Interview..Know these! | ఇంటర్వ్యూనా..ఇవి తెలుసుకోండి!
ఉద్యోగ అర్హతలు ఉన్నా.. ఇంటర్వ్యూలో సరైన నైపుణ్యాలు ప్రదర్శించలేక చాలామంది అవకాశాలు కోల్పోతుంటారు. చిన్న చిన్న పొరపాట్లతో అవకాశాలను చేజార్చుకుంటుంటారు. ఈ నేపథ్యంలో ఇంటర్వ్యూకు హాజరయ్యేవారు వివిధ అంశాల్లో ఎలాంటి జాగ్రత్తలు పాటించాలో ముందుగానే తెలుసుకోవడం మంచిది.
మీ ప్రధాన బలం ఏమిటి?
-సాధారణంగా ఇంటర్వ్యూయర్ అడిగే ప్రశ్నల్లో ఇది ఒకటి. అభ్యర్థి ఇంటర్వ్యూకు హాజరుకాకముందే తనకున్న క్వాలిటీస్ లిస్టవుట్ చేసుకోవాలి. సంబంధిత కంపెనీ ఆఫర్ చేసే ఉద్యోగానికి మీకున్న స్కిల్స్ సరిపోతాయా? లేదా అనే విషయాలు బేరీజు వేసుకోవాలి. మీ బలాలు, బలహీనతలే మీరు ఉద్యోగానికి అర్హులా? కాదా? అనేది తెల్చేస్తాయి!
మీ బలహీనత?
-ఇంటర్వ్యూ చేసేవారు అడిగే ప్రశ్న. సింపుల్ ప్రశ్నే అనుకుంటారు. కానీ ఈ ప్రశ్నకు ఇచ్చే సమాధానంఆధారంగా ఉద్యోగ అవకాశాలు ఉంటాయి. మీ బలాలను బట్టి, సామర్థ్యాలను బట్టి ఎదుటివారిలో పాజిటివ్ దృక్పథం కలిగేలా అభ్యర్థులు ఇలాంటి ప్రశ్నకు సమాధానం ఇవ్వగలగాలి.
గత ఉద్యోగాన్ని ఎందుకు వదులుకోవాలనుకుంటున్నారు?
-భవిష్యత్తు పట్ల బాధ్యతాయుతంగా ఉన్నామనే భావన ఎదుటివారిలో కలిగించాలి. గత ఉద్యోగంతో వ్యక్తిగతంగా ప్రయోజనం లేదని, వృత్తిపరంగా ఎదగడానికి కూడా అక్కడ చాలా తక్కువ ప్రయోజనాలున్నాయని ఉదాహరణలతో సంక్షిప్తంగా సమాధానం ఇస్తే బాగుంటుంది. ఇక్కడ మీకున్న సామర్థ్యాలను కూడా ప్రస్తావించాలి.
మీ గురించి?
-మనల్ని మనం ప్రజెంట్ చేసుకోవడానికి సరైన ప్రశ్న ఇది. అభ్యర్థి ఎఫెక్టివ్‌గా సమాధానం ఇస్తే ఇంటర్వ్యూయర్‌ను ప్రభావితం చేయడానికి ఎక్కువ అవకాశాలు ఉంటాయి. ఒకవేళ ఎఫెక్టివ్‌గా సమాధానం ఇవ్వలేకపోతే సంక్షిప్తంగా వ్యక్తిత్వ పరిచయం, విద్యార్హతలు, వ్యక్తిగత నైపుణ్యాలను ప్రస్తావిస్తే సరిపోతుంది.
ఈ కంపెనీనే ఎందుకు ఎంచుకుంటున్నట్లు?
-తనకు జాబ్ ఎంత ముఖ్యమో ఈ ప్రశ్న ద్వారా చెప్పగలగాలి. తన బలాలు, నైపుణ్యాలు శ్రద్ధగా వివరించగలగాలి. సంబంధిత కంపెనీలో చేరడం వల్ల వ్యక్తిగత లక్ష్యాలు ఎలా చేరుకోవాలనుకుంటున్నారో తెలియజేయాలి. వ్యక్తిగత లక్ష్యాలే కాకుండా కంపెనీ లక్ష్యాలు కూడా తెలిసి ఉండటం అభ్యర్థిపై మంచి అభిప్రాయం కలుగజేస్తుంది.
సంస్థ లక్ష్యాలను చేరుకోగలరా?
-వ్యక్తిగత లక్ష్యాలకు ప్రాధాన్యం ఇచ్చే అభ్యర్థుల కోసమే కాకుండా సంస్థ ఉన్నతికి తోడ్పడేవారికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. కాబట్టి సంస్థ ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకొని ఎలాంటి వాతావరణంలోనైనా పనిచేయడానికి సిద్ధంగా ఉండాలి.
గతంలో అధిగమించిన చాలెంజింగ్ టాస్క్ గురించి చెప్పగలరా?
