జంతువుల ప్రవర్తనను అధ్యయనం చేసే శాస్త్రం ఏది?
జీవశాస్త్ర శాఖలు
జీవుల (మొక్కలు, జంతువులు) గురించిన అధ్యయనాన్ని జీవశాస్త్రం అంటారు. జీవశాస్త్ర అధ్యయనాన్ని సరళతరం చేయడం కోసం దాన్ని వివిధ విభాగాలుగా విభజించారు. వీటిలో కొన్నింటి గురించి తెలుసుకుందాం.
- వృక్షశాస్త్రం (Botany): ఇది వృక్షాల గురించిన అతిపెద్ద విభాగం.
- జంతుశాస్త్రం (Zoology): ఇది జంతువుల గురించిన పెద్ద విభాగం.
- వర్గీకరణ శాస్త్రం (Taxonomy): సిద్ధాంతరీత్యా, ఆచరణరీత్యా జీవులను గుర్తించి, వాటి నామీకరణ,
- వర్గీకరణచేసే శాస్త్రం. టాక్సానమీ అనే పదాన్ని ఏపీ డి కండోల్ ప్రతిపాదించాడు.
- స్వరూపశాస్త్రం (Morphology): జీవుల (మొక్కలు, జంతువులు) రూపం, పరిమాణం, ఆకారం, వర్ణం, వాటి దేహం లోని కణ జాలాలు, అవయవాలు, అవయవ వ్యవస్థల స్వరూపాన్ని తెలిపే శాస్త్రం.
స్వరూప శాస్ర్తాన్ని రెండు రకాలుగా వర్గీకరిం చవచ్చు. అవి.. ఎ. బాహ్యస్వరూప శాస్త్రం, బి. అంతరస్వరూప శాస్త్రం. - బాహ్యస్వరూపశాస్త్రం: జీవుల బాహ్య లక్షణాలను అధ్యయనం చేసే శాస్త్రం.
- అంతరస్వరూపశాస్త్రం: జీవుల్లో వివిధ భాగాల అంతర్నిర్మాణం గురించి తెలిపే శాస్త్రం.
- అంతరస్వరూప శాస్ర్తాన్ని రెండు రకాలుగా విభజించవచ్చు. అవి.. అంతర్నిర్మాణ శాస్త్రం, కణజాల శాస్త్రం.
- అంతర్నిర్మాణ శాస్త్రం: మొక్కల్లోని భాగాలైన వేరు, కాండం, పత్రం, పుష్పంలోని అంతర్నిర్మాణం గురించి, జంతువుల దేహంలోని భాగాలైన అవయవాలు, అవయవ వ్యవస్థల అంతర్గత భాగాల అమరిక గురించి తెలిపే శాస్త్రం.
- కణజాల శాస్త్రం: జీవుల్లోని వివిధ కణజాలాల గురించి తెలియజేసే శాస్త్రం.
- కణశాస్త్రం (Cytology): కణం, కణాంగాల నిర్మాణం గురించి తెలిపే శాస్త్రం. కణాన్ని నిర్మాణాత్మకంగా కాకుండా క్రియాత్మకంగా అధ్యయనం చేసే శాస్ర్తాన్ని కణజీవశాస్త్రం (Cell biology) అంటారు.
- శరీరధర్మ శాస్త్రం (Physiology): జీవుల వివిధ అవయవాల క్రియా విధానాన్ని తెలియజేసే శాస్త్రం.
- పిండోత్పత్తి శాస్త్రం (Embryology): జీవుల పిండాభివృద్ధి గురించి తెలియజేసే శాస్త్రం.
- పరిణామశాస్త్రం (Evolution): జీవ ఆవిర్భావం, కొత్త జాతి జీవులు ఏర్పడే విధానాన్ని తెలియజేసే శాస్త్రం.
- పురాజీవశాస్త్రం (Palaeontology): జీవుల శిలాజాలను గురించి తెలియజేసే శాస్త్రం.
