శిశు వికాసం – పెడగాజీ
1. రమణ అనే ఉపాధ్యాయుడు ఒక అంధుల పాఠశాలను సందర్శించి ఆ పాఠశాలలో విద్యనభ్యసిస్తున్న అంధ విద్యార్థుల ప్రజ్ఞను తెలుసుకోవాలనుకున్నాడు. ఆ ఉపాధ్యాయుడికి ఉపయోగపడే పరీక్ష ఏది?
1) శాబ్ధిక పరీక్ష
2) అశాబ్ధిక పరీక్ష
3) నిష్పాదన పరీక్ష
4) పేపర్ పెన్సిల్ పరీక్ష
2. ఒకేసారి శిక్షణ పొందిన ఉపాధ్యాయ విద్యార్థుల్లో ఉద్యోగం పొందిన అనంతరం కొంతమంది మాత్రమే మంచి ఉపాధ్యాయులుగా విద్యార్థులతో గుర్తింపు పొందారు. దీనికి కారణం వారిలోని..
1) వైఖరి
2) సహజ సామర్థ్యం
3) ఉపాధ్యాయుని బహిర్గత ప్రేరణ
4) సమాజ ఒత్తిడి
3. కార్వేటినగరం అనే గ్రామంలో 50 మంది నిరక్ష్యరాస్యుల ప్రజ్ఞను రమేష్ అనే వ్యక్తి ఒకేసారి పరీక్షించాలనుకున్నారు. ఈ వ్యక్తికి
ఉపయోగపడే పరీక్ష ఏది?
1) ఆర్మీబీటా
2) బినే సైమన్ పరీక్ష
3) బాటియా ప్రజ్ఞామాపని
4) ఆర్మీ ఆల్ఫా
4. వరుణ్ తన ఇంటి నుంచి పాఠశాలకు ఒక దారిలో వెళ్లగలడు, కాని కావ్య పాఠశాలకు వివిధ మార్గాల్లో ఎలాగైనా వెళ్లగలదు.
వీరిలో ఉన్న ఆలోచనలు వరుసగా..
1) విభిన్న ఆలోచన, సమైక్య ఆలోచన
2) విభిన్న ఆలోచన, అమూర్త ఆలోచన
3) సమైక్య ఆలోచన, విభిన్న ఆలోచన
4) సమైక్య ఆలోచన, మూర్త ఆలోచన
5. ప్రణవ్ అనే విద్యార్థిలోని కొన్ని లక్షణాలు గమనించిన ఉపాధ్యాయుడు.. ఆ విద్యార్థి భవిష్యత్‌లో మంచి పోలీస్ అయ్యే అవకాశం ఉందని గుర్తించాడు. ఇది కింది ఏ అంశానికి చెందినది ?
1) అలవాట్లు
2) సహజ సామర్థ్యం
3) అనువంశికత
4) వైఖరి
6. ఒక వ్యక్తి సమాజంలోని వ్యక్తుల సమస్యలను తెలుసుకొని వారి సమస్యల పరిష్కారానికి ప్రయత్నిస్తూ వారితో తెలివిగా నడుచుకొంటూ అధిక కలుపుగోలుతనాన్ని ప్రదర్శిస్తున్నారు. ఈ వ్యక్తిలో అధికంగా ఉన్న ప్రజ్ఞ ఏది?
1) యాంత్రిక ప్రజ్ఞ
2) అమూర్త ప్రజ్ఞ
3) సాంఘిక ప్రజ్ఞ
4) మూర్త ప్రజ్ఞ
7. రాహుల్, మౌనికల శారీరక వయసు వరుసగా 5, 3 సంవత్సరాలు. వారి మానసిక వయసులు 5,5. అయితే వారి ప్రజ్ఞ లబ్ధిని ఏ విధంగా చెప్పవచ్చు?
1) సగటు ప్రజ్ఞ, ఉన్నత ప్రజ్ఞ
2) ఉన్నత ప్రజ్ఞ, సగటు ప్రజ్ఞ
3) సగటు ప్రజ్ఞ, సగటు ప్రజ్ఞ
4) ఉన్నత ప్రజ్ఞ, ఉన్నత ప్రజ్ఞ
8. సుధీర్ అనే విద్యార్థి తన మనస్సులోని అంతర్గత అంశాలను తన తల్లిదండ్రులకు అర్థమయ్యే రీతిలో చెప్పలేకపోతున్నాడు. దీనికి కారణం గార్డెనర్ ప్రకారం ఆ విద్యార్థిలో లోపించిన ప్రజ్ఞ ఏది?
