Educational Development Institutions | విద్యాభివృద్ధి సంస్థలు
-ఉపాధ్యాయ విద్య (Teacher Education)ను అందించే జాతీయ, రాష్ట్ర సంస్థలు
జాతీయ విద్యా పరిశోధనా శిక్షణ మండలి
-కేంద్ర మానవవనరుల శాఖ ఆధ్వర్యంలో పనిచేసే National Council of Education Research and Training (NCERT) 1961, సెప్టెంబర్ 1న రూపొందింది.
-ఉపాధ్యాయులకు గుణాత్మక వృత్తిపూర్వక, వృత్యంతర శిక్షణ కార్యక్రమాలను రూపొందిస్తుంది.
-విద్యావిషయాల్లో పరిశోధనలుచేసి విద్యార్థులకు అవసరమయ్యే జాతీయ పాఠ్యప్రణాళికను (NCF) రూపొందిస్తుంది.
-SCERTకి, రాష్ట్ర విద్యాశాఖకు మార్గదర్శకత్వం అందిస్తుంది.
-ఆధునిక బోధనాపద్ధతులను పరిచయం చేసి విద్యార్థుల పాఠ్యపుస్తకాలకు, ఉపాధ్యాయ కరదీపికల ముద్రణకు దోహదపడుతుంది.
-విద్యార్థుల కోసం జవహర్లాల్ నెహ్రూ నేషనల్ సైన్స్ ఎగ్జిబిషన్‌ను ప్రారంభించి శాస్త్రీయవైఖరులు మెరుగుపడటానికి దోహపడుతుంది.
రాష్ట్ర విద్యాపరిశోధన శిక్షణామండలి
-State Council Education Research and Training (SCERT) 1967, జూలై 27న రూపొందింది.
-రాష్ట్రస్థాయి విద్యార్థులకు కావాల్సిన పాఠశాల విద్యకు సంబంధించిన పాఠ్యప్రణాళికను రూపొందిస్తుంది.
-విద్యావిషయక పరిశోధనలు చేస్తూ, చర్చాగోష్టులు నిర్వహిస్తూ, ఉపాధ్యాయ వృత్యంతర శిక్షణ కార్యక్రమాలు నిర్వహిస్తుంది.
-రాష్ట్రస్థాయిలో సైన్స్ ఎగ్జిబిషన్లను నిర్వహిస్తుంది.
జాతీయ ఉపాధ్యాయ విద్యామండలి
-National Council of Teacher Education (NCTE)ఇది 1973లో సలహాసంఘంగా NCERTలో ఏర్పడి, 1993లో పార్లమెంట్ చట్టం ద్వారా గుర్తించబడి, 1995 నుంచి స్వయంప్రతిపత్తి గల సంస్థగా పనిచేస్తుంది.
రీజనల్ కేంద్రాలు
1) తూర్పు- భువనేశ్వర్
2) పశ్చిమం- భోపాల్
3) ఉత్తరం- జైపూర్
4) దక్షిణం- బెంగళూరు
-ఈ నాలుగు ప్రాంతీయ మండలులను కలిగి ఉండి ఉపాధ్యాయ విద్యను మెరుగుపర్చే ఉన్నత సంస్థ.
-ఉపాధ్యాయ విద్యనందించే బీఈడీ, డీఈడీ వంటి కళాశాలలకు అనుమతి, గుర్తింపులను ఇస్తుంది.
-ఉపాధ్యాయ విద్యకు కావాల్సిన, విద్యాప్రణాళికల రూపకల్పనకు మార్గదర్శకత్వం అందిస్తుంది.
-ఇది ఢిల్లీ కేంద్రంగా పనిచేస్తుంది.
జాతీయ విద్యాప్రణాళిక, నిర్వహణ విశ్వవిద్యాలయం
-ఇది నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎడ్యుకేషనల్ ప్లానింగ్ అండ్ అడ్మినిస్ట్రేషన్ (NIEPA)గా 1979లో ఏర్పడింది.
-2006 ఆగస్టులో National University of Educational Planning and Administration (NUEPA)గా విశ్వవిద్యాలయ స్థాయికి మారింది.
-ఇది కేంద్ర మానవ వనరుల మంత్రిత్వశాఖ ఆధ్వర్యంలో పనిచేస్తుంది.
-కేంద్ర, రాష్ర్టాల్లో విద్యానిర్వహణ అధికారులకు వర్క్‌షాపులు, సెమినార్లు నిర్వహించి వారి సామర్థ్యాలను పెంపొందిస్తుంది.
-Shala Siddi, Child Info, Swach Puraskar వంటి విద్యాప్రణాళికలను జాతీయస్థాయిలో రూపొందిస్తుంది.
-ఇది ఢిల్లీ కేంద్రంగా పనిచేస్తుంది.
ప్రాంతీయ విద్యామండలి కేంద్రాలు
-మైసూరు కేంద్రంగా Regional Institutions of Education (RIE) 1963, ఆగస్టు 1న ఏర్పడినాయి.
-ఇవి NCERT ఆధారంగా ఏర్పడ్డాయి.
