Minority Welfare – Schemes | మైనారిటీ సంక్షేమం – ప్రభుత్వ పథకాలు
దేశంలో అల్పసంఖ్యాక వర్గాల అభివృద్ధి కోసం భారత ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలను రూపొందించి అమలుచేస్తున్నది. భాష, జనాభా, మతపరమైన మైనారిటీల చిన్నారులకు విద్యతోపాటు యువతకు ఉపాధి కార్యక్రమాలు కూడా అమలవుతున్నాయి. టీఎస్పీఎస్సీ గ్రూప్స్ సిలబస్‌లో అల్ప సంఖ్యాక వర్గాల సంక్షేమాన్ని కూడా ఒక అంశంగా చేర్చింది. ఈ అంశంపై పరీక్షల్లో తప్పనిసరిగా ప్రశ్నలు అడిగే అవకాశం ఉన్నందున నిపుణ పాఠకుల కోసం ఈ వ్యాసం..
-ప్రధానమంత్రి 15 సూత్రాల పథకాన్ని 2006లో ప్రారంభించారు. 2009లో సవరించారు. దీన్ని మొదటి 15-point programmeను సవరించి ఏర్పాటు చేశారు. (Ist 15-point programme – 1983)
15 సూత్రాల పథకంలోని అంశాలు.
1.ICDSలో సరైన వాట
2. పాఠశాల విద్య సౌకర్యాలు
3.ఉర్దూ బోధన వనరులు
4.మదర్సా విద్య ఆధునికీరణ
5.స్కాలర్షిప్లు
6.మౌలానా ఆజాద్ ఫౌండేషన్ ద్వారా విద్యా సంబంధమైన అవస్థాపన సౌకర్యాలు పెంచడం
7.సెల్ఫ్ ఎంప్లాయిమెంట్ అండ్ వేజ్ ఎంప్లాయిమెంట్ ఫర్ ది పూర్
8.నైపుణ్యాల వృద్ధి
9.రుణ సౌకర్యాలు
10.రిక్రూట్మెంట్ టు స్టేట్ అండ్ కల్చరల్ సర్వీసెస్
11.రూరల్ హౌసింగ్ స్కీమ్‌లో సరైన వాటా
12.స్లమ్‌ల వృద్ధి
13.మత అల్లర్లను అరికట్టడం
14.మతదాడుల విచారణ
15.మత అల్లర్ల బాధితుల పునరావాసం
ప్రీ మెట్రిక్ స్కాలర్షిప్ స్కీమ్
-2008లో ప్రారంభించారు. కేంద్ర ప్రభుత్వ పథకం
-కేంద్రం 75 శాతం నిధులను సమకూరుస్తుంది.
-కేంద్రపాలిత ప్రాంతాలకు 100 శాతం నిధులను ఇస్తుంది.
పోస్ట్ మెట్రిక్ స్కాలర్షిప్ స్కీమ్
-2007లో ప్రారంభించారు.
-100 శాతం కేంద్రమే నిధులను సమకూరుస్తుంది.
-2007లో మెరిట్ కమ్ మీన్స్ బేస్డ్ స్కాలర్‌షిప్‌ని ప్రారంభించారు. ఈ పథకం టెక్నికల్ అండ్ ప్రొఫెషనల్ కోర్సులను అభ్యసిస్తున్న విద్యార్థులను ఉద్దేశించింది.
మౌలానా ఆజాద్ నేషనల్ ఫెలోషిప్
-2009లో ప్రారంభించారు. 100 శాతం నిధులను కేంద్రమే ఇస్తుంది.
-యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ ద్వారా అమలుపరుస్తారు.
-ఎంఫిల్, పీహెచ్డీ చేస్తున్న పరిశోధక విద్యార్థులకు ఐదేండ్ల పాటు నెలసరి ఉపకార వేతనాలు ఇస్తారు.
