మిషన్ కాకతీయను ఎప్పుడు ప్రారంభించారు?
ప్రాణహిత నది
-ప్రాణహిత నది పెన్‌గంగ, వార్ధా, వైన్‌గంగ అనే నదుల కలయికవల్ల ఏర్పడింది.
-పై మూడు నదులు మధ్యప్రదేశ్‌లోని సాత్పురా పర్వతాల్లో జన్మించి అజంతాకొండల దక్షిణభాగంగా ప్రవహిస్తాయి.
-పెన్‌గంగ, వార్ధా, వైన్‌గంగ నదులు మహారాష్ట్రలోని గడ్చిరోలి జిల్లా యావత్మాల్ జిల్లా గుండా ప్రవహిస్తాయి. యావత్ మాల్ జిల్లాలోని జుగాడ్ వద్ద పెన్‌గంగ నదితో వార్ధా నది కలుస్తుంది.
-ఈ నదులు రెండింటిలోకి వైన్‌గంగ తమ్మిడిహెట్టి (ఆసిఫాబాద్) వద్ద కలిసి ప్రాణహిత నదిగా ఏర్పడుతుంది. తదనంతరం ప్రాణహిత నది తెలంగాణ (ఆసిఫాబాద్, మంచిర్యాల జిల్లాలు), మహారాష్ట్ర సరిహద్దుల గుండా సుమారు 113 కి.మీ. ప్రవహించి జయశంకర్భూపాలపల్లి జిల్లా కాళేశ్వరం వద్ద గోదావరి నదిలో కలుస్తుంది (కాళేశ్వరం త్రివేణిసంగమం- గోదావరి+మానేరు+ప్రాణహిత నదులు కలయిక).
-ప్రాణహిత నది కుడివైపునుంచి పెన్‌గంగ, మధ్యనుంచి వార్ధా, ఎడమనుంచి వైన్‌గంగ కలుస్తూ ఏర్పడినది.
పెన్‌గంగ
-ఈ నది మధ్యప్రదేశ్‌లోని విదర్భ ప్రాంతంలోని రేవుల్ఘాట్ పర్వతాలవద్ద పుట్టి మహారాష్ట్రలోని యావత్మాల్ జిల్లాలో జుగాడ్ వద్ద వార్ధా నదిలో కలుస్తుంది.
-ఈ నదిపై తెలంగాణ-మహారాష్ట్రల అంతర్రాష్ట్ర ప్రాజెక్టుగా లోయర్ పెన్‌గంగ ప్రాజెక్టును నిర్మించనున్నారు.
-పెన్‌గంగ నదిపై ఇటీవల చనాకా-కొరాటా (ఆదిలాబాద్ జిల్లా) నిర్మించారు.
-ఈ బ్యారేజీ పూర్తి నీటినిల్వ సామర్థ్యం 213 మీ.
-ఈ బ్యారేజీవల్ల ఆదిలాబాద్ జిల్లా తాంసి, జైనథ్, బేల మండలాల్లోని 50 వేల ఎకరాలకు నీరు అందుతుంది.
వార్ధా నది
-ఈ నది మధ్యప్రదేశ్‌లోని సాత్పురా పర్వతాల్లోని బేతుల్ జిల్లా ముల్తాయ్ వద్ద జన్మించి మహారాష్ట్రలోని విదర్భ గుండా ప్రవహిస్తూ సుమారు 528 కి.మీ. పొడవున ప్రయాణించి పెన్‌గంగ నదితో జుగాడ్ వద్ద కలుస్తుంది.
-ఈ నది విదర్భ ప్రాంతంలో అతిపెద్ద నది.
వైన్‌గంగ
-ప్రాణహిత నది ఎడమవైపు నుంచి గోదావరిలో కలుస్తూ, గోదావరి నదికి 40 శాతం నీటి లభ్యతను అందిస్తుంది.
