మూసారాముడు అని ఎవరిని పిలిచేవారు?
ముజఫర్ జంగ్ (1750-51)
-ఇతను నిజాం ఉల్ ముల్క్ కుమార్తె ఖైరున్నిసా కుమారుడు.
-ఇతడికి సహాయంగా వచ్చిన ఫ్రెంచ్‌వారికి మచిలీపట్నం, యానాం దీవి ప్రాంతాలను బహుమానంగా ఇచ్చాడు.
-ఇతడిని 1751లో కడప, కర్నూలు నవాబులకు నాయకుడైన హిమ్మత్ఖాన్ హత్య చేశాడు.
-దీంతో హైదరాబాద్‌లో ఫ్రెంచ్ అధికారి అయిన బుస్సీ సలాబత్ జంగ్‌ను హైదరాబాద్ నవాబ్‌ని చేశాడు.
సలాబత్ జంగ్ (1751-61)
-ఇతడు నవాబు అయిన తర్వాత ఫ్రెంచివారికి కొండపల్లి, గుంటూరు, ఏలూరు, రాజమండ్రి, చికాకోల్ మొదలైన కోస్తా ప్రాంతాలను ఇచ్చాడు.
-దక్షిణ కృష్ణా ప్రాంతంపై డూప్లెక్స్‌ను గవర్నర్‌గా నియమించాడు.
-ఈ విధంగా దక్కన్లో ఫ్రెంచివారి ప్రతిష్ఠ పెరిగింది.
-ఆ తర్వాత దక్కన్లో బ్రిటిష్‌వారి ప్రాబల్యం పెరగ్గానే సలాబత్‌జంగ్ 1759లో పై ప్రాంతాలను ఫ్రెంచివారి నుంచి తిరిగి తీసుకొని ఇంగ్లిష్ వారికి బహూకరించాడు.
-ఇతని కాలంలో ప్రసిద్ధిగాంచిన బొబ్బిలి యుద్ధం క్రీ.శ. 1757 జనవరి 24న జరిగింది.
నిజాం అలీఖాన్ (1761-1803)
-ఇతడు తన అన్న సలాబత్‌జంగ్‌ను బంధించి, హత్య చేయించిన తర్వాత హైదరాబాద్ నిజాంగా ప్రకటించుకున్నాడు.
-ఇలా నిజాంగా ప్రకటించుకున్న మొదటి పాలకుడు నిజాం అలీఖాన్.
-నాటి నుంచి నిజాం బిరుదు వంశపారంపర్యంగా రావడం ప్రారంభమైంది.
-ఇతడిని రెండో అసఫ్‌జా అని కూడా అంటారు.
-కాడ్రేగుల జోగిపంతులు దౌత్యంతో నిజాం అలీఖాన్ ఆంగ్లేయులకు తొమ్మిది లక్షల రూపాయల గుత్తానికి ఐదు ఉత్తర సర్కారులను ఇచ్చాడు.
-లార్డ్ వెల్లస్లీ ప్రవేశపెట్టిన సైన్య సహకార ఒప్పందంలో 1798 సెప్టెంబర్ 1న చేరాడు. ఇలా మొదటగా చేరిన స్వదేశీరాజుగా గుర్తించబడ్డాడు.
-నిజాం ఈ ఒప్పందంలో చేరడానికి కిర్క్‌ప్యాట్రిక్ కీలక పాత్ర పోషించాడు.
-ఒప్పందానికి పూర్వం నిజాం పాలనలో రెండు ఆంగ్ల సైనిక పటాలాలు ఉండేవి. దీనికితోడు ఒప్పందం ప్రకారం మరో ఆరు సైనిక పటాలాలు సమకూర్చారు.
-ఈ ఆరు సైనిక పటలాలకు ఏటా అయ్యే ఖర్చు రూ. 24,17,100 నిజాం చెల్లించాలి.