-2.5 లక్షల వార్షిక ఆదాయం కంటే తక్కువ ఆదాయం గల కుటుంబానికి చెందిన విద్యార్థులకు మాత్రమే ప్రదానం చేస్తారు.
-2.5 లక్షల కంటే తక్కువ ఆదాయం ఉన్న వారికి 2007లో ఫ్రీ కోచింగ్ అండ్ అటెండ్ స్కీమ్‌ని ప్రవేశపెట్టారు. ఈ పథకాన్ని 2009లో సవరించారు.
-మౌలానా ఆజాద్ ఎడ్యుకేషన్ ఫౌండేషన్
-ఇది రాజకీయేతర స్వచ్ఛంద సంస్థ
-విద్యాపరంగా వెనుకబడిన మైనారిటీల కోసం స్థాపించారు.
-1989లో జూలై 6న సొసైటీస్ రిజిస్ట్రేషన్ యాక్ట్-1860 కింద ఏర్పర్చారు.
-ఈ సంస్థ ప్రధానంగా కింది రెండు పథకాలను అమలుపరుస్తున్నది.
1. గ్రాంట్ ఇన్ ఎయిడ్ టు ఎన్జీవోఎస్ ఫర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ ఆఫ్ ది ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్
2.మైనారిటీ విద్యార్థినులకు మౌలానా ఆజాద్ నేషనల్ స్కాలర్‌షిప్‌ని అందిస్తుంది. అందుకు ఈ కింది నిబంధనలు రూపొందించారు.
-ఏడాదికి రెండు వాయిదాల్లో రూ. 12000 చెల్లిస్తారు.
-పదో తరగతిలో 55 శాతం మార్కులు ఉండి, పదకొండో తరగతికి అడ్మిషన్ పొంది ఉండాలి.
-తల్లిదండ్రుల ఆదాయం లక్ష లోపే ఉండాలి.
నేషనల్ కమిషన్ ఫర్ మైనారిటీస్
-జనవరి 12, 1978న కార్యనిర్వాహక సంస్థగా ఏర్పాటుచేశారు.
-నేషనల్ కమిషన్ ఫర్ మైనారిటీఎస్ యాక్ట్ 1992 ద్వారా చట్టబద్ధ సంస్థగా మారింది.
-ఇలా మొదటి చట్టబద్ధ జాతీయ మైనారిటీ కమిషన్ 1993న ఏర్పడింది.
-మొదటి చైర్మన్ సర్దార్ అలీఖాన్, ప్రస్తుత చైర్మన్ నసీం అహ్మద్
-ఒక చైర్మన్, వైస్ చైర్మన్, ఐదుగురు సభ్యులు ఉంటారు. వీరి పదవీకాలం మూడేండ్లు. కేంద్ర ప్రభుత్వం వీరిని నామినేట్ చేస్తుంది.
-మైనార్టీల అభివృద్ధి, సంరక్షణ సమీక్ష, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు మైనారిటీల అంశాలపై సూచనలు, సలహాలు, నమోదు, పిర్యాధులను స్వీకరించి న్యాయం జరిగేలా చూడటం, ప్రధాని 15 సూత్రాల పథకం అమలుతీరును పర్యవేక్షించడం, నివేదికను కేంద్ర ప్రభుత్వానికి సమర్పించడం వంటి విధులను నిర్వహిస్తుంది.
భాషాపరమైన మైనారిటీల
జాతీయ కమిషనర్ – 1957
-నేషనల్ కమిషనర్ ఫర్ లింగ్విస్టిక్ మైనారిటీస్
-నిబంధన 350 (బి)ని అనుసరించి రాష్ట్రపతి ఏర్పాటుచేస్తాడు. ఇది రాజ్యాంగబద్ధ సంస్థ.
