First 8 natural numbered cubes | మొదటి 8 సహజ సంఖ్యల ఘనాల సరాసరి?
సగటు
-దత్తాంశంలోని రాశుల మొత్తాన్ని రాశుల సంఖ్యచే భాగించగా వచ్చే ఫలితాన్ని సగటు లేదా సరాసరి అంటారు.
-సగటు = రాశుల మొత్తం/రాశుల సంఖ్య
-రాశుల సంఖ్య = రాశుల మొత్తం/సగటు
-రాశుల మొత్తం = రాశుల సంఖ్య X సగటు
-సగటు వేగం = దూరాల మొత్తం/కాలాల మొత్తం
-సగటు లేదా సరాసరి అనేది ఇచ్చిన రాశులలో కనిష్ఠ, గరిష్ఠ విలువల మధ్య ఉంటుంది. దేనితో ఏకీభవించకపోవచ్చు.
మొదటి n సహజ సంఖ్యల సరాసరి = (n+1)/2
-మొదటి n సహజ సంఖ్యల వర్గాల సరాసరి = (n+1)(2n+1)/6
-మొదటి n సహజ సంఖ్యల ఘనాల సరాసరి = n(n+1)2/4
-మొదటి n సరి సంఖ్యల సరాసరి = n+1
-మొదటి n బేసి సంఖ్యల సరాసరి = n
-దశాంశంలోని ఏ రెండు వరుస సంఖ్యల మధ్య భేదం సమానంగా ఉంటే ఆ శ్రేణికి సగటు = (మొదటి పదం+చివరిపదం)/2 = (a+1)/2
-K మొదటి n గుణిజాల సరాసరి = k (n+1)/2
వివరణలు
1. 47, 68, 90, 35 ల సగటు ఎంత?
సాధన: సగటు = రాశుల మొత్తం/రాశుల సంఖ్య
= (47+68+90+35)/4
= 240/4
సగటు = 60
2.మొదటి 25 సహజ సంఖ్యల సరాసరి ఎంత?
సాధన: మొదటి n సహజ సంఖ్యల సరాసరి = (n+1)/2
మొదటి 25 సహజ సంఖ్యల సరాసరి = (25+1)/2
= 26/2 = 13
3.1, 4, 9, 16, 25 ల సరాసరి ఎంత?
సాధన: పై శ్రేణిలోని 5 అంకెలు మొదటి 5 సహజ సంఖ్యల
వర్గాలు (1, 2, 3, 4, 5ల వర్గాలు).
కాబట్టి మొదటి n సహజ సంఖ్యల వర్గాల సరాసరి
= (n+1)(2n+1)/6
= (5+1) (2×5+1)/6
= (6×11)/6
సరాసరి = 11
4.మొదటి 8 సహజ సంఖ్యల ఘనాల సరాసరి ఎంత?
సాధన: మొదటి n సహజ సంఖ్యల ఘనాల సరాసరి
= n(n+1)2/4
= 8(8+1)2/4
= (8x9x9)/4
= 648/4
సరాసరి = 162
5.మొదటి 11 సరిసంఖ్యల సరాసరి ఎంత?
సాధన: మొదటి n సరిసంఖ్యల సరాసరి = n+1
కాబట్టి మొదటి 11 సరి సంఖ్యల సరాసరి = 11+1 = 12
సరి సంఖ్యల సరాసరి = 12.
6.మొదటి 8 బేసి సంఖ్యల సరాసరి ఎంత?
సాధన: మొదటి n బేసి సంఖ్యల సరాసరి = n
కాబట్టి మొదటి 8 బేసి సంఖ్యల సరాసరి = 8
సరాసరి = 8
7. 25, 30, 25, 40, 45, 50 ల సగటు ఎంత?
సాధన: పై శ్రేణిలో అన్ని వరుస సంఖ్యల మధ్య భేదం సమానంగా (+5) ఉంది. శ్రేణిలోని ఏ రెండు వరుస సంఖ్యల మధ్య భేదం సమానంగా ఉన్నా (మొదటి పదం + చివరి పదం)/2 అనే సూత్రం వర్తిస్తుంది.
