భాష ఇలా ఉంది అని వివరించే శాస్త్రం?
భాష – వివిధ భావనలు.. భాష-నిర్వచనాలు
1. భాష అనే పదం ఏ సంస్కృత ధాతువు నుంచి ఉద్భవించింది?
1) బాస 2) బాస్ 3) భాశ్ 4) భాష్
2. సైమన్ పాటర్ రాసిన గ్రంథం?
1) ఏ కోర్స్ ఇన్ మోడరన్ లింగ్విస్టిక్స్
2) ద సైన్ ఆఫ్ లాంగ్వేజ్
3) లాంగ్వేజ్ ఇన్ ద మోడరన్ వరల్డ్
4) మోడరన్ లింగ్విస్టిక్స్
3. ఇంట్రడక్షన్ టు ట్రాన్స్ఫర్మేషనల్ గ్రామర్ అనే గ్రంథంలో భాష అనంతమైన వాక్యాల సముదాయం అని అన్నది ఎవరు?
1) ఎడ్వర్డ్ సపిర్ 2) ఎమ్మన్ బాక్ 3) నిఘంటువుకారులు 4) నోమ్ ఛామ్స్కీ
4. భావ వ్యక్తీకరణలో వాక్యం ప్రధాన అంశం అన్నది ఎవరి అభిప్రాయం?
1) స్టర్ట్‌వర్ట్ 2) ఎమ్మన్ బాక్ 3) ఎడ్వర్డ్ సపిర్ 4) జాన్ పీ హ్యూగ్స్
5. ద సైన్ ఆఫ్ లాంగ్వేజ్ అనే రచనలో ఒక వ్యక్తి తన ఆలోచనలను ఇంకో వ్యక్తికి యాదృచ్ఛికమైన వాగ్రూప సంకేతాల ద్వారా వ్యక్తం చేసే విధానమే భాష అని నిర్వచించిన భాషావేత్త?
1) స్టర్ట్‌వర్ట్ 2) ఎమ్మన్ బాక్ 3) ఎడ్వర్డ్ సపిర్ 4) జాన్ పీ హ్యూగ్స్
6. ఏ కోర్స్ ఇన్ మోడరన్ లింగ్విస్టిక్ అనే గ్రంథంలో వివిధ (అనేక) భాషణ అలవాట్లతో కూడిన సంక్లిష్ట వ్యవస్థే భాష అని నిర్వచించిన భాషావేత్త?
1) హాకెట్ 2) ఎమ్మన్ బాక్ 3) సపిర్ 4) స్టర్ట్‌వర్ట్
7. భాష వ్యక్తి ఆలోచనలు, ఉద్వేగాలకు ఒకరూపు కల్పించి వాస్తవిక జ్ఞానాన్ని కలిగిస్తుంది అని అభిప్రాయపడినవారు?
1) వెష్లర్ 2) అరిస్టాటిల్ 3) బెంజిమన్ వార్ఫ్ 4) జాన్ స్టువర్ట్ మిల్
8. పరిమిత సాధనాలను అపరిమితంగా వాడుకచేసేది?
1) సంస్కృతి, సంప్రదాయాలు 2) అలవాట్లు 3) భాష 4) సమాజం
9. పరిమిత సాధనాలను అపరిమితంగా వాడుక చేసేది భాష. ఈ నిర్వచనం?
1) వైయీకరణకారుల దృష్టిలోనిది
2) నిఘంటువుకారుల దృష్టిలోనిది
3) చరిత్రకారుల దృష్టిలోనిది
4) భాషావేత్తల దృష్టిలోనిది
10. మానవులు భాషాపరమైన ప్రవర్తనను (భాషాభ్యసన, భాషించడం, అవగాహన చేసుకోవడం) అలవర్చుకోవడానికి సహకరించే మేధాశక్తే భాష అని నిర్వచించిన భాషావేత్తలు?
1) ఎస్కే వర్మ & ఎన్ కృష్ణస్వామి
2) కాంట్ & డెస్క్రేట్స్
3) ఎడ్వర్డ్ సపిర్ & హాకెట్
4) రైబర్న్ & బల్లార్డ్
11. భాష అనేది ప్రత్యేక నియమాల సముదాయం ఆధారంగా నిర్మించిన ప్రత్యేక వాక్యాల సముదాయం అన్న భాషావేత్త?
1) రామచంద్రవర్మ 2) కాంట్ 3) ఛామ్స్కీ 4) మాక్స్‌ముల్లర్
12. మోడరన్ లింగ్విస్టిక్ అనే గ్రంథంలో భాష ఒకే ఒక అంశం లేదా లక్షణం గల విషయం కాదు, సమాజంలో మానవ సంబంధాలు ఎంత క్లిష్టమైనవో అంతే సంక్లిష్టమైన మానవీయ ప్రక్రియ అన్నది?
