నైపుణ్యాభివృద్ధి పథకాల గురించి తెలుసా?
ఇన్స్పైర్ (INSPIRE)
-దీని పూర్తి రూపం.. Innovation in Science Pursuit for Inspired Research Program.
-దేశంలోని ప్రతిభగల యువతను సైన్స్ చదివేలా, సైన్స్ కోసం అన్వేషించేలా ప్రోత్సహించడం ఇన్స్పైర్ ప్రోగ్రామ్ ప్రధాన లక్ష్యం. ఈ స్కీమ్‌లో భాగంగా పిల్లల్లో చిన్న వయసులోనే సైన్స్పట్ల ఆసక్తి రేకెత్తించడం కోసం వివిధ కార్యక్రమాలు చేపడుతారు.
-ఆసక్తిగల విద్యార్థులకు తగిన శిక్షణ ఇచ్చి.. సైన్స్ రంగంలో అభివృద్ధి, పరిశోధన కార్యక్రమాలు చేపట్టేలా ప్రోత్సాహం అందిస్తారు.
-సైన్స్ అండ్ టెక్నాలజీ విభాగం, సైన్స్ అండ్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ, స్కిల్ డెవలప్మెంట్ అండ్ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ మంత్రిత్వ శాఖ ఈ ప్రోగ్రామ్‌కు నోడల్ ఏజన్సీలు.
-ఈ స్కీమ్ దేశం ప్రాతిపదికగా సైన్స్ రంగంలో పరిశోధన, అభివృద్ధిని మరింత బలోపేతం చేస్తుంది.
-ఉన్నత విద్యలో సైన్స్‌ను ఆప్షన్‌గా ఎంచుకునే విద్యార్థుల సంఖ్య ఏటేటా తగ్గిపోతుంది. విద్యార్థుల్లో సైన్స్ పట్ల ఆసక్తి కొరవడుతుందనడానికి ఈ పరిణామమే నిదర్శనం.
-అందుకే విద్యార్థులకు నూతన పద్ధతుల్లో సైన్స్పట్ల ఆసక్తి కలిగించి, వారిని సైన్స్రంగ నిపుణులుగా తీర్చిదిద్దేందుకు ఈ ఇన్స్పైర్ స్కీమ్ చర్యలు చేపడుతుంది.
-ఇన్స్పైర్ ప్రోగ్రామ్ ద్వారా విద్యార్థుల్లో శాస్త్రీయ నైపుణ్యాలు పెంపొందించడంవల్ల.. రానున్న రోజుల్లో భారత్ ప్రపంచంలోనే గొప్ప శాస్త్రీయ శక్తి (సైంటిఫిక్ పవర్)గా ఎదిగే అవకాశం ఉంది.
దీన్‌దయాల్ ఉపాధ్యాయ్ గ్రామీణ్ కౌశల్ యోజన (DUGKY)
-ఇది గ్రామీణ ప్రాంతాల్లో సంఘటిత అభివృద్ధి కోసం నేషనల్ రూరల్ లైవ్లీహుడ్ మిషన్ (NRLM) కింద చేపడుతున్న నైపుణ్యాభివృద్ధి కార్యక్రమం.
-శిక్షణ పొందిన వారిలో 75 శాతం మందికి కచ్చితమైన ఉపాధి కల్పించడం దీని లక్ష్యం.
-స్కిల్ డెవలప్మెంట్ అండ్ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ మంత్రిత్వ శాఖ దీనికి నోడల్ ఏజన్సీగా పనిచేస్తుంది.
-నేషనల్ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ద్వారా ఈ కార్యక్రమం అమలవుతుంది.
-గ్రామీణ పేదలకు జీవనాధారమైన వృత్తులు, పనుల పరిధిని మరింత విస్తరింపజేయడం DUGKY లక్ష్యం.
-ముఖ్యంగా గ్రామీణ నిరుద్యోగులకు వ్యవసాయేతర రంగాల్లో శిక్షణ ఇచ్చి, వారు ఇతర రంగాల్లో ఉద్యోగాలు సాధించేలా ప్రోత్సహించడంపై DUGKY ప్రత్యేక దృష్టి సారించింది.
-గ్రామాల్లో సూక్ష్మతరహా, కుటీర పరిశ్రమల స్థాపనను ఈ స్కీమ్ ప్రోత్సహిస్తుంది.
-గ్రామాల్లో సరైన ఉపాధి సదుపాయాలు లేక మెరుగైన జీవనం కోసం ప్రజలు భారీ ఎత్తున పట్టణాలకు వలసపోతున్నారు. దీంతో పట్టణీకరణ శరవేగంగా పెరిగిపోతుంది. DUGKY స్కీమ్ ద్వారా చేపట్టే కార్యక్రమాలు పరోక్షంగా ఈ పట్టణీకరణను అరికట్టడానికి కూడా తోడ్పడుతాయి.
