విద్యార్థుల ఆలోచనలకు, ఊహలకు తావులేని పద్ధతి..
పద్యబోధన
- పద్యబోధన పరమ లక్ష్యం- రసానుభూతిని పొందడం.
- ఉపాధ్యాయుడికి ఉండవలసిన ముఖ్య లక్షణం- రసాస్వాదన శక్తి
కావ్యం – నిర్వచనాలు
- వామనుడు (కావ్యాలంకార సూత్ర వృత్తి): ‘గుణములతో ఏర్పడే రీతి కావ్యాత్మ అని, అలంకారాలు తత్సౌందర్య పోషకాలు’
- ‘గుణాలంకార యుక్తములైన శబ్దర్థాలు కావ్యం’
- అభినవ గుప్తుడు (అభినవ భారతి): శబ్దమే కావ్య శరీరం, కవనీయ కావ్యం.
- కాళిదాసు (రఘువంశం): వాగర్థా వివ సంపృక్తౌ
- భరతుడు (నాట్యశాస్త్రం): ‘కావ్యానికి ఇతివృత్తం శరీరమని రసం తత్సౌందర్య హేతువు’
- నన్నయ్య (ఆంధ్ర శబ్ద చింతామణి): విశ్వశ్రేయ : కావ్యమ్.
- భామహుడు (కావ్యాలంకారం): సహితములైన శబ్దర్థాలు కావ్యం.
- మమ్మటుడు (కావ్య ప్రకాశం): లోకోత్తర వర్ణనా నిపుణుడైన కవికర్మ కావ్యం.
- అదోషణములు, సుగుణములు, సాలంకారములైన శబ్దర్థాలు కావ్యం.
- జగన్నాథ పండితరాయలు (రసగంగాధరం): రమణీయార్థ ప్రతిపాదిక శబ్దఃకావ్యం.
- విశ్వనాథుడు (సాహిత్య దర్పణం): వాక్యం రసాత్మకం కావ్యం.
- భోజరాజు (సరస్వతి కంఠాభరణం, శృంగార ప్రకాశిక): నిర్దోషము, గుణాలంకార రసవంతమగు వాక్యం కావ్యం.
- పీయూష వర్షుడు: గుణాలంకార రీతి, రసోపేతమయిన సాధు శబ్దార్థ సందర్భం కావ్యం.
- కేశవ మిత్రుడు (అలంకార శేఖరం): రసాలంకార యుక్తం, సుఖ విశేష సాధనం అయినది కావ్యం.
- పీబీ షెల్లీ: భావనా వ్యక్తీకరణమే కవిత్వం.
- వర్డ్స్ వర్త్ (Poetry is the spontaneous over flow of powerfull feelings): శక్తిమంతమైన భావాలు సహజంగా ఉప్పొంగుటయే కవిత్వం.
- కార్లయిల్ (Poetry we will call musical thought): మధురమైన భావమే కవిత్వం.
- కుంతకుడు (వక్రోక్తి జీవితం): వక్రోక్తి కావ్య జీవితమ్ (వక్రోక్తియే కావ్య జీవితం)
- భర్తృహరి: సుకవితా యద్యస్తి రాజ్యేన కిమ్.
- ఆనంద వర్ధనుడు (ధ్వన్యాలోకం): కావ్యాస్యాత్మ ధ్వని (కావ్య శరీరానికి ఆత్మ ధ్వని)
- శౌద్ధోధని: రసాదిమద్ వాక్యం కావ్యం (రసాదులు గల వాక్యమే కావ్యం)
- విద్యాధరుడు (ఏకావళి): కవయతీతి కవి: తస్య కర్మ:కావ్యమ్ (వర్ణించేవాడు కవి అతని కర్మే కావ్యం)
- కాల్రిడ్జ్: రమణీయమైన పదాలు, రమణీయమైన వరుస క్రమంలో కూర్చడం కవిత్వం (Poetry is the best words in Best order)
పద్య బోధన-ఉద్దేశాలు
- ఆనందానుభూతి, రసానుభూతి పొందేటట్లు చేయడం.
- సాహితీ విలువలు తెలిపి హృదయ వైశాల్యాన్ని తెలపడం.
- భాషాజ్ఞానాన్ని , సాహిత్య జ్ఞానాన్ని పెంపొందించడం.
- విద్యార్థుల్లో అంతర్లీనంగా ఉన్న సృజనాత్మక శక్తిని వెలికి తీయడం.
- రచనాకాలం, నాటి పరిస్థితులు, విశ్వాసాలు, సంస్కృతి సభ్యతలను తెలపడం.
- ఉదాత్త భావాలు, ఉత్తమ విలువలను స్థాపించడం.
