దేశంలోని ఓడరేవులు ఏవో తెలుసా?
-సముద్రాన్ని భూభాగంతో కలిపే ముఖద్వారాన్ని ఓడరేవు అంటారు.
-దేశంలో ప్రస్తుతం 13 ప్రధాన ఓడరేవులు ఉన్నాయి. చిన్న, మధ్యతరహా ఓడరేవులు దాదాపు 200 వరకు ఉన్నాయి.
-ప్రధాన ఓడరేవుల నిర్వహణ కేంద్రప్రభుత్వ పరిధిలోకి వస్తుంది. ఇతర నౌకా కేంద్రాల నిర్వహణ ఆయా రాష్ర్టాల పరిధిలో ఉంటుంది.
-దేశంలో అత్యధిక ఓడరేవులు గల రాష్ట్రం- మహారాష్ట్ర (53), ఆ తర్వాత గుజరాత్ (40) .
పశ్చిమతీరంలోని ఓడరేవులు ముంబై ఓడరేవు
-ఇది దేశంలోని అతిపెద్ద, సహజసిద్ధ ఓడరేవు. దీన్ని సాల్సెట్టి ద్వీపంలో నిర్మించారు.
-1869లో సూయజ్ కాలువ తెరిచిన తర్వాత దీని ప్రాముఖ్యత పెరిగింది.
-భారత్‌లో సుమారు 25 శాతం వాణిజ్యం ఈ ఓడరేవు ద్వారానే జరుగుతుంది.
-ఇది అత్యంత రద్దీ గల ఓడరేవు. ఇక్కడ ప్రధాన దిగుమతులు- పెట్రోలియం ఉత్పత్తులు
కాండ్లా ఓడరేవు
-దీన్ని 1955లో ఏర్పాటుచేశారు. ఇది స్వాతంత్య్రం తర్వాత ఏర్పాటు చేసిన మొదటి ఓడరేవు.
-ఈ ఓడరేవును కచ్ సింధుశాఖలో ఏర్పాటుచేశారు. దీన్ని స్ట్రింగ్ ఆఫ్ పార్టీషియన్ అని పిలుస్తారు.
-ఇక్కడ ఉన్న ప్రముఖ టెర్మినల్- వాడినర్
-ఇది దేశంలో ఉన్న ఒకే ఒక్క టైడల్ ఓడరేవు
-భారత్‌లో మొదటి ఎక్స్పోర్ట్ ప్రాసెసింగ్ జోన్‌ను ఇక్కడే ఏర్పాటుచేశారు.
-ఈ ఓడరేవు ద్వారా చేసే ప్రధాన ఎగుమతులు- కాటన్ టెక్స్టైల్స్
నవ సేవ ఓడరేవు (మహారాష్ట్ర)
-దీన్ని జవహర్లాల్ ఓడరేవు అని పిలుస్తారు.
-ముంబై ఓడరేవులో రద్దీ తగ్గించడానికై దీన్ని సహాయకారి ఓడరేవుగా అభివృద్ధి చేశారు
-ఇది అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో నిర్మించిన ఓడరేవు, దేశంలో అతిపెద్ద కంటైనర్ పోర్టు.
-ఈ ఓడరేవు ద్వారా చేసే ప్రధాన ఎగుమతులు- కాటన్ టెక్స్టైల్స్
మార్మగోవా ఓడరేవు (గోవా)
-ఇది నదీ ఆధారిత ఓడరేవు. దీన్ని జువారీ నది ఎడమ ఒడ్డున నిర్మించారు.
-ఇనుప ఖనిజాన్ని పశ్చిమదేశాలకు ఎగుమతి చేస్తుంది.
-ఇక్కడి ప్రధాన దిగుమతులు- ముడి చమురు
న్యూ మంగళూరు ఓడరేవు (కర్ణాటక)
-ఇది గురుపూర్ నది ఒడ్డున ఉంది.
-దీన్ని గేట్ వే ఆఫ్ కర్ణాటక అని పిలుస్తారు
-ఆసియాలో అతిపెద్ద నౌకా కేంద్రమైన సీబర్డ్ కేంద్రాన్ని స్థాపించారు.
