పరీక్షల్లో ‘ఇంగ్లిష్’తో ఈజీగా ఇలా..
పోటీ పరీక్షల్లో ఇంగ్లిష్‌కు అత్యంత ప్రాధాన్యం ఉంది. స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (ఎస్ఎస్సీ) నిర్వహించే సీజీఎల్, సీహెచ్ఎస్ఎస్ వంటి వివిధ స్థాయిల ఉద్యోగాలతోపాటు బ్యాంకింగ్ ఉద్యోగాల భర్తీ, బీమా రంగ పరీక్షల్లో అలాగే వివిధ రాష్ర్టాల పబ్లిక్ సర్వీస్ కమిషన్ల పరీక్షల్లోనూ ఇంగ్లిష్ తప్పనిసరిగా ఉంటుంది. అన్ని స్థాయి పరీక్షల్లో అంశాలు ఒకటే అయినా అడిగే తీరు మాత్రం భిన్నంగా ఉంటుంది. గ్రామర్, వొకాబులరీ, కాంప్రహెన్షన్ అంశాలే అన్ని పరీక్షల్లో ఉంటాయి. అయితే ప్రశ్నల కాఠిన్యం పరీక్ష స్థాయిని బట్టి ఉంటుంది. గ్రాడ్యుయేట్లకు నిర్వహించే పరీక్షల్లో ప్రశ్నపత్రం కొంతవరకు కఠినంగా ఉంటుంది.
గ్రామర్ నేర్చుకోండిలా..
- గ్రామర్ ఎక్కువగా నియమాలపై ఆధారపడి ఉంటుంది. అయితే వీటి అన్వయానికి అభ్యర్థులు ప్రాధాన్యం ఇవ్వాలి. ఇంగ్లిష్‌పై పట్టు రావాలంటే కేవలం గ్రామర్ నియమాలు చదివితే సరిపోదు.
- వాటిని సందర్భోచితంగా ఎలా ఉపయోగించాలో తెలుసుకోవాలి. ఇంగ్లిష్ వాక్య నిర్మాణం ఆధారంగా చదువుకుంటే తేలికగా ఉంటుంది.
- ఇంగ్లిష్‌లో వాక్య నిర్మాణం (సబ్జెక్ట్ + వెర్బ్ + ఆబ్జెక్ట్) రూపంలో ఉంటుంది. అయితే తెలుగులో వాక్య నిర్మాణం సబ్జెక్ట్ + ఆబ్జెక్ట్ + వెర్బ్ రూపంలో ఉంటుంది. ఈ మౌలికమైన తేడాను తెలుసుకుని చదువుకోవాలి. తెలుగులో ఉండే నియమాలే ఇంగ్లిష్‌కు వర్తిస్తాయి. ఉదాహరణకు ఏకవచనం, బహువచనం.. ఇలాంటివి ఉంటాయి.
- -ఉదాహరణకు Academicsలో It is I who is responsible అని ఉంటే, ప్రవేశ పరీక్షలో It is I who am responsible అనేది కరెక్ట్ అంటారు. సబ్జెక్ట్ ఇక్కడ I ఉంది. కాబట్టి am కచ్చితంగా సరిపోతుంది. దీన్నే I అనేది First Person Singular Pronoun కాబట్టి దాని Verb am. కానీ, is కాదు. ఇలా సబ్జెక్టును పరిశీలించి దానికి సరిపోయే వెర్బ్ను గుర్తించే నేర్పును పెంచుకోవాలి.
- ఇంగ్లిష్‌లో ప్రిపోజిషన్కు సంబంధించి అభ్యర్థులు ఎక్కువగా ప్రాక్టీస్ చేయాలి. ఏ స్థాయి పరీక్షలో అయినా ప్రిపోజిషన్కు వెయిటేజీ ఉంటుంది. అలాగే ఇంగ్లిష్‌కు సంబంధించినంత వరకు టెన్సెస్ చాలా కీలకం. కాంప్రహెన్షన్‌ను అర్థం చేసుకోవడంలో ఇవి ముఖ్యపాత్ర పోషిస్తాయి.
వొకాబులరీ
- కేవలం డిక్షనరీ అర్థాలు తెలుసుకుంటే సరిపోదు. వివిధ పదాలను సందర్భోచితంగా ఎలా ఉపయోగించాలో తెలుసుకోవాలి. పదాల వాడకం ముఖ్యమైనది. అభ్యర్థులు నిత్యం ఇంగ్లిష్ న్యూస్ పేపర్లలో వచ్చే సంపాదకీయాలు (ఎడిటోరియల్స్) చదవాలి.
