Kalyani Chalukya | కళ్యాణి చాళుక్య నందికంది శాసనాలు
తెలంగాణ ప్రాంతంలో క్రీస్తుకు పూర్వం నుంచే గొప్ప నాగరికత వర్ధిల్లిందనటానికి నేడు అడుగడుగునా చారిత్రక సాక్ష్యాలు కనిపిస్తున్నాయి. ఎన్నో రాజవంశాలు ఈ నేలపై తమ సుపరిపాలనా పాదముద్రలను వదిలివెళ్లాయి. అందుకు సంబంధించిన ఆనవాళ్లు శానసాల రూపంలో అనేకచోట్ల దర్శనమిస్తున్నాయి. అందులో ముఖ్యమైనవి కళ్యాణీ చాళుక్యులు వేయించిన నందికంది శాసనాలు. సంగారెడ్డికి కొద్దిదూరంలోనే ఉన్న నందికంది గ్రామంలోని రామలింగేశ్వర ఆలయంలో ఉన్న ఐదు శాసనాలు తెలంగాణ ప్రాచీన చరిత్రకు సాక్ష్యాలుగా నిలుస్తున్నాయి. ఆ శాసనాలపై నిపుణ పాఠకులకోసం ప్రత్యేకం…
తెలంగాణను ప్రాచీనకాలంలో శాతవాహనులు, విష్ణుకుండినులు, బాదామి చాళుక్యులు, రాష్ట్రకూటులు తదితర రాజవంశాలు పరిపాలించాయి. రాష్ట్రకూటుల అనంతరం కళ్యాణిచాళుక్యులు క్రీ.శ. 973 నుంచి 1189 వరకు (రెండో తైలపుడు (అహవమల్ల 973-976) మొదలు త్రిభువనమల్ల ఆరోవిక్రమాదిత్యుడు, నాలుగో సోమేశ్వరుని (1182-1200) వరకు) అంతకుముందు రెండో భీముడు, ఒకటో అయ్యన, నాలుగో విక్రమాదిత్యుడు పరిపాలించారు. ఇందులో మెతుకు సీమ ఒకటి. మెతుకు సీమకు పులాక రాష్ట్రమని (సంస్కృతనామం) పిలిచేవారని చరిత్ర చెబుతుంది. అస్మక, కొరవి, నాగ భూమి, కాసుల నాడ, మంజీరికా, గుల్షానాబాద్, మెతుకు సీమ, మెదకు ప్రస్తుతం మెదక్గా పేర్లు మారిన మెదక్ జిల్లాలోని నందికందిలో తెలంగాణ చరిత్రలోనే ప్రసిద్ధమైన ప్రముఖ రామలింగేశ్వరస్వామి (రామేశ్వరాలయం) ఆలయం ఉంది. ప్రాచీనకాలంలో నందికంది పేరు కిరియ కన్ది అని శాసన పాఠంలో ఉంది. ఈ ప్రాచీన ఆలయం సంగారెడ్డికి నైరుతిలో 16 కి.మీ. దూరం, హైదరాబాద్కు 63 కి.మీ.దూరంలో ఉంది.
చరిత్ర మొదటి శాసనం
-కళ్యాణి చాళుక్యరాజుల శిల్పశైలిలో ఈ మందిర నిర్మాణం జరిగింది. అయినా, ఇక్కడ ఉన్న శిలాశాసనం ప్రకారం ఈ ఆలయం క్రీ.శ. 10వ శతాబ్దం అంతంలో, 11వ శతాబ్దం ఆరంభంలో నిర్మితమైనట్టు తెలుస్తుంది. ధ్వజ స్తంభంపై ఉన్న శాసనాన్ని పరిశీలిస్తే రెండో తైలపుడు(అహనమల్ల) కాలంలోనే ఆలయ ధ్వజస్తంభ ప్రతిష్ఠాపన జరిగినట్టు తెలుస్తుంది. రెండో తైలపుడు 973 నుంచి 996 వరకు 23 ఏండ్లు పరిపాలించాడు. అంతకుమందే చాలాకాలం క్రితం ఒకటో అయ్యన, నాలుగో విక్రమాదిత్యుని కంటే ముందే లింగ ప్రతిష్ఠాపన జరిగినట్టు చరిత్ర చెబుతుంది. శాసన పాఠంలో సంవత్సరం లేదు. కాబట్టి శాసనాన్ని అనుసరించి 10-11వ శతాబ్దంగా గుర్తించాలి. ఎందుకంటే మిగతా కళ్యాణిచాళుక్యరాజుల శాసనాలు స్పష్టంగా ఉన్నాయి.
