Where did the Macedonian edict come from | మ్యాకదోని శాసనం ఎక్కడ లభించింది?
1. తెలంగాణలో నూతన రాతియుగపు స్థావరాలు ఎక్కడ లభించాయి ? – వరంగల్, కరీంనగర్
2. పాలకొండ (వరంగల్)లో చేతితో చేసిన కుండలు, ధాన్యం నిల్వ ఉంచే పాత్రలు లభించాయి.
3. పెద్దపెద్ద రాళ్లను రాక్షసగుళ్లు అంటారు. – వీటిని సమాధుల నిర్మాణానికి ఉపయోగించారు.
4. తెలంగాణలోని వివిధ జిల్లాల్లో లభించిన బృహత్శిలాయుగం సమాధులు
1) మెన్హర్ (పొడవైన రాళ్లు)-దేవునిగుట్ట (వరంగల్)
2) సర్కోఫగి (రాతిపెట్టెలు)- ఏలేశ్వరం (నల్లగొండ)
3) డాల్మెన్ (గదిలాంటి సమాధి) -పోతనపల్లి (మహబూబ్నగర్)
4) గుండ్రటి రాళ్లు -దేవునిగ్రామం (వరంగల్)
5. తెలంగాణలో 3000 ఏండ్ల క్రితమే మానవులు నివసించినట్లు తెలుస్తున్నది.
6. తెలంగాణలో ముఖ్యరాతి చిత్ర కళా స్థావరాలు
-రామచంద్రపురం-ఖమ్మం
-పాండవులగుట్ట -వరంగల్
-రామగుండం-కరీంనగర్
-ఆసిఫాబాద్-ఆదిలాబాద్
-రేకొండ-నిజామాబాద్
-జూపల్లె-నల్లగొండ
7. పాండవులగుట్టలో గల చిత్రాలు
1) దృశ్యాలు: వేట, నృత్యం, సంగీతం
2) జంతువులు: ఎద్దు, బర్రె, మూపురం ఎద్దు, జింక, ఏనుగు, పులి
3) పక్షులు: గద్ద, రాబందు, కొంగ, నెమలి
4) ఆయుధాలు: విల్లు, బాణాలు, కత్తి
8. అమ్రాబాద్ (మహబూబ్నగర్)లో చెక్కకు బిగించిన రాతి గొడ్డలి లభించింది.
9. తెలంగాణలో యానాదులు, చెంచులు వేట, ఆహార సేకరణ ద్వారా జీవిస్తున్నారు.
10. ఆదిమానవులు అడవిలోని వృక్షాలు, జంతువులు, నదులు, పర్వతాలను పూజించేవారు.
11. క్రీ.పూ. 1200 నుంచి మాత్రమే మానవుడు పంటలు పండించుట నేర్చుకొన్నాడు.
12. మహాజనపదాల కాలంలో గ్రామాల్లో వ్యవసాయం చేసేవారిని గృహపతి (గహపతి) అనేవారు.
13. మహాజనపదాల్లో తెలంగాణలో ఉన్న జనపదం అస్మక
14. మగధను పాలించిన మొదటి పాలకుడు-బింబిసారుడు
15. గణ రాజ్యాలకు చెందిన బోధకుడు-బుద్ధుడు
16. అర్థశాస్త్ర గ్రంథంలో భారత ఉపఖండంలో వివిధ వనరులను, వివిధ వృత్తులవారి నుంచి పన్నులు ఎలా వసూలు చేయాలో తెలుపుతుంది.
17. అశోకుని శాసనాలు చాలావరకు ప్రాకృత భాషలో బ్రాహ్మీ లిపిలో ఉన్నాయి.
18. వివాహ బంధుత్వ సంబంధాలున్న సమూహాలను తెగలు అంటారు.
19. శాతవాహనుల కాలానికి చెందిన మ్యాకదోని శాసనం బళ్లారి (కర్ణాటక)లో లభించింది.
20. మెహౌల్రి ఇనుప స్తంభాన్ని చంద్రగుప్తుడు-II ఏర్పాటు చేశారు.
-విదేశీ వస్తువులు తక్షశిలలో లభించాయి.
-వేదకాలం నాటి ప్రజలు ఆవులు, గుర్రాలను పెంచుకొనేవారు.
-వేదకాలంలోనే సమాజంలో వర్ణవ్యవస్థ ఏర్పడింది.
-సాలార్జంగ్ మ్యూజియం హైదరాబాద్లో, గిరిజన ప్రదర్శనశాల శ్రీశైలంలో ఉంది.
-పుట్టుకతో క్షత్రియులుకానివారు చేసే క్రతువు హిరణ్యగర్భ
-శాసనాల్లో మొదటిభాగాన్ని ప్రశస్తి అంటారు. ఇది పాలకుల ఘనతను తెలుపుతుంది.
-వ్యవసాయంలో నూతన అభివృద్ధి చర్యలను చోళులు చేపట్టారు.
-రైతుల స్థిర నివాసాలను ఉర్ అనేవారు.
-ఉత్తర మేరూర్ శాసనం గ్రామ పరిపాలనను సభ ఏ విధంగా చేసేదో వివరిస్తుంది.
-కల్హణుడు కశ్మీర్ రాజుల గురించి పెద్ద సంస్కృతి పద్యాన్ని రాశాడు.
-నైలునది ప్రపంచంలోనే పొడవైనది. ఇది విక్టోరియా సరస్సు నుంచి ప్రారంభమై మధ్యదరా సముద్రంలో కలుస్తుంది.
-ఆఫ్రికా ఖండానికి -ఉత్తరాన మధ్యదరా సముద్రం
-దక్షిణాన దక్షిణసముద్రం (అంటార్కిటికా మహాసముద్రం)
-తూర్పున ఎర్రసముద్రం, ఎడన్ సింధుశాఖ, హిందూమహాసముద్రం
-పశ్చిమాన అట్లాంటిక్ మహాసముద్రం సరిహద్దులు.
-ఆఫ్రికాలోగల మంచినీటి సరస్సు-విక్టోరియా, న్యాసా, టాంజానియా
-ఆఫ్రికాలోగల ఉప్పునీటి సరస్సు- ఛాడ్, గామ
-గతంలో నైజీరియా, జింబాబ్వే దేశాలు బ్రిటన్ నియంత్రణలో ఉన్నాయి.
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
తాత్వికతను తెలిపేది.. రాజ్యాంగానికి గుండెలాంటిది
ఎలకానిక్ రికార్డులు.. ప్రాథమిక సాక్ష్యాలు
శుక్రకణాలు తాత్కాలికంగా నిల్వ ఉండే ప్రాంతం?
సెకండరీ ఎడ్యుకేషన్ కమిషన్కు మరోపేరు?
‘వెయ్యి ఉరిల మర్రి’ గా పేరుగాంచిన ఊడలమర్రి ఏ జిల్లాలో ఉంది?
రక్షణ దుర్గాలు – నాటి పాలనా విభాగాలు
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?