దేశంలోని ముఖ్య నౌకాశ్రయాలివీ!
కాండ్లా పోర్ట్- గుజరాత్
గుజరాత్లో అతిపెద్ద పోర్ట్ ఇది. 1950లో దీని నిర్మాణం జరిగింది. కచ్ జిల్లాలో గాంధీధామ్ సిటీకి దగ్గరలో ఈ పోర్ట్ ఉంది. ఇండియాలోనే కాకుండా ఆసియాలోనే స్పెషల్ ఎకానమిక్ జోన్‌గా ప్రసిద్ధి. పెట్రోలియం, కెమికల్స్, ఐరన్, విత్తనాలు, ఉప్పు, వస్త్ర పరిశ్రమకు సంబంధించిన వస్తువులను ఎగుమతి, దిగుమతి చేస్తుంది. భారతదేశంలోనే అత్యధిక ఆదాయ వనరుగా ఈ పోర్ట్‌కు పేరుంది. గుజరాత్లో ఈ పోర్ట్ కాకుండా, ముంద్రా అనే మరో పోర్ట్ కూడా ఉంది. ఇది దేశంలో అతిపెద్ద ప్రైవేట్ పోర్ట్.
జవహర్లాల్ నెహ్రూ- మహారాష్ట్ర
దీన్ని నవ సేవ ఓడరేవు అని కూడా పిలుస్తారు. 1989 మే 26న ప్రారంభమైంది. మహారాష్ట్రలోని కొంకన్ తీర ప్రాంతంలో ఈ ఓడరేవు ఉంది. దేశంలోనే అతిపెద్ద కంటైనర్ వ్యవస్థ కలిగిన పోర్ట్ ఇది. అంతర్జాతీయంగానూ కంటైనర్ వ్యవస్థను కలిగి ఉన్నందున కింగ్ ఆఫ్ పోర్ట్‌గా కూడా పేరుంది. టెక్స్టైల్స్, మిషనరీ, ఆయిల్, కెమికల్స్, కూరగాయల వంటి ఉత్పత్తుల ఎగుమతి, దిగుమతులను కొనసాగిస్తుంది.
ముంబై పోర్ట్
వెస్ట్ ముంబైలో సహజసిద్ధమైన ప్రదేశంలో ఈ పోర్ట్ ఉంది. 1870లో ఈ పోర్ట్ నిర్మాణం జరిగింది. ఇండియాలోనే అతిపెద్ద పోర్ట్ ఇది. క్రూడ్, పెట్రోలియం ఎగుమతి, దిగుమతి చేస్తూ అంతర్జాతీయ కంటైనర్ వ్యవస్థను కలిగి ఉంది.
మార్మగావ్ పోర్ట్- గోవా
గోవాలోని ప్రధాన పోర్ట్ ఇది. 1963లో ప్రధాన నౌకాశ్రయంగా గుర్తించబడింది. గోవాకు ప్రధాన ఆకర్షణగా నిలిచింది. ఇనుము, దానికి సంబంధించిన రా మెటీరియల్‌కు ఎగుమతి కేంద్రంగా మారింది. భారతదేశపు అత్యాధునిక పోర్ట్‌గా పేరుగాంచింది.
పనంబూర్ పోర్ట్- కర్ణాటక
ఈ పోర్టు న్యూ మంగళూరు పోర్ట్‌గా సుపరిచితం. 1974 మే 4న ఈ పోర్ట్ ప్రారంభమైంది. కర్ణాటకాలోని దక్షిణ కన్నడ జిల్లాలో సూరత్కల్ రైల్వే స్టేషన్ సమీపంలో ఉంది. కర్ణాటకలో ప్రధానమైన ఈ పోర్టు దేశంలో అతిపెద్ద పోర్టు అని చెప్పవచ్చు. మాంగనీస్, గ్రానైట్ స్టోన్స్, కాఫీ, కలప, పెట్రోలియం వంటి ఉత్పత్తులను ఎగుమతి చేస్తుంది.
