The autobiography of Puchalapally Sundarayya | పుచ్చలపల్లి సుందరయ్య స్వీయ చరిత్ర పేరు?
-1969 ఫిబ్రవరి 19, 20, 21 తేదీల్లో గుంటూరు జిల్లా పిడుగురాళ్ల సమీపంలోని గుత్తికొండ బిలంలో చారు మజుందార్ రహస్య సమావేశం నిర్వహించారు.
-ఈ రహస్య సమావేశానికి పంచాది కృష్ణమూర్తి, చౌదరి తేజేశ్వరరావు, మామిడి అప్పలసూరి హాజరయ్యారు.
-తెలంగాణలోని వరంగల్ ప్రాంతం నుంచి కె.జి.సత్యమూర్తి, చంద్రశేఖరరెడ్డి (వరంగల్ ఆర్ఈసీ విద్యార్థి)లు హాజరయ్యారు.
-ఆరోగ్య కారణాలవల్ల ఖాజీపేట గాబ్రియల్ స్కూల్ టీచర్ కొండపల్లి సీతారామయ్య హాజరుకాలేక తన కుమారుడైన చంద్రశేఖర్‌రెడ్డిని పంపించాడు.
-కొండపల్లి సీతారామయ్య హాజరుకానప్పటికీ రాష్ట్ర కమిటీ కార్యవర్గంలోకి ఆయనను, కేజీ సత్యమూర్తిని తీసుకున్నారు.
-గుత్తికొండ సమావేశంలోనే సీపీఐ (ఎంఎల్) ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కమిటీ ఏర్పడింది.
-వర్గ శత్రు నిర్మూలనే ధ్యేయంగా విప్లవకారులు ఆయుధాలు చేతబట్టడంతో హింసాత్మక ఘటనలు చోటుచేసుకున్నాయి.
-సాయుధ పోరాట పంథాను చేపట్టడంతో ప్రభుత్వం శ్రీకాకుళం జిల్లాను కల్లోలిత ప్రాంతంగా ప్రకటించి పోలీస్ చర్యలను ఉధృతం చేసింది.
-పోలీసులతో జరిగిన ఎన్కౌంటర్లలో చాలామంది ప్రముఖ నాయకులు మరణించారు.
-1969 మార్చి 11న తరిమెల నాగిరెడ్డి తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశారు.
-1969 ఏప్రిల్ 10 నుంచి 12 వరకు కృష్ణా జిల్లా కంభంపాడు దగ్గర నిమ్మతోటలో రహస్యంగా సమావేశమై తక్షణ కార్యక్రమం (ఇమిడియట్ ప్రోగ్రాం) పేరుతో ఒక కార్యక్రమాన్ని నిర్దేశించుకున్నారు.
-తర్వాత విజయవాడలో సమావేశమై ఖమ్మంలోని పగిడేరు, పాల్వంచ ప్రాంతాల్లో వెంటనే పోరాట చర్యలు ప్రారంభించాలని నిర్ణయించారు.
-1969 ఏప్రిల్ 16న పగిడేరులో భూస్వాముల వద్ద 4 తుపాకులు గుంజుకున్నారు.
-ములుగు ప్రాంతంలోని గుమ్మడిదొడ్డి గ్రామంలో భూస్వామి ఇంటిపై దాడి చేశారు.
-ఖమ్మం, వరంగల్, కరీంనగర్ జిల్లాల్లో గెరిల్లా దళాలు ఏర్పాటు చేసి కార్యకలాపాలు ప్రారంభించారు.
-ముఖ్యంగా తెలంగాణలో ప్రవేశించిన యూనియన్ సైన్యాలను ఏ ప్రాంతాల్లోనైతే నల్లగొండ, వరంగల్ పోరాట యోధులు కేంద్ర స్థానం చేసుకొని 1948-51 మధ్య కాలంలో ఎదుర్కొన్నారో ఆ ప్రాంతాల్లోనే శిక్షణ, దాడులు కేంద్రీకరించారు.
-బీహార్, ఉత్తరప్రదేశ్‌లలో కూడా సాయుధ తిరుగుబాట్లు ప్రారంభమయ్యాయి.
-1969 మే 27న జలాంత్రకోట వద్ద పోలీసుల కాల్పుల్లో ప్రముఖ ఉద్యమకారుడు పంచాది కృష్ణమూర్తి మరణించాడు.
-పంచాది కృష్ణమూర్తి మరణానంతరం ఉద్యమం అణగకపోగా మరింత ఉధృతమైంది.
-అనంతర కాలంలో సీపీఐ(ఎంఎల్) నాయకులైన కాను సన్యాల్, సోరెన్బోస్లు శ్రీకాకుళం జిల్లాను సందర్శించి, ఉద్యమ భవిష్యత్తు నిర్వహణను సత్యంకు అప్పగించారు.
-ప్రభుత్వ అణచివేత చర్యల్ని ఎదుర్కొనేందుకు ఆత్మాహుతి దళం ఏర్పాటు చేయాలని కూడా నిర్ణయించారు.
-1969 జూలైలో రైతాంగ సంఘర్షణ సమితి మొత్తం 518 గ్రామాల్లో 300 గ్రామాలను తన అదుపులోకి తీసుకుంది.
-దోపిడీదారులను శిక్షించడానికి రైతాంగ సంఘర్షణ సమితి ప్రజా న్యాయస్థానాలను నెలకొల్పింది.
