Who proposed the Lokpal system in the country | దేశంలో లోక్‌పాల్ వ్యవస్థను ప్రతిపాదించినవారు ?
1. ప్రాథమిక హక్కులపై పరిమితులు విధించే అధికారం పార్లమెంట్‌కు ఉన్నప్పటికీ ఆపరిమితులను సహేతుకంగా పరిశీలించే అధికారం న్యాయస్థానాలదే. అంతేకాకుండా రాజ్యాంగ మౌలిక స్వరూప సిద్ధాంతం ప్రకారం పార్లమెంట్ చేసే రాజ్యాంగ సవరణ కూడా పరిశీలించే అధికారం కోర్టుకు ఉందని సుప్రీంకోర్టు ఏ కేసులో పేర్కొంది ?
1) మినర్వామిల్స్ కేసు 2) గోలక్‌నాథ్ కేసు
3) కేశవానంద భారతి కేసు 4) 2,3
1) 6వ 2) 312వ 3) 249వ 4) 250వ
3. భారతదేశంలో 1959లో మొదటిసారిగా లోక్‌పాల్ వ్యవస్థను ఏర్పాటు చేయాలని ప్రతిపాదించినవారు ?
1) జవహర్లాల్ నెహ్రూ 2) బీఆర్ అంబేద్కర్
3) సీడీ దేశ్‌ముఖ్ 4) సర్దార్ వల్లభాయ్ పటేల్
4. పార్లమెంట్లో ఉపయోగించే భాష హిందీ కానీ, ఇంగ్లిష్ కానీ అయి ఉండాలని తెలిపే అధికరణం ?
1) 120వ 2) 121వ 3) 210వ 4) 343వ
5. ప్రవేశికలు భారత రాజ్యాంగానికి ఆత్మ, హృదయం, ఒక ఆభరణంగా వర్ణించినవారు ?
1) డా.బీఆర్ అంబేద్కర్
2) డా. బాబూ రాజేంద్రప్రసాద్
3) 1,2 4) పండిట్ ఠాకూర్‌దాస్ భార్గవ
6. భారత రాజ్యాంగ ప్రవేశిక (పీఠిక) లోగల సరైన పదాలు
1) సార్వభౌమాధికారం, సామ్యవాద, లౌకిక,
గణతంత్ర రాజ్యం
2) సార్వభౌమాధికారం, సామ్యవాద, లౌకిక,
ప్రజాస్వామ్య, గణతంత్ర రాజ్యం
3) సార్వభౌమాధికారం, సామ్యవాద, లౌకిక,
ప్రజాస్వామ్యరాజ్యం
4) సామ్యవాద, లౌకిక, ప్రజాస్వామ్య, గణతంత్రరాజ్యం
7. బ్రిటిష్ ప్రభుత్వం భారతీయులకు విద్య గురించి లక్ష రూపాయలు ఖర్చు చేయాలని ఈస్టిండియా కంపెనీని ఆదేశించిన చట్టం ?
1) చార్టర్ చట్టం-1813 2) చార్టర్ చట్టం-1833
3) చార్టర్ చట్టం-1953
4) పిట్స్ ఇండియా చట్టం-1784
8. మొదటి రాజ్యాంగ పరిషత్ 1946, డిసెంబర్ 9న నిర్వహించిన సమావేశానికి హాజరైన సభ్యుల సంఖ్య ?
1) 209 2) 211 3) 219 4) 229
9. నెహ్రూ ప్రవేశపెట్టిన లక్ష్యాలు, ఆశయాల తీర్మానాన్ని భారతీయుల రాజకీయ చక్రమని వర్ణించిన వారు ?
1) కేఎం మున్షీ 2) కేటీ షా
3) కామత్ 4) ఐవర్ జెన్నింగ్స్
10. భారతదేశంలో తొలి మహిళా కేబినెట్ మంత్రి రాజ్‌కుమారి అమృత్‌కౌర్ నిర్వహించిన శాఖను గుర్తించండి ?
1) న్యాయశాఖ 2) ఆర్థికశాఖ
3) విదేశాంగ శాఖ 4) ఆరోగ్యశాఖ
11. భారత స్వాతంత్య్ర చట్టం-1947కు సంబంధించి సరికాని అంశం.
1) లార్డ్‌మౌంట్ బాటన్ ప్రణాళిక అనికూడా అంటారు.
2) 1947, జూలై 18న బ్రిటిష్ రాజ్య ఆమోదముద్ర లభించింది.
3) దేశ విభజనను మహాత్మాగాంధీ తీవ్రంగా వ్యతిరేకించారు.
4) పాకిస్థాన్ ముస్లిం రాజ్యంగా ఏర్పాటు చేయడానికి మహ్మద్ అలీ జిన్నా వ్యతిరేకించాడు.
