Father of Cloning | ‘ఫాదర్ ఆఫ్ క్లోనింగ్’ అని ఎవరిని అంటారు?
1. క్లోనింగ్‌కు సంబంధించి కింది వాటిలో సరైన వాక్యం ఏది?
ఎ. ఒక జీవి శారీరక కణంలోని కేంద్రకాన్ని ఆడజీవి అండ కణంలోకి (కేంద్రకం తొలగించిన అండ కణం) పంపి.. దాన్ని ప్రయోగశాలలో అభివృద్ధి చేసి పిల్ల జీవిని సృష్టించే సాంకేతిక ప్రక్రియను క్లోనింగ్ అంటారు.
బి. క్లోనింగ్ ద్వారా ఏర్పడిన పిల్లజీవి.. ఏ జీవి శారీరక కణంలోని కేంద్రకాన్ని తీసుకున్నామో ఆ జీవిని పోలి ఉంటుంది.
సి. క్లోనింగ్‌ను అలైంగిక ప్రత్యుత్పత్తి విధానం అంటారు.
డి. క్లోనింగ్ అనే పదానికి గ్రీకు భాషలో రెమ్మ అని అర్థం.
1) ఎ 2) ఎ, సి 3) ఎ, బి, సి 4) పైవన్నీ
2. మానవ క్లోనింగ్‌ను మొదట నిషేధించిన దేశాలు?
1) అమెరికా, బ్రిటన్ 2) ఇండియా, జపాన్
3) ఇండియా, అమెరికా 4) అమెరికా, జపాన్
3. కింది వాటిలో సరికానిది ఏది?
ఎ. స్కాట్లాండ్కు చెందిన శాస్త్రవేత్త ఇయాన్ విల్మట్ను ఫాదర్ ఆఫ్ క్లోనింగ్ అంటారు.
బి. ఇయాన్ విల్మట్ ప్రపంచంలోనే తొలిసారిగా 1996లో క్లోనింగ్ ప్రక్రియ ద్వారా డాలీ అనే క్షీరద గొర్రెపిల్లను సృష్టించాడు.
సి. డాలీని సృష్టించేందుకు విల్మట్ గొర్రె పొదుగు కణాలను ఉపయోగించాడు.
డి. డాలీ.. 2003లో ఊపిరితిత్తుల వ్యాధి, కీళ్లనొప్పితో చనిపోయింది.
1) ఎ, బి 2) సి, డి 3) బి, డి 4) ఏదీకాదు
4. దేశంలో క్లోనింగ్ సాంకేతికతను అభివృద్ధి చేసిన తొలి సంస్థ ఏది?
1) నేషనల్ ఇన్స్టిట్యూట్ ఫర్ రిసెర్చ్ ఆన్ యానిమల్స్
2) నేషనల్ డెయిరీ రిసెర్చ్ ఇన్స్టిట్యూట్
3) సెంట్రల్ ఇన్స్టిట్యూట్ ఫర్ రిసెర్చ్ ఆన్ బఫెల్లోస్
4) ఏదీకాదు
5. నేషనల్ డెయిరీ రెసెర్చ్ ఇన్స్టిట్యూట్ (NDRI)కు సంబంధించి కింది వాటిలో ఏది సరైనది?
ఎ. NDRI తొలిసారిగా సంరూప అనే క్లోన్ గేదెను సృష్టించింది.
బి. హ్యాండ్ గైడెడ్ టెక్నాలజీతో గరిమా-1 అనే రెండో క్లోన్ గేదెను సృష్టించింది.
సి. 2010లో గరిమా-2 అనే క్లోన్ గేదెను సృష్టించి, దాని నుంచి మహిమ అనే మరో క్లోన్ గేదెను ఉత్పత్తి చేశారు.
1) ఎ, బి 2) బి, సి 3) ఎ, సి 4) పైవన్నీ
6. కింది వాటిలో NDRI సృష్టించిన క్లోన్ దున్నపోతు ఏది?