-ఇతని కాలంలో కిర్క్‌ప్యాట్రిక్ హైదరాబాద్‌లో బ్రిటిష్ రెసిడెన్సీ భవనాన్ని ఖైరున్నిసా కోసం నిర్మించాడు.
-ఇతడి కాలంలో ఫ్రెంచ్ అధికారి రేమండ్‌ను మూసారాముడిగా పిలిచేవారు.
-ఇతడి పేరుమీదుగానే మూసారాంబాగ్ ఏర్పడింది.
-నిజాం అలీ సహాయంతో రేమండ్ గన్‌ఫౌండ్రీని ఏర్పాటుచేశాడు.
-నిజాం అలీ సేనాని అయిన మీర్ ఆలం తన పేరుమీదుగానే మీరాలం చెరువును తవ్వించాడు.
సికిందర్ జా (1803-29)
-ఇతడు నిజాం అలీఖాన్ రెండో కుమారుడు.
-ఇతడి పేరుమీదుగానే సికింద్రాబాద్ నగరం నిర్మితమైంది.
-ఇతడి కాలంలో హెన్రీ రస్సెల్.. బ్రిగేడ్ అనే ప్రత్యేక సైనిక దళాన్ని ఏర్పర్చాడు.
-రస్సెల్ బ్రిగేడ్ దళం సహాయంతో నిజాం 1817లో పిండారీలను అణచివేశాడు. 1818 మరాఠా యుద్ధంలో పాల్గొంది.
-ఈ దళం 1818-20ల మధ్య సంస్థానంలో జరిగిన తిరుగుబాట్లను అణచివేయగలిగింది.
-తర్వాత కాలంలో రస్సెల్ బ్రిగేడ్ దళాన్ని హైదరాబాద్ కంటింజెంట్ ఫోర్స్‌గా పిలిచేవారు.
-ఈ దళ నిర్వహణ కోసం సికిందర్జా ప్రధాని చందూలాల్ పామర్ అండ్ కో అనే సంస్థ నుంచి సుమారు రూ. 60 లక్షల అప్పు తీసుకున్నాడు.
-దీనికి బదులుగా బీరార్ వర్తకపు హక్కులు ఈ కంపెనీకి ఇచ్చారు.
-అయితే ఈ మోసపూరిత అప్పును తిరిగి చెల్లించడంలో బ్రిటిష్ రెసిడెంట్ అధికారి చార్లెస్ మెట్కాఫ్ నవాబుకు సహకరించాడు.
-సికిందర్జా ప్రధాని చందూలాల్ కర్నూలులో అహోబిలం దేవాలయాన్ని నిర్మించాడు.
నాసిరుద్దౌలా (1829-57)
-ఇతడు నిజాంగా బాధ్యతలు చేపట్టగానే రాజ్యంలోని యూరోపియన్ సూపరింటెండెంట్లను ఉపసంహరించాడు.
-ఇతడి కాలంలోనే ఇతడి సోదరుడు ముబారిజ్ ఉద్దౌలా హైదరాబాద్‌లో వహాబీ ఉద్యమం చేపట్టాడు.
-బ్రిటిష్‌వారికి వ్యతిరేకంగా జరిగిన ఈ వహాబీ ఉద్యమంలో ముబారిజ్ ఉద్దౌలాకు టోంకు, రాంపూర్, ఒడియగిరి, కర్నూల్ నవాబులు మద్దతు పలికారు.
-అయితే హైదరాబాద్‌లో అప్పటి బ్రిటిష్ రెసిడెంట్ జనరల్ ఫ్రేజర్.. ముబారిజ్ ఉద్దౌలాను అరెస్టు చేయమని నిజాం మీద ఒత్తిడి చేశాడు.
-దీంతో నిజాం నవాబు నాసిరుద్దౌలా తన సోదరుడిని గోల్కొండ కోటలో బంధించాడు. ముబారిజ్ ఉద్దౌలా ప్రభుత్వ నిర్బంధంలోనే గోల్కొండ కోటలో 1854 జూన్ 25న మరణించాడు.
