What minorities does the Constitution recognize | రాజ్యాంగం ఎటువంటి మైనారిటీలను గుర్తించింది?
ఇండియన్ పాలిటీ
1. 1946లో తాత్కాలిక ప్రభుత్వంలోని కార్యనిర్వాహక మండలి ఉపాధ్యక్షుడు?
1) జవహర్లాల్ నెహ్రూ 2) ఎస్ రాధాకృష్ణన్
3) సీ రాజగోపాలచారి 4) రాజేంవూదవూపసాద్
2. దేశంలో జరిగిన వివిధ ఎన్నికల్లో ఏ తరహా ఎన్నికల విధానం అవలంబించారు ?
1) వయోజన ఓటింగ్ ద్వారా ప్రత్యక్ష ఎన్నికలు
2) బదిలీ చేయగలిగిన ఏక ఓటుగల నైష్పత్తిక ప్రాతి
నిధ్య పద్ధతి
3) నైష్పత్తిక ప్రాతినిధ్య జాబితా పద్ధతి
4) పరోక్ష ఎన్నికల క్యుములేటివ్ పద్ధతి
3. కింది వాటిలో ప్రధానమంవూతికి సంబంధించి సరైనది?
1) ఉభయసభల్లో సభ్యుల్ని మాత్రమే మంత్రులుగా
ఎన్నుకునే అవకాశం ఉంటుంది
2) రాష్ట్రపతిని సంప్రదించిన తర్వాతే మంత్రులను నిర్ణయించాలి
3) మంత్రులుగా ఎవరిని నియమించాలనే విష
యంలో ప్రధానమంవూతికి పూర్తి స్వేచ్ఛ ఉంది
4) మంత్రులను నియమించే విషయంలో ప్రధానికి
పరిమిత అధికారాలు మాత్రమే ఉన్నాయి
4. కింది వారిలో లోక్‌సభ స్పీకర్‌గా పనిచేసినవారు?
ఎ) నీలం సంజీవడ్డి బి) రబి రే
సి) ఎల్కే అద్వానీ డి) మనోహర్ జోషి
ఇ) బలరాం జక్కర్ ఎఫ్) శంకర్ దయాల్ శర్మ
1) ఎ, బి, ఎఫ్ 2) ఎ, బి, డి, ఎఫ్
3) ఎ, బి, డి, ఇ 4) డి, ఇ, ఎఫ్
5. భారత ప్రభుత్వ చట్టం-1935కు సంబంధించి సరైనవి?
ఎ) రాష్ట్రాల్లో డయార్కిని ప్రవేశపెట్టారు
బి) కేంద్రంలో డయార్కిని ప్రవేశపెట్టారు
సి) రాష్ట్రాల్లో డయార్కిని రద్దు చేశారు
డి) కేంద్రంలో డయార్కిని రద్దు చేశారు
ఇ) రాష్ట్రాలకు స్వయం ప్రతిపత్తి కల్పించారు
1) బి, సి, ఇ 2) ఎ, బి, సి 3) బి, సి, డి 4) ఎ, డి
6. రాజ్యాంగంలోని అంశం, గ్రహించిన దేశాలను జతపర్చండి.
ఎ) ఫ్రాన్స్ 1) గవర్నర్ల నియామకం
బి) జర్మనీ 2) ప్రాథమిక హక్కులను
సస్పెండ్ చేయడం
సి) కెనడా 3) రిపబ్లిక్ పద్ధతి
డి) దక్షిణావూఫికా 4) రాజ్యాంగ సవరణ పద్ధతి
1) ఎ-3, బి-2, సి-1, డి-4
2) ఎ-1, బి-2, సి-3, డి-4
3) ఎ-4, బి-3, సి-1, డి-2
4) ఎ-3, బి-1, సి-2, డి-4
7. రాజ్యాంగ పరిషత్‌లోని కమిటీలు, వాటి అధ్యక్షులను జతపర్చండి.
