What is the current name of Peak-15 | శిఖరం-15కు ప్రస్తుత పేరు?
పర్యావరణ వైవిధ్యానికి భారత ఉపఖండం పెట్టింది పేరు. హిమాలయాలు, దక్కన్ పీఠభూమి వాటి మధ్య ప్రపంచంలోనే అతిపెద్ద గంగా-సింధూ మైదానం, ఆ పక్కనే ఉష్ణ ఎడారి, దేశానికి మూడువైపులా సువిశా లమైన సముద్రం కలిసి భారతదేశానికి ప్రపంచంలో ప్రత్యేకతను తీసుకొచ్చాయి. పోటీ పరీక్షల్లో దేశంలో ప్రకృతి, పర్యావరణ వైవిద్యాలపై లోతైన ప్రశ్నలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో నిపుణ పాఠకుల కోసం హిమాలయాల ప్రత్యేకతలపై ఈ వ్యాసం..
భారతదేశ నైసర్గిక ప్రదేశాన్ని 5 ప్రధాన భాగాలుగా విభజించారు.
1. హిమాలయ పర్వతాలు
2. ఉత్తర మైదానం/గంగా-సింధుమైదానం
3. ద్వీపకల్ప పీఠభూమి
4. తీర మైదానాలు
5. దీవులు
కేంద్ర గణాంక సంస్థ (సెంట్రల్ స్టాటిస్టికల్ ఆర్గనైజేషన్) అంచనాల ప్రకారం దేశ భూభాగ విస్తీర్ణం 3.28 మి.చ.కి.మీ. అందులో.. పర్వతాలు – 10.7 శాతం
కొండలు – 18.6 శాతం
పీఠభూములు – 27.7 శాతం
మైదానాలు – 43 శాతం ఉన్నాయి.
ఇవి ఏర్పడే విధానంలో మొదటగా ఏర్పడినది..
1. ద్వీపకల్ప పీఠభూమి (కేంబ్రియల్ యుగం – 150 కోట్ల సంవత్సరాలు)
2. హిమాలయ పర్వతాలు (టెర్షియరీ పీరియడ్)
3. ఉత్తర మైదానాలు (ప్లిస్టొసిన్)
భూ ఉపరితల స్వరూపాలు
8,848 మీ. ఎవరెస్ట్ (భూమి ఉపరితలంపై ఎత్తైన శిఖరం)
901 మీ. పర్వతాలు (10.7 శాతం)
900 మీ. కొండలు (18.6 శాతం)
500 మీ. పీఠభూములు (27.7 శాతం)
200 మీ. మైదానాలు (43 శాతం)
సముద్ర మట్టం (Sea level) –
396.6 మీ. లోతైన ప్రదేశం మృతసముద్రం (Dead Sea)
(భూమి ఉపరితలంపై లోతైన ప్రాంతం)
ఇది ఇజ్రాయెల్-జోర్డాన్ దేశాల మధ్య ఉంది. (ఆసియా)
11.103 మీ. – మేరియానా అఖాతం (మేరియానా ట్రెంచ్)(ఇది మహాసముద్రంలో లోతైన ప్రాంతం)
ఇది పసిఫిక్ మహాసముద్రంలోని మిండానోవా ద్వీప సముదాయంలో ఫిలిప్పైన్స్‌లో ఉంది.
సాధారణ లవణీయత
సాధారణ లవణీయత అంటే 1000 మి.లీ. సముద్ర జలాల్లో 35 గ్రా. లవణీయత ఉంటుంది.
ప్రపంచంలో ఎక్కువ లవణీయతగల సముద్రం- మృత సముద్రం
ప్రపంచంలో తక్కువ లవణీయతగల సముద్రం- బాల్టిక్ సముద్రం (రష్యా-స్వీడన్ దేశాల మధ్య)
ప్రపంచంలో ఎక్కువ లవణీయతగల సరస్సు- వాన్ సరస్సు (ఇది టర్కీలో ఉంది. ఇందులో 1000 గ్రా. నీటిలో 350 గ్రా. లవణీయత ఉంది)
లవణీయత ఆధారపడే అంశాలు
1. అధిక ఉష్ణోగ్రత
2. అల్ప వర్షపాతం
3. సముద్రాల్లో కలిసే నదిలోని మంచినీరు
4. సముద్రాల లోతు (200 పాథమ్స్)
5. పవనాలు
గమనిక: సూర్యుని కిరణాలు నీటిలోకి 200 పాథమ్ల వరకు మాత్రమే ప్రయాణిస్తాయి.
