ద్రుత ప్రాకృతం అంటే ఏమిటి..?
పారిభాషిక పదాలు
వర్ణాగమం
నడిరేయి – నడికిరేయి
నడువడి – నడువడిక
వేగుచుక్క – వేగురుచుక్క
వర్ణాదేశం
వాడు+టక్కరి = వాడుడక్కరి
ట=ట్+అ డ=డ్+అ
వర్ణవ్యత్యయం
పదాల్లోని అక్షరాలు ముందు వర్ణాలు వెనుకకు, వెనుక వర్ణం ముందుకు వస్తే అది వర్ణవ్యత్యయం.
ఉదా : నవ్వులాట – నవ్వుటాల
వారణాసి – వాణారసి
గజదొంగ – జగదొంగ
పలుచన – చలుపన
లడాదులు
లడాదులు మూడు రకాల పురుషాలు ఉంటాయి.
ఉత్తమ – మధ్యమ – ప్రథమ
ఏక / బహు – ఏక / బహు – ఏక / బహు
లిట్ – భూతకాలం
లట్ – వర్తమానం
లృట్ – భవిష్యత్తు
లాట్ – ఆశీస్సు
లజ్ – వ్యతిరేఖలు
ఉత్తమ- తన గురించి తాను చెప్పేది
మధ్యమ- ఎదుటి వ్యక్తి గురించి చెప్పేది
ప్రధమ- ఎక్కడో ఉన్న వ్యక్తి గురించి చెప్పేది
ఉత్తమ పురుష
తన గురించి తాను చెప్పుకునేది.
ఉదా : నేను పుస్తకం చదువుతున్నాను. (ఏకవచనం)
మేము పుస్తకం చదువుతున్నాం. (బహువచనం)
మధ్యమ పురుష
ఎదుటి వ్యక్తి గురించి మాట్లాడేది.
ఉదా : నువ్వు పుస్తకం చదివావా ? (ఏకవచనం)
మీరు అన్నం తింటున్నారా? (బహువచనం)
ప్రథమ పురుష
ఎక్కడో ఉన్న వ్యక్తి గురించి మాట్లాడేది.
ఉదా : వాడు వచ్చాడా? (ఏకవచనం)
వారు వచ్చారా? (బహువచనం)
కోడ్- తాను ఉత్తమ (1st person)
ఎదుట ఉత్తమ (2nd person)
ఎక్కడో ప్రథమ (3rd person).
ఔపవిభక్తులు (ఇ-టి-తి)
ఉపవిభక్తి ఆధారంగా ‘ఔపవిభక్తి’ వెలుగులోకి వచ్చిన పారిభాషిక పదం
(లేదా)
ఉపవిభక్తి ఆధారంగా ‘ఔపవిభక్తి’ పారిభాషిక పదాల్లో వచ్చి చేరింది.
ఉపవిభక్తి అంటే విభక్తికి దగ్గరగా ఉండేది.
ఉదా : కాలు + లో = కాలిలో (ఇ)
ఊరు + లో = ఊరిలో
కన్ను + తో = కంటితో
నోరు + తో = నోటితో
నెయి + లో = నేతిలో
గోయి + లో = గోతిలో
విభక్తులు లేకుండా పదాలు వచ్చినప్పుడు
ఇ,టి,తి లు వస్తే వాటిని అనౌపవిభక్తులు అంటారు.
ఉదా : ఊరు+వాడు = ఊరివాడు
పడమర+గాలి = పడమటి గాలి
రాయి+మీద = రాతిమీద
భావార్థం-(ట)
క్రియ పదం తరువాత ‘ట’ వచ్చి చేరితే భావార్థం అంటారు.
ఉదా: చదువుట, రాయుట, తినుట
ధాతుజ విశేషణం
ధాతువు నుంచి పుట్టిన విశేషణాన్ని ధాతుజ విశేషణం అంటారు.
ప్రత్యయాలు – ఎడు, ఏడు
ఉదా : చదువు+ఎడు = చదువెడు
చదువు+ఏడు = చదువేడి
ద్రుతం
‘న’కారం పొల్లును ధృతం అంటారు.(న్)
ద్రుతప్రాకృతం
ఏ పదం చివర ద్రుతం వచ్చి చేరుతుందో దానిని ద్రుతప్రాకృతం అంటారు.
ఉదా : పూచన్, వచ్చెన్, తోచెన్
కళ : ఏ పదం చివర ద్రుతం ఉండదో దానిని కళ పదం అంటారు. కళకు శాశ్వాతమైన అర్థం ఉంది.
తత్సమం
సంస్కృతానికి, ప్రాకృతానికి సమానమైన భాష తత్సమం.
పకృతి పదాలు – తత్సమం
సంస్కృతం(అగ్నిః) – ప్రాకృతం(అగ్నీ) -తత్సమం(అగ్ని)
తద్భవం
సంస్కృతం, ప్రాకృత భవంబగు భాష తద్భవంబు.
వికృతి పదాలు – తద్భవం
సంస్కృతం(అగ్నిః)-ప్రాకృతం(అగ్నీ)-తద్భవం(అగ్గి)
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?
దేశాల అనుసంధానం.. వాణిజ్య అంతఃసంబంధం
కణ బాహ్య జీర్ణక్రియ
ఇంటి పని వద్దన్నవారు.. స్వీయ శిక్షణ ఉండాలన్నవారు
జీవావరణ వ్యవస్థకు కావలసిన మూలశక్తి దారులు?
మౌజియన్ అనే గ్రీకు పదానికి అర్థం?
సమాజ మేధో కేంద్రాలు.. నాగరికతకు చిహ్నాలు