- సంపూర్ణ మూర్తిమత్వాభివృద్ధికి దోహదం చేయడం.
- కావ్య విమర్శనాశక్తిని అభివృద్ధి పరచడం.
- సముచిత మనోవైఖరులను పెంపొందించడం.
పద్యపాఠాలు-రకాలు
- ప్రాచీన పద్యం
- ఆధునిక పద్యం
- కథాకావ్యం
- గేయం
- రుబాయి
- గజల్
- అనువాద కవిత
- పేరడి
- వచన కవిత
- ముత్యాలసరం
- నవ రసాలు
- భరతుని ‘నాట్యశాస్త్రం’లోని అష్టరస నిర్వచనానికి శాంతరసాన్ని చేర్చి ఉద్భటుడు ‘కావ్యాలంకారసార సంగ్రహం’లో నవరసాలను మొదటిసారి ఇలా చెప్పాడు.. ‘శృంగార హాస్య కరుణా రౌద్ర వీర భయానకః బీభత్సాద్భుత శాంతాశ్చ నవనాట్యే రసాఃస్మృతా’
పద్యబోధన పద్ధతులు
ముర్రే ‘ఒక పద్యంలో ఉద్దిష్టాలయిన ఆవేశాలు మనలో తిరిగి మొలకెత్తితేగాని, ఆ భావానుభూతిని పొందితేగాని దాన్ని మనం అవగతం చేసుకున్నామనడానికి వీలులేదు.
పూర్ణ పద్ధతి
- ఎంపిక చేసుకున్న పద్య పాఠ్యాంశాన్ని ఏకాంశంగా భావించి బోధించే పద్ధతిని పూర్ణపద్ధతి అంటారు.
- కవి కొన్ని సందర్భాల్లో సంపూర్ణ భావాన్ని రెండు మూడు పద్యాల్లో చెప్పి ఉండవచ్చు. అప్పుడు ఆ పద్యాలన్నింటిని ఏకాంశంగా గ్రహించి బోధించడం పూర్ణపద్ధతి.
- పీరియడ్ వ్యవధికి అనువుగా ఎంపిక చేసుకుని బోధించే పద్ధతి.
- Proceed from whole to parts అనే సూత్రంపై ఆధారపడిన పద్ధతి.
- ‘ఛేదించినప్పుడు పుష్ప సౌందర్యం ఎలాగైతే అదృశ్యమయిపోతుందో అలాగే సాహిత్య పుష్పముల విషయంలో కూడా’.
- పూర్ణపద్ధతిలో బోధిస్తున్నప్పుడు ఏకాంశంగా తీసుకున్న పద్యభావాన్ని స్థూలంగా పరిచయం చేయాలి. అంటే పద్యంలో ఎవరు, ఎవరితో, ఏ సందర్భంలో దేనిని గురించి ప్రస్తావిస్తున్నారో తెలిసేలా చేయాలి.
- అప్పుడే అధ్యయనం స్పష్టంగా, సులభంగా ఆసక్తికరంగా సాగుతుంది.
- పద్యంలో వారు నేర్చుకోబోయే అంశాన్ని పరిచయం చేసి ఆ తర్వాత వివరంగా అన్ని అంశాలను గురించి బోధన నిర్వహించాలి.
- ప్రతి పదానికి అర్థం చెప్పకుండా పద్య భావానికి, సౌందర్యానికి ప్రాధాన్యం ఇచ్చే పద్ధతి.
- పద్యబోధన పరమ లక్ష్యమైన ఆనందానుభూతి, రసానుభూతి పొందడానికి ఉత్తమ పద్ధతి.
- ఆధునిక, అనుసరణీయమైన పద్ధతి అయిన పూర్ణపద్ధతి అనేక బోధనా వ్యూహాలను ఇముడ్చుకుని ఉంటుంది.
- పద్యంలోని శబ్ద చమత్కారాన్ని, అర్థ చమత్కారాన్ని విద్యార్థులే గ్రహించి చెప్పేందుకు తగిన సన్నివేశాలు కల్పించాలి.
- కఠిన పదాలకు అర్థాలను ప్రత్యక్షంగా చెప్పకుండా వాక్యప్రయోగాల ద్వారా విద్యార్థుల నుంచే రాబట్టాలి.
- వ్యాకరణాంశాలు (సంధులు, సమాసాలు, పదస్వభావం) ఉదాహరణ పద్ధతిలో, పూర్వగాథా విశేషాంశాలను విద్యార్థులే స్వయంగా తెలుసుకునేలా సహాయం చేయాలి.
- ఉన్నత తరగతులకు ఉత్తమమైనది.
