వైవిధ్యమైన కోర్సులివి..
రొటీన్ కోర్సులకు భిన్నంగా ఏదైనా చేయాలి.. మెదడుకు పదునుపెట్టి సృజనాత్మకతను పెంచుకోవాలి.. అభిరుచి, ఆసక్తికి అనుగుణంగా కొత్తగా ఏదో చేయాలి.. నలుగురిలో ఒకడిగా కాకుండా ప్రత్యేకంగా నిలవాలి.. వాటికి తగ్గట్లు మంచి జీతభత్యాలు పొందాలి అనుకునేవారి కోసమే ఈ వైవిధ్యమైన కోర్సులు..
వీడియో ఎడిటింగ్
-రికార్డ్ చేసిన వీడియోలను ఎడిటింగ్ చేసేవారిని వీడియో ఎడిటర్లు అంటారు. అంటే వీడియోలను కాన్సెప్ట్‌కు అనుగుణంగా అవసర దృశ్యాలను తీసుకుని, అనవసరమైనదానిని కట్‌చేసి, ఆకర్షణీయంగా తీర్చిదిద్దే కళను వీడియో ఎడిటింగ్ అంటారు. పెండ్లి అయినా ఇతర ఏ ఫంక్షన్ అయినా వీడియోలు తీస్తున్నారు. వీటిలో అవసరమైనవి తీసుకుని ఆకట్టుకునేటట్టు తీర్చిదిద్దుతారు.
-ఈ వీడియో ఎడిట్‌ను వివిధ సాఫ్ట్వేర్లలో చేస్తున్నారు. అవే అవిడ్, ఎఫ్‌సీపీ. ఈ వీడియో ఎడిటింగ్‌లో లీనియర్, నాన్ లీనియర్, ఆఫ్‌లైన్, ఆన్లైన్, విజన్ మిక్సింగ్ అని వివిధ రకాలుగా ఉంటాయి.
-టెన్త్, ఇంటర్ చేసినవారు కూడా ఈ కోర్సును నేర్చుకోవచ్చు. ఈ కోర్సు చేసినవారికి ఫొటోస్టూడియోలు, టీవీ చానళ్లు, సినిమాల్లో ఉపాధి లభిస్తుంది.
కోర్సులు
-ఎంఎఫ్ఏ ఇన్ మీడియా డిజైన్
-బీఎస్ ఇన్ డిజిటల్ సినిమాటోగ్రఫీ
-మాస్టర్ ఆఫ్ ఆర్ట్స్ ఇన్ ఫిల్మ్ అండ్ టీవీ
సంస్థలు
-ఫిల్మ్ అండ్ టెలివిజన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా (పుణె)
-సత్యజిత్ రే ఫిల్మ్ అండ్ టెలివిజన్ ఇన్స్టిట్యూట్ (కోల్‌కతా)
-విజిలింగ్ ఉడ్స్ ఇంటర్నేషనల్ (ముంబై)
-సెంటర్ ఫర్ రిసెర్చ్ ఇన్ ఆర్ట్ ఆఫ్ ఫిల్మ్ అండ్ టెలివిజన్ (ఢిల్లీ)
-ఏషియన్ అకాడమీ ఆఫ్ ఫిల్మ్ అండ్ టెలివిజన్ (నోయిడా)
-ఇవేకాకుండా హైదరాబాద్‌లో చాలా ప్రైవేట్ సంస్థలు, సినీ స్టూడియోలు ఈ కోర్సును అందిస్తున్నాయి.
స్పా మేనేజ్మెంట్
-మనిషి అభివృద్ధి చెందుతున్నకొద్దీ ఒత్తిడికి గురవుతున్నాడు. ఈ ఒత్తిడి నుంచి ఉపశమనం పొందడానికి, రిలాక్స్ కోసం స్పా సెంటర్లను ఆశ్రయిస్తున్నాడు. దీంతో స్పా సెంటర్లకు డిమాండ్ పెరిగింది. ఈ రంగంలో శిక్షణ పొందితే ఉపాధి లభిస్తుంది. అవసరమైతే సొంతంగా స్పా సెంటర్‌ను ఏర్పాటు చేసుకోవచ్చు.
-ఈ స్పా సెంటర్లు రోజురోజుకు పెరుగుతున్నాయి. కాబట్టి స్పా మేనేజ్మెంట్ చేసినవారికి త్వరగా ఉపాధి లభిస్తుంది. హైదరాబాద్ వంటి పెద్ద నగరాలతోపాటు పెద్దపెద్ద పట్టణాల్లో కూడా ఈ స్పా సెంటర్లు పెరుగుతున్నాయి. కాబట్టి ఈ కోర్సు చేసినవారు స్పా సెంటర్లలో మసాజర్ లేదా థెరపిస్ట్‌గా ఉపాధి పొందవచ్చు. వేతనం కూడా ఆకర్షణీయంగా ఉంటుంది.