-ప్రాణహిత నది (గోదావరి ఉపనది)పై ఆసిఫాబాద్ జిల్లా కౌటాల మండలం తమ్మిడిహెట్టి వద్ద ప్రాణహిత-చేవెళ్ల (డా. బీఆర్ అంబేద్కర్ ప్రాణహిత-చేవెళ్ల సుజల స్రవంతి) పథకాన్ని ప్రారంభించారు.
-దీన్నే తమ్మిడిహెట్టి బ్యారేజీ అని అంటారు.
-ఆసిఫాబాద్ జిల్లా అడ్గ్రామం వద్ద పెద్దవాగుపై కుమ్రంభీం (అడ) ప్రాజెక్టు, పహాడీబండ వద్ద వట్టివాగుపై వట్టివాగు ప్రాజెక్టు, తిర్యాని మండలం ఇర్కపల్లి గ్రామ సమీపంలోని చెలిమెలవాగుపై ఎన్టీఆర్ సాగర్ (చెలిమెలవాగు ప్రాజెక్టు) ప్రాజెక్టులను నిర్మించారు.
ఇంద్రావతి నది
-మొత్తం పొడవు 635 కి.మీ.
-ప్రవహించే రాష్ర్టాలు ఒడిశా, ఛత్తీస్‌గఢ్, తెలంగాణ.
-జన్మస్థలం- ఒడిశా తూర్పుకనుమలలోని కలహండి జిల్లా దండకారణ్య ప్రాంతం
-ఈ నది ఒడిశా, ఛత్తీస్‌గఢ్ రాష్ర్టాల గుండా ప్రవహిస్తూ తెలంగాణలోని జయశంకర్ భూపాలపల్లి జిల్లా ఇచ్చంపల్లి ప్రాజెక్టుకు ఎగువన గోదావరి నదిలో కలుస్తుంది.
-ఈ నది గోదావరి నదికి ఎడమవైపు నుంచి కలుస్తుంది.
-ఈ నదికి గోదావరికి అత్యంత వేగంగా వచ్చి కలిసే నదిగా పేరు ఉంది.
-ఈ నదిపై ఏర్పడిన జలపాతం- చిత్రకూట్ జలపాతం (ఛత్తీస్‌గఢ్)
శబరి నది (కొలాబ్ నది)
-జన్మస్థలం- ఒడిశా తూర్పుకనుమలలోని సింకారం కొండలు
-ప్రవహించే రాష్ర్టాలు- ఛత్తీస్‌గఢ్-ఒడిశా సరిహద్దు, తెలంగాణ
-ఈ నది ఛత్తీస్‌గఢ్-ఒడిశా సరిహద్దుల గుండా ప్రవహిస్తూ తెలంగాణలో భద్రాద్రికొత్తగూడెం జిల్లాలో ఇందిరాసాగర్ వద్ద గోదావరి నదిలో కలుస్తుంది.
-ఈ నది పరీవాహక ప్రాంతం వార్షిక అధిక వర్షపాతం (120 మి.మీ.) తెలంగాణలో నమోదైంది.
-ఈ నది తీరాన పర్ణశాల ఉంది.
-శబరి నది ప్రధాన ఉపనది సీలేరు (ఏపీలో గోదావరిలో కలుస్తుంది), రెండోది తాలిపేరు.
-శబరి నది తెలంగాణలోని గోదావరినదిలో కలిసే చివరి ఉపనది.