12. బానిసత్వానికి ఒక నూతన చట్టం, భారతదేశంపై బలవంతంగా ఈ చట్టం రుద్దబడింది. జవహర్లాల్ నెహ్రూ కింది ఏ చట్టాన్ని తీవ్రంగా వ్యతిరేకించారు ?
1) 1833 చార్టర్ చట్టం
2) ఇండియన్ కౌన్సిల్‌చట్టం-1892
3) భారత ప్రభుత్వ చట్టం-1919
4) భారత ప్రభుత్వ చట్టం-1935
13. కింది వాటిలో సరికానిది గుర్తించండి.
1) లార్డ్ మేయో తీర్మానం-1870
2) లార్డ్ రిప్పన్ తీర్మానం-1882
3) ప్రత్యేక చార్టర్ చట్టం-1720
4) రాయల్ కమిషన్-1909
14. భారత రాజ్యాంగం అతిపెద్ద రాజ్యాంగం అని దీన్ని ఐరావతం అని చమత్కరించినవారు ?
1) ఆస్టిన్ 2) హెచ్వీ కామత్
3) సైమన్ 4) ఐవర్ జెన్నింగ్
15. భారత రాజ్యాంగం వైఫల్యం చెందితే రాజ్యాంగాన్ని నిందించరాదు. దాన్ని అమలుపరిచే వారిని నిందించాలని సూచించినవారు ?
1) బాబురాజేంద్రప్రసాద్
2) బీఆర్ అంబేద్కర్
3) మహాత్మాగాంధీ 4) జయప్రకాశ్ నారాయణ్
16. కింది వాటిలో సరైనవాటిని గుర్తించండి.
ఎ) భారతదేశానికి ప్రత్యేక రాజ్యాంగం కావాలని మొదట
డిమాండ్ చేసినవారు-ఎంఎన్ రాయ్
బి) మన దేశానికి సంబంధించి మొదటి లిఖిత చట్టం
-1773 రెగ్యులేటింగ్ చట్టం
సి) 1774లో కలకత్తాలో ఏర్పాటు చేసిన సుప్రీంకోర్టుకు
తొలి ప్రధాన న్యాయమూర్తి-హెలిజా హంపే
డి) కేంద్ర బడ్జెట్ నుంచి రాష్ట్ర బడ్జెట్‌ను 1919
చట్టం ద్వారా వేరుచేశారు.
1) ఎ,సి 2) ఎ,డి 3) ఎ,బి,సి 4) పైవన్నీ సరైనవే
17. కిందివాటిలో తప్పుగా ఉన్నదాన్ని గుర్తించండి.
1) మొట్టమొదటిసారిగా లోక్‌సభ డిసెంబర్ 27,1970లో రద్దయింది.
2) నాలుగో లోక్‌సభ కొనసాగుతున్న కాలంలో అప్పటి
ప్రధాని ఇందిరాగాంధీ అదేశాల మేరకు రద్దు చేయడం జరిగింది.
3) నాలుగో లోక్‌సభ రద్దుకాలంలో రాష్ట్రపతిగా వీవీ గిరి
ఉన్నారు.
4) నాలుగో లోక్‌సభను రాష్ట్రపతి జాకీర్ హుస్సేన్ రద్దు చేశారు
18. మొట్టమొదటి సారిగా వరకట్న నిషేధ బిల్లుపై పార్లమెంట్ ఉభయ సభల సంయుక్త సమావేశాన్ని ఎప్పుడు ఏర్పాటు చేశారు?
1) మే 4, 1961 2) మే 5, 1961
3) మే 6, 1961 4) మే 7, 1961
19. 1947లో నెహ్రూ ప్రథమ మంత్రి మండలిలో రక్షణ శాఖ మంత్రిగా పనిచేసినవారు ?
1) షణ్ముగం శెట్టి 2) సర్దార్ బల్దేవ్సింగ్
3) జాన్ మథాయ్ 4) మౌలానా అబుల్ కలాం ఆజాద్
జవాబులు
1-3, 2-3, 3-3, 4-1, 5-4, 6-2, 7-1, 8-2, 9-1, 10-4, 11-4, 12-4, 13-4, 14-2, 15-2, 16-4, 17-4, 18-3, 19-2
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
తాత్వికతను తెలిపేది.. రాజ్యాంగానికి గుండెలాంటిది
ఎలకానిక్ రికార్డులు.. ప్రాథమిక సాక్ష్యాలు
శుక్రకణాలు తాత్కాలికంగా నిల్వ ఉండే ప్రాంతం?
సెకండరీ ఎడ్యుకేషన్ కమిషన్‌కు మరోపేరు?
‘వెయ్యి ఉరిల మర్రి’ గా పేరుగాంచిన ఊడలమర్రి ఏ జిల్లాలో ఉంది?
రక్షణ దుర్గాలు – నాటి పాలనా విభాగాలు
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?