కోర్సులు
-స్పా మేనేజ్మెంట్ సర్టిఫికెట్
-స్పా అండ్ హాస్పిటాలిటీ మేనేజ్మెంట్
-స్పా మేనేజ్మెంట్ బీఏ (ఆనర్స్)
సంస్థలు
-ఓరియంట్ స్పా అకాడమీ (జైపూర్)
-ఇంటర్నేషనల్ స్పా అకాడమీ (కేరళ)
-స్పా కన్సల్టెంట్ (పుణె)
-ఇవేకాకుండా హైదరాబాద్‌లోని వివిధ స్పా సెంటర్లు శిక్షణతో పాటు ఉపాధిని ఇస్తున్నాయి.
బ్యూటీషియన్
-అందాన్ని ద్విగుణీకృతం చేసేవి బ్యూటీపార్లర్లు. ఏ సందుగొందుల్లో చూసినా ఈ బ్యూటీపార్లర్లు వెలుస్తున్నాయి. బ్యూటీషియన్ కోర్సు చేసినవారికి ఉపాధి త్వరగా లభిస్తుంది.
-యువతులు, మహిళలు మేకప్ లేకుండా ఏ ఫంక్షన్‌కు వెళ్లరంటే అతిశయోక్తిలేదు. ఫంక్షన్ అంటే ముందు బ్యూటీపార్లర్‌కు వెళ్లి మేకప్ కావాల్సిందే.
-టెన్త్ పాస్ లేదా ఫెయిలైనవారు లేదా పై చదువులు చదువలేని యువతులు బ్యూటిషియన్ కోర్సులో చేరవచ్చు. వివిధ బ్యూటీపార్లర్లు ఆసక్తిగల యువతులకు శిక్షణనిస్తున్నాయి. అంతేకాకుండా పోచంపల్లి వద్ద ఉన్న జలాల్‌పూర్‌లోని స్వామి రామానందతీర్థ ఇన్స్టిట్యూట్ ఉచితంగా ఈ కోర్సును అందిస్తుంది.
-బ్యూటీషియన్‌గా శిక్షణ పొందిన తర్వాత పేరొందిన బ్యూటీపార్లర్‌లో ఉపాధి లభిస్తుంది. లేదంటే సొంతంగా చిన్న బ్యూటిపార్లర్ను ఏర్పాటు చేసుకోవచ్చు.
కోర్సులు
-డిప్లొమా ఇన్ హెయిర్ డిజైనింగ్
-డిప్లొమా ఇన్ కాస్మెటిక్స్
-డిప్లొమా ఇన్ ఎలక్ట్రో లాగ్
-డిప్లొమా ఇన్ హెయిర్ ైస్టెలింగ్ అండ్ హెయిర్ కలరింగ్
-సిడెస్కో డిప్లొమా ఇన్ బ్యూటీ థెరపీ
సంస్థలు
-బుటిక్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ బ్యూటీ థెరపీ అండ్ హెయిర్ డ్రెస్సింగ్ (ముంబై)
-క్రిస్టినీ వాల్మి ఇంటర్నేషనల్ స్కూల్ ఆఫ్ ఈస్థటిక్స్ (ముంబై)
-ఎన్రిచ్ సెలూన్ అండ్ అకాడమీ (ముంబై)
-ఎల్‌టీఏ స్కూల్ ఆఫ్ బ్యూటీ (ముంబై)
-ఇవేకాకుండా హైదరాబాద్‌లోని పేరున్న బ్యూటీపార్లర్లు, ప్రైవేట్ సంస్థలు బ్యూటీషియన్లో శిక్షణనిస్తున్నాయి.
ఫుడ్ కెమిస్ట్
-ఆహారం గురించి, వాటిలో మానవుడికి అవసరమైన, శక్తినిచ్చే రసాయనాల గురించి తెలుసుకునేవారే ఫుడ్ కెమిస్ట్‌లు. ఆహారం గురించి తెలుసుకోవాలనే ఆసక్తి ఉన్నవారు ఈ కోర్సును తీసుకోవచ్చు. సైన్స్ సబ్జెక్టులతో ఇంటర్ పాసైనవారు ఈ కోర్సు చేయవచ్చు.
-నేటి మారుతున్న కాలంలో ఆరోగ్యం గురించి ప్రతిఒక్కరూ శ్రద్ధతీసుకుంటున్నారు. ఈ తరుణంలో ఆరోగ్యాన్నిచ్చే ఉత్పత్తులను ప్రతి ఒక్క కంపెనీ తయారుచేయడానికి ముందుకు వస్తున్నాయి. ఉత్పత్తుల్లో మానవుల ఆరోగ్యాన్ని పెంచే రసాయనాలు ఏం వాడాలి, ఆరోగ్యాన్ని దెబ్బతీసే రసాయనాలు ఏం ఉన్నాయి అనే విషయాలను తెలుసుకోవాలంటే కెమిస్ట్‌ల అవసరం తప్పనిసరి.
