భక్తి ఐదు రకాలు
-శాంతి భక్తి: రసానుభవ స్థితిలో పరమాత్మతో ఐక్యమయ్యే భక్తి.
-దాస్యభక్తి: భగవత్సేవకు భక్తుడు తనను తాను సమర్పించుకునే భక్తి.
-సఖ్యభక్తి: భగవంతున్ని ప్రాణమిత్రునిగా ఆరాధించే భక్తి.
-వాత్సల్య భక్తి: భగవంతున్ని పుత్రవాత్సల్యంతో ప్రేమించే భక్తి.
-మధుర భక్తి: భగవంతున్ని భర్తగా ఉపాసించే భక్తి.
భక్తి ఉద్యమ ముఖ్య లక్షణాలు
1. ఏకేశ్వరోపాసన.
2. విగ్రహారాధనపై వ్యతిరేకత.
3. కులవ్యవస్థ ఖండన.
4. మతకర్మకాండలు, తీర్థయాత్రలపై నిరసన.
5. ప్రాంతీయ భాషల్లో బోధన.
6. హిందూ మహ్మదీయ సఖ్యత.
భక్తి ఉద్యమకారుల్లో ప్రధాన వర్గాలు సద్గుణ వర్గం
-ఈ వర్గంవారు భగవంతుడు ఆకారాన్ని, రూపాన్ని కలిగి ఉంటాడని భావించారు.
-విగ్రహారాధన, తీర్థయాత్రలు చేయాలని పేర్కొన్నారు. ఈ వర్గంలో ప్రధాన భక్తిప్రవక్తలు.. చైతన్యుడు, సూరదాస్, మీరాబాయి, శంకరదాస్, తులసీదాస్ నిర్గుణవర్గం
-భగవంతుడు నిరాకారుడు, విగ్రహారాధన, తీర్థయాత్రలు చేయరాదు.
-కబీర్, గురునానక్, దాదుదయాల్, రాయదాస్, సుందరదాస్లు ఈ వర్గంలోని భక్తిప్రవక్తలు.
నింబార్కుడు
-11వ శతాబ్దానికి చెందిన ఆంధ్రబ్రాహ్మణుడు, రామానుజాచార్యునికి సమకాలీనుడు.
-వేదాంత పారిజాత సౌరభం పేరుతో బ్రహ్మ సూత్రాలకు భాష్యం రాశాడు. ఇతని సిద్ధాంతాన్ని ద్వైతాద్వైతం అంటారు. దీనిని భట్టభాస్కరుని భేదభేద వాదంతో పోలుస్తారు.
-ఉత్తరాదికి తరలివెళ్లి మధురను కేంద్రంగా చేసుకొని రాధాకృష్ణుల భక్తిని ప్రచారం చేశాడు.
రామానందుడు
-15వ శతాబ్దానికి చెందిన ఇతను ఉత్తరప్రదేశ్లోని ప్రయాగ వద్ద జన్మించాడు.
-ఇతని 12 మంది శిష్యులను అవదూతలు అని పిలిచేవారు. వీరు వేర్వేరు అల్పవర్గాలకు చెందినవారు. 1. రవిదాసు (దళితుడు) 2. కబీర్ (మహ్మదీయుడు) 3. ధనిన (రైతు) 4. సేన (క్షురకర్మకుడు) 5. పీప (రాజవంశీయుడు) 6. భవానంద 7. సుఖానింద 8. ఆశానంద 9. పరమానంద 10. సంసురానంద 11. మహానంద 12. శ్రీఆనంద
-కుల, మతాలకు అతీతంగా తొలిసారి భక్తిని ప్రతిపాదించాడు. సీతరామ భక్తిని ప్రవేశపెట్టాడు.
-హిందీ భాషలో బోధించాడు.
-ఆనందభాష్యం అనే గ్రంథం రచించాడు.
-ఇతని గీతాన్ని గుర్గ్రంథ సాహెబ్లో చేర్చారు.