Tertiary landscapes | తృతీయ భూస్వరూపాలు
ద్వీపం
-నాలుగు వైపుల నీటితో ఆవరించి ఉన్న భూభాగాన్ని ద్వీపం అంటారు.
ఉదా:
-ప్రపంచంలో అతిపెద్ద ద్వీపం గ్రీన్లాండ్
-ప్రపచంలో ఏకైక ద్వీపపు ఖండం ఆస్ట్రేలియా
-ప్రపంచంలో అతిపెద్ద అగ్నిపర్వత దీవి ఐస్లాండ్
ద్వీపకల్పం
-మూడు వైపుల నీటితో ఆవరించి, ఒకవైపు భూభాగం కలిగిన భూస్వరూపాన్ని ద్వీపకల్పం అంటారు.
ఉదా:
-ప్రపంచంలో అతిపెద్ద ద్వీపకల్పం -అరేబియా
-రెండో అతిపెద్ద ద్వీపకల్పం- భారతదేశం
భూసంధి
-రెండు భూభాగాలను కలుపుతూ రెండు జలభాగాలను వేరు చేసే ప్రాంతాన్ని భూసంధి అంటారు.
ఉదా: పనామా భూసంధి, సూయజ్ భూసంధి
జలసంధి
-రెండు జలభాగాలను కలుపుతూ రెండు భూభాగాలను వేరుచేసే ప్రాంతాన్ని జలసంధి అంటారు.
ఉదా:
-పసిఫిక్ మహాసముద్రంలోని బేరింగ్ జలసంధి
-భారత్, శ్రీలంక మధ్యలో ఉన్న పాక్ జలసంధి
ఆకారపు లోయలు
-నదీ క్రమక్షయం మూలంగా V ఆకారంలో లోయ వంటి ప్రాంతాలు ఏర్పడితే వాటిని V ఆకారపు లోయలు అంటారు.
గార్జెస్
-V ఆకారపు లోయలు ఇంకొంచెం లోతుగా ఏర్పడితే వాటిని గార్జెస్ అంటారు.
ఉదా:
-ఆదిలాబాద్ జిల్లాలో గోదావరి నది ఏర్పరిచే బైసన్గార్జ్
-అరుణాచల్‌ప్రదేశ్‌లో బ్రహ్మపుత్ర/ దిహంగ్ నది ఏర్పరిచే దిహంగ్ గార్జ్ అగాథధరి
-నదీ క్రమక్షయంవల్ల నిట్రమైన పార్శాలతో ఏర్పడిన లోయవంటి భాగాన్ని అగాథధరి అంటారు.
ఉదా: కొలరాడో నదివల్ల ఏర్పడిన కొలరాడో అగాథధరి
నది
-పర్వతాల గుండాగాని, పీఠభూముల గుండాగాని, మైదానాల గుండాగిని సహజసిద్ధంగా ప్రవహించే స్వరూపాన్ని నది అంటారు.
ఉదా:
-ప్రపంచంలో అతి పొడవైన నది నైలునది.
-ప్రపంచంలో అతి పెద్ద నది అమెజాన్.
కాలువ
-రవాణా, నీటిపారుదల కోసం కృత్రిమంగా తవ్విన భూస్వరూపాన్ని కాలువ అంటారు.
ఉదా:
-పనామా కాలువ, సూయజ్ కాలువ
-దేశంలో ఇందిరాగాంధీ, బకింగ్‌హామ్ కాలువలు.
సరస్సు
-అంతర్భాగంలో ఉన్న నదీ జలభాగాన్ని సరస్సు అంటారు.
ఉదా:
-ప్రపంచంలో అతిపెద్ద మంచినీటి సరస్సు సుపీరియర్
-ప్రపంచంలో అతిపెద్ద ఉప్పునీటి సరస్సు కాస్పియన్ సరస్సు
-మన దేశంలో అతిపెద్ద మంచినీటి సరస్సు ఉలార్ సరస్సు
-మన దేశంలో అతిపెద్ద ఉప్పునీటి సరస్సు సాంబార్ సరస్సు
జలపాతం
-ఎత్తయిన ప్రాంతం నుంచి అగాథధరి మీదకి పడే నీటి స్వరూపాన్ని జలపాతం అంటారు.
ఉదా:
-ప్రపంచంలో అతి ఎత్తయిన జలపాతం ఏంజెల్
-దేశంలో అతి ఎత్తయిన జలపాతం జోగ్/ జెర్సొప్పా జలపాతం
ఆర్చిపెలాగో
-అనేక దీవుల సముదాయాన్ని ఆర్చిపెలాగో అంటారు.
ఉదా:
-ప్రపంచంలో అతిపెద్ద ఆర్చిపెలాగో ఇండోనేషియా
-ప్రపంచంలో రెండో అతిపెద్ద ఆర్చిపెలాగో ఫిలిప్పైన్స్
లోయ
-నదులు హిమానీనదాల క్రమక్షయంవల్ల ఏర్పడిన సన్నని, లోతైన భూభాగమే లోయ.
ఉదా: కృష్ణా నదీలోయ, గోదావరి నదీలోయ
పగులు లోయ
-ఒక విశాలమైన భూభాగం మధ్య భాగం భూమి అంతర్భాగంలోని బలాల వల్ల లోపలికి కుచించుకుపోయి ఏర్పడిన స్వరూపమే పగులులోయ.
ఉదా: నర్మద పగులులోయ, రైన్ నదీ పగులులోయ
-ప్రపంచంలో అతిపెద్ద పగులులోయ: ది గ్రేట్ ఆఫ్రికన్ రిఫ్ట్ వ్యాలీ
అగ్రం
-భూభాగం చివరికొన సముద్రంలోకి చొచ్చుకొని వస్తే దాన్ని అగ్రం అంటారు.
-భారత్‌లోని కన్యాకుమారి అగ్రం, ఆఫ్రికాలోని గుడ్‌హోప్ అగ్రం.
అఖాతం
-సముద్ర అలల మూలంగా క్రమక్షయం చెంది అర్ధచంద్రాకారంలో ఏర్పడిన భూస్వరూపాన్ని అఖాతం అంటారు.
ఉదా: బంగాళాఖాతం
తీరం
-సముద్రాన్ని ఆనుకొని ఉన్న భూభాగాన్ని తీరం అంటారు.
-ప్రపంచంలో అత్యధిక తీరరేఖ కలిగిన దేశం- కెనడా
-అత్యల్ప తీరరేఖ కలిగిన దేశం- జోర్డాన్
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
తాత్వికతను తెలిపేది.. రాజ్యాంగానికి గుండెలాంటిది
ఎలకానిక్ రికార్డులు.. ప్రాథమిక సాక్ష్యాలు
శుక్రకణాలు తాత్కాలికంగా నిల్వ ఉండే ప్రాంతం?
సెకండరీ ఎడ్యుకేషన్ కమిషన్‌కు మరోపేరు?
‘వెయ్యి ఉరిల మర్రి’ గా పేరుగాంచిన ఊడలమర్రి ఏ జిల్లాలో ఉంది?
రక్షణ దుర్గాలు – నాటి పాలనా విభాగాలు
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?