How long is the Ram Setu | రామసేతు పొడవు ఎంత?
పోటీ పరీక్షల ప్రత్యేకం
రామసేతు
-పాంబన్, మన్నార్ దీవుల మధ్య నెలకొని ఉన్న బ్రిడ్డి వంటి నిర్మాణమే రామసేతు. ఇది మన్నార్ సింధుశాఖను పాక్ జలసంధితో వేరుచేస్తుంది.
-దీన్ని శ్రీరాముడు, వానరసేన లంకను చేరుకునేందుకు నిర్మించారని హిందువుల విశ్వాసం.
-భారత్, శ్రీలంక మధ్య రామసేతు పొడవు 48 కిలోమీటర్లు.
-రామసేతు నిర్మాణం వల్ల భారత వాణిజ్య నౌకలు శ్రీలంక చుట్టు 400 కిలోమీటర్లు లేదా 30 గంటల అధిక దూరం ప్రయాణించాల్సి వస్తుంది. దీనికి పరిష్కారంగా భారత ప్రభుత్వం జూలై 2, 2005లో సేతు సముద్రం షిప్పింగ్ కెనాల్ ప్రాజెక్టును ఆమోదించింది. అయితే ఆ ప్రాజెక్టు ద్వారా రామసేతును 20 మీటర్ల లోతు, 200మీటర్ల వెడల్పు తవ్వవలసి ఉంటుంది.
-ఈ ప్రాజెక్టు నిర్మాణం పర్యావరణపరంగా సున్నిత ప్రాంతం. హిందువుల మనోభావాలను గాయపర్చడం వల్ల తీవ్ర వ్యతిరేకతను ఎదుర్కోవడంతో 2013లో ఆర్కే పచౌరీ కమిటీ ఇచ్చిన నివేదిక ఆధారంగా 2013లో భారత ప్రభుత్వం శాశ్వతంగా ప్రాజెక్టును నిలిపివేసింది.
భారత్-శ్రీలంక జలసరిహద్దు
– భారత్‌కు ఆగ్నేయ దిక్కున శ్రీలంక (దీవి) హిందూ మహాసముద్రంలో ఉంది.
– దీనిని హిందూ మహాసముద్రంలో అశ్రుబిందువు అని అంటారు.
భారత్-శ్రీలంక మధ్య ప్రాంతాలు
-పాంబన్ దీవి లేదా రామేశ్వరం దీవి. ఇది భారత్‌కు చెందినది.
-ఈ దీవిలో శ్రీలంకకు దగ్గరగా ఉండే ప్రాంతం ‘ధనుష్కోడి.(తమిళనాడు)
– దనుష్కోడి బంగాళాఖాతం, హిందూ మహాసముద్రం కలిసే ప్రాంతంలో ఉంది.
మన్నార్ దీవి
– ఇది శ్రీలంకకు చెందింది. భారత్‌కు దగ్గరగా ఉన్న ఈ దీవిలోని ప్రాంతం ‘తతైమన్నారు’ తమిళనాడులోని నాగర్‌కోయిల్ నుంచి శ్రీలంకకు ఈ దీవి ద్వారా వెళ్తారు.
పాక్ జలసంధి
-ఇది తమిళనాడును, ఉత్తర శ్రీలంకను వేరుచేస్తున్న జలభాగం.
-రెండు భూభాగాల మధ్య ఉన్న విశాల జలభాగాన్ని జలసంధి అంటారు. లేదా రెండు విశాల సముద్రాలను కలుపుతున్న జలభాగాన్ని ‘జలసంధి’ అంటారు.
– పాక్ జలసంధి బంగాళాఖాతాన్ని (పాక్ అఖాతం), హిందూమహాసముద్రాన్ని (మన్నార్ సింధుశాఖ) కలుపుతుంది.
-అఖాతం ( Bay) అంటే తీర ప్రాంతంలోకి చొచ్చుకువచ్చిన అర్థచంద్రాకారపు సముద్రభాగం.