– రామలింగేశ్వరస్వామి దేవస్థానం ముందు భాగంలో ఉన్న శిలాశాసనంలో నాలుగు పక్కల శాసన పాఠంలో మహా మండలేశ్వరుడైన పంపవే నుంచి కోవూరు (నేటి కోహీర్ ) అనే గ్రామాన్ని రామలింగేశ్వరునికి బహూకరించినట్టుగా పేర్కొన్నారు. కిరియకన్దిగా శాసన పాఠంలో ఉంది.
రెండో శాసనం
– సెలయేరు (ఝరా= సంస్కృతంలో) బావి వద్ద పక్కన గల నేలపై విలువైన మరో శాసనం ఉంది. ఈ శాసనం త్రిభువనమల్ల బిరుదాకింతుడు ఆరో విక్రమాదిత్యుడి పరిపాలన కాలం 1086 కాలం నాటిదని ఉంది. మండపం కుడిభాగంలోని ప్రవేశ ద్వారం పునాది శిలపై తాతయ్య గారి డింభుని పేరు ఉంది. వీరి ఉనికి 11వ శతాబ్దం నాటిదని తెలుస్తున్నది. మండప ప్రవేశ ద్వారంలో నందీశ్వరుని పెద్ద విగ్రహం ఉంది. అంతేకాక, మరో శాసనం కూడా ఉన్నదని, అది నందికంది- పెద్దాపూర్ గ్రామ శివారుల్లో వరిపొలంలో ఉన్నదని చరిత్రకాంశం. ఈ దేవస్థానంలోని ఒక శిల్పంలో ఎక్కడా లేనటువంటి బ్రహ్మశిల్పాన్ని సుందరంగా చెక్కారు. బ్రహ్మ పద్మాసనంలో కూర్చొని అభయ హస్తంతో మూడు ముఖాలతోనూ అంటే నాలుగో ముఖం వెనుక భాగంలో ఉంటుంది. నాలుగు చేతులతోనూ చెక్కారు. కిరీటం కూడా ఉంది.
– ప్రాచీన రామలింగేశ్వర స్వామి (రామేశ్వరాలయం) దేవస్థానం భూప్రణాళిక నక్షత్ర, తామరపుష్పాల ఆకారం, గర్భగుడి నవరంగ మండపం చతుర్థ నాలుగు శిలా స్తంభాలతో నిర్మితమై ఉంది. నాలుగు పక్క శాసనభాగాలతో ఒకవైపు శివలింగం నంది-చంద్రున్ని, మరోవైపు కాళికాఅమ్మవారు అభయమిస్తున్నట్టు ఒకవైపు ముగ్గుర్ని శిల్పాలుగా చెక్కారు. పైభాగంలో ధర్మచక్రాన్ని కళ్యాణిచాళుక్య రాజుల రాజముద్రికను చెక్కారు. ద్వీప ధ్వజస్తంభ శాసనం కాక దేవాలయ వెనుకభాగంలో కళ్యాణిచాళుక్య రాజుల శిల్పాలు, నాగశిల్పాలు, శివలింగం శిల్పాలు ప్రతిష్ఠించారు.
ఒకటో శాసనం
జినకంభ మలిసిద కడబాదల సాసనంగే దంబరది
సినాసదట వసుధా కాపోవమ
– – – – లో క రంజను రాగధీ….
