సమస్యా పరిష్కార పద్ధతిలో సోపానం కానిది?
లక్ష్యాలు-స్పష్టీకరణలు- విలువలు
1. ‘హృదయం పనితీరు’ పాఠ్యాంశం విన్న విద్యార్థి కర్ణికలకు- జఠరికలకు మధ్య తేడాలు తెలుపుతున్నాడు. ఈ వాక్యం?
1) లక్ష్యం 2) స్పష్టీకరణ
3) విలువ 4) ఆశయం
2. కింది వాటిలో అభిరుచికి సంబంధించిన స్పష్టీకరణ?
1) జాతీయ సమస్యలపై అభిప్రాయాలు తెలియజేయడం
2) పౌర కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొనడం
3) సాంస్కృతిక వైవిధ్యతను అభినందించడం
4) ఇతరుల అభిప్రాయాలను గౌరవించడం
3. గత నాలుగు దశాబ్దాల్లోని ఏపీ జనాభా గణాంక వివరాలను విద్యార్థి అధ్యయనం చేసి 2020లో జనాభా పెరుగుదల రేటును గణించాడు. ఈ స్పష్టీకరణ దేనికి చెందుతుంది?
1) సంశ్లేషణ 2) విశ్లేషణ
3) వ్యవస్థాపనం 4) హస్తలాఘవం
4. మూడు రాజధానుల గొప్పతనాన్ని అందరికీ అర్థమయ్యే రీతిలో సరళమైన భాష, స్పష్టమైన పద ఉచ్ఛారణతో తార్కిక క్రమంలో సమాచారాన్ని వ్యక్తపరుస్తున్న విద్యార్థిలో ఉండే నైపుణ్యం?
1) హస్తలాఘవ నైపుణ్యం
2) అభివ్యంజన నైపుణ్యం
3) నివేదనా నైపుణ్యం
4) పరిశీలనా నైపుణ్యం
5. కింది వాటిలో జ్ఞాన లక్ష్యాన్ని సూచించే ప్రశ్న?
1) మూత్రపిండం నిర్మాణాన్ని వివరించండి
2) మూత్రపిండం పటం గీసి భాగాలు గుర్తించండి
3) మానవునిలో మూత్రపిండం లేకపోవడం వల్ల జరిగే నష్టాన్ని ఊహించండి
4) మూత్రపిండం ఏ ఆకారంలో ఉంటుంది
6. సరైనది గుర్తించండి?
1) భావావేశ రంగంలో కింది స్థాయి లక్ష్యం- శీలస్థాపనం
2) మానసిక చలనాత్మక రంగంలో 2వ అత్యున్నత స్థాయి- సమన్వయం
3) జ్ఞానాత్మక రంగం ఆధిపత్య శ్రేణిలో 2వ స్థానం- సంశ్లేషణ 4) అన్నీ సరైనవే
7. అవగాహనలో ప్రవర్తనాత్మక స్పష్టీకరణ ‘ఎక్స్‌ట్రాపొలేషన్’కు ఉదాహరణ?
1) కార్యకారణ సంబంధం తెలపడం
2) అన్వయం చేయడం, వర్గీకరించడం
3) పోల్చడం, తేడాలు తెలపడం
4) నివేదించడం
8. కింది వాటిలో వైఖరిని సూచించే వాక్యం?
1) కొవిడ్ తీవ్రతపై ప్రజలను అప్రమత్తం చేయడం
2) కొవిడ్ సమయంలో డాక్టర్ల కృషిని అభినందించడం
3) ప్రయోగశాలలో కొవిడ్ వైరస్ ఉనికిని పరిశీలించడం
4) కొవిడ్ కాలంలో కొవిడ్ కేర్ సెంటర్లను సందర్శించడం
9. అభ్యాసకుడు I= PTR/100 ను శాబ్దిక ప్రవచన రూపంలోకి అనువదిస్తాడు?
1) జ్ఞానం 2) అవగాహన
3) వినియోగం 4) నైపుణ్యం
10. విద్యార్థి తాను పొందిన గణిత భావనలను తమ ఇంటి వైశాల్యం, చుట్టుకొలతను కనుగొనడంలో వినియోగించడం?
