అల్పాహారం + భోజనం = బ్రంచ్
పూర్వం యూరోపియన్లు తమ ఇంటి గోడల ఆధారంగా చుట్టూ ఒక కథను చిత్రించేవారు. ఒక్కొక్క అంతస్తు (floor)కు ఒక్కొక్క కథ చొప్పున ఎన్ని అంస్తులు ఉంటే అన్ని కథలు (stories/storeys(british)) ఉండేవి. కాబట్టే రెండంతస్తుల మేడ (two storied building), ఏడంతస్తుల మేడ (Seven storied building) అని కూడా వాడుక. అయితే నేను second floorలో ఉంటాను అని చెప్పాలి తప్ప storeyలో ఉంటాను అనకూడదు.
-Palace కంటే కొంచెం తక్కువ విశాలమైన నివాసం mansion. నిజానికి mansion అంటే నివసించే స్థలం (గూడు) అని అర్థం. Latin manere నుంచి French-manoir అంటే to dwell నివసించే అని అర్థం. Manor దీని నుంచే వచ్చింది. తెలుగులో దేవతల నివాసం గుడి (temple) అనే పదం మనుషులు ఉండే గూడు, గుడిసె నుంచి వచ్చింది. ఇటువంటిదే ఇంకో పదం కోవెల < కోయిల్ (కో-దేవుడు, ఇల్-ఇల్లు).
-బెంగాల్ ప్రాంతంలోని విశాలమైన వరండా (Verenda/Porch) ఉండే ఒకటిన్నర అంతస్తు ఇళ్లను చూసి ఇంగ్లిష్‌వారు ముచ్చటపడి అటువంటి ఇళ్లను కట్టుకుని వాటిని bungalows (bungalow
-స్వాతంత్య్రం రాకముందు ఇండియాలో చిన్నవి, పెద్దవి కలిపి 565 సంస్థానాలు (Princely States) ఉండేవి. నిజాం లాంటి పెద్ద సంస్థానాల్లో బ్రిటిష్ అధికార ప్రతినిధి (Official representative)గా resident ఉండేవాడు. ప్రస్తుత గవర్నర్ వ్యవస్థకు బీజాలు ఇక్కడే ఉన్నాయి. రెసిడెంట్ నివాసాన్ని residency అనేవారు. ఉర్దూలో residencyని కోఠీ అని అంటారు.
-హైదరాబాద్‌లో రెసిడెన్సీ ఉన్న ప్రాంతమే ఇప్పటి కోఠీ. రెసిడెన్సీలో ఇప్పుడు కోఠీ ఉమెన్స్ కాలేజీ, ఉస్మానియా మెడికల్ కాలేజీలు ఉన్నాయి. దానికి దగ్గరలోనే ఏడో, ఆఖరి నిజాం మీర్ ఉస్మాన్ అలీఖాన్ నివాసం కింగ్ కోఠీ (Kings Residency) ఉంది.
-Residency, residenceలో తేడా ఉంది. చారిత్రకంగా residency అంటే బ్రిటిష్ పాలనలో రాజు సంస్థానాల్లో ఉండే గవర్నర్ జనరల్ ప్రతినిధి నివాసం.
-ఎవరైనా నివసించేది residence. ఈ residence అనే పదం ఫ్రెంచ్ నుంచి ఇంగ్లిష్‌లోకి వచ్చింది. దీనికి మూలం లాటిన్ resideo (reblack, sedio sit). రోజంతా ఎటుతిరిగినా మళ్లీ వచ్చేది residenceలోకే కదా.
1. Nero (37 AD to 68 AD) రోమన్ చక్రవర్తి క్రీ.శ. 64లో చెలరేగిన అగ్నిజ్వాలలకు Rome నగరం తగలబడిపోతుంటే ఫిడేలు వాయిస్తూ కూర్చున్నాడనే అపవాదు ఉంది (Nero fiddled while Rome burned).
-ఇటువంటి ఇంకో ఫ్రెంచ్ పదం restaurant దీనికి మూలం లాటిన్ restauro (re black, stauro store). ఖాళీ కడుపును తిరిగి నింపేది రెస్టారెంట్. బాగా ఆకలిగా ఉంది, దగ్గరలో ఏదైనా హోటల్ ఉందా అంటూ ఉంటాం. కానీ నిజానికి హోటల్ అంటే వసతిగృహం (building where people stay, usually for a short time, paying for their rooms and meals) లాంటిది. సాధారణంగా పెద్ద హోటళ్లలో రెస్టారెంట్లు ఉంటాయి. కాబట్టి మనం బస (stay) చేయడానికి కాకుండా కేవలం తినడానికి అయితే రెస్టారెంట్‌కి పోదామా అని మాత్రమే అనాలి,
ఇంగ్లిష్ ముచ్చట్లు-2
హోటల్‌కి పోదామా అనకూడదు.
-బస చేసే గదుల (rooms) వద్ద తమ వాహనాల (Motor vehicles)ను నిలిపి ఉంచుకునే (Parking) సౌకర్యం ఉన్న హోటల్‌ను motel అంటారు. Motor, Hotel రెండు పదాల కలయికతో Motel ఏర్పడింది. Breakfast, lunch రెండింటి వేళల మధ్య ఒకేసారి తినడాన్ని Brunch అంటారు.
-ఇలా ఒక పదంలోని మొదటి అక్షరాల్ని, రెండో పదంలోని చివరి అక్షరాల్ని కలిపి రెండింటి అర్థాల సారంతో సృష్టించే పదాలను Portmanteau words అంటారు. Smog (పొగమంచు) – smoke+fog; travelogue (యాత్రాచరిత్ర) travel+monologue ఇటువంటివే.