-ఈ ఓడరేవును, మహారాష్ట్రను కొంకణ్ రైల్వే మార్గం కలుపుతుంది
-ప్రధాన ఎగుమతులు-ఇనుప ఖనిజం, ప్రధాన దిగుమతులు-పెట్రోలియం ఉత్పత్తులు
కొచ్చిన్ ఓడరేవు (కేరళ)
-దీన్ని అరేబియా సముద్రపు రాణి (Queen of Arabian Sea) అని పిలుస్తారు.
-దీన్ని ఎంబనాడ్ కాయల్ వద్ద నిర్మించారు
-లాల్‌బహదూర్ శాస్త్రి నాటికల్ అండ్ ఇంజినీరింగ్ కాలేజీ ఈ ఓడరేవు సమీపంలో ఉంది.
-ఇది కొలంబో నుంచి సూయజ్ వరకు గల జలమార్గం మధ్యలో ఉంది.
-ఈ ఓడరేవులో ప్రధాన ఎగుమతులు- కంటెయి నర్లు, సుగంధ ద్రవ్యాలు, ప్రధాన దిగుమతులు- పెట్రోలియం ఉత్పత్తులు
తూర్పు తీరంలోని ఓడరేవులు విశాఖపట్నం ఓడరేవు
-దేశంలోనే అత్యంత లోతైన సహజసిద్ద ఓడరేవు.
-అతిపెద్ద కన్వేయర్ బెల్ట్ హార్బర్ కలిగిన ఓడరేవు.
-ఇది డాల్ఫిన్ నోస్ అనే కొండ, రాస్ అనే పర్వతశ్రేణి సముద్ర అలల నుంచి కాపాడుతున్నాయి.
-ఇది దేశంలో అత్యంత సురక్షితమైన ఓడరేవు.
-ఈ ఓడరేవు నుంచి ఎగుమతులు-బైలడిల్లా (ఛత్తీస్‌ఘడ్) గని నుంచి ఇనుప ఖనిజాన్ని జపాన్‌కు ఎగుమతి చేస్తున్నారు.
చెన్నై ఓడరేవు (తమిళనాడు)
-ఇది దక్షిణ ఇండియాలో, తూర్పు తీరంలో గల అతిపురాతనమైన, కృత్రిమమైన అతిపెద్ద ఓడరేవు
-దీన్ని 1859లో నిర్మించారు. ఇది ఇండియాలోని రెండవ అతిపెద్ద ఓడరేవు.
-ఇది దేశంలోని మొదటి కంపెనీ మేనేజ్మెంట్ పోర్టు
-ఈ ఓడరేవులో ప్రధాన ఎగుమతులు-తోళ్లు, పొగాకు, ప్రధాన దిగుమతులు-బొగ్గు, పెట్రోలియం ఉత్పత్తులు
ట్యుటికోరిన్ ఓడరేవు (తమిళనాడు)
-ఇది దేశానికి దక్షిణ మూలన ఉంది. హిందూ మహాసముద్ర తీరంలో ఉన్న ఏకైక ఓడరేవు.
-ఇది ముత్యపు చిప్పలకు ప్రసిద్ది.
ఎన్నోర్ ఓడరేవు (తమిళనాడు)
-దేశంలో ఏకైక కార్పొరేట్ ఓడరేవు. ఇది 2001 నుంచి పనిచేస్తుంది.
-దీన్ని కామరాజ్ నాడార్ ఓడరేవుగా మార్చారు.
పారాదీప్ ఓడరేవు (ఒడిశా)
-జపాన్‌కు ఇనుప ఖనిజాన్ని ఎగుమతి చేయడానికి దీన్ని ఏర్పాటు చేశారు.
-ఈ ఓడరేవులో ప్రధాన ఎగుమతులు- ముడి ఇనుము, బొగ్గు.
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?
దేశాల అనుసంధానం.. వాణిజ్య అంతఃసంబంధం
కణ బాహ్య జీర్ణక్రియ
ఇంటి పని వద్దన్నవారు.. స్వీయ శిక్షణ ఉండాలన్నవారు
జీవావరణ వ్యవస్థకు కావలసిన మూలశక్తి దారులు?
మౌజియన్ అనే గ్రీకు పదానికి అర్థం?
సమాజ మేధో కేంద్రాలు.. నాగరికతకు చిహ్నాలు