Bhringaraj oil | భృంగరాజ్ తైలం లభించే మొక్క?
1. ఆరో కార్బన్‌పై కీటోన్ సమూహం ఉండే నత్రజని క్షారాలు?
1) అడినిన్, సైటోసిన్ 2) అడినిన్, థైమిన్
3) థైమిన్, గ్వానిన్ 4) ఏదీకాదు
2. CCA కోడాన్ దేనిలో ఉంటుంది?
1) m-RNA 2) t-RNA 3) r-RNA 4) DNA
3. కింది వాటిలో సరైనది ఏది?
ఎ. ఒకే mRNA తో కలిసి ఉండే రైబోజోమ్‌ల
సమూహం – పాలీజోమ్లు
బి. జన్యు సంకేతం రూపం – త్రిక సంకేతం
సి. F1 రేణువులను కనుగొన్నది – ఫెర్నాండెజ్
డి. అనువాదం జరిగే ప్రాంతం – రైబోజోమ్‌లు
1) ఎ 2) ఎ, బి 3) ఎ, బి, సి 4) పైవన్నీ
4. కణంలో జీవక్రియలు అధికంగా జరిగే దశ?
1) అంతర్దశ 2) చలన దశ
3) మధ్యస్థ దశ 4) ప్రథమ దశ
5. వేరు కొనలో ఒక కొన నుంచి 256 కణాలు ఏర్పడాలంటే ఎన్నిసార్లు విభజనలు జరుగాలి?
1) ఐదు 2) ఎనిమిది 3) ఏడు 4) ఆరు
6. జన్యు పునఃసంయోజనాలకు కారణమైన పారగతి వేటి మధ్య జరుగుతుంది?
1) సమజాత క్రోమోజోమ్‌లు, సోదర క్రొమాటిడ్ల మధ్య
2) అసమజాత క్రోమోజోమ్‌లు, సోదర క్రొమాటిడ్ల మధ్య
3) అసమజాత క్రోమోజోమ్‌లు, సోదరేతర క్రొమాటిడ్ల మధ్య
4) సమజాత క్రోమోజోమ్‌లు, సోదరేతర క్రొమాటిడ్ల మధ్య
7. తైపీ అనేది ఏ పంట రకం?
1) సజ్జ 2) జొన్న 3) వరి 4) గోధుమ
8. కింది వాటిలో సరికాని జత ఏది?
1) ఇన్‌గ్రామ్ – స్ట్రెప్టోకోకస్ న్యుమోనియా
2) గ్రిఫిత్ – డిప్లోకోకస్ న్యుమోనియా
3) బీడిల్, టాటమ్ – న్యూరోస్పోరా క్రాసా
4) జాకబ్, మోనాడ్ – ఈ. కోలై
9. వృక్ష సంబంధమైన రీకాంబినెంట్ జన్యు ఇంజినీరింగ్ ప్రక్రియలో విరివిగా ఉపయోగించే బ్యాక్టీరియా?
1) ఎశ్చరేషియా కోలై 2) స్పైరులినా జాతులు
3) సాల్మోనెల్లా జాతులు 4) ఏదీకాదు
10. అణు కత్తెరలు అంటే..?
1) ఆక్సిడోరిడక్టేజ్లు 2) పాలిన్డ్రోమ్లు
3) రెస్ట్రిక్షన్ ఎండోన్యూక్లియేజ్‌లు 4) ప్రొటియేజ్‌లు
11. కింది వాటిలో సరైన వ్యాఖ్య ఏది?
ఎ. సూర్యకాంతి నుంచి శక్తిని ATP అణువుల
రూపంలోకి మార్చే కణాంగాలు- హరిత రేణువులు
బి. కార్బోహైడ్రేట్లలో శక్తిని ATP అణువుల రూపంలోకి మార్చే కణాంగాలు- మైటోకాండ్రియన్లు
1) ఎ 2) బి 3) ఎ, బి 4) ఏదీకాదు
12. ఆటోక్లేవ్ దేనికి ఉపయోగిస్తారు?
