These exams are the gateways to foreign education | విదేశీ విద్యకు ఈ పరీక్షలే గేట్వేస్
ప్రపంచాన్ని కుగ్రామంగా మార్చేసిన గ్లోబలైజేషన్ ప్రభావం విద్యపై కూడా ప్రబలంగా పడింది. ఏ దేశంలోనూ విద్యావిధానం ఇతర దేశాల ప్రభావానికి లోనుకాకుండా మనలేని పరిస్థితి వచ్చింది. భూగోళంపై ఎక్కడ నాణ్యమైన విద్య లభిస్తుందో విద్యార్థులు అక్కడికి వెళ్తున్నారు. భారత్ నుంచి ఈ విద్యా వలస విపరీతంగా పెరుగుతున్నది. సాంకేతికత, ఆర్థిక వనరుల లభ్యత (స్కాలర్షిప్స్) పెరగడం దీనికి కారణం. భారతీయ విద్యార్థులు ఇతర దేశాల్లోని విద్యాసంస్థల్లో చేరేందుకు ప్రత్యేక పరీక్షలు రాయాల్సి ఉంటుంది. అలాంటి పరీక్షల సమాచారం నిపుణ పాఠకులకోసం ఈ వారం..
టోఫెల్
(Test of English as a Foreign Language)
ప్రపంచంలో ఎక్కువ దేశాలు, విశ్వవిద్యాలయాలు గుర్తించిన పరీక్షల్లో టోఫెల్ అగ్రగామి. సుమారు 9,000 యూనివర్సిటీలు, 130 దేశాలు ఈ టెస్ట్‌ను పరిగణలోకి తీసుకొంటాయి. ఆస్ట్రేలియా, కెనడా, యూకే, యూఎస్ఏ వంటి దేశాలు దీన్ని గుర్తించాయి. ప్రపంచ వ్యాప్తంగా సుమారు 30 మిలియన్ల మంది ఈ టెస్ట్‌ను రాశారు. దీనిలో ఇంగ్లిష్ లాంగ్వేజ్ ప్రొఫిషియన్సీని పరీక్షిస్తారు. ఈ పరీక్షను ఏడాది పొడవునా నిర్వహిస్తుంటారు. సాధారణంగా శని, ఆదివారాల్లో దీన్ని నిర్వహిస్తారు. స్కోర్ వ్యాలిడిటీ రెండేండ్లు.
– పరీక్ష విధానం: దీనిలో నాలుగు సెక్షన్లు ఉంటాయి. 4 1/2 గంటల వ్యవధిలో పరీక్షను నిర్వహిస్తారు. దీన్ని ఈటీఎస్ సంస్థ నిర్వహిస్తుంది. ఇది ఇంట్నట్ బేస్డ్, పేపర్ బేస్డ్ విధానంలో ఉంటుంది.
– వెబ్సైట్: http://www.ets.org/toefl
జీఆర్ఈ
(GRE -Graduate Record Exam)
ప్రపంచవ్యాప్తంగా 130 దేశాల్లో 6 లక్షలకు పైగా గ్రాడ్యుయేట్ స్కూల్స్ జీఆర్‌ఈని ప్రామాణికంగా తీసుకొంటాయి. ఏటా ఆరు లక్షల మందికి పైగా అభ్యర్థులు ఈ పరీక్షను రాస్తుంటారు. సుమారు వెయ్యి సెంటర్లలో ఈ పరీక్షను నిర్వహిస్తారు. ఇది కంప్యూటర్ బేస్డ్ పరీక్ష. కంప్యూటర్స్ అందుబాటులో లేనిచోట పేపర్ బేస్డ్గా దీన్ని నిర్వహిస్తారు. పరీక్ష కాలవ్యవధి మూడు గంటలు.
– ఈ పరీక్షలో అనలిటికల్ రైటింగ్, వెర్బల్ రీజనింగ్, క్వాంటి రీజనింగ్‌పై ప్రశ్నలు ఇస్తారు.
– పరీక్ష స్కోర్ ఐదేండ్ల వ్యాలిడిటీ కలిగి ఉంటుంది.
– వెబ్సైట్: www.ets.org/gre
పియర్సన్ టెస్ట్
(Pearson Test of English)
719 విద్యాసంస్థల్లో 1780 ప్రోగ్రామ్స్‌లో ప్రవేశాల కోసం దీన్ని పరిగణలోకి తీసుకొంటారు. యూఎస్ఏలో 232, యూకేలో 323, ఆస్ట్రేలియాలో ఈ పరీక్షకు ఎక్కువగా ప్రాధాన్యం ఇస్తారు. 44 దేశాల్లో 155 సెంటర్లలో పియర్సన్ టెస్ట్‌ను నిర్వహిస్తారు.