1) ప్రయోజన విలువ
2) సాంస్కృతిక విలువ
3) క్రమశిక్షణ విలువ
4) సన్నాహ విలువ
11. 100×101 అనే గుణకార సమస్యకు ఫలితం 10,000-11.000 మధ్య రావచ్చని అంచనా వేయడంలో ఇమిడి ఉన్న లక్ష్యం?
1) జ్ఞానం 2) అవగాహన
3) వినియోగం 4) నైపుణ్యం
12. బ్లాక్ హారెస్ట్ గణిత విలువల వర్గీకరణలో లేని అంశం?
1) దృక్పథాలు 2) భావనలు
3) సమాచారం 4) సామర్థ్యాలు
13. లాక్డౌన్ సమయంలో సోనూసూద్ వలస కార్మికులను సొంత రాష్ర్టాలకు తరలించి రియల్ హీరోగా కీర్తి పొందాడు. ఈ వాక్యం ఏ రంగానికి సంబంధించింది?
1) జ్ఞానాత్మక రంగం
2) భావావేశ రంగం
3) మానసిక చలనాత్మక రంగం
4) నైపుణ్యాత్మక రంగం
14. ఒక రైతు కొడుకు తన తండ్రి కష్టాన్ని చూసి తట్టుకోలేక నూతన ఆలోచనలతో తక్కువ ఖర్చుతో తక్కువ సమయంలో ధాన్యాన్ని ఆరబెట్టే పరికరాన్ని ఆవిష్కరించి తండ్రికి అప్పగించాడు. దీనిలో ఇమిడి ఉన్న బోధనా విలువ?
1) ఉపయోగిక విలువ
2) వృత్తిపరమైన విలువ
3) సిద్ధపరిచే విలువ
4) బౌద్ధిక విలువ
15. సవరించిన బ్లూమ్స్ వర్గీకరణలో అత్యున్నత స్థాయిలు వరుసగా?
1) సంశ్లేషణ, మూల్యాంకనం
2) వ్యవస్థాపనం, శీలస్థాపనం
3) సమన్వయం, సహజీకరణ
4) మూల్యాంకనం చేయడం, ఉత్పత్తి చేయడం
16. ‘చారిత్రక కట్టడాలు’ పాఠ్యాంశం విన్న విద్యార్థి ‘చార్మినార్‌ను సందర్శించి, చార్మినార్ చిత్రాన్ని అందంగా గీసి, చార్మినార్ సౌందర్యాన్ని వర్ణిస్తున్నాడు’. ఈ వాక్యంలోని లక్ష్యాలను వరుస క్రమంలో ఉంచండి?
1) నైపుణ్యం, అవగాహన, జ్ఞానం
2) అభిరుచి, వైఖరి, నైపుణ్యం
3) అభిరుచి, నైపుణ్యం, అవగాహన
4) అవగాహన, నైపుణ్యం, వినియోగం
17. ప్రాజెక్టు పనిని ఇవ్వడం ద్వారా విద్యార్థుల్లో ప్రధానంగా ఏ విలువను పెంపొందించవచ్చు?
1) సాంఘిక విలువ, సమాచార విలువ
2) వృత్తిపర విలువ, సౌందర్యాత్మక విలువ
3) సృజనాత్మక విలువ, సాంస్కృతిక విలువ
4) జాతీయ విలువ, స్థానిక విలువ
18. రంగారెడ్డి జిల్లా విస్తీర్ణతను రాష్ట్రంలోని జిల్లాల విస్తీర్ణంతో పోల్చడం?
1) జ్ఞానం 2) అవగాహన
3) వినియోగం 4) నైపుణ్యం
19. ఎన్ని’ అని ప్రశ్నించడంలో జ్ఞాన లక్ష్యం ఇమిడి ఉంది. అదే విధంగా ‘జ్ఞానేంద్రియాలు ఎన్ని? అవి ఏవి?’ అని ప్రశ్నించడంలో ఇమిడి ఉన్న లక్ష్యం ఏది?
1) జ్ఞానం 2) అవగాహన
3) వినియోగం 4) నైపుణ్యం
20. కింది వాటిలో క్రమశిక్షణ విలువను సూచించే నిర్వచనం?
