అంటార్కిటికా ఖండం ఏ దేశం కన్నా పెద్దది?
అంటార్కిటికా ఖండాన్ని చేరిన మొదటి వ్యక్తి- రాల్డ్ అముండసేన్
-దక్షిణార్ధగోళంలో అంటార్కిటికా వలయంలో దక్షిణ ధ్రువాన్ని ఆవరించి ఉన్న ఐదో పెద్ద ఖండాన్ని అంటార్కిటికా ఖండం అంటారు.
-ప్రపంచంలో అత్యంత దక్షిణంగా, ఎత్తుగా ఉన్న ఖండం అంటార్కిటికా.
-అంటార్కిటికా ఖండం సరాసరి ఎత్తు 2,250 మీటర్లు
-ప్రపంచంలో అత్యల్ప ఉష్ణోగ్రతలు, అత్యల్ప వర్షపాతం నమోదయ్యే ఖండం.
-అంటార్కిటికా ఖండం మీద ఉన్న మంచు 29 మిలియన్ కిలోమీటర్ల మందాన్ని కలిగి ఉన్నది.
-ఖండం మొత్తంలో 98 శాతం మంచుతో ఆవరించి ఉన్నది.
-ప్రపంచం మొత్తం మీద ఉన్న మంచులో 90 శాతం అంటార్కిటికాలోనే ఉన్నది.
-ప్రపంచం మొత్తం ఉన్న మంచునీటిలో 75 శాతం మంచినీరు ఈ ఖండంలోనే ఉన్నది.
-ఈ ఖండంలోని మంచుపొర కరిగితే సముద్ర మట్టాలు 55 మీటర్ల ఎత్తు పెరుగుతాయి.
-అంటార్కిటికా ఖండంలో అతి ఎత్తయిన శిఖరం – విన్సన్ మాసిఫ్ (5140 మీటర్లు)
-అంటార్కిటికా ఖండంలోని క్రియాశీల అగ్నిపర్వతం- ఎరిబస్
-అంటార్కిటికా ఖండంలో లోతైన ప్రాంతం -బెంట్లీ ట్రెంచ్
-ఈ ఖండంలోనే ప్రపంచంలో అతిపెద్ద హిమానీ నదాలైన లాంబార్ట్, బియోర్డ్మోర్లు ఉన్నాయి.
-1956లో పసిఫిక్ మహాసముద్ర దక్షిణ ప్రాంతంలో అతిపెద్ద మంచు కొండను కనుగొన్నారు. దీని విస్తీర్ణం 31,000 చదరపు కిలోమీటర్లు.
-ఈ మంచుకొండ ఐరోపా ఖండంలోని బెల్జియం దేశం కంటే పెద్దది.
-అంటార్కిటికా ఖండం మధ్యలో ట్రాన్స్ అంటార్కిటికా పర్వతాలు ఉన్నాయి. వీటి పొడవు 3050 కిలోమీటర్లు. ఇవి అంటార్కిటికా ఖండాన్ని తూర్పు, పశ్చిమ అంటార్కిటికాలుగా విభజిస్తున్నాయి.
-ప్రపంచంలో అత్యల్ప ఉష్ణోగ్రత -88.3డిగ్రీల సెంటీగ్రేడ్ ఉష్ణోగ్రత అంటార్కిటికా ఖండంలోని జవోస్ట్టోక్ అనే పరిశోధన కేంద్రం వద్ద నమోదైంది.
-ఈ ఖండంలో శీతాకాలంలో తీర ప్రాంతాల్లో -20 డిగ్రీల సెంటీగ్రేడ్, ఖండాంతర్గత ప్రాంతాల్లో -70 డిగ్రీల సెంటీగ్రేడ్ ఉష్ణోగ్రతను నమోదు చేశారు.
-వేసవికాలంలో గమనిస్తే ఖండాంతర్గత ప్రాంతాల్లో 35డిగ్రీల సెంటీగ్రేడ్ వరకు నమోదవుతాయి.
-అంటార్కిటికా ఖండంలో వీచే తీవ్రమైన, దట్టమైన చలి పవనాలను కెటబాలిక్ పవనాలు అని పిలుస్తారు. వీటి వేగం గంటకు 225 కి.మీ.ల నుంచి 250 కి.మీ.ల వరకు ఉంటుంది.
-ఈ ఖండంలో అత్యంత శుష్క ప్రాంతం శుష్కలోయ.
-ఈ ప్రాంతం వద్ద గడిచిన 20 లక్షల సంవత్సరాల్లో అసలు వర్షమే కురవలేదు.
-ఈ ఖండంలో ఉండే దుర్భర పరిస్థితుల కారణంగా ఇక్కడ వృక్షాలు పెరగవు. దీంతో వృక్షాలు లేని ఏకైక ఖండంగా అంటార్కిటికాను పిలుస్తారు.
-ఈ ఖండంలో 400 రకాల నాచుజాతి, రెండు రకాల పుష్పజాతి మొక్కలను గుర్తించారు.
-ఈ ఖండంలోని ప్రధాన జంతువులు సీల్, తిమింగలం.
-ప్రధాన పక్షి పెంగ్విన్.
-ఇక్కడ విరివిగా లభించే జంతువు క్రిల్ అనే రొయ్య వంటి సముద్ర జంతువు.
-1959లో అనేక దేశాల మధ్య అంటార్కిటికా సంధి జరిగింది. ఇందులో భారత్ 1983లో చేరింది.
భారత్ ముఖ్యమైన పరిశోధన కేంద్రాలు
1. దక్షిణ గంగోత్రి (1983)
2. మైత్రి (1989)
3. భారతి (2012)
భారతి నిర్వహించే పరిశోధనలు
1. సూక్ష్మజీవుల మనుగడ
2) పర్యావరణ.
3) లోతులో నుంచి తవ్వితీసిప మంచుపొరలను పరిశీలించడం
4)జీవవైవిధ్యం
5. భూకంపాలు, అగ్నిపర్వతాలు, అణుధార్మికత ఆనవాళ్లను కనుగొనడం.
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?
దేశాల అనుసంధానం.. వాణిజ్య అంతఃసంబంధం
కణ బాహ్య జీర్ణక్రియ
ఇంటి పని వద్దన్నవారు.. స్వీయ శిక్షణ ఉండాలన్నవారు
జీవావరణ వ్యవస్థకు కావలసిన మూలశక్తి దారులు?
మౌజియన్ అనే గ్రీకు పదానికి అర్థం?
సమాజ మేధో కేంద్రాలు.. నాగరికతకు చిహ్నాలు