1) పోషక కణజాల యానకం తయారు చేయడానికి
2) వర్ధన యానకాన్ని సూక్ష్మజీవిరహితం చేయడానికి
3) ఎక్స్‌ప్లాంట్‌ను తయారు చేయడానికి
4) ఎక్స్‌ప్లాంట్‌ను అంతర్నివేశనం చేయడానికి
13. కిందివాటిలో సరికానిది ఏది?
ఎ. కేంద్రకానికి వెలుపలగల జీవపదార్థం- సైటోప్లాజమ్
బి. మొక్కల్లో కణకవచ పదార్థాన్ని స్రవించే నిర్మాణం-
గాల్జీసంక్లిష్టం
సి. కేంద్రకం లోపలి జీవపదార్థం- న్యూక్లియోప్లాజమ్
డి. జీవపదార్థాన్ని కొనుగొన్న శాస్త్రవేత్త- ట్వార్ట్
1) ఎ, సి 2) బి 3) ఎ, బి, సి 4) ఏదీకాదు
14. పరాగకోశ వర్ధనంలో ఏ రసాయనం ద్వారా ద్వయస్థితిక మొక్కలను రూపొందించవచ్చు?
1) బోరిక్ ఆమ్లం 2) కాల్చిసిన్
3) నాఫ్తలీన్ 4) ఇథలీన్
15. దారు కేంద్రక నాళికాపుంజాలు దేనిలో ఉంటాయి?
1) హీవియా 2) కుకుర్బిటేసి
3) సెలాజినెల్లా 4) పైవన్నీ
16. వృక్ష సామ్రాజ్యాన్ని పుష్పించే మొక్కలు, పుష్పించని మొక్కలు అని వర్గీకరించినది?
1) ఐక్లర్ 2) లిన్నేయస్ 3) డార్విన్ 4) జాన్ రే
17. భృంగరాజ్ తైలం ఏ మొక్క నుంచి లభిస్తుంది?
1) కోకస్ 2) రిసినస్ 3) అరాఖిస్ 4) ఎక్లిప్టా ఆల్బ
18. ఫలాలు, వాటి మొక్కల శాస్త్రీయ నామాలను జతపర్చండి.
ఎ. బత్తాయి 1. సిట్రస్ సైనెన్సిస్
బి. జామ 2. సిడియం గుజావా
సి. పుచ్చ 3. సిట్రులస్ వల్గారిస్
డి. దానిమ్మ 4. ప్యూనికా గ్రానేటమ్
1) ఎ-4, బి-2, సి-3, డి-1 2) ఎ-1, బి-2, సి-3, డి-4
3) ఎ-3, బి-1, సి-4, డి-2 4) ఎ-1, బి-2, సి-4, డి-3
19. దేశంలో ఎక్కువ మంది అనుసరిస్తున్న వర్గీకరణ విధానం?
1) ఎంగ్లర్, ప్రాంటల్ వర్గీకరణ
2) లిన్నేయస్ వర్గీకరణ
3) బెంథామ్-హుకర్ వర్గీకరణ
4) హచిన్సన్ వర్గీకరణ
20. గ్రామినే కుటుంబపు పరిపత్రాలను ఏమంటారు?
1) లాడిక్యూల్స్ 2) రోస్టెల్లమ్
3) స్కుటెల్లమ్ 4) కరోనా
21. వేరు పీడనాన్ని దేనితో కొలుస్తారు?
1) ఆక్సలోమీటర్ 2) ఫొటోమీటర్
3) థర్మామీటర్ 4) మానోమీటర్
22. మృత్తికా వాతావరణంలో గాలి గాఢత శాతం?
1) 0.05 2) 0.03 3) 0.5 4) 0.01
23. కాల్విన్ తన పరిశోధనల్లో వాడిన రేడియోధార్మిక ఐసోటోప్?
1) C14 2) C15 3) C18 4) C12
24. ఎంజైమ్‌లు, వాటి తరగతులకు సంబంధించి సరికాని జత?