-అలహబాద్ కేంద్రంగా జాతీయ కమిషనర్ కార్యాలయం 1957లో ఏర్పాటుచేశారు. దీనికి బెల్గాం, చైన్నె, కోల్‌కతాలో ప్రాంతీయ కార్యాలయాలు ఉన్నాయి.
-మైనారిటీస్ మంత్రిత్వ శాఖ ద్వారా రాష్ట్రపతి నివేదిక సమర్పిస్తారు.
-స్టేట్ రీఆర్గనైజేషన్ కమిషన్ (1953-55) సూచనల మేరకు 17వ రాజ్యాంగ సవరణ ద్వారా 17వ విభాగంలో అధికరణం 350 (బి) చేర్చి తద్వారా ఈ కమిషన్ ఏర్పాటుచేశారు.
ఎన్సీఎంఈఐ
-2004లో నేషనల్ కమిషన్ ఫర్ మైనారిటీ ఎడ్యుకేషన్ యాక్ట్- 2004ను అనుసరించి ఏర్పాటు చేసిన చట్టబద్ధసంస్థ. ఈ చట్టాన్ని 2004, 2006లో సవరించారు.
-ఈ కమిషన్‌కు క్వాసీ జ్యుడీషియల్ బాడీ, సివిల్ కోర్ట్‌కు ఉండే అధికారాలు ఉంటాయి.
-రాజ్యాంగబద్ధంగా మైనార్టీలు కలిగిఉన్న విద్యావసరమైన సంస్థలను స్థాపించి నిర్వహించుకునే అమలుచేసేందుకు ఏర్పాటు చేసిన సంస్థ.
సెంట్రల్ వెల్ఫేర్ కౌన్సిల్
-వక్ఫ్ చట్టం- 1995, 1994ను అనుసరించి ఏర్పాటుచేసిన చట్టబద్ధ సంస్థ. సెంట్రల్ వక్ఫ్ కౌన్సిల్‌ను 1964, డిసెంబర్లో ఏర్పాటు చేశారు.
-మైనార్టీ మంత్రిత్వ శాఖ పరిధిలో పనిచేస్తుంది.
-రాష్ర్టాల్లో వక్ఫ్ బోర్టులను ఏర్పాటు చేస్తారు. వక్ఫ్ ఆస్తుల విషయంలో ప్రభుత్వాలకు సలహాలను ఇస్తుంది.
-కేంద్ర మైనారిటీ శాఖామంత్రి ఎక్స్ అఫీషియో చైర్మన్‌గా వ్యవహరిస్తాడు.
-2013-14 నుంచి సివిల్స్ ప్రిలిమ్స్, ఇతర పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించేందుకు స్కీమ్ ఆఫ్ సపోర్ట్ ఫర్ స్టూడెంట్స్ క్లియరింగ్ ప్రిలిమ్స్ అనే పథకాన్ని ప్రవేశపెట్టారు.
-రిసెర్చ్ లేదా స్టడీస్, మానిటరింగ్, ఎవాల్యూషన్ ఆఫ్ ద డెవలప్మెంట్ స్కీమ్స్ ఇన్క్లూడింగ్ పబ్లిసిటీ లేదా నలంద ప్రాజెక్ట్ అనే కార్యక్రమాలను 2014, ఫిబ్రవరిలో అలీఘర్ ముస్లిం యూనివర్సిటీలో ప్రారంభించారు. ఈ పథకం మైనారిటీ విద్యా సంస్థల్లో పనిచేస్తున్న అధ్యాపకుల సామర్ధ్యాలను పెంపొందిస్తుంది.
-పడోప్రదేశ్ అనే పథకాన్ని 2013-14 ఆర్థిక సంవత్సరంలో ప్రారంభించారు. విదేశాల్లో చదువుకునేందుకు మైనారిటీ విద్యార్థులకు ఇంటరెస్ట్ సబ్సిడీతో కూడిన విద్యాపరమైన రుణ సదుపాయం కల్పించడం ఈ పథకం ప్రధాన ఉద్దేశం.
