Hyderabad economy into the global market | హైదరాబాద్ ఆర్థిక వ్యవస్థను ప్రపంచ మార్కెట్లోకి చేర్చిన పంటలు?
తెలంగాణ, భారతదేశ ఆర్థిక వ్యవస్థ
1.నిజాంల కాలంలో కేంద్ర పరిపాలనా వ్యవస్థలో మూడు కార్యాలయాలు ప్రభుత్వ కార్యక్రమాలను నిర్వహించేవి. తాలూకా స్థాయిలో ముఫసిల్ కార్యాలయాలు ప్రభుత్వ ప్రత్యక్ష పాలనలో ఉండేవి. నగరాల్లో మూడు రకాలైన కార్యాలయాలు ఉండేవి. వాటిలో రెండు న్యాయవ్యవస్థకు, ఒకటి పోలీసు వ్యవస్థకు సంబంధించినవి. అయితే రాష్ట్ర స్థాయిలో ఆదాయ వ్యయాలను దఫ్తర్-ఎ-మాల్, జాగీరుల కేటాయింపులను దఫ్తర్-ఎ-దివామీ కార్యాలయాలు పరిశీలించేవి. ప్రభుత్వ అధికార ఉత్తర ప్రత్యుత్తరాలను నిర్వహించే కార్యాలయం ఏది?
1) సదర్-ఉల్-మిహం ముతఫర్రీకత్
2) బోర్డ్ ఆఫ్ రెవెన్యూ 3) గజటీర్ కార్యాలయం
4) దారుల్ ఇన్షా
2. 1861కి ముందు ఖల్సా ప్రాంతాల మొత్తం వైశాల్యం 40,000 చ.మైళ్లు. 1881 నాటికి అది 71,600 చ.మైళ్లకు పెరిగింది. దివానీ ప్రాంతం విస్తరించడానికి కారణం?
ఎ) తనఖా జాగీరులను కలుపుకోవడం
బి) ఎగుమతి దిగుమతులపై పన్నుల తొలగింపు
సి) 1861 తర్వాత బ్రిటిష్‌వారు నిజాంకు జిల్లాలు తిరిగివ్వడం
డి) తాలూకాల్లో ప్రభుత్వ ఖజానాల ఏర్పాటు
1) బి, సి 2) ఎ, సి 3) బి, డి 4) బి, ఎ
3. 1878లో నిజాం రాష్ట్రంలో చెరువుల మరమ్మత్తుల కోసం నీటిపారుదల శాఖను ఏర్పాటు చేశారు. జిల్లాలో నీటిపారుదల ప్రగతిని తాలూకాదార్లు పర్యవేక్షించేవారు. తహసిల్దార్లు తమ ప్రాంతాల్లోని నీటిపారుదల వ్యవస్థను పరిశీలించేవారు. అయితే రాష్ట్రస్థాయిలో నీటిపారుదల శాఖను ఎవరు పర్యవేక్షించారు?
1) సదర్-ఉల్-మిహం
2) సదర్-ఉల్-మిహం ముతఫర్రీకత్
3) దఫ్తర్-ఎ-మాల్ 4) దారుల్ ఇన్షా
4. 1881లో హైదరాబాద్ రాష్ట్ర జనాభా 9.8 మిలియన్లు. 1951 నాటికి అది 18.7 మిలియన్లకు పెరిగింది. జనాభా వృద్ధిరేటు భారతదేశంలో కంటే హైదరాబాద్ రాష్ట్రంలో ఎక్కువ. అయితే జనభా లెక్కల సేకరణను నిజాం ప్రభుత్వం ఎప్పుడు ప్రారంభించింది?
1) 1875 2) 1878 3) 1879 4) 1880
1881 జనాభా లెక్కల ప్రకారం గ్రామీణ వ్యవస్థలో ముఖ్యమైన ఉత్పత్తి కులాలు.. నేతలో 5, ఆహారోత్పత్తిలో 5, లోహ ఉత్పత్తిలో 7 (బంగారం, వెండి, ఇనుము, రాగి, మొదలైనవి), వడ్రంగంలో 2, కుండల తయారీలో 2, రాతి పనిలో 2 ఉన్నాయి. అప్పటి మొత్తం జనాభాలో వీరు 10 శాతం ఉన్నారు.
5. కింది వాటిని జతపర్చండి.
ఎ. సైనిక శాఖ ఏర్పాటు 1. 1869
బి. బోర్డ్ ఆఫ్ రెవెన్యూ రద్దు 2. 1875
సి. సదర్-ఉల్-మిహం ముతఫర్రీకత్ సంస్థ ఏర్పాటు 3. 1864
డి. సర్వే అండ్ సెటిల్మెంట్ డిపార్ట్మెంట్ 4. 1867
1) ఎ-3, బి-4, సి-1, డి-2
2) ఎ-1, బి-2, సి-3, డి-4
3) ఎ-3, బి-4, సి-1, డి-2
4) ఎ-4, బి-3, సి-2, డి-1
6. హైదరాబాద్ రాష్ట్రంలో భూ సంబంధాలు భౌగోళికంగా రెండు భాగాలుగా ఉండేవి. అవి దివానీ, జాగీరు ప్రాంతాలు. ప్రభుత్వానికి నేరుగా భూమి శిస్తు చెల్లిస్తూ రైతులే యజమానులుగా ఉండే ప్రాంతం దివానీ లేదా ఖల్సా. రాజు సొంత భూములు సర్ఫేఖాస్ కూడా ఇందులో భాగంగానే ఉండేవి. ప్రభువులకు, మున్సబ్దార్లకు రాజులు ఇచ్చిన భూమి జాగీరు. నిజాం రాష్ట్రంలో దివానీ ప్రాంతమే అతిపెద్ద భాగం. అయితే దివాన్ ప్రాంతం అంటే ఏమిటి?