గోదావరి నదీతీరానగల ముఖ్య పట్టణాలు
1) నాసిక్ 2) నాందేడ్ (మహారాష్ట్ర)
3) బాసర 4) ధర్మపురి 5) భద్రాచలం (తెలంగాణ)
6) రాజమండ్రి (ఆంధ్రప్రదేశ్)
గోదావరి నది ఒడ్డునగల పుణ్యక్షేత్రాలు
1) నాసిక్- త్రయంబకేశ్వరాలయం (ద్వాదశ జ్యోతిర్లింగాల్లో ఒకటి)
2) నాందేడ్- సచ్‌ఖండ్ గురుద్వారా
3) కందకుర్తి- శివాలయం
4) బాసర- జ్ఞాన సరస్వతి దేవాలయం
5) గూడెంగుట్ట – రమాసత్యనారాయణస్వామి దేవాలయం
6) ధర్మపురి- లక్ష్మీనరసింహస్వామి దేవాలయం, యమధర్మరాజు దేవాలయం
7) కాళేశ్వరం- ముక్తేశ్వరస్వామి ఆలయం
8) భద్రాచలం- సీతారామచంద్రస్వామి ఆలయం
గోదావరి నదిపై గల ఎత్తిపోతల పథకాలు
1) అలీసాగర్ – కోస్లి (నవీపేట)- నిజామాబాద్
2) యంచ – యంచ (నవీపేట)- నిజామాబాద్
3) అర్గుల రాజారాం – ఉమ్మెడ- నిజామాబాద్
4) చౌట్పల్లి హన్మంతరెడ్డి – సేట్పల్లి- నిజామాబాద్
5) ఎల్లంపల్లి (శ్రీపాదరావు సాగర్) – ఎల్లంపల్లి- మంచిర్యాల
6) కాళేశ్వరం – మేడిగడ్డ- జయశంకర్పల్లి భూపాలపల్లి
7) దేవాదుల (జే చొక్కారావు) – గంగారం- జయశంకర్ భూపాలపల్లి
8) కంతనపల్లి (పీవీ నర్సింహారావు) – కంతనపల్లి- జయశంకర్ భూపాలపల్లి
9) దుమ్ముగూడెం (జ్యోతిరావు ఫూలే) – అనంతారం – భద్రాద్రికొత్తగూడెం
10) సీతారామ – రోళ్లపాడు- భద్రాద్రి కొత్తగూడెం
11) ఇందిరాసాగర్ (రుద్రమకోట) – రుద్రమకోట – ఖమ్మం
12) భక్త రామదాసు – తిరుమలాయపాలెం- ఖమ్మం
గోదావరి నదిపైగల ప్రాజెక్టులు
1) జయక్వాడీ ప్రాజెక్టు- ఇది మహారాష్ట్రలోని గోదావరి నదిపై అతిపెద్ద ప్రాజెక్టు
2) బాబ్లీ ప్రాజెక్టు- ఇది తెలంగాణ-మహారాష్ట్ర సరిహద్దులోగల ప్రాజెక్టు
3) శ్రీరాంసాగర్ ప్రాజెక్టు- ఈ ప్రాజెక్టుకు అప్పటి ప్రధాని పండిట్ జవహర్లాల్ నెహ్రూ 1963, జూలై 26న నిజామాబాద్ జిల్లా మెండోరా మండలం పోచంపాడు గ్రామం వద్ద శంకుస్థాపన చేశారు. దీని నిర్మాణం 1978లో పూర్తికాగా అప్పటి ముఖ్యమంత్రి మర్రి చెన్నారెడ్డి ప్రారంభించారు.
-ఇది తెలంగాణలో గోదావరి నదిపై నిర్మించిన మొదటి బహుళార్థసాధక ప్రాజెక్టు.
-ఈ ప్రాజెక్టు ఆయకట్టు సామర్థ్యం 18 లక్షల ఎకరాలకు నీరందించడం.
-ఈ ప్రాజెక్టు నీటినిల్వ సామర్థ్యం- 90 టీఎంసీ
-ఈ ప్రాజెక్టు విద్యుత్ ఉత్పాదన- 36 మెగావాట్లు
-ఈ ప్రాజెక్టులో భాగంగా 3 కాలువలు ప్రధానమైనవి.
1) కాకతీయ కాలువ: తెలంగాణలో పొడవైన కాలువ (284 కి.మీ.). ఇది నిజిమాబాద్, జగిత్యాల, కరీంనగర్, జయశంకర్భూపాలపల్లి, వరంగల్‌రూరల్ జిల్లాలకు సాగునీటిని, వరంగల్ (అర్బన్) జిల్లాకు తాగునీటిని అందిస్తుంది.