-1987లో మైనారిటీలు అధికంగా ఉన్న జిల్లాల్లో ప్రభుత్వ పథకాలు సక్రమంగా లబ్ధిదారులకు చేరేలా చూడటానికి ఐడెంటిఫికేషన్ ఆఫ్ మైనారిటీ కాన్సన్ట్రేషన్ డిస్టిక్స్ (ఎంసీడీ) అనే పథకం ప్రవేశపెట్టారు.
-2001 జనాభా లెక్కల ప్రకారం 2007లో 90 ఎంసీడీలను గుర్తించారు. ఈ జిల్లాల్లో 2008 నుంచి స్కీమ్ ఆఫ్ మల్టీ సెక్టోరల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్‌ను అమలుచేస్తున్నారు. ఎంసీడీ ప్రాంతంలో నివసించే వారి జీవన ప్రమాణాలను మెరుగుపరచడమే ఈ పథకం ఉద్దేశం.
-2012 నుంచి మైనార్టీల మహిళల్లో నాయకత్వ సామర్థ్యాలు పెంపొందించే నయీ రోషిణి పథకం (స్కీమ్ ఆఫ్ లీడర్షిప్ డెవలప్మెంట్ ఆఫ్ మైనారిటీ ఉమెన్) అనే పథకం అమలుపరుస్తున్నారు. ఈ పథకం అమల్లో ఎన్జీవోలను సివిల్ సొసైటీలను భాగస్వాములను చేస్తున్నారు.
-స్కీమ్ ఆఫ్ కంప్యూటర్ ఎడ్యుకేషన్ ఆఫ్ ద రికార్డ్స్ ఆఫ్ ద స్టేట్ వక్ఫ్ బోర్డ్స్ అనే పథకాన్ని 2009లో ప్రారంభించారు.
-ముస్లిం మైనార్టీల్లో హస్తకళా నైపుణ్యం వెలికితీసే లక్ష్యంతో 2015 మే 14న ఉస్తాద్ పథకాన్ని ప్రారంభించారు.
రంగనాథ్ మిశ్రా కమిషన్
-2004లో ఏర్పాటు చేశారు.
-కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగాల్లో ముస్లింలకు 10 శాతం, క్రిస్టియన్లకు 5 శాతం రిజర్వేషన్లు కల్పించాలని సూచించింది. ముస్లిం కోటాలో మిగిలితే ఇతర మైనార్టీలకు బదలాయించాలని తెలిపింది.
-అన్ని మతాల్లో దళితులకు ఎస్సీ హోదాను
రాజేంద్రసింగ్ సచార్ కమిటీ
-2005, మార్చి 9న కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసింది.
-ఈ కమిటీనే ది ప్రైమినిస్టర్ హైలెవల్ కమిటీ ఆన్ ద సోషల్, ఎకనామిక్ అండ్ ఎడ్యుకేషనల్ స్టేటస్ ఆఫ్ ముస్లిం కమ్యూనిటీ ఆఫ్ ఇండియా అని పిలుస్తారు.
-2006లో తన నివేదికను సమర్పించింది. వాటిని 2009లో కేంద్ర ప్రభుత్వం ఆమోదించింది.
-కమిటీ సిఫారసులో ప్రధానమైనవి… సమాన అవకాశాలు, ఉర్దూ బోధన, అవగాహన.
-ఈ కమిటీ సిఫారసుల ఆధారంగా 15 సూత్రాల పథకం ప్రారంభించారు.
-రాష్ట్రంలో ముస్లింల స్థితిగతులపై అధ్యయనం చేయడానికి చెల్లప్ప, సుదీర్ కమిటీలు తమ నివేదిను సమర్పించాయి.
మైనారిటీ – సామాజిక శాసనాలు
1.The dargah khaja saheb act-1955
2.National commission for minorties act-1992
3. National commission for minorty educa-tional institution act- 2004
4.Waqf act-1995 (preciously-1954)- 2013లో సవరించారు.