-కాబట్టి ఫుడ్ కెమిస్ట్రీ కోర్సులు చేసినవారికి పలు కంపెనీల్లో విరివిగా అవకాశాలు ఉంటాయి. అంతేకాకుండా కార్పొరేట్ ఆస్పత్రులు కూడా ఎటువంటి ఆహారం తీసుకోవాలి, దేనిలో శక్తినిచ్చే విటమిన్లు తదితరాలు ఉన్నాయో రోగులకు తెలిపేందుకు ఫుడ్ కెమిస్ట్‌లను నియమించుకుంటున్నాయి.
కోర్సులు
-బీఎస్సీ ఇన్ ఫుడ్ కెమిస్ట్రీ
-ఎమ్మెస్సీ ఇన్ ఫుడ్ కెమిస్ట్రీ
-ఎమ్మెస్సీ బయోకెమిస్ట్రీ
సంస్థలు
-దనపకియం క్రిష్ణసామి ముదలియార్ కాలేజ్ ఆఫ్ ఉమెన్ (తమిళనాడు)
-లయోలా కాలేజీ (తమిళనాడు)
-మార్ అథనసియోస్ కాలేజ్ ఫర్ అడ్వాన్స్డ్ స్టడీస్ (కేరళ)
ఈవెంట్ మేనేజ్మెంట్
-ఏదైనా కార్యక్రమాన్ని చేపట్టడాన్ని ఈవెంట్ అంటారు. దానికవసరమైనవాటిని బాధ్యతగా నిర్వహించడాన్ని మేనేజ్మెంట్ అంటారు. దానినే స్థూలంగా ఈవెంట్ మేనేజ్మెంట్ అంటారు. ఈవెంట్ మేనేజ్మెంట్ అనేది ప్రస్తుతం ఒక అవసరంగా మారింది.
-పుట్టినరోజు నుంచి పెండ్లి వేడుకవరకు, చిన్న సమావేశాల నుంచి పెద్ద సదస్సుల వరకు వేదికలను ఏర్పాటు చేసి ఆకట్టుకోవడమనేది చాలా పెద్ద తతంగం. ఈ తతంగం నిర్వహించాలంటే బంధువులు, స్నేహితులు, కార్యకర్తలు, ప్రజలు, సభికుల మంచిచెడ్డలు చూసుకోవాలన్నా, వచ్చినవారిని ఆకర్షించేలా వేదికలను తీర్చిదిద్దాలన్నా పెద్దపని. అందుకే ఈ పనిని ఈవెంట్ మేనేజర్లకు అప్పగిస్తున్నారు. ఈవెంట్ మేనేజర్లకు ప్రస్తుతకాలంలో బాగా డిమాండ్ ఉంది. కాబట్టి ఈ కోర్సు చేసినవారికి ఆకర్షణీయ వేతనంతో ఉపాధి లభిస్తుంది.
కోర్సులు
-డిప్లొమా కోర్స్ ఇన్ ఈవెంట్ మేనేజ్మెంట్ (డీఈఎం)
-పోస్ట్‌గ్రాడ్యుయేట్ డిప్లొమా కోర్స్ ఇన్ ఈవెంట్ మేనేజ్మెంట్ (పీజీడీఈఎం)
-పోస్ట్‌గ్రాడ్యుయేట్ డిప్లొమా కోర్స్ ఇన్ ఈవెంట్ మేనేజ్మెంట్ అండ్ యాక్టివేషన్
-బీబీఏ ఇన్ ఈవెంట్ మేనేజ్మెంట్
-ఎంబీఏ ఇన్ ఈవెంట్ మేనేజ్మెంట్
సంస్థలు
-ఈవెంట్ మేనేజ్మెంట్ డిప్లొమా ఇన్స్టిట్యూట్ (ముంబై)
-అమైటీ యూనివర్సిటీ ఆఫ్ ఈవెంట్ మేనేజ్మెంట్ (న్యూఢిల్లీ)
-నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఈవెంట్ మేనేజ్మెంట్ (ముంబై, కోల్‌కతా, అహ్మదాబాద్)
-ది ఇంటర్నేషనల్ సెంటర్ ఫర్ ఈవెంట్ మార్కెటింగ్ మేనేజ్మెంట్ (ఐసీఈఎం) (న్యూఢిల్లీ)
-ఇన్స్టిట్యూట్ ఫర్ టూరిజమ్ ఫ్యూచర్ మేనేజ్మెంట్ ట్రెండ్స్ (ఐటీఎఫ్‌టీ) (చండీగఢ్)
-ఇవేకాకుండా హైదరాబాద్‌లోని పలు ఈవెంట్ మేనేజ్మెంట్ సంస్థలు కూడా ఔత్సాహిక అభ్యర్థులకు శిక్షణనిస్తున్నాయి.
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?
దేశాల అనుసంధానం.. వాణిజ్య అంతఃసంబంధం
కణ బాహ్య జీర్ణక్రియ
ఇంటి పని వద్దన్నవారు.. స్వీయ శిక్షణ ఉండాలన్నవారు
జీవావరణ వ్యవస్థకు కావలసిన మూలశక్తి దారులు?
మౌజియన్ అనే గ్రీకు పదానికి అర్థం?
సమాజ మేధో కేంద్రాలు.. నాగరికతకు చిహ్నాలు