2) లక్ష్మీకాలువ: ఇది వరంగల్ అర్బన్ జిల్లాకు సాగునీటినందిస్తుంది.
3) సరస్వతి కాలువ: ఇది నిర్మల్ జిల్లాకు సాగునీటినందిస్తుంది.
శ్రీరాంసాగర్ ప్రాజెక్టు పునరుజ్జీవ పథకం
-ఈ పథకం పనులకు ముఖ్యమంత్రి కేసీఆర్ 2017, ఆగస్టు 10న వరద కాల్వ హెడ్ రెగ్యులేటర్వద్ద నిర్మించిన పైలాన్‌ను ఆవిష్కరించి ప్రారంభించారు.
-ఈ పథకంలో భాగంగా మేడిగడ్డ నుంచి అన్నారం, సుందిళ్ల, శ్రీపాదసాగర్ (ఎల్లంపల్లి) జలాశయం వరకు గోదావరినదిలోనే రివర్స్ పంపింగ్ ద్వారా నీటిని తరలించనున్నారు. ఎల్లంపల్లి నుంచి నందిమేడారం చెరువు ద్వారా వరద కాలువలోకి నీటిని సరఫరా చేస్తారు.
-రోజుకు 1 టీఎంసీ చొప్పున 60 రోజుల్లో 60 టీఎంసీల నీటిని వరదకాలువ ద్వారా ఎస్సారెస్పీ జలాశయంలోకి మళ్లిస్తారు.
1. మీనాంబరం నది అని కింది వాటిలో ఏ నదిని పిలుస్తారు? (3)
1) మూసీ 2) మంజీర 3) దిండి 4) మానేరు
2. రాష్ట్రంలో నదీ వ్యవస్థ ఏ దిశ నుంచి ఏ దిశ వైపు కదులుతుంది? (2)
1) వాయవ్యం నుంచి ఈశాన్యం
2) వాయవ్యం నుంచి ఆగ్నేయం
3) ఆగ్నేయం నుంచి వాయవ్యం
4) ఈశాన్యం నుంచి నైరుతి
3. మూడు నదుల కలయికతో ఏర్పడే నది? (4)
1) తుంగభద్ర 2) మంజీర
3) మానేరు 4) ప్రాణహిత
4. చెరువుల పునరుద్ధరణకు తెలంగాణ ప్రభుత్వం ప్రారంభించిన మిషన్ కాకతీయ క్యాప్షన్ ఏది? (2)
1) మీ ఊరు- మీ చెట్టు 2) మన ఊరు – మన చెట్టు
3) మీ చెరువు – మీ చెట్టు
4) మన చెరువు – మన చెట్టు
5. మిషన్ కాకతీయను ఎప్పుడు ప్రారంభించారు? (1)
1) 2015, మార్చి 21 2) 2015, మార్చి 12
3) 2015, ఫిబ్రవరి 12 4) 2015, ఏప్రిల్ 21
6. సింగూర్ జల విద్యుత్ కేంద్రం ఏ జిల్లాలో ఉంది? (2)
1) నల్లగొండ 2) మెదక్
3) నిజామాబాద్ 4) మహబూబ్‌నగర్
7. రాష్ట్రంలో ఏకైక భారజల కేంద్రం ఎక్కడ ఉంది? (3)
1) పాల్వంచ 2) ముదిగొండ
3) మణుగూరు 4) జగిత్యాల
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?
దేశాల అనుసంధానం.. వాణిజ్య అంతఃసంబంధం
కణ బాహ్య జీర్ణక్రియ
ఇంటి పని వద్దన్నవారు.. స్వీయ శిక్షణ ఉండాలన్నవారు
జీవావరణ వ్యవస్థకు కావలసిన మూలశక్తి దారులు?
మౌజియన్ అనే గ్రీకు పదానికి అర్థం?
సమాజ మేధో కేంద్రాలు.. నాగరికతకు చిహ్నాలు