-భారతీయ హజ్‌కమిటీ చట్టం -2002ని రూపొందించి హజ్ యాత్రికులకు సేవలందిస్తున్న హజ్ కమిటీలను ఏర్పాటు చేశారు.
-మైనారిటీల సంక్షేమ పథకాల అమలుతీరు పర్యవేక్షించేందుకు 2014, డిసెంబర్ 13న మిషన్ ఎంపర్మెంట్ అనే పథకం ప్రారంభించారు.
-5నుంచి 14ఏండ్లలోపు విద్యార్థులకు సంవత్సరానికి రెండుసార్లు ఉచితవైద్య పరీక్షలు చేయించుకునేందుకు మౌలానా ఆజాద్ సెహబ్ కార్డులను అందిస్తున్నారు.
-తెలంగాణ మైనార్టీల సామాజిక, ఆర్థిక, విద్యాపరమైన స్థితిగతులను తెలుసుకునేందుకు 2015లో సుధీర్ కమిటీని ఏర్పాటుచేశారు. ( 12శాతం రిజర్వేషన్లు అమలు సాధ్యాసాధ్యాలపై కమిటీ పరిశీలన చేస్తుంది).
-మైనార్టీ హక్కులపై యునైటెడ్ నేషనల్ డిక్లరేషన్‌ను 18 డిసెంబర్,1992న ప్రకటించారు.
-ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వంచే 6 రకాల మతాల వారు మైనారిటీలుగా గుర్తింపబడ్డారు.
-1. ముస్లింలు 2. క్రిస్టియన్లు 3. సిక్కులు 4. బౌద్ధులు 5. జైనులు 6. జొరాష్ట్రియన్లు
-తెలంగాణ ప్రభుత్వం 2014, నవంబర్ 11న మౌలానా అబుల్ కలాం జయంతి సందర్భంగా మైనారిటీ సంక్షేమ దినంగా ప్రకటించింది.
-తెలంగాణ రాష్ట్ర జనాభాలో 14.21 శాతం మైనార్టీలున్నారు. ఇందులో ముస్లింలు 12.69 శాతం ఉన్నారు.
-2011 జనాభా లెక్కల ప్రకారం భారత్‌లో 19.29 శాతం మైనారిటీలున్నారు. వీరిలో ముస్లింలు 14.2 శాతం ఉన్నారు.
-మైనారిటీ సంక్షేమం అనేది జనవరి 29,2006కు పూర్వం సామాజిక న్యాయం, సాధికారత మంత్రిత్వశాఖలో భాగంగా ఉండేది. 2006 నుంచి ప్రత్యేక మంత్రిత్వ విభాగంగా ఏర్పడింది. మొదటి మైనారిటీ శాఖమంత్రి అబ్దుల్ రహమాన్ అంతూలే.
-ప్రస్తుత మైనారిటీ శాఖ మంత్రి ముక్తార్ అబ్బాస్ నఖ్వీ
-ఫజల్ అలీ సూచనల మేరకు 1957లో మైనార్టీ భాషల కార్యాలయాన్ని న్యూఢిల్లీలో ప్రారంభించారు.
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
తాత్వికతను తెలిపేది.. రాజ్యాంగానికి గుండెలాంటిది
ఎలకానిక్ రికార్డులు.. ప్రాథమిక సాక్ష్యాలు
శుక్రకణాలు తాత్కాలికంగా నిల్వ ఉండే ప్రాంతం?
సెకండరీ ఎడ్యుకేషన్ కమిషన్‌కు మరోపేరు?
‘వెయ్యి ఉరిల మర్రి’ గా పేరుగాంచిన ఊడలమర్రి ఏ జిల్లాలో ఉంది?
రక్షణ దుర్గాలు – నాటి పాలనా విభాగాలు
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?