-1969 డిసెంబర్లో తరిమెల నాగిరెడ్డి, దేవులపల్లి వెంకటేశ్వరరావు, వెల్మారెడ్డి, గోపాల్‌రెడ్డి, చల్లపల్లి శ్రీనివాసరావు, మండ్ల సుబ్బారెడ్డి, వసంతాడ రామలింగాచారి, సుంకరి లక్ష్మీనరసయ్యలు మద్రాస్‌లో రహస్య సమావేశం నిర్వహిస్తుండగా అరెస్టయి హైదరాబాద్ కుట్ర కేసులో జైలు పాలయ్యారు.
-1970 జూలై 10న బారికొండ వద్ద జరిగిన ఎదురుకాల్పుల్లో సత్యం, కైలాసం ఇద్దరూ మరణించారు.
-సత్యం, కైలాసం మరణంతో శ్రీకాకుళం సాయుధ పోరాటం దాదాపుగా కనుమరుగైంది.
-1970 జూలై 24న మామిడి అప్పలసూరి, డి. నాగభూషణం పట్నాయక్‌లను కలకత్తాలో అరెస్టు చేశారు.
-శ్రీకాకుళం ఉద్యమంలో పాల్గొన్న 120 మందిపై పోలీసులు కేసు నమోదు చేశారు.
-1970 జూలై నెలలో నీలం రామచంద్రయ్య, రామనర్సయ్య, చండ్ర పుల్లారెడ్డిలు మరొక రాష్ట్ర కమిటీని ఏర్పాటు చేసి, ఆంధ్రప్రదేశ్ రెవల్యూషనరీ కమ్యూనిస్టు పార్టీని ఏర్పాటు చేసి గోదావరి లోయలో తమ దృష్టిని కేంద్రీకరించారు.
-1972 జూలై 16న కలకత్తాలో చారు మజుందార్ అరెస్టయ్యాడు.
-చారు మజుందార్ అరెస్టయిన 12 రోజులకు 1972 జూలై 28న పోలీసు కస్టడీలోనే మరణించాడు.
-దోషులుగా నిర్ధారించబడిన వారిలో నాగభూషణం పట్నాయక్‌కు మరణశిక్ష విధించారు.
-ఈ మరణశిక్షకు వ్యతిరేకంగా దేశవ్యాప్త ఆందోళన జరిగింది. ఈ ఆందోళనవలన, అతని అనారోగ్య కారణాల వలన తర్వాత కాలంలో నాగభూషణం పట్నాయక్‌ను విడుదల చేశారు.
-1970 నాటికి పోలీసులు అమలు చేసిన నిర్బంధకాండవల్ల శ్రీకాకుళం ఉద్యమంలో కొంత స్తబ్ధత ఏర్పడింది.
-1972 సెప్టెంబర్‌లో చండ్ర రాజేశ్వరరావు, రాజా బహదూర్గౌడ్, నల్లమల గిరిప్రసాద్‌లు చారిత్రాత్మక తెలంగాణ పోరాటం అనే పుస్తకాన్ని ప్రచురించారు.
-1972 డిసెంబర్లో మాకినేని బసవపున్నయ్య తెలంగాణ సాయుధ పోరాటం-వాస్తవాలు అనే గ్రంథాన్ని ప్రచురించాడు.
-పుచ్చలపల్లి సుందరయ్య స్వీయ చరిత్ర – విప్లవ పథంలో నా పయనం.
పాలకొల్లు సమావేశం
-1968 జనవరిలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మార్క్సిస్ట్ పార్టీ ప్లీనరీ జరిగింది.
-మావోవాదులు మెజారిటీ సంఖ్యలో ఉన్న ఈ సమావేశంలో తమ సైద్ధాంతిక సూత్రాలను ప్రతిపాదించి చర్చించడానికి వారికి ఒక మంచి అవకాశం లభించింది.
-పార్టీ పొలిట్‌బ్యూరో తరఫున పుచ్చలపల్లి సుందరయ్య, మాకినేని బసవపున్నయ్యలు సమావేశంలో పాల్గొని, కమ్యూనిస్టు వర్గాల్లో ఉన్న సైద్ధాంతిక విభేదాలను పరిష్కరించడానికి ప్రయత్నించి విఫలమయ్యారు.
-పాలకొల్లు ప్లీనరీ ప్రిసీడియానికి మావో వాదులైన తరిమెల నాగిరెడ్డి, దేవులపల్లి వెంకటేశ్వర రావులు కేంద్ర కమిటీని సమర్థిస్తున్న గుంటూరు బాపనయ్యలు ఎన్నికయ్యారు.
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
తాత్వికతను తెలిపేది.. రాజ్యాంగానికి గుండెలాంటిది
ఎలకానిక్ రికార్డులు.. ప్రాథమిక సాక్ష్యాలు
శుక్రకణాలు తాత్కాలికంగా నిల్వ ఉండే ప్రాంతం?
సెకండరీ ఎడ్యుకేషన్ కమిషన్‌కు మరోపేరు?
‘వెయ్యి ఉరిల మర్రి’ గా పేరుగాంచిన ఊడలమర్రి ఏ జిల్లాలో ఉంది?
రక్షణ దుర్గాలు – నాటి పాలనా విభాగాలు
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?