1) ఎస్కే వర్మ 2) ఎన్ కృష్ణస్వామి 3) ఎస్కే కృష్ణస్వామి 4) ఎస్కే వర్మ & ఎన్ కృష్ణస్వామి
13. మనస్సులోని భావ పరంపరను ఏ పదాల ద్వారా ఏ వాక్యాల ద్వారా ఎదుటివారికి అందిస్తామో అదే భాష అన్న భాషా శాస్త్రజ్ఞుడు?
1) నోమ్ ఛామ్స్కీ 2) రామచంద్రవర్మ 3) హాకెట్ 4) జాన్ పీ హ్యూగ్స్
14. భాష మేధస్సును ప్రసరించే కాంతి అని నిర్వచించిన భాషావేత్త?
1) జాన్ స్టువర్ట్ మిల్ 2) బెంజిమన్ వార్ఫ్ 3) ఎడ్వర్డ్ సపిర్ 4) ప్రొఫెసర్ విట్నీ
15. భాషను అభివృద్ధి చెందుతున్న సమాజ అవసరాల కోసం ఏర్పడిన అలిఖిత చట్టాల వ్యవస్థగా అభివర్ణించినది?
1) బెంజమిన్ వార్ఫ్ 2) జాన్ స్టువర్ట్ మిల్ 3) నోమ్ ఛామ్స్కీ 4) ప్రొఫెసర్ విట్నీ
16. భాషా చరిత్ర నిర్మాణానికి, భాషా కుటుంబాల పరిశీలనకు, నిర్ధారణకు, కాలానుగుణంగా భాషాగతి, పోకడల పరిశీలనకు సహకరించే సాధనం భాష అని నిర్వచించినవారు?
1) విద్యార్థి 2) మనోవైజ్ఞానికులు 3) భాషా శాస్త్రజ్ఞుడు 4) సామాజిక శాస్త్రజ్ఞుడు
17. మానవ జీవితానికి అవసరమైన సాంకేతిక-ఉద్దీపన ప్రయోజనాలను అందించేది భాష అని నిర్వచించిన భాషావేత్తలు?
1) ఎస్కే వర్మ & ఎన్ కృష్ణస్వామి 2) రిచర్డ్ & ఓగ్డెన్ 3) హెన్రీ వెంత్ 4) కాంట్ & డెస్క్రేట్స్
18. భాష ఇలా ఉంది అని వివరించే శాస్త్రం?
1) వ్యాకరణ శాస్త్రం 2) భాషా శాస్త్రం 3) చందఃశాస్త్రం 4) అలంకారశాస్త్రం
19. నిఘంటువుకారులు భాషకు ఇచ్చిన నిర్వచనాల్లో సరైనవి గుర్తించండి?
ఎ. అర్థవంతమైన పదాల సమూహమే భాష
బి. భాష అంటే పదాలు, వాటి అర్థాలు
1) ఎ మాత్రమే సరైనది
2) బి మాత్రమే సరైనది
3) ఎ, బి రెండూ సరైనవి
4) ఏదీకాదు
20. భాష అనే భావనకు సంబంధించి సరికాని ప్రవచనాన్ని గుర్తించండి?
ఎ. మానవుని ప్రజ్ఞకు, ప్రత్యేకతకు మూలకారణం భాష
బి. మానవుడికి బౌద్ధిక వికాసం కలిగి, అతడు ఇతర జీవరాశులకంటే ఉన్నతులుగా, ఉత్కృష్టమైనవారిగా భావించడం భాషవల్ల కలుగుతుంది
సి. భాష మూలంగానే మానవజాతి ఔన్నత్యం, సంస్కృతి, సభ్యత నాగరికతలు తెలుస్తాయి
డి. భాష వ్యక్తుల మధ్య పరస్పర సహకారాన్ని పెంపొందించదు
1) ఎ సరికాదు
2) బి, సి, డి లు సరికావు
3) డి మాత్రమే సరికాదు
4) ఎ, బి, సి లు సరికావు
21. భాషకు సంబంధించి సరికానిది?
1) జీవితాన్ని ఫలప్రదం చేసుకోవచ్చు
2) తమ ఆలోచనా విధానాలను ముందు తరాలకు అందించవచ్చు
3) వ్యక్తుల ఔన్నత్యానికి కారణమవుతుంది
4) జ్ఞాన పరిధులను విస్తరించుకోలేం
22. లింగ్విస్టిక్ ఛేంజ్ అనే గ్రంథంలో యాదృచ్ఛికమైన నిర్మాణ సౌష్ఠవంతో, మానవ సమాజంతో భావ వినిమయానికి, పరస్పర సహకారానికి, సంస్కృతి పరివ్యాప్తికి ఉపకరించే వాగ్రూప ధ్వని సంకేత సముదాయమే భాష అని నిర్వచించిన భాషావేత్త?
