చౌమహల్లా ప్యాలెస్:
ఇది 200 ఏండ్ల క్రితం నిజాం నిర్మించిన రాజభవనం. చార్మినార్కు దగ్గర్లో 1750లో సలాబత్ జంగ్ నిర్మాణాన్ని ప్రారంభించగా, 5వ నిజాం అఫ్జలుద్దౌలా బహదూర్ 1869లో పూర్తి చేశారు. చౌ అంటే నాలుగు, మహల్ అంటే భవనం అని అర్థం. అఫ్జల్ మహల్, మాతబ్ మహల్, తన్హియత్ మహల్, అఫ్తాబ్మహల్ అనే నాలుగు భవనాలు ఉన్నాయి. నిజాం రాజుల కాలంలో దేశవిదేశాల నుంచి వచ్చే రాజ ప్రముఖులకు అతిథులకు ఇక్కడ వసతి ఏర్పాటుచేసేవారు.