-తెలుగు పత్రికల్లో ఇటీవల చాలా Portmanteau పదాలు కనిపిస్తున్నాయి. మృగాడు (మృగంగా మారిన మగాడు), కుళ్లిపాయలు (కుళ్లిపోయిన ఉల్లిపాయలు – చూడుడు-ముళ్లమూడి వెంకటరమణ, కోతి కొమ్మచ్చి) ఈ కోవకు చెందినవే.
కుడి ఎడమైతే పొరబాటు ఉందోయ్
-కుడి ఎడమైతే పొరబాటు లేదోయ్ అన్నాడో సినీకవి దేవదాసులో. ఒక భగ్నప్రేమికుడి వేదాంత ధోరణో లేక తాగుబోతు వ్యక్తి ఆలాపనో/ప్రేలాపనో అనుకుంటే ఫరవాలేదు. కానీ నిజజీవితంలో కుడి ఎడమ ఎప్పుడూ ఒకటి కావు.
-సాధారణంగా కుడి మంగళకరం, కరచాలనం (shake hand) ఇచ్చినా, అక్షతలు వేసినా, ఆశీర్వదించినా (కుడిచేతికి అయిన గాయం వల్ల ఎన్టీఆర్ ఎడమచేతితో ఆశీర్వదించేవారు. ఇది అపవాదు మాత్రమే) కుడిచేతినే వాడుతాం. ఇంగ్లిష్‌లో కూడా right అంటే కుడి అర్థంతో పాటు correct అనే అర్థం కూడా ఉంది.
-పెద్దపెద్దవాళ్లకు కుడి భుజాలు (right hands) ఉంటారు. ఈ కుడి భుజం (right hand) వారి అవసరాలు తీర్చడమేకాకుండా, వారితో అవసరం ఉన్నవారికి మధ్యవర్తిగా ఉంటుంది. గమనించి చూస్తే ఈ కుడి భుజం పెద్దాయనకు ఎప్పుడూ కుడి పక్కనే ఉంటుంది.
-కుడితో కూడి మంచి పదాలు (righteousness నిజాయితీ, up right), ఎడమ (left)తో చేరి చెడు పదాలు ఉండటం రివాజు.
-రసాయనశాస్త్రం (Chemistry) చదివినవారికి dextrorotatory, levorotatory అనే పదాలు పరిచయమై ఉంటాయి. సమతల ధృవకాంతి (Plane polarised light)ని కుడివైపునకు తిప్పి (rotate) చేసే పదార్థాలను dextrorotatory (Latin: dextro right) అని, ఎడమవైపునకు తిప్పి చేసే పదార్థాలను levorotatory (Latin: levo-left) అని అంటారు.
-అల్లికలు (kniting), ఇంటిపనులను చకచకా తన చేతులతో చక్కబెట్టే అమ్మాయిని dexterous girl అంటారు (Latin dexter right, right hand). కుడిచేతిని వాడటం వల్లే ఆ నైపుణ్యం (skill) వచ్చిందని భావించాలి. చేతులను నేర్పుగా ఉపయోగించడాన్ని dexterity అంటారు. కొంతమంది కుడి, ఎడమ చేతులను సమానస్థాయిలో ఉపయోగించే నైపుణ్యం కలిగి ఉంటారు. వారిని ambidextrous (Latin – ambi-both, dextrous-right hand- అంటే రెండు కుడి చేతలుగల అని అర్థం) అంటారు. ఇక్కడ ఎడమ చేతికి కుడిచేతి గౌరవం ఆపాదిస్తారు.
-మహాభారతంలో అర్జునునికి ఈ సామర్థ్యం ఉంది. అందుకే అర్జునుడు సవ్యసాచి (ambi dextrous).
-సవ్య అంటే సక్రమ, కుడి అనే అర్థాలు ఉన్నాయి. సవ్యదిశ (clock-wise direction) ఎడమ నుంచి కుడివైపు ఉంటుంది. అపసవ్య అంటే చెడు (అపసవ్య ధోరణులు), ఎడమ అనే అర్థాలు ఉన్నాయి. అపసవ్య దిశ (anti-clock wise direction) కుడి నుంచి ఎడమై వైపు ఉంటుంది. సవ్యసాచి (ambi dextrous), ఎడమచేతిని కూడా సవ్యంగా (కుడిచేయిగా) వాడగలిగే సామర్థ్యం ఉన్నవాడు.
-అబ్బో ఆయనా.. మహాగొప్పవాడు. నా జీవితంలో అటువంటి మహానుభావున్ని ఇప్పటివరకు చూడలేదు. ఇది పొగడ్తో, తిట్టో అర్థం కాదు. ఇటువంటి పొగడ్త (complements)లను left hand compliments/back hand compliments (a remark that seems to express admiration but could also be understood as an insult) అంటారు.
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?
దేశాల అనుసంధానం.. వాణిజ్య అంతఃసంబంధం
కణ బాహ్య జీర్ణక్రియ
ఇంటి పని వద్దన్నవారు.. స్వీయ శిక్షణ ఉండాలన్నవారు
జీవావరణ వ్యవస్థకు కావలసిన మూలశక్తి దారులు?
మౌజియన్ అనే గ్రీకు పదానికి అర్థం?
సమాజ మేధో కేంద్రాలు.. నాగరికతకు చిహ్నాలు