కాబట్టి మొదటి పదం a, చివరి పదం 1 అనుకున్న..
(a + 1)/2
= (25+50)/2
= 75/2 = 37.5
సగటు = 37.5
8.P, Q అనే రెండు స్టేషన్ల మధ్య ప్రయాణించే ఒక రైలు, P నుంచి బయలుదేరి గంటకు 100 కి.మీ. సగటు వేగంతో ప్రయాణించి Q ని చేరుకుంటుంది. Q నుంచి తిరిగి బయలుదేరి గంటకు 150 కి.మీ. సగటు వేగంతో ప్రయాణించి P ని చేరుకుంటుంది. అయితే మొత్తం ప్రయాణంలో రైలు వేగం ఎంత?
సాధన: P, Q స్టేషన్ల మధ్య దూరం x కి.మీ. అనుకుంటే..
సగటు వేగం = మొత్తం ప్రయాణించిన దూరం/ మొత్తం కాలం
P, Q మధ్య x కి.మీ. ప్రయాణించేందుకు పట్టేకాలం..
= x/100 గంటలు
అదేవిధంగా Q, P మధ్య x కి.మీ. ప్రయాణించేందుకు
పట్టుకాలం = x/150 గంటలు
2x కి.మీ. ప్రయాణించేందుకు పట్టిన మొత్తం కాలం
= x/100 + x/150 = x /60 గంటలు
సగటు = రాశుల మొత్తం/రాశుల సంఖ్య
= 2x/x/60
= (2x X 60)/x = 120
రైలు సగటు వేగం = 120 కి.మీ/గంట.
9.7 మొదటి 5 గుణిజాల సగటు ఎంత?
సాధన -1: 7 మొదటి 5 గుణిజాలు వరుసగా 7, 14, 21, 28, 35.
7 ను K, మొదటి 5 గుణిజాలను n అనుకున్న..
K మొదటి n గుణిజాల సరాసరి = k((n+1)/2)
= 7((5+1)/2)
= 7X3 = 21
7 మొదటి 5 గుణిజాల సగటు – 21.
(లేదా)
సాధన -2: 7 మొదటి 5 గుణిజాలు వరుసగా..
7, 14, 21, 28, 35
పై శ్రేణిలో ప్రతి రెండు వరుస సంఖ్యల మధ్య భేదం సమానంగా (+7) ఉంది. శ్రేణిలోని ఏ రెండు వరుస సంఖ్యల మధ్య భేదం సమానంగా ఉన్నా (మొదటి పదం + చివరి పదం)/2 అనే సూత్రం వర్తిస్తుంది.
కాబట్టి మొదటి పదం a, చివరి పదం 1 అనుకున్న – (a + 1)/2
= (7+35)/2
= 42/2 = 21.
10.4 సంఖ్యల సగటు 30. వాటిలో 3 సంఖ్యలు 27, 22, 33 అయిన మరో సంఖ్య ఎంత?
సాధన: 4 సంఖ్యల సగటు = 30
4 సంఖ్యల మొత్తం = 4 X 30 = 120
ఇచ్చిన 3 సంఖ్యల మొత్తం = 27+22+33 = 82
4వ సంఖ్య = 120-82 = 38
కావాల్సిన మరో సంఖ్య – 38.
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
తాత్వికతను తెలిపేది.. రాజ్యాంగానికి గుండెలాంటిది
ఎలకానిక్ రికార్డులు.. ప్రాథమిక సాక్ష్యాలు
శుక్రకణాలు తాత్కాలికంగా నిల్వ ఉండే ప్రాంతం?
సెకండరీ ఎడ్యుకేషన్ కమిషన్కు మరోపేరు?
‘వెయ్యి ఉరిల మర్రి’ గా పేరుగాంచిన ఊడలమర్రి ఏ జిల్లాలో ఉంది?
రక్షణ దుర్గాలు – నాటి పాలనా విభాగాలు
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?