జాతీయ పార్కులు- బయోస్పియర్ రిజర్వులు
ప్రకృతి సంపద, సుందర ప్రదేశాలు, దృశ్యాలు, వన్యజీవులను సంరక్షించేందుకు జాతీయ పార్కులను ఏర్పాటు చేస్తారు. ఈ ప్రాంతాల నుంచి వంట చెరుకును సేకరించడం, పశువులను మేపడం, అటవీ ఉత్పత్తుల సేకరణ నిషిద్ధం. ఈ ప్రాంతాలపై వ్యక్తిగత హక్కులు ఉండవు. జాతీయ పార్కుల హద్దులను శాసనం ద్వారా నిర్ణయిస్తారు. ప్రస్తుతం దేశంలో 4.2 మిలియన్ హెక్టార్లలో (దేశ భూభాగంలో 1.3 శాతం) 102 జాతీయ పార్కులు ఉన్నాయి.
జాతీయ పార్కు/ వన్యమృగ సంరక్షణ కేంద్రం – రాష్ట్రం
-దచ్చిగాం జాతీయ పార్కు – జమ్ముకశ్మీర్ – హంగూల్ (కశ్మీరి దుప్పి), కస్తూరి మృగం
-సలీం అలీ పక్షి సంరక్షణ కేంద్రం – జమ్ముకశ్మీర్ – హిమాలయన్ మంచుకోడి
-కిస్త్వార్ జాతీయ పార్కు -జమ్ముకశ్మీర్-
-హెమీస్ హై అల్టిట్యూడ్ జాతీయ పార్కు – జమ్ముకశ్మీర్
-జిమ్ కార్బెట్ జాతీయ పార్కు-ఉత్తరాఖండ్ – పెద్ద పులలకు ప్రసిద్ధి. దేశంలోనే తొలి జాతీయ పార్కు
-వ్యాలీ ఆఫ్ ఫ్లవర్స్ జాతీయ పార్కు -ఉత్తరాఖండ్ -విభిన్నరకాల పుష్పజాతుల పరిరక్షణ
-రాజాజీ జాతీయ పార్కు- ఉత్తరాఖండ్
-దుద్వా జాతీయ పార్కు -ఉత్తరప్రదేశ్
-చంద్రప్రభ జాతీయ పార్కు -ఉత్తరప్రదేశ్
-ఖజీరంగా జాతీయ పార్కు – అసోం – ఒంటి కొమ్ము ఖడ్గమృగం
-డిబ్రూసైకోవా -అసోం
-మానస్ వన్యమృగ సంరక్షణ కేంద్రం- అసోం
-సమేరి వన్యమృగ సంరక్షణ కేంద్రం- అసోం
-గర్మ్పానీ వన్యమృగ సంరక్షణ కేంద్రం- అసోం
-కన్హా జాతీయ పార్కు -మధ్యప్రదేశ్- బెట్వా నది ఒడ్డున ఉంది
-పన్నా, శివపురి, కాంగెర్వ్యాలీ, పెంచ్ వనవిహార్, ఫాజిల్, బంధవ్‌ఘర్, సాత్పూర, బోరి, పచ్మర్హి, గాంధీసాగర్ జాతీయ పార్కులు- మధ్యప్రదేశ్
-కన్నేర్ఘాట్ జాతీయ పార్కు – చత్తీస్‌గఢ్ – పులులు
-ఇంద్రావతి, అచనాక్మర్, గురు ఘాసీదాస్, ఉదంది, సితానంది – చత్తీస్‌గఢ్
-శాల్వడోర్ కంచర గాడిదల సంరక్షణ కేంద్రం- గుజరాత్(రాణా ఆఫ్ కచ్ ప్రాంతంలోని చిత్తడి నేలలు) -కంచర గాడిదలు
-గిర్ వన్యమృగ సంరక్షణ కేంద్రం – గుజరాత్ -ఆసియా సింహాలు
-నల్సరోవర్ – గుజరాత్
-బోరివిల్లా జాతీయ పార్కు- మహారాష్ట్ర -అరిచే జింకలు
-తడోబా వన్యమృగ సంరక్షణ కేంద్రం -మహారాష్ట్ర
-మేల్ఘాట్, గుగ్మల్ – మహారాష్ట్ర
-జల్ధావరా, బక్సా, సుందర్బన్స్ నియోర వ్యాలీ-పశ్చిమబెంగాల్
-బన్నేర్‌ఘాట్ జాతీయ పార్కు – బెంగళూరు-ప్రపంచంలోనే అతిపెద్ద సీతాకోక చిలుకల సంరక్షణ కేంద్రం
-దండేలి, అనాసీ -కర్ణాటక, తమిళనాడు సరిహద్దు