1) లాలిమా 2) గరిమా 3) శ్రేష్ఠ్ 4) మహిమ
7. కింద పేర్కొన్న క్లోనింగ్ గేదెలు, అవి ఉత్పత్తయిన సంవత్సరాలను సరిగా జతపర్చండి.
ఎ. గరిమా-2 1. 2009
బి. సంరూప 2. 2013
సి. లాలిమా 3. 2014
డి. మహిమ 4. 2010
1) ఎ-4, బి-1, సి-3, డి-2
2) ఎ-1, బి-2, సి-3, డి-4
3) ఎ-4, బి-3, సి-2, డి-1
4) ఎ-2, బి-3, సి-1, డి-4
8. పుట్టిన వెంటనే చనిపోయిన క్లోన్ గేదె ఏది?
1) సంరూప 2) గరిమా-1
3) గరిమా-2 4) మహిమ
9. కింది వాటిలో సరైన వాక్యం ఏది?
ఎ. NDRI క్లోనింగ్ ద్వారా 2015 మార్చిలో అపూర్వ అనే ముర్రా జాతి గేదెను సృష్టించింది
బి. అపూర్వను గేదె మూత్రంలోని సొమాటిక్ కణాలను ఉపయోగించి క్లోనింగ్ చేశారు
1) ఎ 2) బి 3) ఎ, బి 4) ఏదీకాదు
10. సెంట్రల్ ఇన్స్టిట్యూట్ ఫర్ రిసెర్చ్ ఆన్ బఫెల్లోస్ (CIRB) సంస్థ 2016 జనవరి 10న కొత్త క్లోనింగ్ గేదెను సృష్టించింది. దాని పేరు?
1) సిర్బ్ గౌరవ్ 2) మహిమ 3) లాలిమా 4) రజత్
11. కింది వాటిలో క్లోనింగ్ దున్నపోతులు ఏవి?
ఎ. నూరీ బి. రజత్ సి. స్నూపి డి. శ్రేష్ఠ్ ఇ. హన్నా
1) ఎ, బి, సి, డి 2) బి, సి, డి 3) బి, డి 4) ఎ, ఇ
12. కింది క్లోనింగ్ జీవులు, వాటిని సృష్టించిన దేశాలను జతపర్చండి.
ఎ. మటిల్దా (గొర్రెపిల్ల) 1. ఆస్ట్రేలియా
బి. డ్యూయీ (జింకపిల్ల) 2. అమెరికా
సి. ప్రొమాటి (గుర్రంపిల్ల) 3. ఇటలీ
డి. స్నూపి (కుక్కపిల్ల) 4. దక్షిణకొరియా
ఇ. యాంగ్ యాంగ్ (మేక) 5. చైనా
1) ఎ-5, బి-4, సి-3, డి-2, ఇ-1
2) ఎ-4, బి-3, సి-2, డి-1, ఇ-5
3) ఎ-3, బి-2, సి-1, డి-5, ఇ-4
4) ఎ-1, బి-2, సి-3, డి-4, ఇ-5
జవాబులు
1-4, 2-1, 3-4, 4-2, 5-4, 6-3, 7-1,
8-2, 9-3, 10-1, 11-3, 12-4
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
తాత్వికతను తెలిపేది.. రాజ్యాంగానికి గుండెలాంటిది
ఎలకానిక్ రికార్డులు.. ప్రాథమిక సాక్ష్యాలు
శుక్రకణాలు తాత్కాలికంగా నిల్వ ఉండే ప్రాంతం?
సెకండరీ ఎడ్యుకేషన్ కమిషన్‌కు మరోపేరు?
‘వెయ్యి ఉరిల మర్రి’ గా పేరుగాంచిన ఊడలమర్రి ఏ జిల్లాలో ఉంది?
రక్షణ దుర్గాలు – నాటి పాలనా విభాగాలు
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?