స్కిల్ ఇండియా మిషన్
-ఇది భారత్‌ను ప్రపంచంలోనే ఏకైక స్కిల్డ్ సూపర్ పవర్‌గా నిలబెట్టాలనే ఉద్దేశంతో కేంద్ర సర్కారు ప్రారంభించిన మిషన్. దేశంలో అమలవుతున్న అనేక నైపుణ్య శిక్షణా పథకాలకు ఈ స్కిల్ ఇండియా మిషన్ గొడుగు వంటిది.
-ఇది దేశ ప్రగతి కోసం దీర్ఘకాలిక వ్యూహంతో చేపట్టిన కార్యక్రమం. యువతకు వివిధ అంశాల్లో శిక్షణ ఇప్పించి నిపుణుల కొరత తీర్చడం, దేశంలో వేగవంతమైన, సంఘటితమైన అభివృద్ధి ఈ స్కీమ్ లక్ష్యాలు.
-స్కిల్ ఇండియా క్యాంపెయిన్ ద్వారా 2020 నాటికి దేశంలో 5.6 కోట్ల మంది నిపుణులు అదనంగా ఉంటారని అంచనా.
నోడల్ ఏజెన్సీలు: 1. నేషనల్ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్, 2. కేంద్ర ఆర్థిక శాఖ, 3. మినిస్ట్రీ ఆఫ్ స్కిల్ డెవలప్మెంట్ అండ్ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్.
-దీనికి నిధులు పబ్లిక్, ప్రైవేట్ పార్ట్నర్షిప్ విధానంలో సమకూర్చుతున్నారు. ఇందులో కేంద్ర ప్రభుత్వ వాటా 49 శాతం.
-ఈ మిషన్‌వల్ల సుమారు 80.33 కోట్ల మంది అసంఘటిత కార్మికులు వివిధ రంగాల్లో శిక్షణపొంది, పలు పరిశ్రమల్లో ఉద్యోగాలు సాధించుకునే అవకాశం ఉంది.
ప్రధానమంత్రి యువ యోజన (PMYY)
-2016, నవంబర్ 9న కేంద్ర సహాయ మంత్రి (స్కిల్ డెవలప్మెంట్ అండ్ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ శాఖ) రాజీవ్‌ప్రతాప్ రూఢీ ఈ స్కీమ్‌ను ప్రారంభించారు.
-ఈ స్కీమ్ చదవు ఉండి సరైన నైపుణ్యం, నేటి పోటీ ప్రపంచం గురించిన అవగాహన లేనివారికి ఉద్దేశించినది.
-దేశంలోని యువతకు కావాల్సిన ప్రోత్సాహం అందించడం.. వారు ఉద్యోగ, ఉపాధి విషయాల్లో ప్రపంచంలో నెలకొని ఉన్న పోటీని తట్టుకుని నిలబడేలా తీర్చిదిద్దడం ఈ స్కీమ్ ప్రధాన ఉద్దేశాలు.
-ఈ స్కీమ్ కింద.. పరిశ్రమలు స్థాపించాలనుకునే యువతకు అవసరమైన శిక్షణతోపాటు, సరైన మార్గదర్శకాలు ఇచ్చి ప్రోత్సహిస్తారు.
-దేశ ఆర్థిక వ్యవస్థ పురోగతికి తోడ్పడేలా యువతను తీర్చిదిద్దాలనేది ఈ స్కీమ్ లక్ష్యం.
-ఈ స్కీమ్ దేశంలోని యువ పారిశ్రామికవేత్తలకు తగిన ప్రోత్సాహం అందిస్తుంది.
-30 ఏండ్లలోపు యువతను పరిశ్రమలు స్థాపించేలా ప్రోత్సహించడం కోసం ఈ స్కీమ్ కింద ఒక అవార్డులను ప్రవేశపెట్టారు. 2017, జనవరి 16న ఈ అవార్డుల ప్రదానోత్సవం జరిగింది.
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?
దేశాల అనుసంధానం.. వాణిజ్య అంతఃసంబంధం
కణ బాహ్య జీర్ణక్రియ
ఇంటి పని వద్దన్నవారు.. స్వీయ శిక్షణ ఉండాలన్నవారు
జీవావరణ వ్యవస్థకు కావలసిన మూలశక్తి దారులు?
మౌజియన్ అనే గ్రీకు పదానికి అర్థం?
సమాజ మేధో కేంద్రాలు.. నాగరికతకు చిహ్నాలు