దీని ద్వారా గ్రామీణ కూలీల వలసలను తగ్గించడంతో పాటు ప్రజల కొనుగోలు శక్తిని పెంపొందించే దిశగా ధనిక, పేద వ్యత్యాసాన్ని తగ్గించేందుకు కృషి చేయడం.
-గ్రామీణ ప్రాంత ప్రజలు పని కల్పించాలని సంబంధిత కార్యాలయంలో దరఖాస్తు చేసుకుంటే, సుమారు 5 కిలోమీటర్ల పరిధిలోనే ఉపాధి కల్పించాలి.
-జాబ్‌కార్డు పొందిన 15 రోజుల్లోగా పని చూపించలేకపోతే నిరుద్యోగ భృతి చెల్లించాల్సి ఉంటుంది.
-ఉపాధికి సంబంధించిన వేతనాలు సంబంధిత లబ్ధిదారుల బ్యాంకు ఖాతాల్లో జమ చేస్తారు.
-గ్రామపంచాయతీల్లో అమలు చేసే పనుల్లో కాంట్రాక్టర్ల ప్రమేయం నిషేధిస్తూ చట్టం రక్షణలు కల్పించింది.
-ఉపాధి పనుల్లో పారదర్శకత, జవాబుదారీతనం కోసం నిర్వహణను నోడల్ ఏజెన్సీలకు బదలాయించారు.
-గ్రామసభలను ఏర్పాటు చేసి ఖర్చుచేసిన నిధులపై సామాజిక తనిఖీ నిర్వహించి అవినీతి పాల్పడిన అధికారులు, సిబ్బందిపై చర్యలు తీసుకునేలా చేస్తుంది.
National Rural Employment Guarantee Scheme | జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం
ఇది తెలుసా..!-
-కేంద్ర ప్రభుత్వం జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టం/జాతీయ గ్రామీణ ఉపాధి పథకంను 2005, ఆగస్టు 25న చట్టంగా రూపొందించి అమలు చేస్తున్నది.
-ఆర్థికసంవత్సరంలో నైపుణ్యం లేని వయోజనులందరికీ ప్రతి గ్రామీణ కుటుంబంలో కోరిన వారికి స్థానికంగానే 100 రోజుల పని కల్పించడం దీని ముఖ్యోద్దేశం.
-దీన్ని 2006, ఫిబ్రవరి 2న దేశవ్యాప్తంగా 200 జిల్లాలో ప్రారంభించారు. 2008లో దీన్ని మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంగా మార్పుచేశారు.
-దీని కింద గ్రామాల్లో రహదారుల అభివృద్ధి, కాలువలు, చెరువులు, బావులు, సంప్రదాయక నీటి వనరుల పునరుద్ధరణ, కరువు నివారణ చర్యలు, అడవుల పెంప కం, వరదల నియంత్రణ, రక్షణ పనులు చేపట్టడడం.
-అదేవిధంగా ఎస్సీ, ఎస్టీల భూముల్లో వ్యవయాభివృద్ధికి అనువైన పనులు చేపట్టి సాగులోకి తీసుకురావడం.
Previous article
గిర్గ్లాని కమిషన్‌ను ఏ సంవత్సరంలో నియమించారు?
Next article
షార్క్ చేప నోటిలో ఉండే దంతాల సంఖ్య ఎంత?
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
తాత్వికతను తెలిపేది.. రాజ్యాంగానికి గుండెలాంటిది
ఎలకానిక్ రికార్డులు.. ప్రాథమిక సాక్ష్యాలు
శుక్రకణాలు తాత్కాలికంగా నిల్వ ఉండే ప్రాంతం?
సెకండరీ ఎడ్యుకేషన్ కమిషన్‌కు మరోపేరు?
‘వెయ్యి ఉరిల మర్రి’ గా పేరుగాంచిన ఊడలమర్రి ఏ జిల్లాలో ఉంది?
రక్షణ దుర్గాలు – నాటి పాలనా విభాగాలు
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?