1) స్టర్ట్‌వర్ట్ 2) హాకెట్
3) ఎమ్మన్ బాక్ 4) ఎడ్వర్డ్ సపిర్
23. కింది భాషావేత్తలు, వారి గ్రంథాలను జతపర్చండి?
1. ఎమ్మన్ బాక్ ఎ. ద సైన్స్ ఆఫ్ లాంగ్వేజ్
2. స్టర్ట్‌వర్ట్ బి. ఏ కోర్స్ ఇన్ మోడరన్ లింగ్విస్టిక్స్
3. జాన్ పీ హ్యూగ్స్ సి. ఇంట్రడక్షన్ టు ట్రాన్స్ఫర్మేషనల్ గ్రామర్
4. హాకెట్ డి. లింగ్విస్టిక్ ఛేంజ్
1) 1-సి, 2-డి, 3-ఎ, 4-బి
2) 1-బి, 2-ఎ, 3-డి, 4-సి
3) 1-సి, 2-డి, 3-బి, 4-ఎ
4) 1-సి, 2-ఎ, 3-డి, 4-బి
24. వ్యాకరణకారులు భాషకు ఇచ్చిన నిర్వచనానికి సంబంధించి సరైన ప్రవచనాన్ని గుర్తించండి?
ఎ. ప్రకృతి ప్రత్యయ పద నిరూపణమే భాష
బి. ప్రకృతి అంటే పదమూలం లేదా ప్రాతిపదిక
సి. ప్రాతిపదిక మీద చేరేరూపం ప్రత్యయం. ప్రకృతి-ప్రత్యయం రెండూ కలిసి పదం ఏర్పడుతుంది.
1) ఎ సరైనది 2) బి, సి సరైనవి
3) ఎ, సి సరైనవి 4) ఎ, బి, సి సరైనవి
25. భాషను జనసామాన్యం భావించే తీరు?
1) భావప్రకటనా సాధనం 2) రసోదయ సాధనం
3) నిరూపణ సాధనం 4) అర్థ సాధనం
26. మానవుల మధ్య భాష నిర్వర్తించే పాత్రను అధ్యయనం చేస్తూ వ్యక్తీకరణ రూపాల్లోని వైవిధ్యాన్ని వెల్లడించేది?
1) మానవ శాస్త్రజ్ఞుడు 2) భాషా శాస్త్రజ్ఞుడు
3) సామాజిక శాస్త్రవేత్త 4) సాంకేతిక శాస్త్రజ్ఞుడు
27. మానవులు తమ అభిప్రాయాలను ఎదుటివారికి తెలుపుతూ, పరస్పరం సహకరించుకోవడానికి తోడ్పడే మౌఖిక ధ్వనుల స్వతంత్ర వ్యవస్థ?
1) పదం 2) అర్థం 3) భాష 4) సాహిత్యం
28. కింది వాటిలో సరికాని ప్రవచనాన్ని గుర్తించండి?
1) భావ ప్రకటనకు ఉద్దేశించే సాధనం భాష – సామాన్యుడు (జనసామాన్యం)
2) భావ వినిమయంలో మానవులకు అవరోధాలు లేకుండా చేసే సాధనం, తాను విద్యార్థులకు బోధించాల్సిన విషయం – భాషోపాధ్యాయుడు
3) తాత్తిక చర్చకు ఉపకరించే సాధనం – సాహిత్యవేత్త
4) కవితా సౌందర్యాన్ని దర్శించడానికి, అవగాహన చేసుకోవడానికి ఉపయోగపడే సాధనం – సాహిత్యవేత్త
29. భాషా నిర్వచనాలకు సంబంధించి సరికానిదాన్ని గుర్తించండి?
1) మానవుల ప్రవర్తనలను పశుపక్ష్యాదుల ప్రవర్తనల నుంచి వేరుచేసి చూపడానికి ఉపయోగపడే సాధనం – మనస్తత్వ శాస్త్రజ్ఞుడు
2) ఉపదేశమివ్వడానికి ఉపకరించే సాధనం – మత ప్రచారకుడు
3) మానవ సంస్కృతి అధ్యయనానికి ఉపకరించే సాధనం – మానవశాస్త్రజ్ఞుడు
4) తాత్తిక చర్చకు ఉపకరించే సాధనం – మతప్రచారకుడు
30. భాషా నిర్వచనాలకు సంబంధించి సరికానిది ఏది?
