Rajya Sabha suggests amendments to the bill | రాజ్యసభ ద్రవ్యబిల్లుకు సవరణలు సూచిస్తే?
గ్రూప్స్ ప్రత్యేకం – పాలిటీ
1. రాజ్యాంగ చరిత్ర క్రమంలో కింది వాటిని వరుసగా అమర్చండి.
1. క్యాబినెట్ మిషన్ ప్లాన్
2. మింటోమార్లే సంస్కరణలు
3. మాంటెగ్ – ఛేమ్స్‌ఫర్డ్ సంస్కరణలు
4. సైమన్ కమిషన్ నివేదిక
ఎ) 2, 3, 4, 1 బి) 3, 2, 1, 4
సి) 1, 4, 2, 3 డి) 3, 4, 1, 2
2. సాధారణ సమయంలో భారత పార్లమెంట్?
ఎ) రాష్ట్రపతి కోరిక మీద రాష్ట్ర జాబితాలోని అంశంపై
కూడా చట్టం చేస్తుంది
బి) మూడింట రెండొంతుల మెజారిటీతో లోక్‌సభ
తీర్మానం ద్వారా రాష్ట్ర జాబితాలోని ఏ అంశం
మీదైనా చట్టం చేయగలదు
సి) మూడింట రెండొంతుల మెజారిటీతో రాజ్యసభలో
తీర్మానం ఆమోదం పొందితే రాష్ట్ర జాబితాలోని
ఏ అంశం మీదైనా చట్టం చేయగలదు
డి) ఎట్టి పరిస్థితుల్లోనూ రాష్ట్ర జాబితాలోని అంశంపై
చట్టం చేయదు
3. పార్లమెంట్లో గుర్తింపు పొందిన మొదటి ప్రతిపక్ష నాయకుడు ఎవరు?
ఎ) వైబీ. చవాన్ బి) రామ్ సుభాగ్‌సింగ్
సి) ఏకే గోపాలన్ డి) సీఎం స్టీఫెన్
4. కింది వాటిని జతపర్చండి.
1. ప్రాథమిక హక్కులు ఎ. యూకే
2. పార్లమెంటరీ తరహా ప్రభుత్వం బి. అమెరికా
3. అత్యవసర పరిస్థితి సి. ఐర్లాండ్
4. ఆదేశిక సూత్రాలు డి. జర్మనీ ఇ. కెనడా
ఎ) 1-బి, 2-డి, 3-ఇ, 4-ఎ
బి) 1-ఇ, 2-ఎ, 3-సి, 4-డి
సి) 1-బి, 2-ఎ, 3-డి, 4-సి
డి) 1-ఎ, 2-బి, 3-డి, 4-సి
5. రాష్ట్రాల శాసనసభ స్థానాల సంఖ్యకు సంబంధించి కింది వాటిలో సరైనవేవి?
1. ఉత్తరవూపదేశ్ శాసనసభ స్థానాల సంఖ్య – 405
2. పశ్చిమబెంగాల్ శాసనసభ స్థానాల సంఖ్య – 294
3. ఆంధ్రవూపదేశ్ శాసనసభ స్థానాల సంఖ్య – 175
4. తెలంగాణ శాసనసభ స్థానాల సంఖ్య – 119
ఎ) 1, 2, 3 బి) 2, 3, 4
సి) 1, 2, 4 డి) పైవన్నీ
6. కింది ప్రకరణల్లో సరైనదాన్ని గుర్తించండి.
1. ప్రకరణ 43-ఎ: కార్మికులకు యాజమాన్యంలో
భాగస్వామ్యం కల్పించడం
2. ప్రకరణ 43-బి: సహకార సంఘాలను ప్రోత్సహించడం
3. ప్రకరణ 48-ఎ: అడవులు, వన్యవూపాణి సంరక్షణ,
పర్యావరణ పరిరక్షణకు ప్రభుత్వం కక్షుషి చేయడం
4. ప్రకరణ 39-ఎ: సమాన న్యాయం, ఉచిత న్యాయ
సహాయం
ఎ) 1, 2, 3 బి) 2, 3, 4 సి) 1, 2, 4 డి) పైవన్నీ
7. స్పీకర్ కార్యాలయానికి సంబంధించి సరైనదేది?