- జన్యుశాస్త్రం (Genetics): అనువంశికత, వైవిధ్యాల గురించి తెలియజేసే శాస్త్రం. జెనెటిక్స్ అనే పదాన్ని బేట్సన్ ప్రతిపాదించాడు.
- ఇథాలజీ (Ethology): జంతువుల ప్రవర్తనను గురించి తెలిపే శాస్త్రం. దీన్నే బిహేవియరల్ బయాలజీ అని కూడా అంటారు.
- పరాగరేణు శాస్త్రం (Palynology): సిద్ధ బీజాలు లేదా పరాగరేణువుల ఉత్పత్తి, నిర్మాణం లాంటి విషయాలను తెలిపే శాస్త్రం.
- సూక్ష్మజీవ శాస్త్రం (Microbiology): బ్యాక్టీరియా, వైరస్ మొదలైన కంటికి కనపడని జీవుల గురించిన అధ్యయనం.
- జీవసాంకేతిక శాస్త్రం (Biotechnology): జన్యుపరమైన అంశాలు, నూతన వంగడాలు, మందుల ఉత్పత్తి మొదలైన విషయాల గురించి తెలియజేసే శాస్త్రం.
- కీటక శాస్త్రం (Entomology): కీటకాలను గురించి తెలియజేసే శాస్త్రం.
- పక్షిశాస్త్రం (Ornithology): పక్షుల గురించి తెలియజేసే శాస్త్రం. భారత పక్షిశాస్త్ర పితామహుడు – సలీం అలీ.
- ఆవరణశాస్త్రం (Ecology): పర్యావరణ వ్యవస్థ గురించి తెలియజేసే శాస్త్రం.
- రోగనిర్ధారణ శాస్త్రం (Pathology): వివిధ రకాల వ్యాధుల గురించిన సమాచారం ఇచ్చే శాస్త్రం.
- శైవల శాస్త్రం (Phycology): పత్రహరితం కలిగి, స్వయం పోషితాలుగా జీవించే థాలోఫైటా మొక్కలైన శైవలాల గురించిన అధ్యయనం.
- శిలీంధ్రశాస్త్రం (Mycology): పత్రహరిత రహితమైన పరపోషితాలుగా జీవించే థాలోఫైటా మొక్కలైన శిలీంధ్రాల గురించిన అధ్యయనం.
- లైకెనాలజీ (Lichenology): ఒక శైవలం, ఒక శిలీంధ్రం పరస్పరం ఆధారపడుతూ సహజీవనం గడిపే ప్రత్యేక వర్గపు మొక్కలైన లైకెన్ల అధ్యయనం.
- బ్రయాలజీ (Bryology): వృక్ష రాజ్యపు ఉభయచరాలైన బ్రయోఫైటా మొక్కల గురించిన అధ్యయనం.
- టెరిడాలజీ (Pteridology): నాళికా కణజాల యుత పుష్పించని మొక్కలైన టెరిడోఫైటా మొక్కల గురించిన అధ్యయనం.
- వృక్ష భౌగోళిక శాస్త్రం (Phytogeography): గత కాలంలోనూ, ప్రస్తుత కాలంలోనూ భూమండలంలోని వివిధ ప్రాంతాల్లో మొక్కల వితరణ గురించిన అధ్యయనం.
- జంతుభౌగోళిక శాస్త్రం (Zoogeography): గత కాలంలోనూ, ప్రస్తుత కాలంలోనూ భూమం డలంలోని వివిధ ప్రాంతాల్లో జంతువుల వితరణ గురించిన అధ్యయనం.
ప్రాక్టీస్ బిట్స్
1. పక్షులను గురించిన అధ్యయనం ఏది?
1) హెర్పటాలజీ 2) ఆర్నిథాలజీ
3) మమ్మాలజీ 4) ఇక్తియాలజీ
2. కింది వాటిని జతపర్చండి?