1) వ్యక్తంతర్గత ప్రజ్ఞ
2) సంగీత సంబంధ ప్రజ్ఞ
3) శారీరక స్పర్శాత్మక ప్రజ్ఞ
4) భాషా ప్రజ్ఞ
9. దర్పిత ఎల్లప్పుడూ టి.విలో వచ్చే కార్టూన్ సీరియల్స్‌ని అవధానంతో చూస్తుంది. హాసిని ఆంగ్లం చాలా తేలికైన సబ్జెక్టుగా భావిస్తుంది. వీరిద్దరూ కలిగి ఉన్న మనోవైజ్ఞానిక అంశాలు వరుసగా
1) సహజ సామర్థ్యం
2) అభిరుచి, వైఖరి
3) వైఖరి, అభిరుచి
4) అభిరుచి, సహజ సామర్థ్యం
10. సుశాంత్ అనే విద్యార్థి ఆటలో, సంగీతంలో రెండిటిపై మంచి ఆసక్తిని కలిగి ఉన్నాడు. ఈ రెండిటిలో ఏదో ఒకదానిని ఎన్నుకోవడానికి ఆసక్తితో పాటు పరిగణలోకి తీసుకోవాల్సిన ఆంశం ఏది?
1) ఆర్థిక పరిస్థితి
2) ఆదాయం
3) సహజ సామర్థ్యం
4) తల్లిదండ్రుల ప్రోత్సాహం
11. డ్యాన్స్ నేర్చుకోడానికి ఒకే సంస్థలో శిక్షణ పొందుతున్న చాలా మంది పిల్లల్లో కొందరు అద్భుతంగా డ్యాన్స్ చేయగలుగుతున్నారు. దిలీప్ అనే విద్యార్థి ఎంతగా శిక్షణ పొందుతున్నప్పటికీ ప్రాక్టీస్ చేస్తున్నప్పుడు కనీస స్థాయిలో కూడా డ్యాన్స్ చేయలేకపోతున్నాడు. దీనికి కారణం?
1) అభిరుచి లేకపోవడం
2) వైఖరి
3) సహజ సామర్థ్యాలు లేకపోవడం
4) పైవన్నీ
12. చదవటం, రాయటం వచ్చిన శృతి, సాహితి, హర్షిత్, అక్షయ్ అనే విద్యార్థులు అందరి ప్రజ్ఞను ఒకేసారి పరీక్షించాలని భావించిన కోటిబాబు అనే ఉపాధ్యాయునికి ఉపయోగపడే ప్రజ్ఞ పరీక్ష ఏది?
1) ఆర్మీఆల్ఫా
2) ఆర్మీబీటా
3) బినేసైమన్
4) భాటియా ప్రజ్ఞామాపని
13. మౌనిక అనే విద్యార్థిని గణిత సమస్యలను సాధించగలదు, రాహుల్ తన వద్దనున్న క్రీడా పరికరాలను నైపుణ్యంగా ఉపయోగించగలడు. రాహుల్, మౌనికల్లోని ప్రజ్ఞ వరుసగా
1) అమూర్త ప్రజ్ఞ, యాంత్రిక ప్రజ్ఞ
2) యాంత్రిక ప్రజ్ఞ, అమూర్త ప్రజ్ఞ
3) సాంఘిక ప్రజ్ఞ, యాంత్రిక ప్రజ్ఞ
4) యాంత్రిక ప్రజ్ఞ, సాంఘిక ప్రజ్ఞ
14. కింది వ్యక్తంతర వైయక్తిక భేదాన్ని గుర్తించండి
1) జ్యోత్స్న లెక్కలు బాగా చేయగలదు కాని చదరంగం బాగా ఆడలేదు
2) గీత బాగా చదవగలదు కాని చేతిరాత బాగా రాయలేదు
3) కావ్య తన తరగతిగదిలో అందరికన్నా బాగా చదవగలదు
4) వరుణ్ గణిత సామర్థ్యం కంటే భాషా సామర్థ్యం అధికం
15. కింది వ్యక్తంతర్గత వైయక్తిక భేదం కానిది గుర్తించండి
1) సాహితికి ఆంగ్లంపై కంటే గణితంపై ఆసక్తి ఎక్కువ
2) శృతి తన వయసు వారితో చూస్తే ప్రజ్ఞాశాలి\
3) హర్షిత్ బాగా చదవగలదు, ఆటలు ఆడగలడు
4) అక్షయ్ బాగా పాడగలడు, డ్యాన్స్ చేయగలడు
సమాధానాలు
1-3 2- 2 3-1 4-3 5-2 6- 3 7- 1 8-4 9- 2 10- 3 11-3 12-1 13-2 14-3 15-2
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?
దేశాల అనుసంధానం.. వాణిజ్య అంతఃసంబంధం
కణ బాహ్య జీర్ణక్రియ
ఇంటి పని వద్దన్నవారు.. స్వీయ శిక్షణ ఉండాలన్నవారు
జీవావరణ వ్యవస్థకు కావలసిన మూలశక్తి దారులు?
మౌజియన్ అనే గ్రీకు పదానికి అర్థం?
సమాజ మేధో కేంద్రాలు.. నాగరికతకు చిహ్నాలు