– ఈ పరీక్షలో నాలుగు విభాగాలు ఉంటాయి. స్పీకింగ్, లిజనింగ్, రైటింగ్, రీడింగ్‌లపై ప్రశ్నలు ఇస్తారు
– ఇది కంప్యూటర్ బేస్డ్ పరీక్ష. దీన్ని మూడుగంటల కాలవ్యవధిలో నిర్వహిస్తారు
– డిగ్రీ, మేనేజ్మెంట్ కోర్సుల్లో ప్రవేశానికి ఈ పరీక్ష స్కోర్‌ను ప్రామాణికంగా తీసుకొంటారు
– ఈ స్కోర్ రెండేండ్ల పాటు చెల్లుబాటు అవుతుంది
– వెబ్సైట్: www.pearsonpte.com
జీమ్యాట్
GMAT (Graduate Management Admission Test)
– 100 దేశాల్లో గ్రాడ్యుయేట్ మేనేజ్మెంట్ కోర్సుల్లో ప్రవేశాల కోసం దీన్ని నిర్వహిస్తారు
– సుమారు 1900 గ్రాడ్యుయేట్ బిజినెస్ స్కూల్స్ దీని ద్వారా ప్రవేశాలు కల్పిస్తాయి
– ఇది కంప్యూటర్ ఆధారిత పరీక్ష. దీనిలో నాలుగు సెక్షన్లు ఉంటాయి. అనలిటికల్ రైటింగ్ అసెస్మెంట్, క్వాంటి వెర్బల్, ఇంటిక్షిగేటెడ్ రీజనింగ్‌పై ప్రశ్నలు ఇస్తారు.
-పరీక్ష కాలవ్యవధి 3 1/2 గంటలు.
– స్కోర్ ఐదేండ్లపాటు చెల్లుబాటు అవుతుంది. మన దేశంలో ఎక్కవమంది విద్యార్థులు ఎంబీఏ, ఎంఎస్ కోసం జీమ్యాట్ పరీక్ష రాస్తున్నారు.
www.mba.com
శాట్
SAT (Scholastic Aptitude Test)
-కాలేజ్ బోర్డు ఈ పరీక్షను నిర్వహిస్తుంది. సుమారు ఏడు మిలియన్ల మంది విద్యార్థులు, 23,000 ఉన్నత పాఠశాలలు, 3,800 పైగా కాలేజీలు దీన్ని పరిగణలోకి తీసుకొంటాయి.
-ఇది కంప్యూటర్ బేస్డ్ పరీక్ష. దీనిలో రీడింగ్, రైటింగ్, మ్యాథ్స్‌లపై ప్రశ్నలు ఇస్తారు.
-పరీక్ష స్కోర్‌కు ఐదేండ్లు వ్యాలిడిటీ ఉంటుంది. ఈ స్కోర్‌తో విదేశాల్లో అండర్ గ్రాడ్యుయేట్ కోర్సుల్లో ప్రవేశాలు పొందవచ్చు.
-వెబ్సైట్: www.sat.collegeboard.com
IELTS
(International English Language Testing System)
ప్రపంచవ్యాప్తంగా సుమారు 6000+ విద్యాసంస్థలు, 135 దేశాలు ఈ పరీక్షను పరిగణలోకి తీసుకొని ప్రవేశాలు కల్పిస్తాయి. ఏటా సుమారు 1.4 మిలియన్ల మంది అభ్యర్థులు ఈ పరీక్షను రాస్తారు. 500 పరీక్ష కేంద్రాల్లో, నెలకు నాలుగుసార్ల చొప్పున ఏటా 48 సార్లు ఈ పరీక్షను నిర్వహిస్తారు.
-ఇండియాలో 39 పరీక్ష కేంద్రాలు ఉన్నాయి.
-సాధారణంగా శని, గురువారాల్లో దీన్ని నిర్వహిస్తారు.
-పరీక్షలో రీజనింగ్, రీడింగ్, స్పీకింగ్, రైటింగ్ అంశాల్లో అభ్యర్థి జ్ఞానాన్ని పరీక్షిస్తారు.
-పరీక్ష కంప్యూటర్ బేస్డ్, పేపర్ బేస్డ్ విధానాల్లో ఉంటుంది. ఎన్నిసార్లయినా ఈ పరీక్షను రాసుకోవచ్చు.
-స్కోర్ రెండేండ్ల వ్యాలిడిటీ కలిగి ఉంటుంది.
-ఈ పరీక్షను బ్రిటిష్ కౌన్సిల్, ఐడీపీలు సంయుక్తంగా నిర్వహిస్తాయి
-వెబ్సైట్: www.ielts.org
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
తాత్వికతను తెలిపేది.. రాజ్యాంగానికి గుండెలాంటిది
ఎలకానిక్ రికార్డులు.. ప్రాథమిక సాక్ష్యాలు
శుక్రకణాలు తాత్కాలికంగా నిల్వ ఉండే ప్రాంతం?
సెకండరీ ఎడ్యుకేషన్ కమిషన్‌కు మరోపేరు?
‘వెయ్యి ఉరిల మర్రి’ గా పేరుగాంచిన ఊడలమర్రి ఏ జిల్లాలో ఉంది?
రక్షణ దుర్గాలు – నాటి పాలనా విభాగాలు
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?