భారత పార్లమెంట్ – కొన్ని విశేషాలు
పార్లమెంట్ అనే పదం parler (తర్వాత Parley) అనే ఫ్రెంచ్ పదం నుంచి గ్రహించబడింది. దీని అర్ధం సమావేశం (Consultation or Assembly). భారత్‌లో పార్లమెంటరీ వ్యవస్థను బ్రిటన్ నుంచి గ్రహించారు. ప్రస్తుత ప్రపంచ ఆధునిక పార్లమెంటరీ వ్యవస్థకు బ్రిటన్ పార్లమెంటరీ వ్యవస్థను మాతృకగా పరిగణిస్తారు. బ్రిటన్ పార్లమెంటరీ వ్యవస్థను పార్లమెంటరీ ప్రభుత్వం అంటారు. అంటే శాసనసభకు కార్యనిర్వహణ శాఖ బాధ్యత వహించి ఉండే ప్రభుత్వం. ఈ వ్యవస్థనే వెస్ట్ మినిస్టర్ నమూనా (West Minister Model of Governament) అంటారు.
- పార్లమెంటరీ ప్రభుత్వ విధానం పలు లక్షణాలపై ఆధారపడి ఉంది.
- ప్రధానమంత్రి, మంత్రిమండలి లోక్‌సభకు బాధ్యత వహిస్తారు.
- మంత్రి మండలి లోక్‌సభలో మెజారిటీ కలిగి ఉంటుంది. మంత్రి మండలికి నిర్ణీత కాల పరిమితి ఉండదు.
- లోక్‌సభను నిర్ణీత కాలపరిమితి ముగియ డానికి ముందే మధ్యంతరంగా రద్దు చేయవచ్చు.
- కార్యనిర్వహక వర్గంలో ప్రధానమంత్రి, మంత్రిమండలి వాస్తవ కార్యనిర్వాహకులు (De facto). రాష్ట్రపతి నామ మాత్రపు కార్యనిర్వాహకుడిగా (De jure) ఉంటారు.
- మంత్రిమండలి ఉమ్మడిగా లోక్‌సభకు బాధ్యత వహిస్తుంది. మంత్రులు వ్యక్తిగతంగా తమతమ శాఖలకు సంబంధించి రాష్ట్రపతికి బాధ్యత వహిస్తారు.
- మంత్రి మండలి లోక్‌సభను రద్దు చేయడా నికి రాష్ట్రపతికి సలహా ఇస్తుంది.
- భారత పార్లమెంటరీ ప్రభుత్వ విధానం ప్రధానంగా బ్రిటిష్ రాజ్యాంగంపై ఆధారపడి ఉన్నా.. దీన్ని పూర్తిగా బ్రిటిష్ రాజ్యాంగాన్ని ఆధారం చేసుకుని రూపొందించలేదు.
మీకు తెలుసా?
- భారతదేశంలో పౌరులకు రాష్ర్టాలతో సంబంధం లేకుండా జాతీయ పౌరసత్వం మాత్రమే కల్పించబడింది. గతంలో జమ్ముకశ్మీర్‌లో తప్ప భారత్‌లో మరే రాష్ట్రంలోనూ ద్వంద్వ పౌరసత్వం లేదు.
- ప్రస్తుతం జమ్ముకశ్మీర్ రాష్ర్టాన్ని రెండు కేంద్రపాలిత ప్రాంతాలుగా విభజించిన తర్వాత దేశంలో ద్వంద్వ పౌరసత్వం ఎక్కడా కూడా లేదు.
పార్లమెంట్ నిర్మాణం
- రాజ్యాంగంలోని 5వ భాగంలో ఉన్న 79 నుంచి 122 వరకు ఆర్టికల్స్ పార్లమెంట్ నిర్మాణం, కాలపరిమితి, విధులు, అధికారాలు, శాసనప్రక్రియ మొదలైన అంశాలను వివరిస్తాయి.
- ఆర్టికల్ 79 ప్రకారం పార్లమెంటులో అంతర్భాగంగా రాష్ట్రపతి, లోక్‌సభ, రాజ్యసభ ఉంటాయి.
రాష్ర్టాలకు ప్రతినిధిగా రాజ్యసభ, ప్రజలకు ప్రతినిధిగా లోక్‌సభ వ్యవహరిస్తాయి. - పార్లమెంట్ ఎస్టేట్‌లో పార్లమెంట్ భవనం, పార్లమెంట్ హౌస్ అనెక్స్, పార్లమెంట్ లైబ్రరీ అనే 3 భవనాలు కలవు. పార్లమెంట్ భవనం 1927లో పార్లమెంట్ హౌస్ అనెక్స్ 1975లో, పార్లమెంట్ లైబ్రరీ 2002లో ప్రారంభించారు.