1) మ్యుటేజ్- ఐసోమిరేజ్
2) ట్రాన్స్ అమైనేజ్- లయేజ్
3) RuBISCO- కార్బాక్సిలేజ్
4) ఫ్యూమరేజ్- హైడ్రోలేజ్
25. కింది వాటిలో శ్వాసక్రియ జరుపుకోని జీవి?
1) బ్యాక్టీరియా 2) శైవలం 3) వైరస్ 4) శిలీంధ్రం
26. వెర్మిఫామ్ ఉపాంగం కలిగిన అంకురచ్ఛదం ఉండే మొక్క?
1) గ్రీవెల్లియా రోబస్టా 2) ఆర్జిమోన్
3) జియామేజ్ 4) మిరాబిలిస్ జలాపా
27. పరాగరేణువుకు బీజ రంధ్రాలు, బీజ చారలు ఉంటే ?
1) కోల్పేట్ 2) కోల్పోరేట్ 3) పోరేట్ 4) కెటాట్రీమ్
28. పిండకోశం అడుగుభాగంలో ఉండే చక్రం లాంటి నిర్మాణం?
1) చలాజా 2) ఎపిస్టేజీ 3) హైపోస్టేజీ 4) కారంకుల్
29. కింది వాటిలో సరికాని వ్యాఖ్య ఏది?
ఎ. అనుకూల పరిస్థితులు ఉన్నా విత్తనాలు వెంటనే
మొలకెత్తలేక పోవడమే సుప్తావస్థ
బి. ఫలదీకరణ జరుగకుండా పుష్పంలోని అండాశయం
నుంచి ఫలం ఏర్పడటమే అనిషేకఫలనం
1) ఎ 2) బి 3) ఎ, బి 4) ఏదీకాదు
30. విత్తనం మొక్క మీద ఉండగానే మొలకెత్తడాన్ని ఏమంటారు?
1) సుప్తావస్థ 2) వివిపారీ
3) అంకురణ తేజం 4) స్కారిఫికేషన్
31. 1943లో బెంగాల్లో కరువుకు కారణమైన పరాన్నజీవి?
1) హెల్మింథోస్పోరియం ఒరైజే
2) పక్సీనియా గ్రామినస్
3) రైజోక్టోనియా సోలానీ 4) పెరిక్యులేరియా ఒరైజా
32. మొక్కలకు సంక్రమించే తెగుళ్లు, వాటికి కారణమయ్యే సూక్ష్మజీవులను జతపర్చండి.
ఎ. పత్తిలో కోణీయ ఆకుమచ్చ తెగులు
1. సెఫలయోరస్ వెర్సెన్స్
బి. ఆలుగడ్డలో ఎర్లీైబ్లెట్ తెగులు
2. ఆల్టర్నేరియా సోలానీ
సి. టీ మొక్కల్లో రెడ్స్ట్ తెగులు
3. పక్సీనియాస్ట్రిషార్మిస్
డి. గోధుమలో ఎల్లోరస్ట్ తెగులు
4. జాంథోమోనాస్ మాల్వేసియారం
1) ఎ-1, బి-2, సి-3, డి-4 2) ఎ-4, బి-3, సి-2, డి-1
3) ఎ-3, బి-4, సి-1, డి-2 4) ఎ-4, బి-2, సి-1, డి-3
33. కింది వాటిలో ముఖ్యమైన వ్యాధి నిరోధక చర్య ఏది?
1) వ్యాధి నిరోధక శక్తిగల వంగడాల సృష్టి
2) వ్యాధి నిరోధక రసాయనాలు చల్లడం
3) తెగులు సోకిన మొక్కలను నిర్మూలించడం
4) విత్తనశుద్ధి
34. బ్యాక్టీరియాను నాశనం చేసే సూక్ష్మజీవ నాశకం?
1) అగ్రిమైసిన్ 2) బ్లాస్టిసిడిన్
3) స్ట్రెప్టోమైసిన్ 4) పైవన్నీ
35. సిట్రస్ కాంకర్ వ్యాధికి అనుకూలమైన ఉష్ణోగ్రత?