ఖండ పద్ధతి
- పూర్ణ పద్ధతికి భిన్నమైనది.
- పద విభజన చేస్తూ ప్రతి పదానికి అర్థం చెబుతూ, పదస్వరూప స్వభావాలను తెలుపుతూ, వివరిస్తూ సాగే
- పద్యబోధన పద్ధతిని ‘ఖండ’ పద్ధతి అంటారు.
- పద్యాన్ని ఖండాలుగా చేసి చెప్పడం రసాస్వాదనకు అనుకూలం కాదు.
- ఉపాధ్యాయుడు బోధిస్తున్నప్పుడు విద్యార్థులు శ్రోతలుగా ఉంటారు.
- విద్యార్థి భాగస్వామ్యానికి అవకాశం లేని సాంప్రదాయక పద్యబోధన విధానం.
- పద్యబోధనలో అనుసరించదగ్గ పద్ధతి కాదని మనోవిజ్ఞాన శాస్త్రవేత్తలు, విద్యావేత్తల అభిప్రాయం.
పఠన పద్ధతి
- ఉపాధ్యాయుడు పద్య పాఠ్యాంశాన్ని ఒకటి, రెండు సార్లు ఆదర్శ పఠనం చేసి కొందరు విద్యార్థుల ద్వారా ప్రకాశ పఠనం చేయించే పద్ధతి- పఠన పద్ధతి.
- ‘Poetry must be read not taught’ పద్యాన్ని చదవాలి బోధించకూడదని చెప్పే పద్ధతి.
పద్యం/ రచనలోని అంతస్సంగీతాన్ని లయాత్మకంగా రాగ, తాళ యుక్తంగా, శ్రావ్యంగా, భావస్పోరకంగా వెలువరించడం వల్ల విద్యార్థుల్లో రసానుభూతి కలుగుతుంది. - పద్య బోధన ఉద్దేశాలను ఈ పద్ధతి ద్వారా సాధించలేం.
- పూర్ణ పద్ధతితో సమన్వయించి అనుసరించదగిన గొప్ప ప్రభావవంతమైన వ్యూహం.
- పఠన పద్ధతి అనడం కంటే పఠన విధానం అనవచ్చు.
ప్రతి పదార్థ పద్ధతి
- ఉపాధ్యాయుడు పద్యాన్ని చదివి, పద విభాగం చేసి, అన్వయక్రమాన్ని ఏర్పరిచి ప్రతిపదానికి అర్థం చెప్పే సందర్భంలోనే సమాస, విగ్రహ వాక్యాలు, సంధికార్యాలు బోధించి ఆ తర్వాత పద్య తాత్పర్యం చెప్పే పద్ధతి.
- విద్యార్థులు కేవలం శ్రోతలుగా ఉండే పద్ధతి.
- ఆనందానుభూతి, రసానుభూతి సాధించలేం.
- విద్యార్థుల ఆలోచనలు, ఊహలకు తావులేని పద్ధతి.
- పూర్ణపద్ధతికి ఆటంకం కలిగించే పద్ధతి.
తాత్పర్య పద్ధతి
- మాతృభాషేతర సాహిత్య బోధనలో అనుసరించవలసిన పద్ధతి.
- పద్యాన్ని చదివి వినిపించి, తాత్పర్యాన్ని తెలిపి, తిరిగి దాన్ని విద్యార్థులతో చెప్పించే పద్ధతి.
- ఉపాధ్యాయుడు పద్యాన్ని చదివి దానిలోని ప్రధాన సారాన్ని మాత్రమే చెప్పడం- సారాంశ పద్ధతి.
ప్రతిపదార్థ తాత్పర్య పద్ధతి
- ప్రతిపదార్థ-తాత్పర్య పద్ధతుల సమాహార పద్ధతి.
- పాఠశాలలో అనుసరించదగిన పద్ధతి కాదు.
ప్రశంసా పద్ధతి
- ఉపాధ్యాయుడు పద్యబోధనలో చర్చను నిర్వహించేటప్పుడు విద్యార్థుల నుంచి రాబట్టడానికి వీలుకాని ధ్వని విశేషాలు, రచనా చమత్కారాలు, రసపోషణ, అలంకార విశిష్టత మొదలైన అంశాలను విద్యార్థులకు విశదీకరించి వారు వాటిని ప్రశంసించేటట్లు చేస్తూ అందులో లీనమయ్యేటట్లు చేయడమే ప్రశంసా పద్ధతి.
- విద్యార్థుల్లో కవుల పట్ల గౌరవాదరాభిమానాలను, సాహిత్యాభిరుచి పెంపొదించడానికి ఉపకరించే పద్ధతి.
