కుతుబ్‌షాహీల్లో చివరి పాలకుడు?
1. క్రీ.శ. 1518 లో కుతుబ్‌షాహీ వంశాన్ని స్థాపించింది ఎవరు?
1) ఇబ్రహీం కుతుబ్‌షా
2) కులీ కుతుబ్ ఉల్ ముల్క్
3) మహ్మద్ కులీ కుతుబ్‌షా
4) అబ్దుల్లా కుతుబ్‌షా
2. కుతుబ్‌షాహీల మొదటి రాజధాని?
1) గోల్కొండ 2) ఔరంగాబాద్
3) నాందేడ్ 4) బీజాపూర్
3. పెరిస్టా తన రచనలో తెలంగాణ ప్రాంతాన్ని ఏ పేరుతో పేర్కొన్నాడు?
1) తెలంగాణ 2) తైలాంగ్ 3) తిలాంగ్ 4) త్రిలాంగ్
4. తారీఖీ-ఇ-పెరిస్ట్టా గ్రంథ రచయిత ?
1) అమీర్ ఖుస్రో 2) పెరిస్టా
3) ట్రావెర్నియర్ 4) బెర్నియర్
5. కులీ కుతుబ్ ఉల్ ముల్క్ సమకాలిక రాజు?
1) శ్రీకృష్ణదేవరాయలు 2) అచ్యుతరాయలు
3) హరిహరరాయలు 4) 1, 2
6. కులీ కుతుబ్ ఉల్ ముల్క్ సమకాలికుడు కాని వారిని గుర్తించండి?
1) అచ్యుతరాయలు 2) షేర్షా 3) బాబర్ 4) అక్బర్
7. కులీ కుతుబ్ ఉల్ ముల్క్ పూర్వీకులు ఏ ప్రాంతానికి చెందినవారు?
1) దక్షిణ ఇరాన్ 2) దక్షిణ ఇరాక్
3) తూర్పు ఇరాన్ 4) తూర్పు ఇరాక్
8. కులీ కుతుబ్ ఉల్ ముల్క్ పరిపాలన కాలం?
1) 1518- 1543 2) 1518 – 1534
3) 1518- 1535 4) 1518-1553
9. మహ్మద్ నగర్ అనే పేరుతో కొత్త నగరాన్ని నిర్మించింది ఎవరు?
1) జంషీద్ 2) అబ్దుల్లా కుతుబ్‌షా
3) అబుల్ హసన్ తానీషా 4) కులీ కుతుబ్ ఉల్ ముల్క్
10. కులీ కుతుబ్ ఉల్ ముల్క్ విజయనగర సైన్యాన్ని ఏ సంవత్సరంలో ఓడించాడు?
1) 1518 2) 1529 3) 1530 4) 1543
11. క్షయ వ్యాధితో మృతిచెందిన కుతుబ్‌షాహీ సుల్తాన్ ఎవరు?
1) కులీ కుతుబ్ ఉల్ ముల్క్ 2) సుబాన్
3) జంషేద్ కులీ 4) ఇబ్రహీం- కులీ- కుతుబ్‌షాహీ
12. ఏడేండ్ల వయస్సులో సింహాసనాన్ని అధిష్టించిన సుల్తాన్?
1) సుబాన్ 2) దౌలత్కులీ
3) ఇబ్రహీం కులీ 4) జంషేద్ కులీ
13. కేవలం ఆరు నెలలు పాలించిన కుతుబ్‌షాహీ పాలకుడు?
1) దౌలత్ కులీ 2) ఇబ్రహీం కులీ
3) జంషేద్ కులీ 4) సుబాన్ కులీ
14. విజయనగర సామ్రాజ్యంలో ఆశ్రయం పొందిన కుతుబ్షాహి సుల్తాన్ ఎవరు?
1) అబ్దుల్లా కుతుబ్‌షా 2) ఇబ్రహీం కులీ కుతుబ్‌షా
3) మహ్మద్ కుతుబ్‌షా 4) మహ్మద్ కులీ కుతుబ్‌షా
15. కళాభిమాని, సాహిత్యప్రియుడిగా పేరొందిన కుతుబ్‌షా హీ సుల్తాన్ ఎవరు?
1) అబ్దుల్లా కుతుబ్‌షా 2) మహ్మద్ కుతుబ్‌షా
3) ఇబ్రహీం కుతుబ్‌షా 4) అబుల్ హసన్ తానీషా
16. రాక్షస తంగడి యుద్ధం ఏ కుతుబ్‌షా కాలంలో జరిగింది?
