Each topic should be read analytically | ప్రతి అంశాన్ని విశ్లేషణాత్మకంగా చదవాలి
టెట్ ప్రత్యేకం..
టెట్ సైన్స్ కంటెంట్, పెడగాగీ ప్రిపరేషన్
టెట్ పేపర్ -2కు ప్రిపేరయ్యే అభ్యర్థులకు సైన్స్‌లో ఫిజికల్, బయోసైన్స్ కంటెంట్, పెడగాగీ (మెథడాలజీ)కి సంబంధించి 30 మార్కులకు ప్రశ్నలు వస్తాయి. వీటిలో 24 మార్కులు కంటెంట్, 6 మార్కులు పెడగాగీకి సిలబస్‌లో కేటాయించిన విషయం తెలిసిందే. టెట్ పరీక్షకు ఉన్న కొద్ది సమయాన్ని సమర్థవంతంగా ఉపయోగించుకోడానికి పటిష్టమైన ప్రణాళిక సిద్ధం చేసుకోవాలి. ప్రతి అంశాన్ని విశ్లేషణాత్మకంగా చదివితేనే విజయం సాధిస్తారు. టెట్‌లో సైన్స్ కంటెంట్, పెడగాగీ ఎలా చదవాలో తెలుసుకుందాం..
l పేపర్-2 కంటెంట్‌కు సంబంధించి ప్రభుత్వం ముద్రించిన 6 నుంచి 10వ తరగతి వరకు పాఠ్యపుస్తకాలు చదవాలి. ముఖ్యమైన టాపిక్స్‌లో అవసరమైతే ఇంటర్మీడియట్లో ఫిజిక్స్, కెమిస్ట్రీ, బోటనీ, జువాలజీ తెలుగు అకాడమీ పుస్తకాలు చదివితే మంచి స్కోరింగ్ రావడంతో పాటు ప్రతి అంశంలో ప్రశ్నలకు సులభంగా సమాధానం రాసే అవకాశం ఉంటుంది. మార్కెట్లో లభించే మెటీరియల్స్‌పై ఆధారపడకుండా ఆయా అంశాలను చదివి స్వయంగా నోట్స్ తయారు చేసుకోవాలి. ఈ అంశాలు ‘టీఆర్టీ’కి కూడా వందశాతం ఉపయోగపడుతాయి.
l కంటెంట్ చదివే సమయంలో 6 నుంచి 10వ తరగతి వరకు సైన్స్పాఠ్యపుస్తకాల్లో రిలేటెడ్ టాపిక్స్ ఉంటే వాటిని ముందుగా అన్వయిస్తూ చదివి సొంత నోట్స్ రాసుకోవాలి. ఇది పరీక్ష ముందు రోజు ఆయా అంశాలు చూసుకోడానికి సులభంగా ఉంటుంది. చాలామంది ఒక్కొక్క తరగతి సబ్జెక్ట్ పూర్తిచేసి మరొక తరగతిని ప్రారంభిస్తారు. కానీ ఇలా చేయడం వల్ల ఫలితం ఉండదు.
l చదివిన అంశాలన్నీ క్రమ పద్ధతిలో కృత్య వివరణగా చదువుతూ ఒక అంశానికి మరొక అంశానికి మధ్య భేదాలు, పోలికలను అన్వయించుకుంటూ అప్లికేషన్ ప్రశ్నావళి తీరులో గుర్తిస్తూ సమగ్ర సమాచారం చదివాను అనే సెల్ఫ్ కాన్ఫిడెన్స్‌తో ఉన్నప్పుడే విజయం వరిస్తుంది.
l ఫిజికల్ సైన్స్‌లో మన విశ్వంలోని ప్రతి అంశాన్ని గుర్తుంచుకోవడంతో పాటు వాటిని ప్రాధాన్య అంశాలైన నక్షత్రాలు, గ్రహాలను గుర్తు పెట్టుకోవాలి. ధ్వని, విద్యుత్, కాంతి, ఉష్ణం చాప్టర్లలోని ముఖ్య భావనలు, శాస్త్రవేత్తలు, ఆవిష్కరణలపై పట్టు సాధించాలి. అదే విధంగా మూలకాల వర్గీకరణలోని పరమాణు సంఖ్యలు, ఎలక్టాన్ విన్యాసాలు, రసాయన బంధాలను గుర్తుంచుకోవాలి.