ఎ. ఏపీ డి కండోల్ 1. వర్గీకరణశాస్త్ర పితామహుడు
బి. బేట్సన్ 2. టాక్సానమీ పదాన్ని ఇచ్చింది
సి. సలీం అలీ 3. భారత పక్షి శాస్త్ర పితామహుడు
డి. లిన్నేయస్ 4. జెనెటిక్స్ పదాన్ని ఇచ్చింది
1) ఎ-4, బి-2, సి-1, డి-4
2) ఎ-2, బి-4, సి-3, డి-1
3) ఎ-1, బి-3, సి-2, డి-4
4) ఎ-3, బి-1, సి-4, డి-2
3. కింది వాటిలో సరైన వ్యాఖ్య ఏది?
ఎ. కణం, కణాంగాల నిర్మాణం గురించిన అధ్యయనాన్ని కణశాస్త్రం అంటారు.
బి. కణాన్ని నిర్మాణాత్మంగానే కాకుండా క్రియాత్మకంగా అధ్యయనం చేసే శాస్ర్తాన్ని కణజీవ శాస్త్రం అంటారు.
1) ఎ మాత్రమే సరైనది
2) బి మాత్రమే సరైనది
3) ఎ, బి సరైనవి
4) ఎ, బి రెండూ సరికానివి
4. ఎ. వృక్షరాజ్యపు ఉభయచరాలు అని బ్రయోఫైటా మొక్కలను అంటారు.
బి. పత్రహరిత రహితమైన పరపోషితాలను శైవలాలు అంటారు.
1) ఎ మాత్రమే సరైనది
2) బి మాత్రమే సరైనది
3) ఎ సరైనది, బి సరికానిది
4) ఎ, బి రెండూ సరికానివి
5. నాళికా కణజాలయుత పుష్పించని మొక్కలు ఏవి?
1) థాలోఫైటా 2) బ్రయోఫైటా
3) టెరిడోఫైటా 4) లైకెన్లు
6. శైవలం, శిలీంధ్రం పరస్పరం ఆధారపడుతూ సహజీవనం గడిపే ప్రత్యేక వర్గపు మొక్కలు ఏవి?
1) లైకెన్లు 2) బ్రయోఫైటా
3) టెరిడోఫైటా 4) శిలీంధ్రం
7. పత్రహరితయుత స్వయంపోషక థాలోఫైట్స్ ఏవి?
1) శిలీంధ్రాలు 2) శైవలాలు
3) బ్రయోఫైటా 4) టెరిడోఫైటా
8. కింది వాటిని జతపర్చండి?
ఎ. పాథాలజీ 1. జంతువుల ప్రవర్తనా శాస్త్రం
బి. ఆర్నిథాలజీ 2. పక్షుల అధ్యయన శాస్త్రం
సి. పేలినాలజీ 3. పరాగరేణువుల గురించిన శాస్త్రం
డి. ఇథాలజీ 4. రోగనిర్ధారణ శాస్త్రం
1) ఎ-1, బి-2, సి-3, డి-4
2) ఎ-4, బి-3, సి-2, డి-1
3) ఎ-4, బి-2, సి-3, డి-1
4) ఎ-2, బి-1, సి-4, డి-3
9. జీవుల శిలాజాలను గురించిన అధ్యయననాన్ని ఏమంటారు?
1) పేలినాలజీ
2) పేలియంటాలజీ
3) పేలియో బోటనీ
4) పేలియో జువాలజీ
10. జీవుల ఆవిర్భావం, కొత్తజాతి జీవుల ఏర్పాటు గురించి వివరించే శాస్త్రం ఏది?
1) ఎవల్యూషన్ 2) టాక్సానమీ
3) ఎకాలజీ 4) ఇథాలజీ
సమాధానాలు
1-2 2-2 3-3 4-3 5-3 6-1 7-2 8-3 9-2 10-1
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?
దేశాల అనుసంధానం.. వాణిజ్య అంతఃసంబంధం
కణ బాహ్య జీర్ణక్రియ
ఇంటి పని వద్దన్నవారు.. స్వీయ శిక్షణ ఉండాలన్నవారు
జీవావరణ వ్యవస్థకు కావలసిన మూలశక్తి దారులు?
మౌజియన్ అనే గ్రీకు పదానికి అర్థం?
సమాజ మేధో కేంద్రాలు.. నాగరికతకు చిహ్నాలు