Devotional Movement | భక్తి ఉద్యమం- త్రిమతాచార్యులు
హైందవమతంలో కర్మకాండకు, కుల వ్యవస్థకు వ్యతిరేకంగా ఉద్భవించిన జైన, బౌద్ధమతాలు మధ్యయుగ ఆరంభంలో ప్రాచుర్యాన్ని కోల్పోయాయి. జైన, బౌద్ధాలలోని నిరాడంబరత, కులరాహిత్యం, సమానత్వ ధోరణులు హిందూ సంస్కర్తలను ఆకర్శించాయి. ఫలితంగా ఉపనిషత్తులు పేర్కొన్న జ్ఞాన, భక్తి మార్గాలకు ప్రాధాన్యం పెరిగింది. త్రిమతాచార్యుల రాకతో హైందవమతంలో నూతన ధోరణులు ప్రవేశించాయి.
శంకరాచార్యులు (క్రీ.శ. 788-820)
సిద్ధాంతం : అద్వైతం
జన్మస్థానం : కేరళలోని కాలడి
జననం: క్రీ.శ.788
బిరుదు: ప్రచ్ఛన్న బుద్ధుడు
మరణం: క్రీ.శ. 820
మరణస్థలం: కేదారినాథ్
ఇతనిని ఆదిగురువుగా భావించి ఆదిశంకరాచార్యులుగా పిలుస్తారు.
పూర్వమీమాంస భాష్యకారుడైన కుమారిలభట్టు శిష్యుడైన మండనమిసున్ని వాదనలో ఓడించాడు.
మాయా సిద్ధాంతాన్ని ప్రవేశపెట్టి ప్రచ్ఛన్న బుద్ధుడిగా ప్రసిద్ధి చెందాడు.
శంకరుడు ప్రతిపాదించిన అద్వైతానికి మూలం బాదరాయణుడు రచించిన ఉత్తర మీమాంస (బ్రహ్మ సూత్రాలు).
శంకరుడు బాదరాయణ బ్రహ్మసూత్రాలకు భాష్యం రచించాడు.
బ్రహ్మమే సత్యం, శాశ్వతం అని బోధించాడు.
జగత్తు వాస్తవం కాదు, కేవలం మిథ్య(మిథ్యావాదం) ప్రతిపాదించాడు.
చాందోగ్యోపనిషత్లోని తత్వమసి (బ్మహ్మవునీవు) అనేది అద్వైత సిద్ధాంతానికి మూలం.
శృంగేరి (కర్ణాటక), ద్వారక (గుజరాత్), బద్రీనాథ్ (ఉత్తరాఖండ్), పూరీ (ఒడిశా) క్షేత్రాలలో నాలుగు మఠాలు స్థాపించాడు.
శంకరాచార్యుల మరణానంతరం ఇతని శిష్యులు కంచి(తమిళనాడు) మఠాన్ని స్థాపించారు.
ప్రస్థానత్రయంగా గౌరవించే బ్రహ్మసూత్రాలు, ఉపనిషత్తులు, భగవద్గీతలకు వ్యాఖ్యానం రాశాడు.
ఇతని బోధనలను అనుసరించే వారిని స్మార్థులు అంటారు.
రామానుజాచార్యులు ( 1017-1137)
సిద్ధాంతం : విశిష్టాద్వైతం
జన్మస్థానం: శ్రీపెరంబుదూర్
గ్రంథాలు: వేదాంతసారం
వేదాంత సంగ్రహం
వేదాంత దీపం
గీతాభాష్యం
శ్రీభాష్యం
బ్రహ్మసూత్రాలకు శ్రీభాష్యం పేరిట వ్యాఖ్యానం రాశాడు.
కులోత్తుంగ చోళుని ఆగ్రహానికి గురై హొయసాల రాజ్యానికి చేరుకున్నాడు.
శంకరుని మాయావాదాన్ని తిరస్కరించాడు.
జ్ఞానమార్గంతోపాటు భక్తి, కర్మ మార్గాలను కూడా ప్రతిపాదించాడు.
శ్రీవైష్ణవం అనే తెగను స్థాపించాడు.
120 ఏండ్లు జీవించాడు. ప్రస్థాన త్రయానికి వ్యాఖ్యానం రాశాడు.
తన గురువు యమునముని తర్వాత శ్రీరంగం పీఠాధిపతిగా కొనసాగాడు.
విశిష్టాద్వైతంలో తెలకలి, వడుకలై అనే శాఖలు ఉన్నాయి.
మహారాష్ట్రలోని పండరీపూర్లో గల విఠోభా ఆలయాన్ని ఆధారంగా చేసుకొని భక్తి ఉద్యమాన్ని అధికంగా వ్యాప్తిజేశాడు.
మద్వాచార్యులు (క్రీశ 13వ శతాబ్దం)
సిద్ధాంతం : ద్వైతం
జన్మస్థానం: కర్ణాటకలోని ఫాకజ
గ్రంథాలు : అనువ్యాఖ్యానం
: అనుభాష్యం
: బ్రహ్మసూత్ర భాష్యం
తొలిపేరు వాసుదేవుడు తర్వాత ఆనందతీర్థుడు, పూర్ణప్రజ్ఞుడు, మద్వాచార్యుడు అనే పేర్లతో ప్రసిద్ధికెక్కాడు.
ఉడిపిలో శ్రీకృష్ణ ఆలయాన్ని నిర్మించాడు.
ఇతను 37 గ్రంథాలు రాశాడు. వాటిల్లో ముఖ్యమైంది బ్రహ్మసూత్ర భాష్యం
చాందోగ్య, ఐతరేయ, బృహదారణ్యక మొదలైన ఉపనిషత్తులకు భాష్యాలు రాశాడు.
ఇతని అనుయాయులను మధ్య వైష్ణవులు అని అంటారు. అద్వైతాన్ని వ్యతిరేకించాడు.
మతభేదాలను, వర్ణధర్మాలను సమర్థించాడు.
ఈ మతాన్ని కన్నడ బ్రాహ్మణులు మాత్రమే స్వీకరించారు.
మద్వాచార్యుని ప్రభావంతో కర్ణాటకలో దాసకూట ఉద్యమం ప్రారంభమైంది. దాసకూటం అంటే భగవంతుని సేవకులు అని అర్థం. ఈ ఉద్యమమే మహారాష్ట్రలో పండరీపుర ఉద్యమమైంది.
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?
దేశాల అనుసంధానం.. వాణిజ్య అంతఃసంబంధం
కణ బాహ్య జీర్ణక్రియ
ఇంటి పని వద్దన్నవారు.. స్వీయ శిక్షణ ఉండాలన్నవారు
జీవావరణ వ్యవస్థకు కావలసిన మూలశక్తి దారులు?
మౌజియన్ అనే గ్రీకు పదానికి అర్థం?
సమాజ మేధో కేంద్రాలు.. నాగరికతకు చిహ్నాలు