1) భావప్రకటనకు ఉద్దేశించే సాధనం – విద్యార్థి
2) వాగ్రూపంగాగానీ, లిఖితరూపంగాగానీ ఎదుటి వ్యక్తికి భావాన్ని అందించే సాధనం – సాంకేతిక శాస్త్రజ్ఞుడు
3) తాత్తిక చర్చకు ఉపకరించే సాధనం – వేదాంతి
4) శాసనాలు, రచనలు, అభిలేఖల సాయంతో చరిత్రను నిర్మించడానికి ఉపకరించే సాధనం – చరిత్రకారులు
31. కింది వాటిలో భాషా నిర్వచనాలకు సంబంధించని ప్రవచనాన్ని గుర్తించండి?
1) మానవుల మధ్య పరస్పర సంబంధాలను పెంపొందించగల సాధనం – సామాజిక శాస్త్రజ్ఞుడు
2) భాష విషయ వివేచనానికి ఉపకరించే సాధనం. భాష కేవలం సాధనమే కాకుండా సాధ్యం కూడా. కొందరికి ఇది సాధనం, కొందరికి ఇది సాధ్యం, మరికొందరికి రెండూ – భాషా శాస్త్రజ్ఞుడు
3) ఎదుటివారికి తన ఆలోచనలను, అభిప్రాయాలను చెప్పడానికి చేష్టలతోపాటు ఉపయోగపడే ధ్వనిరూపం – విద్యార్థి
4) పదాలు, వాటి అర్థాలే భాష – వ్యాకరణకారులు
32. ఎడ్వర్డ్ సపిర్ భాషకు ఇచ్చిన నిర్వచనాల్లో సరికానివి గుర్తించండి?
ఎ. భాష ఒక సమాజపు ఆలోచనలను, జ్ఞానాన్ని, విలువలను తెలియజేసే వాహకం. సమాజపు గుర్తింపునకు భాష ప్రాథమిక వ్యక్తీకరణ.
బి. భావ వినిమయంలో తమ భావాలను, ఉద్వేగాలను, కోరికలను స్వతహాగా వెలువడిన సంకేతాల ద్వారా వ్యక్తం చేయడానికి రూపొందించుకున్న సాధనం భాష
సి. అలవోకగా ఉత్పన్నమయ్యే కంఠధ్వనుల సాధనాలతో కేవలం మానవ సంబంధమై సహజేతర పద్ధతి ద్వారా మానవోద్రేకాలను, ఆలోచనలను, వాంఛలను తెలియజేసేది భాష
డి. భాష అంటే పదాలు, వాటి అర్థాలు
1) ఎ, బి సరికావు 2) డి సరికాదు
3) సి, డి సరికావు
4) ఎ, బి, సి, డి సరికావు
33. భాషా నిర్వచనాల్లో సైమన్ పాటర్కు సంబంధించిన సరైన వాటిని గుర్తించండి?
ఎ. ధ్వనిని ఉత్పత్తిచేసే తన అవయవాల సాయంతో వ్యక్తం చేసే ధ్వనుల పరంపరే భాష.
బి. మానవులు ఒకరికొకరు తమ అభిప్రాయాలను తెలియజేసుకోవడానికి, పరస్పరం సహకరించుకోవడానికి ఉపయోగించే అర్థవంతమైన యాదృచ్ఛిక ధ్వనుల సమూహమే భాష.
సి. మానవులు తమ అభిప్రాయాలను ఎదుటివారికి తెలుపుతూ పరస్పరం సహకరించుకోవడానికి తోడ్పడే మౌఖిక ధ్వనుల స్వతంత్ర వ్యవస్థే భాష
1) ఎ, బి సరైనవి 2) బి, సి సరైనవి
3) ఎ, సి సరైనవి 4) ఎ, బి, సి సరైనవి
సమాధానాలు
1-4, 2-4, 3-2, 4-2, 5-4, 6-1, 7-3, 8-3, 9-4, 10-2, 11-3, 12-4, 13-2, 14-1, 15-4, 16-3, 17-2, 18-2, 19-3, 20-3, 21-4, 22-1, 23-1, 24-4, 25-1, 26-3, 27-3, 28-3, 29-4, 30-1, 31-4, 32-2, 33-4.
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?
దేశాల అనుసంధానం.. వాణిజ్య అంతఃసంబంధం
కణ బాహ్య జీర్ణక్రియ
ఇంటి పని వద్దన్నవారు.. స్వీయ శిక్షణ ఉండాలన్నవారు
జీవావరణ వ్యవస్థకు కావలసిన మూలశక్తి దారులు?
మౌజియన్ అనే గ్రీకు పదానికి అర్థం?
సమాజ మేధో కేంద్రాలు.. నాగరికతకు చిహ్నాలు