- పార్లమెంట్ హౌస్ అనెక్స్ సెక్రెటరీల విభాగంగా పనిచేస్తుంది. పార్లమెంట్ లైబ్రరీని సన్సదీయ జ్ఞానపీఠ్ అంటారు.
- న్యూఢిల్లీలోని భారత పార్లమెంట్ భవనానికి (సంసద్ భవన్) సర్ ఎడ్విన్ ల్యుటియన్స్, సర్ హెర్బర్ట్ బేకర్ ఆర్కిటెక్ట్‌లుగా (రూపశిల్పి) పనిచేశారు. ఈ భవన నిర్మాణ శైలిని (గుండని నిర్మాణం) ల్యూటియన్స్ వాస్తు శైలిగా పేర్కొంటారు.
- అయితే ఈ నిర్మాణాన్ని మధ్యప్రదేశ్‌లోని మిటోలిలో గల ‘చౌసత్ యోగిని ఆలయం’ ఆధారంగా చేసుకుని నిర్మించారని కొన్ని ఆధారాలు చెబుతున్నాయి.
- పార్లమెంట్ భవనానికి 1921లో గవర్నర్ జనరల్ ఛేమ్స్‌ఫర్డ్ శంకుస్థాపన చేయగా, 1927 జనవరి 18న గవర్నర్ లార్డ్ ఇర్విన్ ఈ భవనాన్ని ప్రారంభించారు.
- కొత్తగా త్రిభుజాకారంలోని పార్లమెంట్ భవనానికి డిసెంబర్ 10, 2020న ప్రధాని నరేంద్ర మోదీ శంకుస్థాపన చేశారు. ఇది ఆగస్టు 15, 2022 నాటికి ( 75 సంవత్సరాల స్వాతంత్ర దినం) పూర్తికానుంది.
- దీనిని సెంట్రల్ విస్టా రీడెవలప్మెంట్ ప్లాన్‌లో భాగంగా నిర్మిస్తున్నారు.
- ఈ కొత్త భవనాన్ని ధోల్పూర్ మైన్స్ (మధ్య భారత్)లో లభిస్తున్న ఎర్ర ఇసుక రాయితో నిర్మిస్తున్నారు.
- ఈ భవనాన్ని టాటా ప్రాజెక్ట్స్ లిమిటెడ్ చేపట్టింది.
- ఈ భవనానికి అహ్మదాబాద్‌కు చెందిన HCP డిజైన్స్ ఆర్కిటెక్ట్ బిమల్ పటేల్ పనిచేస్తున్నాడు.
ప్రధాన భవనం : దీని పైభాగంలో అశోకుని చక్రాన్ని పోలిన 4 సింహాలలాగే ఒక కాలచక్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ కాల చక్రం 24 గంటల సమయాన్ని, 365 రోజులను సూచిస్తుంది.
లోక్‌సభ భవనం : దీని సీటింగ్ కెపాసిటీ 888. దీనిలో జాతీయ పక్షి నెమలిని థీమ్‌గా డిజైన్ చేస్తున్నారు.
రాజ్యసభ భవనం : దీని సీటింగ్ కెపాసిటీ 384. దీనిలో జాతీయ పుష్పం తామర థీమ్‌గా డిజైన్ చేస్తున్నారు.
సెంట్రల్ లాంజ్ : దీనిలో జాతీయ వృక్షం మర్రిచెట్టును థీమ్‌గా డిజైన్ చేస్తున్నారు.
సెంట్రల్ కాన్స్టిట్యూషనల్ హాల్ : ఇది గత చరిత్ర, వారసత్వాన్ని ప్రతిబింబించే విధంగా ఉంటుంది.
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?
దేశాల అనుసంధానం.. వాణిజ్య అంతఃసంబంధం
కణ బాహ్య జీర్ణక్రియ
ఇంటి పని వద్దన్నవారు.. స్వీయ శిక్షణ ఉండాలన్నవారు
జీవావరణ వ్యవస్థకు కావలసిన మూలశక్తి దారులు?
మౌజియన్ అనే గ్రీకు పదానికి అర్థం?
సమాజ మేధో కేంద్రాలు.. నాగరికతకు చిహ్నాలు