l బయాలాజికల్ సైన్స్‌లో జంతు, వృక్ష కణాల్లోని భేదాలు, పోలికలు వాటిలోని శాస్త్రవేత్తల పేర్లను గుర్తుంచుకోవాలి. జీవశాస్త్రంలో జీవ ప్రపంచం, సూక్ష్మజీవుల ప్రపంచం, జీవశాస్త్రంలో ఆధునిక పోకడలు, జంతు ప్రపంచం, పర్యావరణం పాఠ్యాంశాలతో పాటు నూతనంగా వచ్చిన మార్పులపై శ్రద్ధపెట్టాలి. వీటి నుంచి అధికంగా ప్రశ్నలు వచ్చే అవకాశాలు ఉన్నాయి.
l కంటెంట్‌కు సంబంధించి పాఠ్యపుస్తకాలు చదివి సొంత నోట్స్ తయారు చేసుకోవాలి. దీన్ని పలు పర్యాయాలు చదవడం పూర్తయితే రిఫరెన్స్ కోసం ఇతర మెటీరియల్‌ను ప్రిపరేషన్‌కు ఉపయోగించుకోవాలి.
l మాక్ టెస్టులు (ప్రాక్టీస్ టెస్టులు) రాయడం వల్ల ప్రిపరేషన్లోని లోటుపాట్లను గుర్తించి, సరిదిద్దుకునేందుకు వీలుంటుంది.
l పెడగాగీల విషయంలో ఫిజికల్ సైన్స్, బయోసైన్స్‌లో ‘బోధన అభ్యసన శాస్త్రం’లోని అంశాలను పరిశీలిస్తే రెండు అంశాల్లోని సిలబస్ దాదాపు దగ్గరగా ఉంటుంది. కంటెంట్‌లోని పాఠ్యాంశాలకు అనాలసిస్‌తో వ్యవస్థీకరించిన జ్ఞానం, తార్కిక ఆలోచనలతో ప్రిపరేషన్ సాగించాలి. ముఖ్యంగా ఆయా సబ్జెక్టులకు సంబంధించి బోధన ఉద్దేశాలు, విద్యాప్రణాళిక, ఎన్సీఎఫ్-2005, ఎస్సీఎఫ్-2011, బోధనోపకరణాలు, మూల్యాంకనం, సీసీఈ తదితర పాఠ్యంశాలపై ఎక్కువగా ప్రశ్నలు గత టెట్‌లో వచ్చాయి. కాబట్టి బీఈడీ స్థాయిలో తెలుగు అకాడమీ పుస్తకాలు ప్రిపరేషన్‌కు ఉపయోగించుకోవాలి.
l పెడగాగీ విషయంలో పాఠశాల విద్యాశాఖ ప్రతి సంవత్సరం ఉపాధ్యాయులకు ఇచ్చే వృత్యంతర శిక్షణలకు అందించే మాడ్యూల్స్‌ను చదివితే అధిక మార్కులు సాధించే అవకాశాలుంటాయి.
l గత టెట్ పేపర్లను పరిశీలిస్తే ఏ స్థాయిలో ప్రశ్నలు ఎలా అడుగుతున్నారనేది అర్థమవుతుంది. చదివిన అంశాలను స్నేహితులతో చర్చిస్తే బాగా గుర్తుంటాయి.
l గత టెట్‌లో ప్రశ్నలు కాస్త క్లిష్టంగా ఉన్నాయి. ఆయా అంశాల్లో బేసిక్స్ కంటే అప్లికేషన్స్ వంటి వాటిపై ప్రత్యేక అధ్యయనం చేయాలి.
పెడగాగీ
1. డెఫినేషన్, నేచర్ స్ట్రక్చర్ అండ్ హిస్టరీ ఆఫ్ సైన్స్ (Definition, Nature, Structure and History of Science)
2. సైన్స్ బోధన లక్ష్యాలు, విలువలు, బోధనాలక్ష్యాలు, సైన్స్‌లో విద్యాప్రమాణాలు (Aims, Values, Instructional Objectives of teaching Science and Academic Standards in Science)
3. సైన్స్ బోధన పద్ధతులు
(Methods of Teaching Science)
4. టీచింగ్ సైన్స్‌లో ఇన్స్ట్రక్షన్ మెటీరియల్స్- సైన్స్‌లో టీఎల్ఎం (Instructional Material in Teaching Science- TLM in Science)
5. బోధనా ప్రణాళిక
(Instructional Planning)
6. సైన్స్ ల్యాబ్ (Science Laboratory)
7. సైన్స్ టీచర్- పాత్రలను మార్చడం (Science Teacher- Changing Roles)
8. సైన్స్ కరిక్యులమ్, ట్రాన్స్లేషన్, ఎన్సీఎఫ్- 2005, ఎస్సీఎఫ్-2011 (Scie nce Curriculum and its transa ction, NCF-2005, SCF-2011)
9. కొత్త సైన్స్ పాఠ్యపుస్తకాలు
(New Science Textbooks)
10. మూల్యాంకనం- సీసీఈ- ఫార్మేటివ్ అసెస్మెంట్, సమ్మేటివ్ అసెస్మెంట్, డిజైనింగ్, అడ్మినిస్ట్రేషన్- స్కోలాస్టిక్ అచీవ్మెంట్ టెస్ట్ (శాట్) (Evaluation- CCE – Formative Assessment, Summa tive Assessment- Designing and Administration- Analysis of Scholastic Achievement Test (SAT)).