ఎ) హౌస్ కమిటీ 1) పట్టాభి సీతారామయ్య
బి) క్రెడెన్షల్ కమిటీ 2) సర్దార్ వల్లభాయ్ పటేల్
సి) యూనియన్ పవర్స్ కమిటీ
3) జవహర్లాల్ నెహ్రూ
డి) సలహా సంఘం 4) అల్లాడి కృష్ణస్వామి అయ్యర్
1) ఎ-2, బి-4, సి-3, డి-1
2) ఎ-1, బి-4, సి-3, డి-2
3) ఎ-4, బి-3, సి-1, డి-2
4) ఎ-3, బి-1, సి-2, డి-4
8. కిందివాటిని జతపర్చండి.
ఎ) ఆర్థిక, స్టాప్ కమిటీ 1) జేబీ కృపలానీ
బి) ప్రాథమిక హక్కుల కమిటీ
2) సర్దార్ పటేల్
సి) ప్రాథమిక హక్కుల ఉపకమిటీ
3) బాబూ రాజేంద్ర ప్రసాద్
డి) ముసాయిదా కమిటీ 4) అంబేద్కర్
1) ఎ-3, బి-2, సి-1, డి-4
2) ఎ-1, బి-2, సి-3, డి-4
3) ఎ-4, బి-3, సి-2, డి-1
4) ఎ-3, బి-1, సి-2, డి-4
9. కింది వాటిలో సరైనది?
ప్రతిపాదన A: ఈస్టిండియా కంపెనీ పాలనాకాలంలో చేసిన చట్టాలను చార్టర్ చట్టాలు అంటారు.
కారణం R: ఎలిజబెత్ రాణి ఆమోదంతో చార్టర్ చట్టం ద్వారా ఈస్టిండియా కంపెనీ ఏర్పడింది.
1) A, Rలు నిజం, Aకు R సరైన వివరణ
2) A, Rలు నిజం, కానీ Aకు R సరైన వివరణ కాదు 3) A నిజం, R తప్పు 4) Aతప్పు, R నిజం
10. కింది వాటిలో సరైనది?
ప్రతిపాదన (A): భారత రాజ్యాంగం అంతా అందమైన అతుకుల బొంత
కారణం (R): రాజ్యాంగ పరిషత్ ప్రపంచ రాజ్యాంగాలను పరిశీలించి ఇతర దేశాల రాజ్యాంగాల్లోని మంచి అంశాలను తీసుకుంది
1) A, Rలు నిజం, Aకు R సరైన వివరణ
2) A, Rలు నిజం, కానీ Aకు R సరైన వివరణ కాదు 3) A నిజం, R తప్పు 4) A తప్పు, R నిజం
11. కింది వాటిలో రాజ్యాంగంలో పేర్కొన్న అంశం?
ఎ. రాష్ట్రపతి పార్లమెంటు ఉభయసభల్లో సభ్యుడు కాదు
బి. రాష్ట్రపతి, రెండు సభలను కలిపి పార్లమెంటు అంటారు
1) ఎ లేదా బి 2) ఎ, బి
3) ఎ మాత్రమే 4) బి మాత్రమే
12. రాజ్యాంగం ఎటువంటి మైనారిటీలను గుర్తించింది?
1) కేవలం మతపరమైన మైనారిటీలు
2) కేవలం భాషాపరమైన మైనారిటీలు
3) మతం, భాషాపరమైన మైనారిటీలు
4) మత, జాతి, భాషాపరమైన మైనారిటీలు
13. రాజ్యాంగ సవరణ ఎవరు చేపట్టవచ్చు?
ఎ. లోక్‌సభ బి. రాజ్యసభ
సి. రాష్ట్ర అసెంబ్లీ డి. రాష్ట్రపతి
1) ఎ 2) ఎ, బి, సి 3) బి, సి, డి 4) ఎ, బి
14. అటార్నీ జనరల్ గురించి కింది వాటిలో సరైనవి ఏవి?
ఎ. రాష్ట్రపతి నియమిస్తారు
బి. సుప్రీంకోర్టు న్యాయమూర్తికి ఉండే అర్హతలు ఉండాలి
సి. పార్లమెంటులో ఏదో ఒక సభలో సభ్యత్వం ఉండాలి
డి. మహాభియోగ తీర్మానం ద్వారా మాత్రమే తొలగిస్తారు
1) ఎ, బి 2) ఎ, సి 3) బి, సి, డి 4) సి, డి
15. కింది వారిని హోదా ప్రకారం వరసగా అమర్చండి.