ఉదాహరణ: బంగాళాఖాతం ( Bay of Bengal)
– ఇది ప్రపంచలోనే అతిపెద్ద అఖాతం
– ప్రపంచలోనే అత్యంత లోతైన అఖాతం మేరియానా ట్రెంచ్ (11,034 మీటర్లు)
-మన్నార్ సింధుశాఖ (Gulf of Mannar)
– దక్షిణ తమిళనాడును శ్రీలంకను వేరుచేస్తున్న అఖాతాన్నే మన్నార్ సింధుశాఖ అంటారు. ఇక్కడ ఉన్న గల్ఫ్ ఆఫ్ మన్నార్‌ను బయోస్పియర్ రిజర్వుగా భారత్ ప్రకటించింది. ఇది భారత్‌లో ఉన్న ఏకైక ‘మెరైన్ బయోస్పియర్ రిజర్వ్’.
కచ్చతీ దీవి
– ఈ దీవిని భారత్ 1974లో శ్రీలంకతో చేసుకున్న ఒప్పందం మేరకు శ్రీలంకకు అప్పగించింది.
-పాక్ అఖాతం, మన్నార్ సింధుశాఖ రెండు కూడా తక్కువ లోతు కలిగి అపార మత్స్య సంపదను కలిగి ఉన్నాయి.
సిల్గురి కారిడార్ (చికెన్‌నెక్):
నేపాల్ దేశం ఆగ్నేయ మూల నుంచి బంగ్లాదేశ్ ఉత్తర అంచు మధ్యగల సన్నని భారత భూభాగాన్ని ‘సిల్గురి కారిడార్’ అంటారు.
-ఇది పశ్చిమబెంగాల్ రాష్ట్రంలో 22కిలోమీటర్ల వెడల్పుగల ఇరుకైన ప్రాంతం. ఇక్కడ ప్రధాన నగరం సిలిగురి. దీన్ని కోడిమెడ (Chiken Neck) అని కూడా పిలుస్తారు.
భారత్-భూటాన్
-భారత్-భూటాన్ స్నేహపూర్వక ఒప్పందాన్ని 1949, 2002లో చేసుకున్నాయి.
భారత్-మయన్మార్
– ఈ రెండు దేశాల మధ్య 16కిలోమీటర్ల వెడల్పుతో పొడవైన స్వేచ్ఛా సరిహద్దు ( Free Movement Regime) కలదు. ఈ ప్రాంతంలో సరిహద్దు కొండల్లో నివసించే తెగల ప్రజలు ఎలాంటి ఆంక్షలు లేకుండా సంచరించవచ్చు.
భారత్-మయన్మార్ సరిహద్దులో విభజన కాని ప్రాంతాలు
– లోహిత్ వ్యాలీ సెక్టార్, 135 కిలోమీటర్లు (అరుణాచల్‌ప్రదేశ్)
-కబాల్ వ్యాలీ సెక్టార్, 36 కిలోమీటర్లు ( మణిపూర్)
-భారత్-మయన్మార్‌ను వేరుచేసే పర్వతాలు ‘పూర్వాంచల్ పర్వతాలు’
భారత్-మాల్దీవులు
-ఇవి ఇక ప్రవాళ దీవుల సముదాయం.
– ఇవి భారత్‌కు దక్షిణ దిక్కున హిందూ మహాసముద్రంలో ఉంది.
-భారత్‌కు చెందిన లక్షదీవుల్లోని దక్షిణాన ఉన్న మినికాయ్ దీవికి, మాల్దీవులకు మధ్య 8 డిగ్రీల చానల్ కలదు.
భారత్-థాయిలాండ్
– భారత్‌కు చెందిన అండమాన్ నికోబార్ దీవులకు, థాయిలాండ్ దేశానికి మధ్య ‘అండమాన్ సముద్రం’ ఉంది.
– భారత్‌కు చెందిన అండమాన్ నికోబార్ దీవులకు దగ్గరగా ఉన్న విదేశం మయన్మార్ (కోకోదీవులు), తర్వాత ఇండోనేషియా.