1) ఇబ్రహీం కుతుబ్‌షా 2) అబ్దుల్లా కుతుబ్‌షా
3) అబుల్ హసన్ తానీషా 4) మహ్మద్ కుతుబ్‌షా
17. ఇబ్రహీం కుతుబ్‌షా కాలంలో ఆదరణ పొందిన ప్రముఖ తెలుగు కవులు ఎవరు?
1) అద్దంకి గంగాధరుడు 2) కందుకూరి రుద్రకవి
3) కంచర్ల గోపన్న 4) 1, 2
18. తపతి సంవరణోపాఖ్యానాన్ని రచించింది ఎవరు?
1) కందుకూరి రుద్రకవి 2) కంచర్ల గోపన్న
3) అద్దంకి గంగాధరుడు 4) ఎవరూ కాదు
19. నిరంకుశోపాఖ్యానాన్ని రచించింది ఎవరు?
1) కంచర్ల గోపన్న 2) కందుకూరి రుద్రకవి
3) అద్దంకి గంగాధరుడు 4) పై వారంతా
20. హైదరాబాద్ నగర నిర్మాత?
1) మహ్మద్ కులీ కుతుబ్‌షా 2) అబ్దుల్లా కుతుబ్‌షా
3) ఇబ్రహీం కుతుబ్‌షా 4) అబుల్ హసన్ తానీషా
21. హెచ్‌కే షేర్వాణి అనే చరిత్రకారుడు ఎవరి కాలాన్ని కల్చరల్ ఆఫ్ లిఫ్ట్‌గా వర్ణించాడు?
1) ఇబ్రహీం కుతుబ్‌షా 2) మహ్మద్ కులీకుతుబ్‌షా
3) అబ్దుల్లా కుతుబ్‌షా 4) అబుల్ హసన్ తానీషా
22. హిస్టరీ ఆఫ్ కుతుబ్‌షాహీ డైనస్టి రచయిత ఎవరు?
1) పెరిస్ట్టా 2) అమీర్ ఖుస్రో
3) హెచ్‌కే షేర్వాణి 4) మార్కోపోలో
23. బీజాపూర్ సైన్యాలు గోల్కొండ రాజ్యంపై ఎవరి కాలంలో దండెత్తాయి?
1) ఇబ్రహీం కుతుబ్‌షా 2) జంషేద్
3) మహ్మద్ కులీకుతుబ్‌షా 4) అబ్దుల్లా కుతుబ్‌షా
24. కింది వారిలో నూర్జహాన్ ఎవరి సమకాలికురాలు?
1) సుల్తాన్ మహ్మద్ కుతుబ్‌షా
2) మహ్మద్ కులీ కుతుబ్‌షా
3) అబ్దుల్లా కుతుబ్‌షా
4) జంషేద్ కుతుబ్‌షా
25. హిస్టరీ ఆఫ్ గోల్కొండ పుస్తక రచయిత?
1) జేఎన్ సర్కార్ 2) హెచ్‌కే షేర్వాణి
3) కాఫీఖాన్ 4) సిద్ధిఖీ
26. గోల్కొండ కుతుబ్‌షాహీల్లో చివరి పాలకుడు?
1) అబ్దుల్లా కుతుబ్‌షా 2) జంషేద్
3) సుబాన్ 4) అబుల్ హసన్ తానీషా
27. కింది వారిలో మరాఠా చక్రవర్తి ఎవరి సమకాలికుడు?
1) అబుల్ హసన్ తానీషా
2) అబ్దుల్లా కుతుబ్‌షా
3) మహ్మద్ కులీ కుతుబ్‌షా 4) జంషేద్
28. అక్కన్న, మాదన్నలు ఎప్పుడు హత్యకు గురయ్యారు?
1) 1674 2) 1686 3) 1699 4) 1675
29. ఏ మొగల్ చక్రవర్తి కాలంలో గోల్కొండ రాజ్యం మొగల్ సామ్రాజ్యంలో అంతర్భాగమైంది?
1) ఔరంగజేబు 2) జహంగీర్ 3) షాజహాన్ 4) అక్బర్
30. సరైన అంశాన్ని గుర్తించండి?
1) మీర్ జుమ్లా- ఆర్థిక మంత్రి
2) మజుందార్ – ఆదాయ,
వ్యయాలను తనిఖీ చేసే మంత్రి
3) కొత్వాల్ – పోలీస్ శాఖ అధిపతి
4) పైవన్నీ సరైనవే
31. ఐన్- ఉల్- ముల్క్ విధిని గుర్తించండి?