ఎ. క్యాబినెట్ సెక్రటరీ బి. చీఫ్ ఎలక్షన్ కమిషనర్
సి. కేంద్ర క్యాబినెట్ మినిస్టర్
డి. భారత ప్రధాన న్యాయమూర్తి
1) సి, డి, బి, ఎ 2) డి, సి, ఎ, బి
3) డి, సి, బి, ఎ 4) సి, డి, ఎ, బి
16. రాజ్యాంగ ప్రవేశికలోని అంశాలు, ప్రకరణలను జతపర్చండి.
ఎ) ప్రజాస్వామ్యం 1) ప్రకరణ 25
బి) విశ్వాసం, నమ్మకం, ఆరాధన 2) ప్రకరణ 19
సి) ఆలోచన, భావ ప్రకటన స్వేచ్ఛ 3) ప్రకరణ 326
డి) గణతంత్రం 4) ప్రకరణ 54
1) ఎ-2, బి-4, సి-3, డి-1
2) ఎ-1, బి-2, సి-3, డి-4
3) ఎ-4, బి-3, సి-1, డి-2
4) ఎ-3, బి-1, సి-2, డి-4
17. పార్లమెంటు ప్రత్యేక మెజారిటీ పద్ధతి ద్వారా సవరించే అంశాలు?
ఎ. నూతన రాష్ట్రాల ఏర్పాటు బి. ప్రాథమిక విధులు
సి. ప్రాథమిక హక్కులు డి. ఆదేశిక సూత్రాలు
ఇ. పౌరసత్వంలో మార్పులు
1) బి, సి, డి 2) సి, డి, ఇ 3) ఎ, బి, సి 4) పైవన్నీ
18. కిందివాటిని జతపర్చండి.
ఎ) మొదటి అటార్ని జనరల్ 1) హెచ్‌కే కృపలానీ
బి) మొదటి కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్
2) నరసింహారావు
సి) మొదటి ఫైనాన్స్ కమిషన్ చైర్మన్
3) ఎమ్సీ సెతల్వాడ్
డి) యూపీఎస్సీ మొదటి చైర్మన్ 4) కేసీ నియోగి
1) ఎ-2, బి-4, సి-3, డి-1
2) ఎ-3, బి-2, సి-4, డి-1
3) ఎ-4, బి-3, సి-1, డి-2
4) ఎ-1, బి-3, సి-2, డి-4
19. రాజ్యాంగంలోని భాగం, దానికి సంబంధించిన అంశాలను జతపర్చండి.
ఎ) 14-ఎ భాగం 1) సహకార సంఘాలు
బి) 9-ఎ భాగం 2) మున్సిపాలిటీలు
సి) 4-ఎ భాగం 3) ట్రిబ్యునల్స్
డి) 9-బి భాగం 4) ప్రాథమిక విధులు
1) ఎ-2, బి-3, సి-4, డి-1
2) ఎ-1, బి-2, సి-3, డి-4
3) ఎ-3, బి-2, సి-4, డి-1
4) ఎ-3, బి-1, సి-2, డి-4
20. ఎన్నికలకు సంబంధించి సరైనవి ఏవి?
ఎ. ఓటరు గుర్తింపు కార్డును ప్రవేశపెట్టింది- టీఎన్ శేషన్
బి. 1996లో గోవాలో మొదటి సారిగా ఈవీఎంలను ఉపయోగించారు
సి. 2013 ఎన్నికల్లో మొదటిసారిగా న్యూట్రల్ ఓటును ప్రవేశపెట్టారు
డి. 2003 నుంచి సైన్యంలో పనిచేసే వారికి ప్రాక్సీ ఓటింగ్ విధానాన్ని ప్రవేశపెట్టారు
ఇ. 2004 ఎన్నికల్లో మొదటిసారిగా న్యూట్రల్ ఓటును ప్రవేశపెట్టారు
1) బి, సి, డి 2) సి, డి, ఇ
3) ఎ, బి, సి 4) ఎ, బి, సి, డి
21. కింది వాటిలో సరైనది?
