What is the Doctrine of Severability | డాక్ట్రిన్ ఆఫ్ సెవరబిలిటీ అంటే?
1. 1956 ఫిబ్రవరి 20న ఢిల్లీలో తెలంగాణ, ఆంధ్ర ప్రాంతాలకు చెందిన 8 మంది నాయకులు పాల్గొన్న పెద్ద మనుషుల ఒప్పందంలో సంతకం చేయని వ్యక్తి?
1) బూర్గుల రామకృష్ణరావు 2) కేవీ రంగారెడ్డి 3) సర్దార్ గౌతు లచ్చన్న 4) టంగుటూరి ప్రకాశం పంతులు
2. 1950లో రాజ్యాంగం అమల్లోకి వచ్చేనాటికి 7 ప్రాథమిక హక్కులు ఉండేవి. ప్రస్తుతం ఉన్న 6 ప్రాథమిక హక్కుల్లో లేని హక్కు ఏది?
1) ఆస్తి హక్కు 2) రాజ్యాంగ పరిహారపు హక్కు
3) మత స్వాతంత్య్రపు హక్కు 4) సమానత్వపు హక్కు
3. దిగువ న్యాయస్థానం లేదా ట్రిబ్యునల్ తమ పరిధిని అతిక్రమించి విచారిస్తున్నప్పుడు కేసుల విచారణను తక్షణం నిలిపివేయాలని ఆదేశిస్తూ ఉన్నత న్యాయస్థానాలు జారీ చేసే ఆజ్ఞను ఏమంటారు?
1) ప్రొహిబిషన్-ప్రతినిషేధం
2) మాండమస్-పరమదేశ
3) సెర్షియోరరీ-ఉత్ప్రేషణ
4) హెబియస్ కార్పస్-బందీ ప్రత్యక్ష
4. విద్యాహక్కును 2002లో 86వ రాజ్యాంగ సవరణ ద్వారా 21 (ఏ)లో చేర్చారు. 6 నుంచి 14 ఏండ్లలోపు బాలబాలికలకు నిర్భంద ఉచిత ప్రాథమిక విద్యను అందించాలని పేర్కొన్నారు. ఈ హక్కు ఏ తేదీ నుంచి అమల్లోకి వచ్చింది?
1) 2005 ఏప్రిల్ 1 2) 2009 అక్టోబర్ 2
3) 2010 ఏప్రిల్ 1 4) 2005 అక్టోబర్ 10
5. 1978లో జనతా ప్రభుత్వం ఆస్తిహక్కును ఫ్రాథమిక హక్కుల జాబితా నుంచి 44వ రాజ్యాంగ సవరణ ద్వారా (31వ ప్రకరణ) తొలిగించింది. ప్రస్తుతం ఏ అధికరణ/ ఆర్టికల్‌లో చట్టబద్ధ హక్కుగా పొందుపరిచారు?
1) 303(ఎ) 2) 300(ఎ) 3) 301(ఎ) 4) 302(ఎ)
6. కింది వాటిలో తప్పుగా ఉన్న దాన్ని గుర్తించండి.
ఎ. 2009 నవంబర్ 29న కేసిఆర్ ఆమరణ నిరాహారదీక్ష
బి. 2009 డిసెంబర్ 9న తెలంగాణ ఏర్పాటు ప్రక్రియను ప్రారంభిస్తున్నట్లు చిదంబరం ప్రకటన
సి. 2010 ఫిబ్రవరి 9న జస్టిస్ శ్రీకృష్ణ కమిటీ ఏర్పాటు
డి. 2013 జూలై 13న తెలంగాణ బిల్లుకు కేంద్ర మంత్రివర్గం ఆమోదం
1) ఎ మాత్రమే 2) బి, సిలు మాత్రమే
3) సి, డిలు మాత్రమే 4) డి మాత్రమే
7. ప్రాథమిక హక్కుల పరిరక్షణ కోసం సుప్రీంకోర్టు/హైకోర్టు ఎన్ని రకాల రిట్లను జారీ చేస్తాయి?
1) 5 2) 6 3) 8 4) 7
8. రాజ్యాంగబద్ధంగా, చట్టబద్ధంగా అధికారాలు లేనప్పటికీ, అధికారాలను నిర్వహించే వ్యక్తిని న్యాయస్థానాలు ఏ అధికారంతో అని ప్రశ్నిస్తూ జారీ చేసే ఆజ్ఞను ఏమంటారు?
1) సెర్షియోరరీ-ఉత్ప్రేషణ
2) కోవారెంటో-అధికార పృచ్చ
3) ప్రొహిబిషన్-ప్రతినిషేధం
4) మాండమస్-పరమదేశ
9. బాధితుడు న్యాయస్థానం ముందు హాజరై తన వాదనను వినిపించుకునే స్థితిలో లేనప్పుడు అతని తరపున వాదించడం కోసం న్యాయస్థానం నియమించిన వ్యక్తి లేదా అధికారిని ఏమంటారు?
1) లోకస్ స్టండీ 2) రెట్రాస్పెక్టివ్
3) సుమోటోకేసు 4) అమికస్ క్యూరీ
10. ప్రాథమిక హక్కులను సవరించే అధికారం పార్లమెంటుకు లేదని, ఒకవేళ ప్రాథమిక హక్కులను సవరించాలంటే ప్రత్యేక రాజ్యాంగ పరిషత్‌ను ఏర్పాటు చేయాలని సుప్రీంకోర్టు ఏ కేసులో తీర్పునిచ్చింది?