అధిక లవణీయతగల మహాసముద్రం – అట్లాంటిక్ మహాసముద్రం
అల్ప లవణీయతగల మహాసముద్రం – ఆర్కిటిక్ మహాసముద్రం
గమనిక:
1. ఒకే లవణీయతగల ప్రదేశాలను కలుపుతూ గీసిన రేఖలు- ఇసోహాలైన్స్
2. ఉపరితలం నుంచి ఒకే లోతులో ఉన్న సముద్ర రేఖలను సూచించే బిందువులను కలిపే గీతలు- సమలోతు గీతలు
3. పర్వతాల అధ్యయనం- ఓరాలజీ
4. పర్వతాల పుట్టుకను- ఓరో జెనెసిస్ అంటారు.
హిమాద్రి హిమాలయాల్లోని ఎత్తయిన శిఖరాలు
1. ఎవరెస్ట్
ఎత్తు – 8,848 మీ.
ఇది నేపాల్‌లో ఉంది.
భూ ఉపరితలంపై ఎత్తయిన శిఖరం. (ప్రపంచంలో ఎత్తయిన శిఖరం)
దీని పూర్వనామం Peak – XV (శిఖరం-15)
దీన్ని మొదట కనుగొన్న వ్యక్తి బ్రిటిష్ సర్వేయర్ జనరల్ సర్జార్జ్ ఎవరెస్ట్ కావున అతని పేరుమీదుగానే ఎవరెస్ట్ శిఖరం అని పిలుస్తున్నారు.
ఈ శిఖరాన్ని హిమాలయాల రాజు అంటారు.
ఎవరెస్ట్‌కు వివిధ దేశాల్లో వివిధ పేర్లు
1. నేపాల్ – సాగరమాత (గాడెస్ ఆఫ్ స్కై)
2. చైనా – కెమోబంగ్మా (మదర్ ఆఫ్ ది వరల్డ్)
3. టిబెట్ – చొమో లుంగ్మా/జోంగ్మా
4. ఆఫ్ఘనిస్థాన్ – సులేమాన్
ఎవరెస్ట్ డే – మే 29
ఈ శిఖరాన్ని మొదటిసారిగా 1953 మే 29న సర్ ఎడ్మండ్ హిల్లరీ, టెన్సింగ్ నార్కే (న్యూజిలాండ్)లు సంయుక్తంగా అధిరోహించారు.
ఎవరెస్ట్‌ను అధిరోహించిన మొదటి మహిళ – జుంకొతాబి (జపాన్)
ఎవరెస్ట్‌ను అధిరోహించిన మొదటి భారతీయ మహిళ – బచేంద్రిపాల్ (ఉత్తరాంచల్)
ఎవరెస్ట్‌ను రెండుసార్లు అధిరోహించిన భారతీయ మహిళ – సంతోష్‌యాదవ్ (బీహార్)
ఎవరెస్ట్‌ను అధిరోహించిన బాలిక – మాలావత్ పూర్ణ (తెలంగాణ) – 2014 మే 25న.
అతి తక్కువ వయసులో ఎవరెస్ట్‌ను అధిరోహించినది- హర్షిత్
2. కాంచనజంగ
ఎత్తు – 8,598 మీ.
ఇది సిక్కింలో ఉంది.
ఇది దేశంలో రెండో ఎత్తయిన శిఖరం.
ప్రపంచంలో మూడో ఎత్తయిన శిఖరం.
హిమాద్రి హిమాలయాల్లో రెండో ఎత్తయిన శిఖరం.
3. నంగప్రభాత్ – 8,126 మీ. – జమ్ముకశ్మీర్
4. నందాదేవి – 7,817 మీ. – ఉత్తరాఖండ్
5. కామెట్ – ఉత్తరాఖండ్
6. అన్నపూర్ణ – 8,078 మీ.
7. ధవళగిరి – 8,177 మీ.
8. మకాలు – 8,481 మీ. (హిమాద్రి హిమాలయాల్లో మూడో ఎత్తయిన శిఖరం) – నేపాల్
9. మనస్లూ – 8,156 మీ.
10 చొఓయ్ – 8,153 మీ.
11. నామ్చాబార్వా – 7,756 మీ. – అరుణాచల్‌ప్రదేశ్ (హిమాద్రిలో అత్యల్ప ఎత్తయిన శిఖరం)
హిమాద్రి హిమాలయాల్లోని ముఖ్యమైన కనుమలు
బనిహాల్ కనుమ
ఇది జమ్ముకశ్మీర్‌లో ఉంది.