ప్రతిపాదన (A): రాజ్యాంగ ప్రారంభంలో 9 షెడ్యూళ్లు ఉన్నాయి
కారణం (R): రాజ్యాంగంలో ప్రస్తుతం 12 షెడ్యూళ్లు ఉన్నాయి
1) A, Rలు నిజం, Aకు R సరైన వివరణ
2) A, Rలు నిజం, కానీ Aకు R సరైన వివరణ కాదు
3) A నిజం, R తప్పు
4) Aతప్పు, R నిజం
22. కింది వాటిలో సరైనది.
ప్రతిపాదన (A): కేంద్ర మంత్రిమండలి తనకు ఇచ్చిన సలహాపై పునరాలోచన చేయవలసిందిగా రాష్ట్రపతి కోరవచ్చు
కారణం (R): రాష్ట్రపతికి కొన్ని విచక్షణ అధికారాలు ఉన్నాయి
1) A, Rలు నిజం, Aకు R సరైన వివరణ
2) A, Rలు నిజం, కానీ Aకు R సరైన వివరణ కాదు
3) A నిజం, R తప్పు 4) Aతప్పు, R నిజం
23. కిందివాటిని జతపర్చండి.
ఎ. 54వ అధికరణం 1. రాష్ట్రపతి ఎన్నిక
బి. 75వ అధికరణం 2. ప్రధాని, మంత్రి మండలి ఎంపిక
సి. 155వ అధికరణం 3. గవర్నర్ నియామకం
డి. 164వ అధిరణం 4. ముఖ్యమంత్రి, క్యాబినెట్ ఎంపిక
1) ఎ-1, బి-2, సి-3, డి-4
2) ఎ-2, బి-1, సి-4, డి-3
3) ఎ-4, బి-3, సి-2, డి-1
4) ఎ-4, బి-2, సి-3, డి-1
24. కింది వలస ప్రభుత్వ చట్టాల ముఖ్యాంశాలు పోల్చండి.
ఎ. చార్టర్ చట్టం- 1813
బి. రెగ్యులేటింగ్ యాక్ట్- 1773
సి. భారత ప్రభుత్వ చట్టం- 1858
డి. పిట్స్ ఇండియా చట్టం- 1784
1. బ్రిటన్‌లో బోర్డ్ ఆఫ్ కంట్రోల్‌ను ఏర్పాటు చేసి ఈస్టిండియా కంపెనీ వ్యవహారాలను పూర్తిగా నియంవూతించడం
2. ఈస్టిండియా కంపెనీ ట్రేడ్ మోనోపలి అంతరించింది
3. పాలించే అధికారం ఈస్టిండియా కంపెనీ నుంచి బ్రిటిష్ ప్రభుత్వానికి మారింది
4. బ్రిటిష్ ప్రభుత్వం కంపెనీ డైరెక్టర్లను ఇండియా పాలనకు సంబంధించి అన్ని పత్రాలను సమర్పించమని కోరింది
1) ఎ-2, బి-4, సి-3, డి-1
2) ఎ-2, బి-1, సి-4, డి-3
3) ఎ-4, బి-3, సి-2, డి-1
4) ఎ-4, బి-2, సి-3, డి-1
25. ప్రోటోకాల్ ప్రకారం కింద పేర్కొన్న వారిలో ఎవరు అత్యున్నత హోదా పొందుతారు?
1) ఉపవూపధాని 2) మాజీ ప్రధాని
3) రాష్ట్ర పరిధిలో గవర్నర్ 4) లోక్‌సభ స్పీకర్
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
తాత్వికతను తెలిపేది.. రాజ్యాంగానికి గుండెలాంటిది
ఎలకానిక్ రికార్డులు.. ప్రాథమిక సాక్ష్యాలు
శుక్రకణాలు తాత్కాలికంగా నిల్వ ఉండే ప్రాంతం?
సెకండరీ ఎడ్యుకేషన్ కమిషన్‌కు మరోపేరు?
‘వెయ్యి ఉరిల మర్రి’ గా పేరుగాంచిన ఊడలమర్రి ఏ జిల్లాలో ఉంది?
రక్షణ దుర్గాలు – నాటి పాలనా విభాగాలు
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?