1) కేశవానంద భారతీ వర్సెస్ కేరళ ప్రభుత్వం- 1973
2) ఇందిరాసహాని వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా-1992
3) గోలక్‌నాథ్ వర్సెస్ పంజాబ్ ప్రభుత్వం-1967
4) శంకరీ ప్రసాద్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా-1951
11. ప్రభుత్వాధికారిగానీ, సంస్థగానీ తమ చట్టబద్ధమైన విధులను నిర్వర్తించనపుడు వాటిని నిర్వర్తించమని సుప్రీంకోర్టు/హైకోర్టు జారీ చేసే అత్యున్నతమైన ఆదేశం?
1) హెబియస్ కార్పస్- బందీ ప్రత్యక్ష
2) మాండమస్- పరమాదేశ
3) ప్రొహిబిషన్- ప్రతినిషేధం
4) కోవారెంటో- అధికార పృచ్చ
12. భారత రాజ్యాంగంలో 3వ భాగంలో ప్రాథమిక హక్కులను 12 నుంచి 35 (అధికరణలు/నిబంధనలు) వరకు పొందుపరిచారు. ప్రస్తుతం ఉన్న 6 ప్రాథమిక హక్కుల్లోని 23 -24 ఆర్టికల్స్ ఏ హక్కుకు సంబంధించింది ?
1) పీడన నిరోధక హక్కు
2) రాజ్యాంగ పరిహారపు హక్కు
3) విద్యా సాంస్కృతిక హక్కు
4) సమానత్వపు హక్కు
13. రాజ్యాంగ ప్రవేశికను నేటివరకు ఒక్కసారి మాత్రమే సవరించారు. స్వరణ్‌సింగ్ కమిటీ సిఫారసు మేరకు 42వ సవరణ ద్వారా (ఇందిరాగాంధీ ప్రధానిగా ఉన్నప్పుడు) సామ్యవాద, లౌకిక, సమగ్రత అనే మూడు పదాలను రాజ్యాంగ పీఠికలో ఎప్పుడు చేర్చారు?
1) 1986 2) 1976 3) 1977 4) 1978
14. స్వాతంత్య్రానికి పూర్వం రూపొందించిన చట్టాలు ఏవైనా ప్రస్తుతం అమల్లో లేకపోయినప్పటికీ వాటి అవసరాన్ని, ప్రాధాన్యతను అనుసరించి ప్రభుత్వాలు వాటిని అమలుచేయవచ్చు. వీటినే మరుగున పడిపోయిన చట్టాలుగా సుప్రీంకోర్టు తన తీర్పులో పెర్కొంది. ఈ ప్రక్రియను ఏమంటారు?
1) డాక్ట్రిన్ ఆఫ్ వేవర్ 2) అల్ట్రా వైరస్
3) డాక్ట్రిన్ ఆఫ్ సెవరబిలిటీ 4) డాక్ట్రిన్ ఆఫ్ ఎక్లిప్స్
15. దిగువ న్యాయస్థానాలు లేదా ట్రిబ్యునల్స్‌లో విచారణలో ఉన్న కేసుల విచారణను తక్షణం తనకుగానీ లేదా మరో కోర్ట్కుగానీ బదిలీ చేయాలనీ సుప్రీంకోర్టు/హైకోర్టులు జారీ చేసే ఆజ్ఞను ఏమంటారు?
1) కోవారెంటో- అధికార పృచ్చ
2) హెబియస్ కార్పస్- బందీ ప్రత్యక్ష
3) సెర్షియోరరీ- ఉత్ప్రేషణ
4) మాండమస్- పరమాదేశ
16. ప్రభుత్వం రూపొందించిన చట్టాలలోని ఏదైనా భాగంకానీ, నియమంకానీ, నిబంధనకానీ ఫ్రాథమిక హక్కులకు (ఆర్టికల్ 13) భంగకరంగా/విరుద్ధంగా ఉన్నప్పుడు మొత్తం చట్టాన్ని రద్దు చేయకుండా, ఏ భాగమైతే ప్రాథమిక హక్కులకు విరుద్ధమో, చట్టంలోని ఆ భాగం మాత్రమే రద్దవుతాయి. ఈ ప్రక్రియను ఏమంటారు?
1) డాక్ట్రిన్ ఆఫ్ వేవర్ 2) డాక్ట్రిన్ ఆఫ్ ఎక్లిప్స్
3) డాక్ట్రిన్ ఆఫ్ సెవరబిలిటీ 4) అల్ట్రా వైరస్
జవాబులు
1-4, 2-1, 3-1, 4-3, 5-2, 6-4, 7-1, 8-2, 9-4, 10-3, 11-2, 12-1, 13-2, 14-4, 15-3, 16-3
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
తాత్వికతను తెలిపేది.. రాజ్యాంగానికి గుండెలాంటిది
ఎలకానిక్ రికార్డులు.. ప్రాథమిక సాక్ష్యాలు
శుక్రకణాలు తాత్కాలికంగా నిల్వ ఉండే ప్రాంతం?
సెకండరీ ఎడ్యుకేషన్ కమిషన్‌కు మరోపేరు?
‘వెయ్యి ఉరిల మర్రి’ గా పేరుగాంచిన ఊడలమర్రి ఏ జిల్లాలో ఉంది?
రక్షణ దుర్గాలు – నాటి పాలనా విభాగాలు
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?