-ఉద్యోగ నిర్వహణలో తలెత్తే సమస్యలను సులువుగా పరిష్కరించే నేర్పు అభ్యర్థికి ఉండాలి. అభ్యర్థి గత ఉద్యోగంలో ఎదుర్కొన్న సవాళ్లను, సమస్యలను తెలియజేయాలి. కంపెనీ సవాళ్లను ఎదుర్కొనేటప్పుడు ఆ సమస్య పరిష్కారంలో మీ వంతు ఏమిటి? ఆ సమయంలో అవలంబించిన వ్యూహాలేమిటి? వంటి విషయాలు చెప్పాలి.
మీ దృష్టిలో విజయం అంటే?
-లక్ష్యాలు, పని నైపుణ్యం, వ్యక్తిత్వం, నైతిక విలువలు వంటి విషయాలను తెలుసుకునేందుకు సాధారణంగా ఇలాంటి ప్రశ్నలు అడుగుతుంటారు. కంపెనీ అభివృద్ధిలో మీ వంతు పాత్ర ఏంటి? రచించిన వ్యూహాలేంటి? తదితర విషయాలను ఆధారపూర్వకంగా చెప్పగలగాలి. మీరు నిర్దేషించుకున్న లక్ష్యాలను అందుబాటులో ఉన్న వనరులతో ఏ విధంగా అధిరోహించారనే విషయం
టీమ్‌వర్క్ చేయడం ఇష్టమేనా?
-కొంతమంది ఒంటరిగా పనిచేయడానికి ఇష్టపడుతారు. సంస్థ ప్రయోజనాలకనుగుణంగా, లక్ష్యాలకనుగుణంగా బృందంతోనూ కలిసి పనిచేయడానికి సిద్ధంగా ఉండాలి. కొన్ని లక్ష్యాలు వ్యక్తిగతంగా కాకుండా బృందంగా పనిచేస్తే సాధించడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఇంటర్వ్యూయర్లు అడిగే ప్రశ్నల్లో టీమ్‌వర్క్ గురించి కూడా చర్చిస్తారు. కాబట్టి అభ్యర్థులు ఈ విషయమై దృష్టి సారించాలి.
ఇతర చోట్ల పనిచేయడానికి సిద్ధంగా ఉన్నారా?
-ఇంటర్వ్యూలో వర్క్‌ప్లేస్ గురించి కూడా అడిగే అవకాశాలు ఉంటాయి. ఈ ప్రస్తావన తీసుకువచ్చినప్పుడు ఎక్కడ పనిచేయాలనుకుంటున్నారో అభ్యర్థి స్పష్టంగా చెప్పాలి. ఒకవేళ ఉన్న ప్రాంతం నుంచి వేరే ప్రాంతానికి బదిలికావాల్సి వచ్చినప్పుడు, దానివల్ల ఎదురయ్యే సమస్యలను నిజాయితీగా విన్నవించగలగాలి.
జాబ్ నుంచి ఏం ఆశిస్తున్నారు?
-ఇంటర్వ్యూకు హాజరయ్యే అభ్యర్థి డైరెక్ట్‌గా సాలరీ గురించి ప్రస్తావించకూడదు. అభ్యర్థి సంభాషణ ఎదుటివారిని ఆకట్టుకునేలా ఉండాలి. జాబ్ నుంచి మీరేం ఆశిస్తున్నారో స్పష్టంగా చెప్పగలగాలి. సంస్థ ఉన్నతికి, వ్యక్తిగత లక్ష్యాలకు ఉద్యోగం ఏ విధంగా హెల్ప్ అవుతుందో తెలియజెప్పాలి.
ముఖాముఖిలో పాటించాల్సిన జాగ్రత్తలు
-ఇంటర్వ్యూ అనేది ఇద్దరు లేదా అంతకన్నా ఎక్కువమంది వ్యక్తుల మధ్య జరిగే సంభాషణ. ఈ సంభాషణను ఒక పనికి వ్యక్తులను ఎంపిక చేయడం కోసం కానీ, వ్యక్తి పరిజ్ఞానాన్ని పరీక్షించడం కోసం కానీ జరుపుతారు. ఇంటర్వ్యూకి వెళ్లే ముందు సబ్జెక్టుపై ఉన్న పరిజ్ఞానాన్ని చెక్‌చేసుకోవాలి.
-ఇంటర్వ్యూకి వెళ్లే ముందు మునుపటి ఉద్యోగం గురించి, కొత్త ఉద్యోగానికి దరఖాస్తు చేయడానికి గల కారణాలను విశ్లేషించుకోవాలి. ఎందుకంటే ఇంటర్వ్యూలో మీ మునుపటి ఉద్యోగ అనుభావాల గురించి అడిగే అవకాశాలున్నాయి.
-ఉద్యోగ అనుభవం లేని వ్యక్తి అయితే రెజ్యూమేలో అర్హతలు, సామర్థ్యం, సమాచార విశ్లేషణ, నిర్వహణ, ప్రణాళిక నైపుణ్యాల గురించి వీలైనంత అర్థవంతమైన చర్చను కొనసాగించేలా ఉండాలి.
-ఇంటర్వ్యూకి ఆలస్యంగా వెళ్లకూడదు. కేటాయించిన సమయం కన్నా ముందే అక్కడికి చేరుకోవాలి
-మీ వేషధారణ లేత రంగులో సాధారణంగా ఉండటం ఉత్తమం
-ఇంటర్వ్యూ జరిగే సమయంలో ఆశావాద దృక్పథంతో వ్యవహరించాలి.