-ఇతడి మరణానంతరం దక్కన్లో వహాబీ ఉద్యమం నిలిచిపోయింది.
-1853 మే 21న బీరార్ ఒప్పందం ప్రకారం నాసిరుద్దౌలా బ్రిటిష్‌వారికి బీరార్, రాయచూర్, ఉస్మానాబాద్ ప్రాంతాలను ఇచ్చాడు.
-బ్రూస్నార్టజ్ తన ది రిబేలియన్ ఇన్ ఇండియా అనే గ్రంథంలో బీరార్ ఒప్పందం గురించి న్యాయదేవత చెవుల్లో దూదిపెట్టి ఆంగ్లేయులు చెవిటి, గుడ్డిదాన్ని చేశారు అని రాశారు.
-ఈ ఒప్పందాన్ని అవమానకరంగా భావించిన సిరాజ్ ఉల్‌ముల్క్ అస్వస్థతకు గురై మరణించాడు.
-దీంతో అతని మేనల్లుడు 24 ఏండ్ల మీర్ తురబ్ అలీఖాన్ (1వ సాలార్జంగ్) హైదరాబాద్ దివాన్ అయ్యాడు.
-1857 మే 10న మీరట్‌లో సిపాయిల తిరుగుబాటు ప్రారంభమైనప్పుడు హైదరాబాద్‌కు నాసిరుద్దౌలా నవాబుగా ఉన్నాడు.
-తిరుగుబాటు ప్రారంభమైన వారం రోజులకు నాసిరుద్దౌలా మరణించడంతో అఫ్జల్ ఉద్దౌలా నవాబు అయ్యాడు.
అప్జల్ ఉద్దౌలా (1857-69)
-ఇతడి కాలంలో 1857 తిరుగుబాటు జరిగింది.
-ఇందులో భాగంగా హైదరాబాద్ రెసిడెన్సీ భవనంపై తుర్రెబాజ్‌ఖాన్ దాడి చేశాడు. కానీ ఆ దాడిని డేవిడ్సన్ తిప్పికొట్టాడు.
-అప్జల్ ఉద్దౌలా 1857 తిరుగుబాటు కాలంలో బ్రిటిష్ వారికి మద్దతు పలికి స్టార్ ఆఫ్ ఇండియా అనే బిరుదును పొందాడు. అంతేకాకుండా రాయచూర్, ఉస్మానాబాద్ ప్రాంతాలను బ్రిటిష్‌వారి నుంచి తిరిగి పొందాడు.
-ఇతడి కాలంలో ప్రధాని మొదటి సాలార్జంగ్ అనేక సంస్కరణలు చేశాడు.
-1859-66 మధ్యకాలంలో అఫ్జల్‌గంజ్ (నయాపూల్) వంతెన ఇతడి కాలంలోనే నిర్మితమైంది.
మీర్ మహబూబ్ అలీఖాన్ (1869-1911)
-ఇతడు మైనర్‌గా ఉన్నప్పుడే పాలకుడు కావడంతో పాలనా బాధ్యతలు సాలార్జంగ్-I, షంషద్ ఉమ్రాలకు అప్పగించబడ్డాయి.
-మీర్ మహబూబ్ అలీఖాన్ కాలంలోనే సాలార్జంగ్-I తన సంస్కరణలన్నింటినీ పూర్తిగా అమలు చేశాడు.
-1883లో సాలార్జంగ్-I మరణించిన తర్వాత అప్పటి భారత గవర్నర్ జనరల్ లార్డ్ రిప్పన్ హైదరాబాద్‌లో పర్యటించి హైదరాబాద్ పాలనా బాధ్యతలు మీర్ మహబూబ్ అలీఖాన్‌కు అప్పగించాడు.