గత – – – బడె బడిసి బిట్ట
ఱం – – – కగంన్వర – – – వెత్తనె
ళ – – – రొం కడినె తరుళ్ల బ
ఇన్తి సమస్త లోక కఱ్చి వ
న్తి గ ఆహవమల్లను శ్రీ సామ
న్త నిరిబాడ శ్రీ రిపు చాళుక్య
తాన్తక నుడి కాన్త దొళొకు
భిక్యతా నఱి యోసూమ నృపాళన
రాజమం సామస్త నుడి తొడితా
– – – మి బడనుఱి
రెండో శాసనం
స్వస్తి సకవశ…….. యా
నంద సంవత్సరద ఉత్తరా
యణద సంక్రాన్తి ము……
బృహస్పతి వారదండు
స్వస్తి సమస్త రాజ్యశ్రీ
ప్రధ్వీ వల్లభ మహారా
జాధిరాజ పరమేశ్వరం
పరమ భట్టారకం సత్యాశ్ర
యకుళతిళక (ం) చాళుక్యా
భరణం శ్రీమద్విక్రమాది
త్యదేవరు సుఖ సంకథావి
నూదదిం రాజ్యంగెయ్యుత్తువిరె
స్వస్తి సమధిగత ప… మ
హాశబ్ద మహామణ్డళేశ్వరం
సుభట నారాయణం కీ…… విళా
సంశ్రీ మత్సంప పెమ్మా….. నడిగుళు
కిఱియ కన్ది వక్ఖాణి దేవరిగె
శ్రీపాదం గళం కఱ్చి నామేశ్వర
దేవరిగె కోవూర నెరడుం భోగముం
మసవ్వా…భ్యనర్త సిద్ధి యాగి కోట్టర్
ప్రభు బుయ్యనయ్యనుం మార
జయ్యనుం మాడికెబ్బె వుం ముక్క
ణయ్యంగె పుణ్య వక్కెన్దు త
మ్మ భట్ట సామ్యద తేజ వృత్తియం
శ్రీమత్పంప పెమ్మా….. నడిగళ్ భూ
సురదోళు వక్ఖాణ దేవరి (గె)
కాలుగఱ్చి కోట్టరు ఇన్తి
శ్రీపంప రుసరుం బ్రభు బు
య్యణయ్యను మాడిద ధ
మ…. మాచస్ద్ర స్థాయి శా
సనం॥ అయ్వత్తుత
పోధనరు విద్వాగమం
(-) యి వదరిగె గ్రాసం న
సువుదు॥గనద్రబ్య
కొదుకోణ్డుదం బుదు
బ్రహ్మ చాయ్య…… నాంచాయ్య….
వనడ సుడ
మూడో శాసనం
శ్రీమత్ భటారర చండిసె
ట్టియ మగనుబ (సవ)
నాయక సిల గ యని ఱె
– డుసగ్గ… –
నాలుగో శాసనం
శ్రీమతు అళియ నావ సెట్టియ మగల కు మణ…. స్వగ్గం క్కె సంద॥
స్వస్తి శ్రీమచ్చాళుక్య విక్రమదగం నెయక్రో
ధన సంవత్సరద మాసు
దమానాస్య సోమవా
రదందు కిఱియకన్ది
య – – – – – సకళమా
డి బిజనకెలుయ దిద
……. సరయున్తాకెఱె….
కొట్ట బిట్టరు ఈ ధమ్మ…. ద
– సామ్యకా
మొదదలి ఇదనా
వా నున్చాప్ప
వారణాసి
యోళు బ్రాహ్మణరు
-శ్రీశ్రీశ్రీశ్రీ
ఐదో శాసనం
– దివితెపణ్ణితర్ మాడిసిదర్
వారిపుసి బేతోజన మగం
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?
దేశాల అనుసంధానం.. వాణిజ్య అంతఃసంబంధం
కణ బాహ్య జీర్ణక్రియ
ఇంటి పని వద్దన్నవారు.. స్వీయ శిక్షణ ఉండాలన్నవారు
జీవావరణ వ్యవస్థకు కావలసిన మూలశక్తి దారులు?
మౌజియన్ అనే గ్రీకు పదానికి అర్థం?
సమాజ మేధో కేంద్రాలు.. నాగరికతకు చిహ్నాలు