1) సైన్య వ్యవహారాలను చూసే మంత్రి
2) మత వ్యవహారాలను చూసే మంత్రి
3) అన్ని శాఖలను నియంత్రించే మంత్రి
4) విదేశీ వ్యవహారాల మంత్రి
32. జిల్లాలు, రాష్ర్టాలు ఎవరి ఆధీనంలో ఉండేవి?
1) హవల్దార్ 2) సర్ఖేల్ 3) దబీర్ 4) కొత్వాల్
33. కింది వాటిలో సరైనది గుర్తించండి?
1) గ్రామపెద్ద – మఖుద్దమ్
2) గ్రామ అకౌంటెంట్ – కులకర్ణి
3) పరగణాస్థాయి అకౌంటెంట్- దేశ్‌పాండే
4) పైవన్నీ
34. రయ్యత్ అంటే?
1) విదేశాల్లో గూఢచారి
2) భూమి సాగు చేసే వ్యక్తి
3) ఒక రకమైన ఆయుధం
4) ఒక రకమైన పరిపాలన శాఖ
35. ఒక హోన్సు అంటే?
1) నేటి రూ. 30తో సమానం
2) నేటి 30 పైసలతో సమానం
3) నేటి రూ. 3తో సమానం
4) నేటి రూ. 13తో సమానం
36. పాలవేకిరి కదిరీపతి రచనను గుర్తించండి?
1) వైజయంతి విలాసం 2) దాశరథీ శతకం
3) శుకసప్తతి 4) పైవన్నీ
37. గోల్కొండ రాజ్యంలో ప్రజల ముఖ్య వృత్తి?
1) విదేశీ వ్యాపారం 2) గనుల తవ్వకం
3) వ్యవసాయం 4) పండ్ల సాగు
38. వ్యవసాయ పనులు జూన్-అక్టోబర్ వరకు వర్షాలపై ఆధారపడి జరిగేవని పేర్కొన్నది?
1) ట్రావెర్నియర్ 2) బెర్నియర్ 3) థీవ్నాట్ 4) మెథోల్డ్
39. కోహినూర్ వజ్రం బరువు ఎంత?
1) 106 క్యారెట్లు 2) 108 క్యారెట్లు
3) 161 క్యారెట్లు 4) 101 క్యారెట్లు
40. కుతుబ్‌షాహీల కాలంలో తివాచీలకు ప్రసిద్ధి చెందిన ప్రాంతం?
1) నర్సాపురం 2) మచిలీపట్నం 3) వరంగల్ 4) మెదక్
41. అచ్చతెలుగులో రాసిన మొదటి గ్రంథం ఏది?
1) యయాతి చరిత్ర
2) వైజయంతి విలాసం
3) పండితారధ్య చరిత్ర
4) తపతీ సంవరణోపాఖ్యానం
42. పురానాపూల్‌ను ప్రేమ వంతెనగా వర్ణించినది?
1) బెర్నియర్ 2) థీవ్నాట్
3) మెథోల్డ్ 4) ట్రావెర్నియర్
43. హుస్సేన్‌సాగర్‌ను నిర్మించిన సంవత్సరం?
1) 1563 2) 1562 3) 1593 4) 1693
44. మక్కామసీదు నిర్మాణాన్ని పూర్తి చేసిందెవరు?
1) అబుల్ హసన్ తానీషా
2) మహ్మద్ కులీకుతుబ్‌షా
3) జహంగీర్ 4) ఔరంగజేబ్
45. మక్కా మసీదు నిర్మాణం పూర్తయిన సంవత్సరం?
1) 1614 2) 1693 3)1690 4)1676
46. రెండంతస్తుల సమాధి ఎవరిది?
1) ఇబ్రహీం కులీకుతుబ్‌షా 2) జంషేద్
3) అబ్దుల్లా కుతుబ్‌షా 4) ఎవరూ కాదు
47. ముస్తజీర్లు అంటే?
1) సుల్తాన్ రక్షణను నిర్వహించేవారు
2) వ్యాపారం నిర్వహించేవారు
3) విదేశీ వ్యాపారులు
4) భూమి శిస్తు వసూలు అధికారాన్ని వేలం పాటలో పొందిన వారు
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?
దేశాల అనుసంధానం.. వాణిజ్య అంతఃసంబంధం
కణ బాహ్య జీర్ణక్రియ
ఇంటి పని వద్దన్నవారు.. స్వీయ శిక్షణ ఉండాలన్నవారు
జీవావరణ వ్యవస్థకు కావలసిన మూలశక్తి దారులు?
మౌజియన్ అనే గ్రీకు పదానికి అర్థం?
సమాజ మేధో కేంద్రాలు.. నాగరికతకు చిహ్నాలు