ఎ) రాష్ట్రపతి ఇష్టమున్నంత కాలం పదవిలో
కొనసాగుతాడు
బి) ఎన్నిక సమయంలో సభలో సభ్యుడు కానవసరం
లేదు, కానీ నియమించబడిన ఆరు నెలల్లో
పార్లమెంట్‌కు ఎన్నిక కావాలి
సి) సభ సాధారణ కాలపరిమితి కంటే ముందే
రద్దయితే స్పీకర్ కూడా పదవిని కోల్పోతాడు
డి) రాజీనామా చేయదలిస్తే రాజీనామా పత్రాన్ని
డిప్యూటీ స్పీకర్‌కు సమర్పించాలి
8. భారత ఎన్నికల సంఘం విధులేవి?
1. లోక్‌సభ స్పీకర్, డిప్యూటీ స్పీకర్, రాజ్యసభ
ఉపాధ్యక్షుని ఎన్నిక నిర్వహించడం
2. కార్పొరేషన్లు, మున్సిపాలటీల ఎన్నికల నిర్వహణ
3. ఎన్నికలకు సంబంధించిన అనుమానాలు,
వివాదాలపై నిర్ణయం
ఎ) 1, 2 బి) 1, 3 సి) 2, 3 డి) పైవన్నీ
9. కింది వాటిని జతపర్చండి.
1. రాష్ట్రపతి
ఎ. సమాచారాన్ని రహస్యంగా ఉంచడం
2. సుప్రీంకోర్టు న్యాయమూర్తి
బి. విశ్వాసంగా విధులను నిర్వహించడం
3. పార్లమెంటు సభ్యులు
సి. రాజ్యాంగానికి బద్ధులై ఉండటం
4. కేంద్రమంత్రి
డి. రాజ్యాంగాన్ని, చట్టాన్ని పరిరక్షించడం
ఎ) 1-సి, 2-డి, 3-ఎ, 4-బి
బి) 1-డి, 2-సి, 3-బి, 4-ఎ
సి) 1-సి, 2-డి, 3-బి, 4-ఎ
డి) 1-బి, 2-డి, 3-ఎ, 4-సి
10. రాజ్యసభ ద్రవ్యబిల్లుకు సవరణలు సూచించినప్పుడు?
ఎ) లోక్‌సభ ఆ సవరణలను ఆమోదించవచ్చు,
తిరస్కరించవచ్చు
బి) లోక్‌సభ ఆ ద్రవ్యబిల్లును వదిలేస్తుంది
సి) లోక్‌సభ ఆ ద్రవ్యబిల్లును రాజ్యసభ
పునఃపరిశీలనకు పంపుతుంది
డి) రాష్ట్రపతి ఆ ద్రవ్యబిల్లు గురించి ఉభయసభల
సంయుక్త సమావేశం ఏర్పాటు చేస్తారు
11. కింది వాక్యాల్లో సరైనది ఏది?
ఎ) ఒక వ్యక్తిని ఏకకాలంలో రెండు లేదా అంతకంటే
ఎక్కువ రాష్ట్రాలకు గవర్నర్‌గా నియమించరాదు
బి) సుప్రీంకోర్టు న్యాయమూర్తులను రాష్ట్రపతి
నియమించిన విధంగా.. రాష్ర్ట హైకోర్టు
న్యాయమూర్తులను గవర్నర్ నియమిస్తారు
సి) గవర్నర్‌ను పదవి నుంచి తొలగించే విధానం
రాజ్యాంగంలో పేర్కొనలేదు
డి) కేంద్రపాలిత ప్రాంతాలకు శాసనసభ ఉంటే
లెఫ్ట్‌నెంట్ గవర్నర్ మెజార్టీ పార్టీనాయకుడిని
ముఖ్యమంవూతిగా నియమిస్తారు
12. ప్రకరణలను పరిశీలించి సరైన జవాబును గుర్తించండి.
1. ప్రకరణ 123: ఆర్డినెన్స్‌లను జారీచేయడానికి రాష్ట్రపతికిగల అధికారం
2. ప్రకరణ 213: గవర్నర్ ఆర్డినెన్స్‌ను జారీచేసే అధికారం
3. ప్రకరణ 262: అంతపూరాష్ట్రీయ మండలి ఏర్పాటు
4. ప్రకరణ 263: అంతపూరాష్ట్రీయ మండలి ఏర్పాటు
ఎ) 1, 2, 3 బి) 2, 3, 4
సి) 1, 2, 4 డి) 1, 3, 4
13. రాజ్యాంగపరిషత్ కమిటీలు, వాటి అధ్యక్షులను జతపర్చండి.