1) దేశాభివృద్ధినే సాధించగల గణితం మరువరానిది- నెపోలియన్
2) హేతువాదంలో మానవ మేథస్సు స్థిరపడే మార్గం గణితం- లాక్
3) జ్యామితి బలీయమైనది, కళతో కలిస్తే దానికి ఎదురు లేదు- యూరిపిడస్
4) గణితం నాగరికతకు అద్దం వంటిది – హెగ్బెన్
సమాధానాలు
1-2 2-2 3-2 4-2 5-4 6-2 7-1 8-1 9-2 10-1 11-2 12-4 13-2 14-4 15-4 16-3 17-1 18-2 19-1 20-2
బోధనా పద్ధుతులు
1. మూలాధార పద్ధతి, సాంఘికృత ఉద్గార పద్ధతి అనేవి వరుసగా?
1) రెండూ ఉపాధ్యాయ కేంద్రితాలు
2) రెండూ విద్యార్థి కేంద్రితాలు
3) ఉపాధ్యాయ కేంద్రితం, విద్యార్థి కేంద్రితం
4) విద్యార్థి కేంద్రితం, ఉపాధ్యాయ కేంద్రితం
2. ఒక సాంఘిక శాస్త్ర ఉపాధ్యాయుడు 10వ తరగతి విద్యార్థులకు ‘స్థానిక స్వయంపాలన’ అనే పాఠ్యాంశాన్ని బోధించడానికి ముందు, గ్రామపంచాయతీ, ఆ గ్రామ సర్పంచ్ గురించిన చర్చ ప్రారంభించాడు. ఈ సన్నివేశంలో అతడు అనుసరించిన బోధనా సూత్రం?
1) సరళత- క్లిష్టతకు
2) తెలిసిన-తెలియని
3) మూర్తం- అమూర్తం
4) ప్రయోగం- సిద్ధాంతం
3. ఏప్రిల్, మే నెలల్లో కరోనా కాటుకు బలైన వ్యక్తుల వివరాలను విద్యార్థి ఒక దినపత్రిక నుంచి సేకరించి వాటిని సుదీర్ఘంగా పరిశీలించి, యథార్థాలను చెప్పగలగడం అనేది ఏ రకమైన దృక్పథం?
1) ఆగమనాత్మ దృక్పథం
2) నిగమనాత్మక దృక్పథం
3) విశ్లేషణాత్మక దృక్పథం
4) సంశ్లేషణాత్మక దృక్పథం
4. కింది వాటిలో ప్రాజెక్టు పద్ధతులను అనుసరించి బోధించే పాఠ్యాంశం?
1) త్రిభుజ ధర్మాలు అన్వేషించడం
2) జలియన్ వాలాబాగ్ దురంతం
3) కిరణజన్య సంయోగక్రియ ప్రదర్శన
4) వివిధ రకాల దుస్తులు-వాటి లక్షణాలు
5. ప్రాజెక్టుకు ‘పార్కర్’ నిర్వచనం?
1) భౌతికంగా చేయడం అనే దానిని అనుసరించే ప్రయోగాత్మకమైన సమస్యా పరిష్కరణ
2) వ్యూహరచనను యోచించడానికి విద్యా ర్థులను బాధ్యులుగా చేసే కృత్యం
3) పాఠశాలలోకి దిగుమతి చేసిన నిజ జీవిత భాగం
4) సహజ వాతావరణంలో పూర్తిచేసిన సమ స్యాత్మక కృత్యం
6.ప్రాజెక్టులకు ఉత్పత్తిదారుల రకం, వినియోగ దారుల రకం, సమస్యా రకం తర్ఫీదు రకం అనే నాలుగు విభాగాలను సూచించిన విద్యావేత్త?
1) కిల్పాట్రిక్ 2) స్టీవెన్సన్
3) జాన్‌డ్యూయి 4) ఆర్మ్‌స్ట్రాంగ్
7. సమస్యా పరిష్కార పద్ధతిలో సోపానం కానిది?