కొచ్చిన్ పోర్ట్- కేరళ
దేశంలోని అతిపొడవైన పోర్ట్ ఇది. 1928 మే 26న ప్రారంభమైంది. అరేబియా సముద్రానికి ప్రధాన పోర్ట్ కూడా. విల్లింగ్డన్, వల్లర్పడం అనే ద్వీపాల మీద ఈ పోర్ట్ ఉంది. సముద్ర సుగంధాలను కలిగిన పోర్ట్ ఇది. దీనికి సొంతంగా కొచ్చి అనే ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కూడా ఉంది.
టుటికోరిన్ పోర్ట్-తమిళనాడు
లోతైన సముద్ర నౌకాశ్రయం ఇది. దేశంలో ఉన్న ఇతర పోర్టుల్లోకెల్లా అతి ప్రధానమైంది. 1974లో ప్రారంభమైంది. తమిళనాడులోని అతిపొడవైన రెండో పోర్టే కాకుండా, దేశంలో అతిపెద్ద కంటైనర్ వ్యవస్థను కలిగి ఉంది. బెంగాల్ వద్ద సముద్ర వాణిజ్యం, పెర్ల్ చేపల పెంపకానికి ఉత్తమ ఓడరేవు ఇది. పెర్ల్ సిటీగా ప్రసిద్ధి.
చెన్నై పోర్ట్
దేశంలో అతి పురాతన పోర్ట్ చెన్నై పోర్ట్. 1881లో పోర్ట్ ఆపరేషన్స్ ప్రారంభమయ్యాయి. దేశంలో అతిపెద్ద పొడవైన రెండో నౌకాశ్రయం కూడా. కార్ల కోసం హబ్ పోర్ట్ ఉంది. ఆటోమొబైల్స్, బొగ్గు, ఫర్టిలైజర్స్, పెట్రోలియం ప్రొడక్ట్స్ ఎగుమతి, దిగుమతులను చేస్తుంది. ఈ పోర్ట్ టెర్మినళ్ల చుట్టూ లైట్‌హౌస్, ఇంట్రా పోర్ట్ కనెక్టివిటీ, రైల్వే టెర్మినస్‌ను కలిగి ఉంది.
వైజాగ్ పోర్ట్
ఆంధ్రప్రదేశ్‌లోని విశాఖపట్నంలో ఉంది. 1933, డిసెంబర్ 19న ప్రారంభమైంది. దేశంలో అతి పురాతన ఓడరేవు కాకుండా, అతి పొడవైన నౌకాశ్రయం కూడా. ఆంధ్రప్రదేశ్‌లో వైజాగ్ కాకుండా కాకినాడ నౌకాశ్రయం కూడా ఉంది.
పారదీప్ పోర్ట్- ఒడిశా
ఒడిశాలోని జగత్సింగ్పూర్ జిల్లాలో ఉంది. 1966 మార్చి 12న ప్రారంభమైంది. లోతైన నీటి ఓడరేవు ఇది. సొంత రైల్వే సిస్టమ్ ఈ నౌకాశ్రయానికి ఉంది. జాతీయ రహదారి పోర్ట్, ఇతర రహదారి నెట్‌వర్క్‌ను జత చేస్తుంది.
హల్దియా పోర్ట్- వెస్ట్ బెంగాల్
వెస్ట్ బెంగాల్‌లోని హుగ్లీ నది ఒడ్డున ఈ పోర్ట్ ఉంది. 1967లో ప్రారంభమైంది. కలకత్తాలో ప్రధాన పోర్ట్. కెమికల్స్, పెట్రో కెమికల్స్, ఆయిల్స్ వంటి ఉత్పత్తులను దిగుమతి చేస్తుంది.
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?
దేశాల అనుసంధానం.. వాణిజ్య అంతఃసంబంధం
కణ బాహ్య జీర్ణక్రియ
ఇంటి పని వద్దన్నవారు.. స్వీయ శిక్షణ ఉండాలన్నవారు
జీవావరణ వ్యవస్థకు కావలసిన మూలశక్తి దారులు?
మౌజియన్ అనే గ్రీకు పదానికి అర్థం?
సమాజ మేధో కేంద్రాలు.. నాగరికతకు చిహ్నాలు