If you read the plan .. the job is yours | ప్రణాళికతో చదివితే.. ఏడాదిలో జాబ్ మీ సొంతం
స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (ఎస్ఎస్సీ)… నిరుద్యోగులపాలిట కల్పవృక్షం. ఏటా క్రమం తప్పకుండా లక్షలాది ఉద్యోగాలను భర్తీ చేస్తుంది. ప్రతి ఏటా నవంబర్‌లో షెడ్యూల్‌ను ప్రకటించి ఆ ప్రకారం దేశవ్యాప్తంగా ఆయా ఉద్యోగాల భర్తీకి టెస్ట్‌లను నిర్వహిస్తుంది ఎస్ఎస్సీ. ఆ వివరాలు సంక్షిప్తంగా నిపుణు పాఠకుల కోసం….
స్టాఫ్ సెలక్షన్ కమిషన్ విడుదల చేసే ఉద్యోగాల్లో ఎక్కువగా క్రేజీ ఉన్నవి సీజీఎల్, సీహెచ్ఎస్ఎల్, ఎంటీఎస్, ఎస్ఐ, కానిస్టేబుల్, స్టెనోగ్రాఫర్, ఎంటీఎస్, జూనియర్ ఇంజినీర్ పోస్టులు.
-ఇంటర్‌తో సీహెచ్ఎస్ఎల్, డిగ్రీతో సీజీఎల్ పరీక్షలను రాయవచ్చు. అదేవిధంగా మల్టీటాస్కింగ్ స్టాఫ్ (టెక్నికల్, నాన్ టెక్నికల్) పోస్టులకు సిలబస్ ఒక్కటే కానీ ప్రశ్నల స్థాయి, అంశాల సంఖ్యలో తేడా ఉంటుంది. వీటన్నింటికి కలిపి ఇంటిగ్రేటెడ్ ప్రిపరేషన్ చేస్తే ఏడాదిలో కేంద్రకొలువు సాధించవచ్చు.
-రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగాలకే పరిమితం కాకుండా దేశవ్యాప్తంగా నిర్వహించే ఈ పరీక్షలకు ప్రిపేర్ అయితే నిర్ణీత గడువులో నిర్వహించే ఎగ్జామ్స్‌తో త్వరగా స్థిరపడవచ్చు.
-డిసెంబర్లో మల్టీటాస్కింగ్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ రానుంది. ఇక మిగిలిన పరీక్షలకు సుమారు ఐదారు నెలల గడువు ఉంది. కాబట్టి ఇప్పటి నుంచి ఆయా పరీక్షలకు క్రమపద్ధతిలో ప్రిపేర్ అయితే సులభంగా ఉద్యోగం సొంతం చేసుకోవచ్చు.
-మ్యాథ్స్, సైన్స్, ఆర్ట్స్ ఏ బ్యాక్‌గ్రౌండ్ విద్యార్థులైనా ప్రాక్టీస్‌తో వీటిలో విజయం సాధించవచ్చు. పదోతరగతి స్థాయిలో మ్యాథ్స్, ఇంగ్లిష్ ఉంటాయి.
-ఇక రీజనింగ్ (వెర్బల్, నాన్ వెర్బల్) కోసం ఆర్ఎస్ అగర్వాల్ వంటి ప్రామాణిక పుస్తకాలను నిరంతరం ప్రాక్టీస్ చేస్తే చాలు.
-జనరల్ స్టడీస్ కోసం డైలీ పేపర్స్, ఎడ్యుకేషనల్ మేగజైన్స్ ఫాలో అయితే మంచి మార్కులు సాధించవచ్చు.
-షెడ్యూల్ ప్రకారం జరిగే ఈ పరీక్షలకు పక్కా ప్రణాళికతో, గతంలో విజయం సాధించిన అభ్యర్థుల సూచనలు, నిపుణుల సలహాలు (అవసరాన్ని బట్టి కోచింగ్) తీసుకొని ప్రిపేర్ కావాలి.
-ఇక జూనియర్ ఇంజినీర్ పోస్టులైన సివిల్, ఎలక్ట్రికల్, మెకానికల్ విభాగాల కోసం వచ్చే నోటిఫికేషన్ కోసం బీఈ/బీటెక్ విద్యార్థులు ప్రిపేర్ అయితే ప్రభుత్వ కొలువు సొంతం చేసుకోవచ్చు. గేట్/ఐఈఎస్ వంటి వాటికి ప్రిపేర్ అయ్యేవారు సులభంగా దీనిలో విజయం సాధించవచ్చు.
-స్టాఫ్ సెలక్షన్ నోటిఫికేషన్‌ల్లో యూనిఫాం ఉద్యోగాల్లో కేంద్ర బలగాల్లో ఎస్ఐ, ఏఎస్ఐ, కానిస్టేబుల్ ఉద్యోగాలు ముఖ్యమైనవి. గత రెండేండ్లుగా వీటిని స్టాఫ్ సెలక్షన్ ద్వారా భర్తీ చేస్తున్నారు. ప్రతి ఏటా వేలాది ఖాళీలకు నోటిఫికేషన్ వస్తుండటం గమనించాల్సిన విషయం. ఇవి మంచి జీతభత్యాలతో కూడిన ఉద్యోగాలు . ఈ పరీక్షలు కూడా నిర్ణీత షెడ్యూల్ ప్రకారం నిర్వహిస్తారు కాబట్టి ప్రిపరేషన్ (ఫిజికల్, రిటన్) టెస్ట్‌లకు ఇప్పటి నుంచే ప్రిపేర్ అయితే ఉద్యోగం ఖాయం.
-పై అన్ని ఉద్యోగాలకు ప్రతిభకు పట్టం కడుతారనడంలో సందేహం లేదు. దాదాపు ఆన్లైన్ పరీక్షల ద్వారా ఎంపిక జరుగుతుంది. పకడ్బందీ ప్రణాళికతో కట్టుదిట్టమైన ఏర్పాట్లతో వీటిని నిర్వహిస్తారు. ఎటువంటి అపోహలకు తావువ్వికుండా ప్రిపేర్ అయితే ఏడాదిలోగా కేంద్ర కొలువులో స్థిరపడవచ్చు.
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
తాత్వికతను తెలిపేది.. రాజ్యాంగానికి గుండెలాంటిది
ఎలకానిక్ రికార్డులు.. ప్రాథమిక సాక్ష్యాలు
శుక్రకణాలు తాత్కాలికంగా నిల్వ ఉండే ప్రాంతం?
సెకండరీ ఎడ్యుకేషన్ కమిషన్‌కు మరోపేరు?
‘వెయ్యి ఉరిల మర్రి’ గా పేరుగాంచిన ఊడలమర్రి ఏ జిల్లాలో ఉంది?
రక్షణ దుర్గాలు – నాటి పాలనా విభాగాలు
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?