ఈ కనుమ అనంతనాగ్, దొడ జిల్లాలను కలుపుతున్నది. దీన్ని గేట్ వే ఆఫ్ కశ్మీర్ అంటారు.
దేశంలో అతిపొడవైన రైల్వే సొరంగం జవహర్ సొరంగమార్గం ఈ కనుమ గుండా పోతుంది. దీని పొడవు 11 కి.మీ.
ఈ కనుమ గుండా కశ్మీర్‌కు పోయే రహదారి ఉంది.
గమనిక:
ప్రపంచంలో అతిపెద్ద రైలు సొరంగం- ఒషిమిజు సొరంగం (22 కి.మీ.- జపాన్)
ప్రపంచంలో అతి పొడవైన రోడ్డు సొరంగం- సెయింట్ గోదార్జ్ రోడ్డు (16 కి.మీ. – స్విట్జర్లాండ్)
ప్రపంచంలో పొడవైన నీటి సరఫరా సొరంగం- న్యూయార్క్ సొరంగం (169 కి.మీ.- అమెరికాలో ఉంది)
జొజిలా కనుమ
ఇది జమ్ముకశ్మీర్‌లో ఉంది.
లేహ్-జమ్ము ప్రాంతాలను కలుపుతుంది.
దేశంలో అత్యంత ఎత్తయిన విమానాశ్రయం లేహ్‌లో ఉన్న kushok bakula rimpochee airport.
బూర్జిల కనుమ: ఇది జమ్ముకశ్మీర్‌లో ఉంది.
షిప్కిలా కనుమ
ఇది హిమాచల్‌ప్రదేశ్‌లో ఉంది.
భారత్-టిబెట్లను ఇది కలుపుతుంది.
సట్లేజ్ నది టిబెట్ నుంచి ఈ కనుమ ద్వారా మనదేశంలోకి ప్రవేశిస్తుంది.
హిమాంచల్ కనుమ
ఇది హిమాచల్ ప్రదేశ్‌లో ఉంది. కెల్లాంగ్-లేహ్ ప్రాంతాలను కలుపుతుంది.
ఈ కనుమ చీనాబ్ నదికి జన్మస్థలం.
రోహతంగ్ కనుమ
ఇది హిమాచల్ ప్రదేశ్‌లో ఉంది.
కులు-కెలాంగ్లను ఇది కలుపుతుంది.
ఈ కనుమ రావి, బియాస్ నదులకు జన్మస్థలం.
నైసర్గిక స్వరూపాలు
1. హిమాలయాలు
నార్త్
టెర్షియరీ యుగంలో – ట్రెథిస్ – యూరేసియా/లారేసియా (అంగారక భూమి)
గోండ్వానా ల్యాండ్/ఇండో ఆస్ట్రేలియన్ పలక
అంటే 60 మిలియన్ (6 కోట్ల) ఏండ్లకు పూర్వం యూరేసియా, గోండ్వానా ల్యాండ్ అనే పలకలు ఒకదానికొకటి టెథిస్ సముద్రంలోకి చొచ్చుకుని వచ్చి ముడతలు పడి సెడిమెంటరీ శిలలుగా మారి రూపాంతరం చెంది హిమాలయాలుగా ఏర్పడ్డాయి.
నదులపరంగా.. ఇవి సింధునది గార్జ్ లోయ నుంచి బ్రహ్మపుత్ర నది గార్జ్ లోయ వరకు విస్తరించి ఉన్నాయి.
రాష్ర్టాలపరంగా.. జమ్ముకశ్మీర్ నుంచి అరుణాచల్‌ప్రదేశ్ వరకు విస్తరించి ఉన్నాయి.
పర్వతాలపరంగా.. నంగప్రభాత్ (జమ్ముకశ్మీర్) నుంచి నామ్చాబార్వా (అరుణాచల్‌ప్రదేశ్) శిఖరం వరకు విస్తరించి ఉన్నాయి.
హిమాలయాల మొత్తం పొడవు- 2400 కి.మీ.
హిమాలయాల సగటు వెడల్పు- 150 – 400 కి.మీ.
హిమాలయాల మొత్తం విస్తీర్ణం – 5 లక్షల చ.కి.మీ.
