అంతర్జాతీయ న్యాయస్థానంలో భారత్ స్థానమేంటి?
అంతర్జాతీయ న్యాయస్థానాన్ని 1945లో ఏర్పాటు చేశారు. దీన్ని ప్రధాన కార్యాలయం నెదర్లాండ్స్‌లోని ది హేగ్‌లో ఉన్నది. అధ్యక్షుడు, ఉపాధ్యక్షుడు (పదవీకాలం మూడేండ్లు), 15 మంది న్యాయమూర్తులు (పదవీకాలం 9 ఏండ్లు) ఉంటారు. న్యాయమూర్తులు సాధారణ సభ, భద్రతామండలి చేత ఎన్నికవుతారు. ప్రతి మూడేండ్లుకు 1/3 వంతు మంది పదవీ విరమణ చేస్తారు.
అధికార భాషలు ఇంగ్లిషు, ఫ్రెంచ్. అంతర్జాతీయ న్యాయస్థానంలో పనిచేసిన భారతీయ న్యాయమూర్తులు సర్ బెనగల్ నర్సింగరావు (1952-53) నాగేంద్రసింగ్ (1973-88), రఘునందన్ స్వరూప్ పాథక్ (1989-1991), దల్వీర్ భండారి (2012-18). దల్వీర్ భండారి తిరిగి ఎన్నికయ్యారు. ఆయన 2018 నుంచి 2027 వరకు న్యాయమూర్తిగా కొనసాగనున్నారు. అంతర్జాతీయ న్యాయస్థానం ఉపాధ్యక్షుడిగా నాగేంద్రసింగ్ 1976 -1979, అధ్యక్షుడిగా 1985-88 వరకు పనిచేశారు. అంతర్జాతీయ న్యాయస్థానం ప్రస్తుత అధ్యక్షుడు రోని అబ్రహం (ఫ్రాన్స్), ఉపాధ్యక్షుడు అబ్దులఖ్వీ యూసుఫ్.
దొండో కేశవ్ కార్వే (1858- 1961)
- కార్వే గొప్ప విద్యావేత్త. 1892లో పుణెలో ఫెర్గూసన్ కళాశాలలో ఆచార్యుడిగా పనిచేశారు.
- 1893లో వితంతు వివాహం చేసుకున్నాడు. వితంతు వివాహ సమాజాన్ని స్థాపించాడు.
- 1896లో హిందూ వితంతు భవనం(HINDU WIDOW HOME) ప్రారంభించాడు.
- పునర్వివాహం చేసుకున్న స్త్రీలకు కలిగే సంతానం కోసం ఒక వసతి గృహం ప్రారంభించాడు.
- 1916లో భారతీయ మహిళా విశ్వవిద్యాలయాన్ని ప్రారంభించాడు. 1932లో ఆ విశ్వవిద్యాలయానికి వీసీ అయ్యాడు.
- విరాళాలు వసూలు చేసి 50 గ్రామాలలో ప్రాథమిక విద్యను బోధించడానికి స్వచ్ఛందంగా పాఠశాలలను ప్రారంభించాడు.
- సాంఘిక సంస్కరణోద్యమానికి కార్వే చేసిన విశిష్ఠ సేవలను గుర్తించి ప్రభుత్వం 1958లో భారతరత్న బిరుదునిచ్చి సత్కరిచ్చింది.
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?
దేశాల అనుసంధానం.. వాణిజ్య అంతఃసంబంధం
కణ బాహ్య జీర్ణక్రియ
ఇంటి పని వద్దన్నవారు.. స్వీయ శిక్షణ ఉండాలన్నవారు
జీవావరణ వ్యవస్థకు కావలసిన మూలశక్తి దారులు?
మౌజియన్ అనే గ్రీకు పదానికి అర్థం?
సమాజ మేధో కేంద్రాలు.. నాగరికతకు చిహ్నాలు