-బందీపూర్ వన్యమృగ సంరక్షణ కేంద్రం- తమిళనాడు, కర్ణాటక – ఏనుగులు
-రంగన్టిట్టూ పక్షి సంరక్షణా కేంద్రం – కర్ణాటక
-దండేవి జాతీయ పార్కు – కర్ణాటక
-సైలెంట్ వ్యాలీ జాతీయ పార్కు – కేరళ – మకాక్ కోతులు (సింహపు తోక ఉన్న కోతులు)
-పెరియార్ వన్యమృగ సంరక్షణ కేంద్రం – కేరళ – ఏనుగులు, పులులు
-బిత్తర్‌కనిక – ఒడిశా – మాంగ్రూవ్స్ సురక్షిత ప్రాంతం
-సిమ్లిపాల్ – ఒడిశా- తెల్లపులులకు ప్రసిద్ధి
-గిండి జాతీయ పార్కు – తమిళనాడు – పాములకు ప్రసిద్ధి
-వేదాంతగల్ పక్షి సంరక్షణా కేంద్రం తమిళనాడు – కొంగలు
-మదువలై వన్యమృగ సంరక్షణ కేంద్రం -తమిళనాడు – ఏనుగులకు ప్రసిద్ధి
-(దీనినే టాప్‌స్లిప్ అని పిలుస్తారు)
-గౌతమ్‌బుద్ధ, వాల్మీకి, దాట్మా
-జాతీయ పార్కులు – బీహార్
-కాంచన్‌జంగ, ఖంగ్ చాందైందా జాతీయ పార్కులు- సిక్కిం
-మౌలింగ్ – అరుణాచల్‌ప్రదేశ్
-నాంధపా- అరుణాచల్‌ప్రదేశ్ – పులులు
-కైబుల్లంజావ్ -మణిపూర్ – లోక్తక్ సరస్సు ఒడ్డున ఉంది
-ముర్లేంగ్, దంపా నోక్రిక్, బలపాక్రం జాతీయ పార్కులు -మేఘాలయ
బయోస్పియర్ రిజర్వులు
-ఏదైనా భౌగోళిక ప్రాంతంలో వృక్ష, జంతుజాతులు, వాటి జన్యువుల పరిరక్షణ, గిరిజనుల జీవనశైలి, మొక్కలు, జంతువుల జన్యు ఆధారాలను సంరక్షించేందుకు ఏర్పాటైన ప్రయోజనకర రక్షిత ప్రాంతాలే బయోస్పియర్ రిజర్వులు. యునెస్కో ఆధ్వర్యంలో ఏర్పాటైన మ్యాన్ అండ్ బయోస్పియర్ ప్రోగ్రామ్ (1971) ప్రస్తుతం దేశంలో 19 బయోస్పియర్ ప్రాంతాలను ప్రకటించింది.
బయోస్పియర్ రిజర్వ్ రాష్ట్రం
నీలగిరి (దేశంలోనే మొదటి బయోస్పియర్, 1986లో ప్రకటించారు) తమిళనాడు
అగస్త్యమలై – కేరళ
గల్ఫ్ ఆఫ్ మన్నార్ – తమిళనాడు
గ్రేట్‌నికోబార్-అండమాన్ నికోబార్
సిమ్లిపాల్- ఒడిశా
అమర్కంట్ – మధ్యప్రదేశ్
అదానకర్- చత్తీస్‌గఢ్
పచ్మర్హి- మధ్యప్రదేశ్
సుందర్బన్- పశ్చిమబెంగాల్
దిబ్రూసికాయ్- అసోం
మానస – అసోం
నోక్రిక్ – మేఘాలయ
దిబంగ్-దేహాంగ్ ఋ- అరుణాచల్‌ప్రదేశ్
కాంచనజంగ- సిక్కిం
నందాదేవి- ఉత్తరాఖండ్
రాణా ఆఫ్ కచ్- గుజరాత్
కోల్డ్ డెసర్ట్ – హిమాచల్‌ప్రదేశ్
శేషాచలం- ఆంధ్రప్రదేశ్
పన్నా – మధ్యప్రదేశ్
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?
దేశాల అనుసంధానం.. వాణిజ్య అంతఃసంబంధం
కణ బాహ్య జీర్ణక్రియ
ఇంటి పని వద్దన్నవారు.. స్వీయ శిక్షణ ఉండాలన్నవారు
జీవావరణ వ్యవస్థకు కావలసిన మూలశక్తి దారులు?
మౌజియన్ అనే గ్రీకు పదానికి అర్థం?
సమాజ మేధో కేంద్రాలు.. నాగరికతకు చిహ్నాలు