వయస్సు- 6 కోట్ల సంవత్సరాలు
ఇవి నవీన ముడుత పర్వతాలు
ఇవి ప్రపంచంలో ఎత్తయిన పర్వత శ్రేణులు
నవీన ముడుత పర్వతాలకు ఉదాహరణలు
1. ఆసియా ఖండం- హిమాలయాలు
2. యూరప్ ఖండం- ఆల్ఫ్స్ పర్వతాలు
3. ఉత్తర అమెరికా- రాకీ పర్వతాలు
4. దక్షిణ అమెరికా- ఆండీస్ పర్వతాలు (ఇవి ప్రపంచంలో పొడవైన పర్వతాలు)
హిమాలయాల ప్రాంతీయ వర్గీకరణ
దేశంలో ఉత్తరాన ప్రవహించే నదులబట్టి హిమాలయాలను ప్రాంతీయంగా విభజించారు.
1. కశ్మీర్ హిమాలయాలు: సింధు-సట్లెజ్ నదుల మధ్య (ఇండస్) ఉన్న హిమాలయాలు
పొడవు 560 కి.మీ.
ఈ హిమాలయాలు హిమనీ నదాలకు ప్రసిద్ధి.
ఉదా: బనిహాల్, పిర్‌పంజాల్
2. కుమాయున్ హిమాలయాలు: సట్లెజ్-కాలి నదుల మధ్య ఉన్న హిమాలయాలు
పొడవు – 320 కి.మీ.
ఈ హిమాలయాలు మతపరమైన క్షేత్రాలకు, సరస్సులకు ప్రసిద్ధి.
ఉదా: కేదారినాథ్, బద్రినాథ్, గంగోత్రి, యమునోత్రి
ఇక్కడ ఉన్న సరస్సుల సంఖ్య- 360
ఈ సరస్సులను థాల్ అంటారు.
ఉదా: నైనిటాల్, భీమటాల్
3. నేపాల్ హిమాలయాలు/మధ్య హిమాలయాలు: ఇవి కాలి-తీస్తా నదుల మధ్య ఉన్న హిమాలయాలు.
పొడవు – 800 కి.మీ.
ఈ హిమాలయాలు ఎత్తయిన శిఖరాలకు ప్రసిద్ధి.
ఉదా: ఎవరెస్ట్, మకాలు
4. అస్సాం హిమాలయాలు: ఇవి తీస్తా-బ్రహ్మపుత్ర నదుల మధ్య ఉన్నాయి.
పొడవు – 720 కి.మీ.
ఈ హిమాలయాలు క్రమక్షయ మైదానాలకు ప్రసిద్ధి.
ఉదా: కచ్చల్ మైదానం
హిమాలయాల వర్గీకరణ
హిమాలయాలను నాలుగు రకాలుగా విభజించవచ్చు.
I.1. హిమాద్రి హిమాలయాలు/అత్యున్నత/గ్రేటర్ హిమాలయాలు
2. హిమాచల్ హిమాలయాలు/నిమ్న/మధ్య హిమాలయాలు
3. శివాలిక్ హిమాలయాలు/బాహ్య హిమాలయాలు
II. టిబెట్ హిమాలయాలు/ట్రాన్స్ హిమాలయాలు
హిమాద్రి+హిమాచల్ హిమాలయాల పొడగింపునే టిబెట్ హిమాలయాలు/ట్రాన్స్ హిమాలయాలు అని పిలుస్తారు.
1. హిమాద్రి హిమాలయాలు
ఇవి హిమాచల్ హిమాలయాలకు ఉత్తరంగా ఉన్నాయి.
వీటి సగటు ఎత్తు – 6100 మీ.
సగటు వెడల్పు – 25 కి.మీ.
ఇవి నంగప్రభాత్ (జమ్ముకశ్మీర్) నుంచి నామ్చాబార్వా (అరుణాచల్‌ప్రదేశ్) వరకు విస్తరించి ఉన్నాయి.
ఈ హిమాలయాలు ఎత్తయిన శిఖరాలకు ప్రసిద్ధి.
ఈ హిమాలయాల్లో ప్రధాన శిలలు – గ్రానైట్, నీస్, సిస్ట్
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
తాత్వికతను తెలిపేది.. రాజ్యాంగానికి గుండెలాంటిది
ఎలకానిక్ రికార్డులు.. ప్రాథమిక సాక్ష్యాలు
శుక్రకణాలు తాత్కాలికంగా నిల్వ ఉండే ప్రాంతం?
సెకండరీ ఎడ్యుకేషన్ కమిషన్‌కు మరోపేరు?
‘వెయ్యి ఉరిల మర్రి’ గా పేరుగాంచిన ఊడలమర్రి ఏ జిల్లాలో ఉంది?
రక్షణ దుర్గాలు – నాటి పాలనా విభాగాలు
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?