1. సారథ్య సంఘం ఎ. అల్లాడి కక్షుష్ణస్వామి
2. క్రెడెన్షల్ కమిటీ బి. రాజేంద్ర ప్రసాద్
3. ప్రాథమిక హక్కుల ఉపకమిటీ సి. జేబీ కృపలానీ
4. యూనియన్ పవర్స్ కమిటీ డి. నెహ్రూ
ఎ) 1-బి, 2-ఎ, 3-సి, 4-డి
బి) 1-ఎ, 2-బి, 3-సి, 4-డి
సి) 1-బి, 2-సి, 3-ఎ, 4-డి
డి) 1-సి, 2-ఎ, 3-బి, 4-డి
14. అటార్ని జనరల్‌కు సంబంధించి కింది వాటిలో సరైనదేది?
1. లోక్‌సభ చర్చలో పాల్గొనవచ్చు
2. లోక్‌సభ కమిటీ సభ్యుడు
3. లోక్‌సభలో మాట్లాడవచ్చు
4. లోక్‌సభలో ఓటు వేయవచ్చు
ఎ) 1 బి) 2, 4 సి) 1, 2, 3 డి) 1, 3
15. భారత సార్వభౌమత్వం, ఐక్యత, అఖండతను సమర్థించ డం, సంరక్షించడం అనేది దేనిలో పేర్కొన్నారు?
ఎ) రాజ్యాంగ ప్రవేశికలో బి) ఆదేశిక సూత్రాల్లో
సి) ప్రాథమిక హక్కుల్లో డి) ప్రాథమిక విధుల్లో
16. దేశంలో ఉన్నది పార్లమెంటరీ తరహా ప్రభుత్వమని ఏ విధంగా చెప్పగలం?
ఎ) లోక్‌సభ సభ్యులను ప్రజలు ఎన్నుకుంటారు
బి) పార్లమెంట్, రాజ్యాంగాన్ని సవరించగలదు
సి) రాజ్యసభ రద్దు కాదు
డి) మంత్రిమండలి లోక్‌సభకు బాధ్యత వహిస్తుంది
17. అఖిల భారత సర్వీసులకు నియామకాలు చేసేది?
ఎ) భారత రాష్ట్రపతి బి) రాష్ట్రాల గవర్నర్లు
సి) యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్
డి) రాష్ట్రాల పబ్లిక్ సర్వీస్ కమిషన్లు
18. పార్లమెంటులో ‘జీరో అవర్’ అని ఏ సమయాన్ని పేర్కొంటారు?
ఎ) సభ్యులు ప్రశ్నలు అడిగినప్పుడు
బి) సభ్యుపూవరూ హాజరు కానప్పుడు
సి) ప్రశ్నోత్తరాల తర్వాత, సభా కార్యవూకమాల
మొదలుకు ముందు
డి) ప్రశ్నోత్తరాల ప్రారంభానికి, సభాకార్యవూకమాలు
ముగియడానికి మధ్య సమయం
19. రాజ్యాంగ పరిహారాల్లో దేనికి అక్షరాల ‘ఆజ్ఞ’ అని అర్థం?
ఎ) ప్రొహిబిషన్ బి) మాండమస్
సి) సెర్షియోరరి డి) కోవాంటో
20. కేంద్రంలో ఏర్పాటైన మొదటి సంకీర్ణ ప్రభుత్వం?
ఎ) జనతా ప్రభుత్వం
బి) యునైటెడ్ ఫ్రంట్ ప్రభుత్వం
సి) నేషనల్ డెమొవూకటిక్ ప్రభుత్వం
డి) నేషనల్ ఫ్రంట్ ప్రభుత్వం
21. ఉన్నతాధికారులుగా పనిచేసి, దౌత్య సంబంధ పదవులను చేపట్టి ఉపరాష్ట్రపతి అయినవారు?
ఎ) ఎస్. రాధాకక్షుష్ణన్, జాకీర్ హుస్సేన్
బి) ఎస్. రాధాకక్షుష్ణన్, జీఎస్ పాథక్
సి) ఎస్. రాధాకక్షుష్ణన్, వీవీ గిరి
డి) బీడీ జెట్టి, కేఆర్ నారాయణన్
22. పీఠికలోని ‘స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రాతక్షుత్వం’ అనే భావాలను ఏ విప్లవం నుంచి గ్రహించారు?
ఎ) రష్యా బి) ఫ్రెంచ్
సి) అమెరికా డి) జర్మనీ
23. ‘సామ్యవాదం’, ‘లౌకికవాదం’ అనే పదాలను రాజ్యాంగం లో ఏ సవరణ ద్వారా చేర్చారు?