-భారతదేశం ప్రాదేశిక జలాల పరిధి (Territorial Water Limit)
– ఇది భారత్‌కు చట్టపరమైన అధికారం (సముద్రం, గగనతలంపై) గల జలపాతం. (12నాటిక్ మైళ్లు= 22.224కిమీ= 13.8మైళ్లు).
– ఒక నాటికల్ మైలు=1.85 2km
– నాటికల్ మైలు అనేది సముద్రాల ఉపరితల దూరాన్ని లెక్కించడానికి వాడతారు.
-భారత ప్రాదేశిక జలాల పరిధి విస్తీర్ణం పరంగా 1,93,834km2
– ఈ ప్రాంతంలో ప్రవేశించాలనుకునే ఏ విదేశీ నౌక , విమానం అయినా భారత్ అనుమతి తీసుకోవాలి.
అనుబంధ జలాలు
l ఇవి 24 నాటికల్ మైళ్ల వరకు విస్తరించి ఉన్నాయి.
l భారతదేశం వాణిజ్య జలాల పరిధి
l ఈ ప్రాంతంలో దొరికే అన్ని రకాల సముద్ర వనరులు భారత్‌కు చెందుతాయి.
l ఈ ప్రాంతం పరిధి 200నాటికల్ మైళ్లు లేదా 370కిలోమీటర్లు లేదా 230.2 మైళ్లు.
l దీనినే ప్రత్యేక ఆర్థిక పరిధి (EEZ- Exclusive Economic Zone) అంటారు.
l భారత EEZ విస్తీర్ణం 2.3 మిలియన్ చ.కి.మీ.
ప్రాక్టీస్ బిట్స్
1. భారత్, చైనా మధ్య జరిగిని ‘మిని యుద్ధం’ లేదా ‘గాల్వాన్ లోయ ఉదంతం’ ఎక్కడ జరిగింది?
1) తూర్పు సెక్టార్ 2) మధ్య సెక్టార్
3) పశ్చిమ సెక్టార్ 4) ఏదీకాదు
2. భారత్-చైనా మధ్య తాత్కాలిక సరిహద్దును (LOAC) జమ్ముకశ్మీర్ (లద్దాఖ్), ఆక్సాయ్‌చిన్ మధ్య గుర్తించారు. అయితే దీనిని విశ్వాస నిర్మాణ చర్యల్లో భాగంగా ఏ సంవత్సరంలో గుర్తించారు?
1) 1993 2) 1995
3) 1996 4) 1, 2 సరైనవి
3. భారత్-చైనా మధ్య ఉన్న వివాదాస్పద ప్రాంతాలను గుర్తించండి?
1) గల్వాన్, డోక్లాం
2) షిప్కిలి, తవాంగ్
3) చుమారు, డెస్సాండ్
4) పైవన్నీ
4. దక్షిణ తమిళనాడు, శ్రీలంకను వేరుచేస్తున్న జలభాగం?
1) మన్నార్ సింధుశాఖ
2) మెక్‌మోహన్‌రేఖ
3) డ్యూరాండ్ రేఖ
4) పాక్ జలసంధి
5. భారత్-చైనా సరిహద్దును ఎన్ని విభాగాలుగా పేర్కొంటారు
1) 2 2) 4
3) 3 4) 6
Answers
1-3, 2-4, 3-4, 4-1, 5-3
జీ గిరిధర్
సీనియర్ ఫ్యాకల్టీ
ఫైవ్ మంత్ర ఇన్స్టిట్యూట్
అశోక్‌నగర్
9966330068
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
తాత్వికతను తెలిపేది.. రాజ్యాంగానికి గుండెలాంటిది
ఎలకానిక్ రికార్డులు.. ప్రాథమిక సాక్ష్యాలు
శుక్రకణాలు తాత్కాలికంగా నిల్వ ఉండే ప్రాంతం?
సెకండరీ ఎడ్యుకేషన్ కమిషన్‌కు మరోపేరు?
‘వెయ్యి ఉరిల మర్రి’ గా పేరుగాంచిన ఊడలమర్రి ఏ జిల్లాలో ఉంది?
రక్షణ దుర్గాలు – నాటి పాలనా విభాగాలు
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?