- ఇందులో వచ్చే కొత్తగా, తెలియని పదాలు ఉంటే డిక్షనరీలో వెతకకుండా సందర్భోచితంగా ఎలా వాడుతున్నారో అర్థం చేసుకోవాలి. దీంతో పరీక్షలో వచ్చే కొత్త పదాలు కూడా అర్థం చేసుకోవడంలో ఇబ్బంది ఉండదు.
- సాధారణ వ్యక్తులకు వొకాబులరీ అంటే కేవలం సమానార్థాలు. అయితే పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న వారికి మాత్రం వ్యతిరేకపదాలు, ఇడియమ్స్, ఫ్రేజల్ వెర్బ్స్, ప్రోవెర్బ్స్ (సామెతలు).. ఇలా అన్ని అంశాలపై పట్టుసాధించాలి.
- అయితే బట్టీ పట్టకుండా వీటిని వివిధ సందర్భాల్లో ఎలా ఉపయోగిస్తున్నారో అధ్యయనం చేయాలి.
- ఎడిటోరియల్స్ చదవడం ద్వారా అభ్యర్థులకు కరెంట్ అఫైర్స్ కూడా ఉపయోగపడుతాయి.
- అలాగే ఆర్థిక, రాజకీయ, శాస్త్ర-సాంకేతిక, క్రీడా, సాహిత్య తదితర అంశాలు ఉండేలా జాగ్రత్తపడాలి.
- ఇది కాంప్రహెన్షన్‌కు కూడా ఉపయోగపడుతుంది.
కాంప్రహెన్షన్
- ఏ పోటీ పరీక్షలో అయినా కాంప్రహెన్షన్ కీలకం. అభ్యర్థికి ఇంగ్లిష్ ఎంతవరకు అర్థమవుతుందో తెలుసుకోవడానికి వీటిని ఇస్తారు. ఇది అన్నింటికంటే కష్టమైనదిగా చెప్పుకోవచ్చు.
- అయితే పదాలను ఎలా అర్థం చేసుకుంటున్నారో తెలుస్తుంది. ఇందులో కాంప్రహెన్షన్ రాసిన రచయిత, దాని లక్ష్యం, అది రాయడానికి కారణం, ఏం చెప్పాలనుకుంటున్నాడు, అతడి మనోభావాలు.. ఇలా ప్రశ్నలు వేసుకుంటూ చదవాలి.
- సాధమైనన్ని ఎక్కువగా ప్రాక్టీస్ చేయడంతో ఉపయోగం ఉంటుంది. బ్యాంకింగ్ పరీక్షలతోపాటు, సివిల్స్‌లో కూడా కాంప్రహెన్షన్ చాలా పెద్దదిగా ఉంటుంది.
- అయితే స్టాఫ్ సెలక్షన్ కమిషన్, ఎన్డీఏ, సీడీఎస్ తదితర పరీక్షల్లో మాత్రం ఇవి కొంతవరకు సులభంగా ఉంటాయి.
- ఆయా పరీక్షల్లో ఏ ప్రశ్నలు ఎంత లోతుగా అడుగుతున్నారో అధ్యయనం చేసి దానికి తగ్గట్టుగా ప్రిపేరవడం
- పాత పేపర్లన్నీ చదివి వాటి సమాధానాలు చూసుకోవడం
- కేవలం కీ పరిశీలిస్తే సరిపోదు. ఎక్కడ తప్పులు చేస్తున్నామో గుర్తించి ఆ అంశాల్లో ప్రాథమికమైనవాటిని మరోసారి చదవాలి.
- ప్రిపరేషన్‌ను ప్రాథమిక వ్యాకరణ అంశాలతో మొదలుపెట్టి కాంప్రహెన్షన్‌కు వెళ్లాలి. అయితే పాఠశాల స్థాయి నుంచే ఇంగ్లిష్ ఉంటుంది. కాబట్టి పట్టున్న అభ్యర్థులు నేరుగా కాంప్రహెన్షన్‌ను ప్రిపేర్కావచ్చు.
Previous article
Alliances-Meetings | కూటములు-సమావేశాలు
Next article
ఇనుప ముక్కను అయస్కాంతీకరణ చేయడం?
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?
దేశాల అనుసంధానం.. వాణిజ్య అంతఃసంబంధం
కణ బాహ్య జీర్ణక్రియ
ఇంటి పని వద్దన్నవారు.. స్వీయ శిక్షణ ఉండాలన్నవారు
జీవావరణ వ్యవస్థకు కావలసిన మూలశక్తి దారులు?
మౌజియన్ అనే గ్రీకు పదానికి అర్థం?
సమాజ మేధో కేంద్రాలు.. నాగరికతకు చిహ్నాలు