పూర్ణ పద్ధతిలో భాగం.
ప్రశ్నోత్తర పద్ధతి
- ఉపాధ్యాయుడు పాఠ్యాంశాన్ని కేంద్రంగా గ్రహించి విషయానుక్రమంగా విద్యార్థుల నుంచి సమాధానాలను రాబట్టే పద్ధతి.
- ఆలోచనా శక్తి, అవగాహన శక్తి, భాషణా శక్తి ఈ పద్ధతి వల్ల పెంపొందుతాయి.
- పాఠశాల స్థాయిలో అన్ని రకాల పాఠ్యాంశాల బోధనలో ఈ పద్ధతిని వినియోగిస్తారు.
- విద్యార్థులకు ఆసక్తికరంగా ఉంటుంది.
- అలసట, విసుగు కలగని పద్ధతి.
- బోధనాభ్యాసన కృత్యాలతో విద్యార్థుల భాగస్వామ్యాన్ని ప్రోత్సహిస్తుంది.
- పూర్ణ పద్ధతిలో భాగం.
చర్చా పద్ధతి
- విద్యార్థులు తమలో తాముగాని లేదా ఉపాధ్యాయుడు విద్యార్థులు కలిసి పాఠ్యాంశాన్ని గురించి సమగ్రంగా మాట్లాడుకోవడమే చర్చా పద్ధతి.
- ఉపాధ్యాయుడు చర్చను ప్రారంభించి చివరలో సాధారణీకరణం చేయాలి.
- పద్య పాఠ్యాంశ బోధనలో చర్చ అతి ముఖ్యమైనది. ఇది అన్ని బోధనా లక్ష్యాల సాధనకు దారితీస్తుంది.
- చర్చ నిర్వహణ ఉపాధ్యాయుడి సమయస్ఫూర్తి, బోధనోపకరణాల వినియోగ నైపుణ్యం, వివరణ నైపుణ్యాలను పట్టి చూపుతుంది.
- తరగతి బోధనలో భాగంగా నిర్వహించే చర్చ ప్రశ్నోత్తర పద్ధతిలో సాగుతుంది.
- స్వేచ్ఛగా, నిస్సంకోచంగా తమ భావాలను వెలువరించే పద్ధతి.
రసం స్థాయిభావం కలిగే మనోవికాసం
- శృంగారం-రతి -స్త్రీ, పురుష సంయోగానికి సంబంధించిన కోరిక
- హాస్యం -హాసం -నవ్వు పుట్టించే వస్తువులను, దృశ్యాలను చూసినప్పుడు కలిగే మనోవికాసం
- కరుణం-శోకం-ఇష్టానికి వ్యతిరేకం జరిగేటప్పుడు కష్టాల్లో బాధ కలిగేటప్పుడు కలిగే దుఃఖం
- రౌద్రం-క్రోధం-శత్రువులను తుదముట్టించాలనే కోరిక/ప్రయత్నం
- వీరం-ఉత్సాహం-అసాధ్యమైన కార్యాలను సాధించడానికి నడుం బిగించడం
- భయానకం-భయం-భయంకరమైన రౌద్ర దృశ్యాలను చూసినప్పుడు లేదా విన్నప్పుడు కలిగే రోత
- అద్భుతం-విస్మయం-అపూర్వమైన దృశ్యాలను చూసినప్పుడు కలిగే దిగ్భ్రాంతి
- శాంతం-శమం-విరక్తి భావం కలిగినప్పుడు మనస్సులో వికారాలు అణగిపోయి ఊరట కలగడం
- ప్రేమ-(ప్రేయోరసం) స్నేహం-రుద్రటుడు
- వత్సల-వాత్సల్యం-విశ్వనాథుడు
- మాయ-మిథ్యాజ్ఞానం -భానుదత్తుడు
- భక్తి -భగవద్రతి-రూపగోస్వామి, మధుసూదన సరస్వతి
Previous article
జంతువుల ప్రవర్తనను అధ్యయనం చేసే శాస్త్రం ఏది?
Next article
సమస్యా పరిష్కార పద్ధతిలో సోపానం కానిది?
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?
దేశాల అనుసంధానం.. వాణిజ్య అంతఃసంబంధం
కణ బాహ్య జీర్ణక్రియ
ఇంటి పని వద్దన్నవారు.. స్వీయ శిక్షణ ఉండాలన్నవారు
జీవావరణ వ్యవస్థకు కావలసిన మూలశక్తి దారులు?
మౌజియన్ అనే గ్రీకు పదానికి అర్థం?
సమాజ మేధో కేంద్రాలు.. నాగరికతకు చిహ్నాలు