న ప్రారంభించారు.
-ఈ పథకం అమలుకోసం కేంద్ర షిప్పింగ్శాఖ మంత్రి నేతృత్వంలో సంబంధిత కేంద్ర క్యాబినెట్ మంత్రులు, రాష్ర్టాల ముఖ్యమంత్రులతో నేషనల్ సాగరమాల అపెక్స్ కమిటీని ఏర్పాటుచేశారు.
-ఈ ప్రాజెక్టు ద్వారా సమగ్రమైన తీరప్రాంత ఆర్థిక మండలి (సీఈఆర్)ని ఏర్పాటుచేస్తారు.
-నౌకాశ్రయాల ఆధునీకరణ, నౌకాశ్రయాల కార్యకలాపాలను వ్యవస్థీకృతంచేయటం, సుస్థిర, సమర్థవంతమైన రవాణా మౌలికవసతులను అభివృద్ధి చేయటం ద్వారా జాతీయాదాయానికి 2 శాతం సంపదను అందించటం ఈ పథకం లక్ష్యాల్లో ఒకటి.
-ఇందులో భాగంగా 1200కు పైగా చిన్న, పెద్ద దీవులను అనుసంధానిస్తూ 189 లైట్‌హౌస్‌లను నెలకొల్పాలని నిర్ణయించారు.
RELATED ARTICLES
-
Current Affairs | SBI నాలుగో స్టార్టప్ బ్రాంచిని ఎక్కడ ఏర్పాటు చేశారు?
-
Scholarship 2023 | Scholarships for Students
-
General Studies | అరుదైన వ్యాధులు.. అసాధారణ లక్షణాలు
-
BIOLOGY | మొక్కలనిచ్చే కణుపులు.. దుంపలుగా మారే వేర్లు
-
Scholarships 2023
-
Current Affairs March 15 | National Women`s Day celebrated on?
Latest Updates
Peut-on gagner dans les casinos en ligne ?
Quel casino en ligne est légitime ?
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
తాత్వికతను తెలిపేది.. రాజ్యాంగానికి గుండెలాంటిది
ఎలకానిక్ రికార్డులు.. ప్రాథమిక సాక్ష్యాలు
శుక్రకణాలు తాత్కాలికంగా నిల్వ ఉండే ప్రాంతం?
సెకండరీ ఎడ్యుకేషన్ కమిషన్‌కు మరోపేరు?
‘వెయ్యి ఉరిల మర్రి’ గా పేరుగాంచిన ఊడలమర్రి ఏ జిల్లాలో ఉంది?
రక్షణ దుర్గాలు – నాటి పాలనా విభాగాలు
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?