-1883లో చందారైల్వే పథకం సంఘటన జరిగింది.
-1888లో హైదరాబాద్‌లోని ప్రజలు ఇతడి కాలంలో మొదటటిసారి ముల్కీ హక్కులను డిమాండ్ చేశారు. అప్పట్లో స్థానికంగా అర్హులైనవారు లేరని ఉత్తర భారతదేశానికి చెందినవారిని హైదరాబాద్‌లో ఉద్యోగులుగా నియమించేవారు.
-దీన్ని ఖండిస్తూ 1888లో ఈ విధానాన్ని రద్దు చేయాలని మహబూబ్ అలీఖాన్‌ను ప్రజలు కోరారు.
-దీంతో మహబూబ్ అలీఖాన్ 1888లోనే ముల్కీ నిబంధనలను రూపొందించి స్థానికులనే ఉద్యోగులుగా నియమించాలని ఆదేశించాడు.
-1908లో మూసీనది వరదలు సంభవించినప్పుడు సహాయ చర్యలు తీసుకున్నాడు.
మాదిరి ప్రశ్నలు
1. నిజాంగా ప్రకటించుకున్న తొలి అసఫ్‌జాహీ పాలకుడు? (3)
1) నిజాం ఉల్ ముల్క్ 2) సలాబత్ జంగ్
3) నిజాం అలీఖాన్ 4) మీర్ ఉస్మాన్ అలీఖాన్
2. హైదరాబాద్‌లో వహాబీ ఉద్యమం ఏ నిజాం కాలంలో జరిగింది? (1)
1) నాసిరుద్దౌలా 2) సికిందర్ జా
3) అఫ్జల్ ఉద్దౌలా 4) నిజాం అలీఖాన్
3. ఏ నిజాం వద్ద మొదటి సాలార్జంగ్ దివాన్‌గా పనిచేయలేదు? (4)
1) నాసిరుద్దౌలా 2) అఫ్జల్ ఉద్దౌలా
3) మీర్ మహబూబ్ అలీఖాన్ 4) సికిందర్ జా
4. కిందివాటిలో సరైనవి (4)
1) ముబారిజ్ ఉద్దౌలా – హైదరాబాద్‌లో వహాబీ ఉద్యమానికి నాయకత్వం వహించాడు
2) తుర్రెబాజ్‌ఖాన్ – హైదరాబాద్‌లో సిపాయిల తిరుగుబాటుకు నాయకత్వం వహించాడు.
3) 1 మాత్రమే సరైంది 4) రెండూ సరైనవి
5. బీరార్ ఒప్పందం జరిగినప్పుడు హైదరాబాద్ ప్రధాని (2)
1) చందూలాల్ 2) సిరాజ్ ఉల్ ముల్క్
3) మొదటి సాలార్ జంగ్ 4) మీర్ ఆలం
6. మూసారాముడు అని ఎవరిని పిలిచేవారు? (2)
1) కిర్క్‌ప్యాట్రిక్ 2) రేమండ్
3) జనరల్ ఫ్రేజర్ 4) హెన్రీ రస్సెల్
7. నిజాం అలీ సైన్య సహకార ఒప్పందంలో చేరింది? (1)
1) 1798, సెప్టెంబర్ 1 2) 1798, అక్టోబర్ 1
3) 1798, ఆగస్టు 1 4) 1798, నవంబర్ 1
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?
దేశాల అనుసంధానం.. వాణిజ్య అంతఃసంబంధం
కణ బాహ్య జీర్ణక్రియ
ఇంటి పని వద్దన్నవారు.. స్వీయ శిక్షణ ఉండాలన్నవారు
జీవావరణ వ్యవస్థకు కావలసిన మూలశక్తి దారులు?
మౌజియన్ అనే గ్రీకు పదానికి అర్థం?
సమాజ మేధో కేంద్రాలు.. నాగరికతకు చిహ్నాలు