1) నిజాం ఆధీనంలో ఉండే భూమి
2) జాగీరుకాని, ఇనాంకాని ప్రాంతం
3) సేవలకు గుర్తింపుగా దానంగా పొందిన ప్రాంతం
4) దివాన్ ఆధీనంలో ఉండే ప్రాంతం
7. హైదరాబాద్ రాష్ట్రంలో 7 రకాల జాగీరు భూములుండేవి. వాటిని జతపర్చండి.
ఎ. నిజాంకు కప్పం చెల్లించేవారు 1. ఇనాందార్లు
బి. సేవలకు గుర్తింపుగా భూమి దానాలను పొందినవారు 2. దేశ్‌ముఖ్‌లు
సి. ప్రభుత్వంతో సంబంధం కలిగిన స్థానిక భూస్వాములు 3. దేశ్పాండ్యాలు
డి. పెద్ద భూస్వాములైన గణక నిపుణులు 4. సంస్థానదార్లు
1) ఎ-4, బి-2, సి-1, డి-3
2) ఎ-4, బి-1, సి-2, డి-3
3) ఎ-3, బి-4, సి-1, డి-2
4) ఎ-3, బి-2, సి-4, డి-1
8. 19వ శతాబ్దం చివరినాటికి హైదరాబాద్ రాష్ట్రంలో వ్యవసాయానికి సంబంధించి సరైనవి గుర్తించండి.
ఎ. రాష్ట్రంలో పండించిన సాధారణ పంటలు- వరి,
జొన్న, సజ్జ, మక్కజొన్న, నువ్వులు, పత్తి,
వేరుశనగ, పొగాకు, మిరప
బి. వరంగల్ సుబాలో నీటిపారుదలతో పండించే
ముఖ్యమైన పంటలు- వరి, జొన్న
సి. తెలంగాణలోనేకాకుండా, హైదరాబాద్ రాష్ట్రంలో అధి
కంగా నీటిపారుదల ఉన్న జిల్లాలు- కరీంనగర్, వరంగల్
డి. కరీంనగర్, వరంగల్, ఆదిలాబాద్ జిల్లాల్లో వరి
పండించే మొత్తం భూమిలో నీటిపారుదల వరుసగా
73 శాతం, 72 శాతం, 63 శాతం ఉంది
ఇ. నూనె గింజల ఉత్పత్తి వాణిజ్య పంటగా ప్రసిద్ధి
చెందింది
1) ఎ, బి, ఇ 2) ఎ, సి, డి, ఇ
3) బి, డి, ఇ 4) పైవన్నీ
9. హైదరాబాద్ రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను ప్రపంచ మార్కెట్లోకి చేర్చిన పంటలు?
1) మిరప, పొగాకు 2) పొగాకు, పత్తి
3) పత్తి, నూనెగింజలు 4) నూనెగింజలు, మిరప
నిజాం రాష్ట్రంలో పత్తి పంటకు మరఠ్వాడా ప్రాంతం వ్యాపార కేంద్రంగా మారింది. అనంతరం తెలంగాణలోని ఆదిలాబాద్ జిల్లాలో ఈ పంట అధికంగా వ్యాప్తి చెందింది. దీంతో 1930 నాటికి హైదరాబాద్ స్టేట్‌లో ఉత్పత్తి అయిన మొత్తం పంటలో 60 శాతం ఎగుమతి అయ్యేది. అదేకాలంలో నూనె గింజల ఉత్పత్తి వాణిజ్య పంటగా ప్రసిద్ధి చెందింది.
10. భారతదేశంలో మొదటి రైలు 1851 డిసెంబర్ 22న రూర్కి-పిరన్ కలియార్కు నడిచిన పదేండ్ల తర్వాత 1861లో హైదరాబాద్‌కు రైలు మార్గం కోసం ప్రతిపాదన అమలైంది. 1899లో గోదావరి లోయ రైల్వే లైను (386 మైళ్లు) ప్రారంభమైంది. 1872లో పోస్టల్‌శాఖ ఆరంభమై హైదరాబాద్ పట్టణానికి జిల్లా కేంద్రాలను అనుసంధానించింది. అయితే నిజాం రాజ్యంలో టెలిగ్రాఫ్ వ్యవస్థ ఎప్పుడు ఏర్పడింది?
1) 1857 2) 1864 3) 1870 4) 1894
జవాబులు
1-4, 2-2, 3-1, 4-4, 5-3, 6-4,7-2, 8-4, 9-3, 10-1
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
తాత్వికతను తెలిపేది.. రాజ్యాంగానికి గుండెలాంటిది
ఎలకానిక్ రికార్డులు.. ప్రాథమిక సాక్ష్యాలు
శుక్రకణాలు తాత్కాలికంగా నిల్వ ఉండే ప్రాంతం?
సెకండరీ ఎడ్యుకేషన్ కమిషన్‌కు మరోపేరు?
‘వెయ్యి ఉరిల మర్రి’ గా పేరుగాంచిన ఊడలమర్రి ఏ జిల్లాలో ఉంది?
రక్షణ దుర్గాలు – నాటి పాలనా విభాగాలు
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?