మానవ సమాజం-పరివర్తన
సామాజిక ఒడంబడిక సిద్ధాంతం
-సమాజం పుట్టుక, దాని స్వభావం అనేది మానవుడు అతనికి సమాజంతో గల సంబంధం అనే అంశంతో దగ్గర సంబంధాన్ని కలిగి ఉంటుంది. ఈ దృగ్విషయాలను వివరించడం కోసం ఈ సిద్ధాంతం ఉపకరిస్తుంది.
-ఈ సిద్ధాంతాన్ని హబ్స్, జాన్లాక్, రూసోలు ప్రతిపాదించారు.
ముఖ్యాంశాలు
1. పూర్తిగా నాగరిక సమాజం ఏర్పడక ముందు మనుషుల మధ్య ఎలాంటి వ్యవస్థలు లేకుండా స్వేచ్ఛగా, సహజంగా ఎలాంటి నియమనిబంధనలు లేని State Natureలో జీవించారు. అందువల్ల వీరి జీవన విధానం Pre Social State అని చెప్పవచ్చు.
-ఇలా వారు నివసించిన విధానాన్నే ప్రకృతి వ్యవస్థ అని భావించవచ్చు.
-కొన్ని ఉమ్మడి ప్రయోజనాలవల్ల మానవులు స్వయంగా తమ మధ్య ఒక ఒడంబడికను ఏర్పరుచుకుని జీవనం కొనసాగించే విధానం రావడంవల్ల సమాజం ఏర్పడి అందుకు అనుగుణంగా మానవులు జీవనం కొనసాగిస్తున్నారు.
-సమాజం ఏర్పడటానికి ముందు ఉన్న ప్రకృతి వ్యవస్థలో మానవుల మధ్య సహజీవనం, పరస్పర సహకారం, ఉమ్మడి ప్రయోజనాలు కరువై తద్వారా బలవంతుడిదే రాజ్యం అన్నట్లు ఉండడంవల్ల, ఉమ్మడి ప్రయోజనాల వల్ల కలిగే ఉపయోగం బోధపడి మనుషులందరూ కలిసి శాంతియుత సహజీవనం కోసమై సమాజాన్ని ఏర్పాటు చేసుకున్నారని వీరి వాదన.
-థామస్ హబ్స్, జాన్లాక్, రూసోలు ముగ్గురూ ప్రాకృతిక అవస్తే సామాజిక ఒడంబడికకు కారణమని తెలిపారు.
-థామస్ హబ్స్ ప్రాకృతిక అవస్థను తెలుపుతూ The Life of man was solitary poor, nasty, brutish and short, every man was an enemy to other man అని అభిప్రాయపడ్డాడు. వీరు తన గ్రంథం లెవియాథిన్లో ప్రాకృతికావస్థ అతి దుర్భరమైనదిగా పేర్కొన్నారు.
-సామాజిక ఒడంబడిక అనే గ్రంథంలో రూసో ప్రాకృతిక వ్యవస్థలో సంతోషకరమైన జీవనాన్ని గడిపినా క్రమక్రమంగా జనాభా పెరగడంతో స్పర్థలు, కలహాలు మొదలయ్యాయని ఫలితంగా సమాజ రక్షణ కరువైందని, అందువల్ల మానవులందరూ ఉమ్మడిగా సహకార జీవనం కోసం ఒప్పందానికి వచ్చారని దీంతో సమాజం ఏర్పడిందని అభిప్రాయపడ్డారు. అందుకే రూసో మానవుడు స్వేచ్ఛాజీవిగా సర్వత్రా సంకెళ్లతో బంధింపబడ్డాడని అభిప్రాయపడ్డాడు. GO BACK TO NATURE అనే నినాదాన్ని ఇచ్చారు.
-ఆర్థికవేత్త ఆడమ్‌స్మిత్ కూడా మానవుల ఆర్థిక కోరికలు తీరడానికి ఏర్పడిన కృత్రిమ సాధనమే సమాజమని అభిప్రాయపడ్డారు.
-ఇలా మానవులు భద్రతతో కూడిన సామాజిక జీవన కోసం తమ స్వతః సిద్ధ హక్కులను వదులుకుని ఉమ్మడి ఒప్పందానికి కట్టుబడి ప్రాకృతికావస్థ నుంచి నూతన సమాజానికి పునాదులు వేశారని హబ్స్, లాక్, రూసోలు అభిప్రాయపడ్డారు.
-సామాజిక ఒప్పందం అద్భుతగాథలుగా ఉందని, థామస్ హబ్స్ చెప్పినట్టుగా ఆదిమ మానవుడు అంత దుర్భర జీవితం అనుభవించాడు. అనడం సమంజసం కాదని, బలమైన ప్రేరణ లేకుండా మృగప్రాయం నుంచి సహజీవనానికి ఎలా మారాడని, ఒప్పందం ముందుతరాలకు కొనసాగిందా లేదా అని ఒప్పందంవల్ల ఏర్పడిన ఐచ్ఛిక సమాజంలో, ఒప్పందంలో చేరని వారు సమాజం కిందికి రారా అనే విమర్శలు ఈ సిద్ధాంతంపై ఉన్నాయి.
సమూహ మనస్తత్వ సిద్ధాంతం GROUP MIND THEORY
-THE GROUP MIND అనే గ్రంథంలో మెక్ డోసీల్ ఈ భావనలను తెలిపారు. ఆయన తన గ్రంథంలో సమాజానికి సామాజిక మానసిక జీవితం లేదా ప్రత్యేక వ్యక్తిత్వం ఉంటుందని అభిప్రాయపడ్డారు. సమాజం సమూహంలో వ్యక్తి తన వైయక్తిక మనస్తత్వాన్ని వదిలి సామూహిక మనస్తత్వానికి అనుగుణంగా వ్యవహరిస్తాడని తనకు వ్యతిరేకంగా ఉన్నా కూడా సమాజ మనస్తత్వాన్ని అనుకరిస్తాడని తెలిపారు.
-సామూహిక మనస్తత్వం కంటికి కనిపించదు కానీ, వ్యక్తుల ప్రవర్తనను నియంత్రించేందుకు సాధనంగా తోడ్పడుతుంది. వ్యక్తుల మనస్తత్వం కంటే సామూహిక మనస్తత్వం ఉన్నతమైనదిగా అభిప్రాయపడ్డాడు.
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?
దేశాల అనుసంధానం.. వాణిజ్య అంతఃసంబంధం
కణ బాహ్య జీర్ణక్రియ
ఇంటి పని వద్దన్నవారు.. స్వీయ శిక్షణ ఉండాలన్నవారు
జీవావరణ వ్యవస్థకు కావలసిన మూలశక్తి దారులు?
మౌజియన్ అనే గ్రీకు పదానికి అర్థం?
సమాజ మేధో కేంద్రాలు.. నాగరికతకు చిహ్నాలు