-మీ వివరాలు అడిగినప్పుడు మీ మునుపటి ఉద్యోగం, దాని అనుభవాలు, నైపుణ్యాల నుంచి మీ అత్యున్నత అర్హతల వరకు మాత్రమే మాట్లాడాలి. వ్యక్తిగత విషయాల గురించి చర్చించకపోవడం మంచిది.
-బాడీ లాంగ్వేజ్ కూడా ముఖ్యం. ఆవేశమైన ఆలోచనా విధానం ఉండకూడదు. వీలైనంత సహనం, నేర్పుతో ఉండాలి.
-మీరు చెప్పే సమాధానం తప్పు కానీ, ఒప్పు కానీ కావచ్చు. కానీ చెప్పే సమాధానంలో కచ్చితత్వం ఉండాలి.
కొన్ని సాధారణ ప్రశ్నలు
-మీ గురించి చెప్పండి?
-ఈ ఉద్యోగం మీకు ఎందుకు ఇవ్వాలి?
-ఒక పరిమిత కాలం అనుభవం తర్వాత, ఇతర కంపెనీలో మంచి జీతభత్యాలు అత్యున్నతమైన హోదా వస్తేం ఏం చేస్తారు?
-ఎంత జీతం ఆశిస్తున్నారు?
-నిర్వాహకులు జీతభత్యాల గురించి బేరసారాలు జరిపినా ఆశించిన జీతానికి తగ్గకుండా చూసుకోవాలి.
దవిలి వెంకన్నబాబు
సీనియర్ అకౌంటెంట్, ఎంకాం
సాలిస్-రీజియస్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ ప్రాజెక్టు లిమిటెడ్ హైదరాబాద్
డ్రెస్‌కోడ్ కూడా ముఖ్యమే!
-జాబ్ ఇంటర్వ్యూకి డ్రెస్‌కోడ్ కూడా ముఖ్యమే. ఇంటర్వ్యూ చేసేవారు మీ డ్రెస్కోడ్నూ పరిశీలిస్తారు. అందుకే ఇంటర్వ్యూకు హాజరయ్యేటప్పుడు తప్పనిసరిగా కొన్ని స్టయిల్ టిప్స్‌ను ఫాలో కావాలి.
-డ్రస్సు శుభ్రంగా ఉతికి ఐరన్ చేసుకోవాలి.
-అసౌకర్యంగా ఉన్న దుస్తులు, షు వేసుకోవద్దు. ఎందుకంటే ఇంటర్వ్యూ సమయంలో అవి మీ దృష్టిని మరల్చి ఏకాగ్రతను దెబ్బతీస్తాయి.
-నలిగిపోయి, సరిగా ఉతకని బట్టలను వేసుకుంటే.. అవి నెగిటివ్ ప్రభావాన్ని కలిగిస్తాయి.
-దుస్తుల రంగులు ఆకట్టుకునేలా ఉండాలి.
-షూ శుభ్రంగా ఉండాలి. మిమ్మల్ని చూడగానే ఫ్రెష్‌గా, ప్రొఫెషనల్‌గా కనిపించాలి. శుభ్రత లేని అబ్బాయి, అమ్మాయిలుగా ఉండకూడదు.
-సిన్సియర్ లుక్ కనిపించాలంటే మాత్రం హూందాగా ఉండే దుస్తులను ఎంచుకోవాలి. ఆ డ్రెస్ బాడీకి అతికినట్లుగా ఉండాలి.
-అమ్మాయిలు ప్యాంట్‌సూట్స్ తరహా ైస్టెల్ ఉండేవి సెలెక్ట్ చేసుకుంటే బాగుంటుంది. పెన్సిల్ కట్ స్కర్ట్స్ వేసుకున్నా బాగుంటుంది.
-కార్పొరేట్ కల్చర్‌కు అనుగుణంగా దుస్తులను ఎంపిక చేసుకుంటే బాగుంటుంది. ఇలా వెళితేనే తమ కల్చర్‌కు సరిపడేలా ఉన్నారని ఇంటర్వ్యూ చేసేవారు ఫీల్ అవుతారు. దీనివల్ల మీపై సానుకూల దృక్పథం కలిగి ఉద్యోగం ఇవ్వడానికి ఆసక్తి కనబరుస్తారు.
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
తాత్వికతను తెలిపేది.. రాజ్యాంగానికి గుండెలాంటిది
ఎలకానిక్ రికార్డులు.. ప్రాథమిక సాక్ష్యాలు
శుక్రకణాలు తాత్కాలికంగా నిల్వ ఉండే ప్రాంతం?
సెకండరీ ఎడ్యుకేషన్ కమిషన్‌కు మరోపేరు?
‘వెయ్యి ఉరిల మర్రి’ గా పేరుగాంచిన ఊడలమర్రి ఏ జిల్లాలో ఉంది?
రక్షణ దుర్గాలు – నాటి పాలనా విభాగాలు
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?