ఎ) 44 బి) 40 సి) 38 డి) 42
24. ‘కో వారెంటో’ అంటే ఏమిటి?
ఎ) బంధీ ప్రత్యక్ష బి) అధికార పక్షుచ్ఛ
సి) పరమాదేశ
డి) ఉత్ప్రేషణ
25. ‘స్థానిక సంస్థల పితామహుడ’ని ఎవరిని పిలుస్తారు?
ఎ) లార్డ్ రిప్పన్ బి) లార్డ్ కానింగ్
సి) లార్డ్ మింటో డి) లార్డ్ మౌంట్‌బాటన్
26. ఒక తప్పుకు రెండుసార్లు శిక్షార్హం కాదు. ఎందుకు?
ఎ) రిపగ్నన్సీ సిద్ధాంతం
బి) ద్వంద్వ శిక్ష నిషేధ సిద్ధాంతం
సి) గ్రహణ సిద్ధాంతం
డి) రెట్రిబ్యూషన్ సిద్ధాంతం
27. స్టేట్ లిస్ట్‌లోకి యూనియన్ లిస్ట్ చొరబడితే ఉపయోగించే సిద్ధాంతం?
ఎ) పిత్ అండ్ సబ్స్టన్స్
బి) గ్రహణ సిద్ధాంతం
సి) ఎమినెంట్ డొమైన్
డి) లెక్స్ ఆర్బిస్
28. కింది వాటిలో సరైనది ఏది?
1. జాతీయ ఓటరు దినోత్సవం, 25
2. ఎన్నికల సంఘం తమ నివేదికను రాష్ట్రపతికి సమర్పిస్తుంది
3. ఎన్నికల సంఘం తమ నివేదికను పార్లమెంట్‌కు సమర్పిస్తుంది
4. ఎన్నికల సంఘం ఎవరికీ నివేదిక సమర్పించాల్సిన అవసరం లేదు
ఎ) 1, 4 బి) 2, 4 సి) 1, 3 డి) 3, 4
29. కింది వాటిలో సమైక్య లక్షణాలేవి?
1. ఏక పౌరసత్వం
2. ద్వంద్వ ప్రభుత్వం 3. లిఖిత రాజ్యాంగం
4. ద్విసభాపద్ధతి 5. ఒకే రాజ్యాంగం
6. కేంద్రం రాష్ట్రాలను పునర్వ్యవస్థీకరించడం
ఎ) 1, 2, 3, 6 బి) 2, 3, 4
సి) 4, 5, 6 డి) 1, 3, 4, 5
30. కింది వాటిలో ఏక కేంద్ర లక్షణాలేవి?
1. అఖిల భారత సర్వీసులు
2. అత్యవసర అధికారాలు 3. అధికార విభజన
4. స్వతంత్ర ప్రతిపత్తిగల న్యాయవ్యవస్థ 5. గవర్నర్ వ్యవస్థ 6. రాజ్యాంగేతర సంస్థలు
ఎ) 1, 2, 5, 6 బి) 2, 3, 4
సి) 4, 5, 6 డి) 1, 3, 4, 5
31. జాతీయ మహిళా కమిషన్ అధ్యక్షురాలు పదవీకాలం?
ఎ) 2 ఏండ్లు బి) 3 ఏండ్లు
సి) 4 ఏండ్లు డి) 5 ఏండ్లు
32. పాకిస్థాన్‌కు బెరుబారి యూనియన్ను భారతదేశం దేని ప్రకారం వదులు కోవచ్చు?
ఎ) 4వ రాజ్యాంగ సవరణ
బి) 24వ రాజ్యాంగ సవరణ
సి) 9వ రాజ్యాంగ సవరణ
డి) 19వ రాజ్యాంగ సవరణ
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
తాత్వికతను తెలిపేది.. రాజ్యాంగానికి గుండెలాంటిది
ఎలకానిక్ రికార్డులు.. ప్రాథమిక సాక్ష్యాలు
శుక్రకణాలు తాత్కాలికంగా నిల్వ ఉండే ప్రాంతం?
సెకండరీ ఎడ్యుకేషన్ కమిషన్‌కు మరోపేరు?
‘వెయ్యి ఉరిల మర్రి’ గా పేరుగాంచిన ఊడలమర్రి ఏ జిల్లాలో ఉంది?
రక్షణ దుర్గాలు – నాటి పాలనా విభాగాలు
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?