1) 10-200C 2) 20-300C
3) 27-390C 4) 0-100C
36. ఎకలాజికల్ పిరమిడ్‌లో అగ్రభాగంలో ఉండేవి?
1) ఉత్పత్తిదారులు 2) శాకాహారులు
3) మాంసాహారులు 4) విచ్ఛిన్నకారులు
37. సామాజిక వన పెంపకాల్లో పెంచుతున్న అనేక ప్రయోజనాలున్న జాతి?
1) మాంజీఫెరా 2) ల్యూసీనా 3) రోజా 4) అజడరిక్టా
38. కింది వాటిలో సరికానిది ఏది?
ఎ. రాళ్లపై ఎదిగే మొక్కలు- లిథోఫైట్స్
బి. మంచుపై ఎదిగే మొక్కలు- క్రయోఫైట్స్
సి. నీడలో ఎదిగే మొక్కలు- సియోఫైట్స్
డి. ఇసుకపై ఎదిగే మొక్కలు- సామోఫైట్స్
1) ఎ 2) ఎ, బి 3) ఎ, సి 4) ఏదీకాదు
39. సమశీతోష్ణ మండల ప్రాంతాల్లో హ్యూమిఫికేషన్ చర్య నెమ్మదిగా జరుగడంవల్ల పేరుకుపోయే సేంద్రియ పదార్థం?
1) పీట్ 2) డఫ్ 3) మోర్ 4) ఏదీకాదు
40. గ్రీన్హౌస్ ఎఫెక్ట్ ఏ వాయువువల్ల కలుగుతుంది? (2)
1) SO2 2) CO2 3) NO2 4) SO2
41. పామాయిల్ దేన్నుంచి లభిస్తుంది?
(4) 1) హీలియాంథస్ 2) ట్రైడాక్స్
3) అరాఖిస్ హైపోజియా 4) ఇల్యుసిన్ కోరకానా
42. అంతర్జాతీయ వరి పరిశోధనా సంస్థ (IRRI) ఎక్కడ ఉంది?
1) కటక్ 2) న్యూఢిల్లీ
3) ఫిలిప్పైన్స్ 4) బీజింగ్
43. కింది వాటిలో సరికాని వ్యాఖ్య?
1) విశాల వరణంలో పైరు రకానికి చెందిన మొక్కల్లో
విషమయుగ్మజ స్థితి ఉంటే మంచి ఫలితాలు
కనిపిస్తాయి.
2) పరపరాగ సంపర్కం జరిగే వన్య రకాలుగానీ,
స్థానికంగా ఉండే పైరు రకాలనుగానీ తొందరగా
అభివృద్ధి చేయడానికి విశాలవరణం ఒక్కటే మార్గం.
3) విశాలవరణం పంట దిగుబడిని, నాణ్యతను పెంచడానికి ఉపయోగపడదు.
4) విశాలవరణంలో వ్యవసాయదారుడు ఒక మిశ్రమ పంటలో బాగా కనిపించే, తేజోవంతంగా ఉండే మొక్కలను ఎన్నుకుంటారు.
44. ఈజిప్షియన్ పత్తిగా దేన్ని పేర్కొంటారు?
1) గాసీపియం హిర్సుటం 2) గాసీపియం బార్బడెన్స్
3) గాసీపియం హెర్బేషియం4) గాసీపియం అర్బోరియం
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
తాత్వికతను తెలిపేది.. రాజ్యాంగానికి గుండెలాంటిది
ఎలకానిక్ రికార్డులు.. ప్రాథమిక సాక్ష్యాలు
శుక్రకణాలు తాత్కాలికంగా నిల్వ ఉండే ప్రాంతం?
సెకండరీ ఎడ్యుకేషన్ కమిషన్‌కు మరోపేరు?
‘వెయ్యి ఉరిల మర్రి’ గా పేరుగాంచిన ఊడలమర్రి ఏ జిల్లాలో ఉంది?
రక్షణ దుర్గాలు – నాటి పాలనా విభాగాలు
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?