1) సమస్యను గుర్తించడం
2) సమస్యను నిర్వచించడం
3) సమస్యను బట్టీపట్టడం
4) సమాచారాన్ని సేకరించడం
8. భారతదేశం గర్వించదగ్గ గాయకుడు బాలసుబ్రమణ్యం జీవిత విశేషాలను చారిత్రక పద్ధతిలో బోధించడానికి ఉపయోగించవలసిన ఉపగమం?
1) ఉపఖ్యానకం 2) జీవిత చరిత్ర
3) పరిణామ ఉపగమం
4) సాంఘిక ఉపగమం
9. ‘ఏపీ అభివృద్ధికి మూడు రాజధానులు అవసరం’ బోధించడానికి ఉత్తమ పద్ధతి?
1) ప్రకల్పనా పద్ధతి
2) కృత్యాధార పద్ధతి
3) వాద-సంవాద పద్ధతి
4) కథా కథన పద్ధతి
10. విద్యార్థి తనకు కలిగిన సందేహాలను ప్రశ్నల ద్వారా వ్యక్తం చేసి, సమాచారాన్ని సేకరించడం విచారణాధార ఉపగమంలోని ఏ ప్రక్రియను సూచిస్తుంది?
1) అడుగుట 2) అన్వేషించుట
3) సృష్టించుట 4) చర్చించుట
11. కింది వాటిలో బోధనా పద్ధతికి వ్యతిరేక భావన?
1) ఆశించిన లక్ష్యాలు సాధిస్తుంది
2) దీర్ఘకాలిక స్మృతికి దారితీస్తుంది
3) అభ్యసనాన్ని అసంపూర్ణం చేస్తుంది
4) అభ్యసనలో విసుగు తొలగిస్తుంది
12. పెద్దవిగా ఉన్న సమస్యలు ఇచ్చినప్పుడు విద్యార్థులకు అవగాహన పరచడానికి, సమస్యను పోలిన మరో చిన్న సమస్యను విద్యార్థులకు పరిచయం చేసి తద్వారా అసలు సమస్యను పరిష్కరింపచేయడం అనేది ఏ నిర్దిష్ట పద్ధతిని అనుసరిస్తుంది?
1) పునఃప్రవచన పద్ధతి
2) విశ్లేషణ పద్ధతి
3) సాదృశ్యాల పద్ధతి
4) చిత్రీకరణ పద్ధతి
13. వ్యాఖ్యానాల సముదాయం మౌఖికంగా గాని, లిఖితంగా గాని ఉండి విభిన్న భావాలను దృక్పథాలను అందించే చర్చా విధానం?
1) సెమినార్ 2) సింపోజియం
3) కార్యశిబిరం 4) మెదడుకు మేత
14. ప్రధాని మోదీ శంకుస్థాపన చేసిన అయోధ్య రామమందిర నిర్మాణానికి ఉపయోగించిన బంగారు ఇటుక?
1) భౌతిక వనరు 2) లిఖిత వనరు
3) అలిఖిత వనరు 4) నిర్మాణ వనరు
15. కిరణజన్య సంయోగ క్రియలో వివిధ కారకాలను నిరూపించడానికి చేసే ప్రయోగం చాలా పెద్దదైనప్పుడు ఒకే విద్యార్థి దానిని ఒక్కసారిగా నిర్వహించలేనట్లయితే ఉపయోగించే ప్రయోగ పద్ధతి?
1) జట్టు పద్ధతి
2) క్లాస్ ఫ్రంట్ పద్ధతి
3) భాగాల పద్ధతి
4) సమూహ పద్ధతి
సమాధానాలు
1-3 2-2 3-3 4-4 5-2 6-1 7-3 8-2 9-3 10-2 11-3 12-3 13-2 14-1 15-3
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?
దేశాల అనుసంధానం.. వాణిజ్య అంతఃసంబంధం
కణ బాహ్య జీర్ణక్రియ
ఇంటి పని వద్దన్నవారు.. స్వీయ శిక్షణ ఉండాలన్నవారు
జీవావరణ వ్యవస్థకు కావలసిన మూలశక్తి దారులు?
మౌజియన్ అనే గ్రీకు పదానికి అర్థం?
సమాజ మేధో కేంద్రాలు.. నాగరికతకు చిహ్నాలు