Scholastic Achievement Test (SAT)).
l సైన్స్ కంటెంట్ (ఫిజికల్స్ సైన్స్, బయోసైన్స్ కలిపి) 24 మార్కులకు ప్రశ్నలుంటాయి. అప్లికేషన్ మెథడ్స్‌లో కంటెంట్‌ను చదవాలి. సిలబస్‌లోని అంశాలు..
బయాలాజికల్ సైన్స్
11. నిత్య జీవితంలో జీవశాస్త్ర ప్రాధాన్యం (Its importance in everyday life)
12. సజీవప్రపంచం – లక్షణాలు
(Living World – Characteristics)
13. వృక్షప్రపంచం (Plant World)
14. జంతు ప్రపంచం (Animal World)
15. సూక్ష్మజీవులు (Microbes)
16. మన పర్యావరణం
(Our Environ ment)
17. జీవశాస్త్రంలో ఆధునిక ధోరణులు (Recent trends in Biology)
భౌతిక శాస్త్రంలో..
1. సహజ వనరులు- గాలి, నీరు
(Natural Resources- Air, Water)
2. మన విశ్వం (Our Universe)
3. సహజ దృగ్విషయాలు
(Natural Phenomenon)
4. యాంత్రిక శాస్త్రం
(Mechanics- Kinematics,
Dynamics)
5. అయస్కాంతం, విద్యుత్
(Magnetism and Electricity)
6. మన చుట్టూ ఉన్న పదార్థం
(Matter around us)
7. రసాయన చర్యలు – సమీకరణాలు
(Laws of Chemical Combi nation and Chemical Calculations)
8. పరమాణు నిర్మాణం
(Atomic Structure)
9. మూలకాల వర్గీకరణ, రసాయన బంధం (Periodic Classification and Chemical Bonding)
10. లోహసంగ్రహణ శాస్త్రం (Metallurgy)
చదవాల్సిన పుస్తకాలు
l కంటెంట్‌కు 6 నుంచి 10వ తరగతి వరకు ప్రభుత్వ పాఠ్యపుస్తకాలు.
l కొన్ని అంశాలకు ఇంటర్మీడియట్ స్థాయి బుక్స్ (ముఖ్యంగా ఉష్ణం, విద్యుత్, అయస్కాంతం, మూలకాల వర్గీకరణలు, వృక్ష, జంతుకణం, జీవప్రపంచం, జీవశాస్త్రంలో ఆధునిక అంశాలపై).
l తెలంగాణ ప్రభుత్వ పాఠ్య పుస్తకాలు చదవడం ముగిస్తే ఆయా అంశాల్లో ఎన్సీటీఈ పాఠ్య పుస్తకాలు చదవాలి.
l పెడగాగీ (మెథడాలజీ)కి కచ్చితంగా డీఈడీ, బీఈడీకి సంబంధించి రెండేండ్ల కోర్సుకు సిలబస్ తెలుగు అకాడమీ బోధన అభ్యసన శాస్త్రం చదవాలి.
l అందుబాటులో ఉంటే ప్రభుత్వ ఉపాధ్యాయులకు ప్రతి సంవత్సరం అందించే వృత్యంతర శిక్షణ మాడ్యూల్స్ (వీటిలో బోధన లక్ష్యాలు, టీఎల్ఎం, బోధన పద్ధతుల టాపిక్స్ ఉపయోగపడుతాయి) చదవాలి.
-బొడ్డుపల్లి రామకృష్ణ
అసిస్టెంట్ ప్రొఫెసర్
డీవీఎం కాలేజ్ ఆఫ్ ఎడ్యుకేషన్
నల్లగొండ
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
తాత్వికతను తెలిపేది.. రాజ్యాంగానికి గుండెలాంటిది
ఎలకానిక్ రికార్డులు.. ప్రాథమిక సాక్ష్యాలు
శుక్రకణాలు తాత్కాలికంగా నిల్వ ఉండే ప్రాంతం?
సెకండరీ ఎడ్యుకేషన్ కమిషన్‌కు మరోపేరు?
‘వెయ్యి ఉరిల మర్రి’ గా పేరుగాంచిన ఊడలమర్రి ఏ జిల్లాలో ఉంది?
రక్షణ దుర్గాలు – నాటి పాలనా విభాగాలు
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?