-ఇవి అజ్మీర్, భోపాల్, భువనేశ్వర్, షిల్లాంగ్, మైసూర్‌లలో ఉన్నాయి.
-నాలుగేండ్ల బీఎస్సీ ఈడీ, బీఏ ఈడీ కోర్సులు, మూడేండ్ల ఎమ్మెస్సీ ఈడీ కోర్సులను అందిస్తాయి.
-పాఠశాల విద్యలో గుణాత్మక అభివృద్ధి తీసుకువచ్చేందుకు కృషిచేస్తాయి.
ఇంగ్లిష్, విదేశీ భాషల కేంద్ర సంస్థ (CIEFL)
-ఇది మొదటగా 1958లో సెంట్రల్ ఇన్స్టిట్యూషన్ ఆఫ్ ఇంగ్లిష్‌గా ఏర్పడింది.
-హైదరాబాద్ కేంద్రంగా పనిచేస్తున్నది.
-దీనిని 1972లో CIEFL ((Central Institution of English and Foreign Language)గా మార్చారు.
-ఈ CIEFL విశ్వవిద్యాలయ స్థాయి EFLU (English and Foreign Language University)గా 2007 ఆగస్టులో ఏర్పడింది.
-ఇంగ్లిష్, విదేశీభాషల బోధనానైపుణ్యాలను ఉపాధ్యాయులకు అందిస్తుంది.
కేంద్ర సాంకేతిక విద్యాసంస్థ
-NCERTకి అనుబంధంగా Central Institution of Education Technology (CIET) 1984లో ఏర్పడింది.
-ఉపాధ్యాయుల సాధికారతను పెంపొందించడానికి విద్యాటెలివిజన్ కార్యక్రమాలు, టెలిస్కూల్ కార్యక్రమాలు, డిజిటల్ తరగతుల ఆడియో, వీడియో కార్యక్రమాలను రూపొందిస్తుంది.
-IGNOU సహకారంతో విద్యాటెలివిజన్ జ్ఞాన్దర్శన్ కార్యక్రమాలను రూపొందిస్తుంది.
రాష్ట్ర సాంకేతిక విద్యాసంస్థ
-కేంద్ర ప్రభుత్వ సహకారంతో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో (State Institution of Education Technology (SIET) 1985లో ఏర్పడింది.
-ప్రాథమిక స్థాయి నుంచి సెకండరీ స్థాయి విద్యార్థులకు దృశ్య, శ్రవణ రూపంలో టెలీస్కూల్ కార్యక్రమాలను అందిస్తుంది.
-మనటీవీ కార్యక్రమాలు, డిజిటల్ తరగతులకు సంబంధించిన విద్యాసాంకేతికతను అందిస్తుంది.
-దీన్ని రాష్ట్ర దృశ్య, శ్రవణ విద్యావికాస కేంద్రమని కూడా అంటారు.
జిల్లా విద్యాశిక్షణాసంస్థ
-జిల్లాస్థాయిలో కాబోయే ఉపాధ్యాయులకు శిక్షణనందించడానికి District Institution of Educational Training (DIET) 1989-90లో రూపొందింది.
-ప్రాథమిక విద్యాస్థాయిలో వృత్తిపూర్వక, వృత్త్యంతర శిక్షణను అందిస్తుంది.
-అనియత విద్య, వయోజన విద్యలో పనిచేసేవారికి శిక్షణను అందిస్తుంది.
మండల వనరుల కేంద్రం
-ఎంఆర్సీలు ఎస్ఎస్ఏ పథకం ఆధారంగా రూపొందించిన సంవత్సరం – 2003-04
-మండలస్థాయిలో ఉపాధ్యాయులను మండల రిసోర్స్ పర్సన్స్, నిపుణుల ద్వారా వృత్యంతర కార్యక్రమాలు, మండల సూక్ష్మ ప్రణాళిక రూపకల్పన అవగాహన కల్పించడానికి దోహదపడే మండలకేంద్రమే – ఎంఆర్సీ
ప్రాక్టీస్ బిట్స్
1. ఉపాధ్యాయ విద్యనందించే బీఎడ్, డీఎడ్ వంటి సంస్థలకు అనుమతినిస్తూ, విద్యా ప్రణాళిక రూపొందించే జాతీయ సంస్థ
1) ఎన్సీఈఆర్టీ 2) ఎన్సీటీఈ
3) ఎన్పీఈ 4) ఎన్పీఈజీఈఎల్
2. ఎన్సీఎఫ్-2005 రూపొందడానికి ఆధారమైంది?
1) ఎస్సీఈఆర్టీ 2) సీఐఈటీ
3) ఎన్సీఈఆర్టీ 4) ఏపీపీఈపీ
3. ఉపాధ్యాయ శిక్షకులకు, విద్యా పరిపాలకులకు పరిపాలనా రంగంలో శిక్షణ ఇచ్చే జాతీయ సంస్థ?
1) ఎన్సీటీఈ 2) ఎన్సీఈఆర్టీ
3) సీఐఈటీ 4) ఎన్వీఈపీఏ
4. ఎన్వీఈపీఏ ఏర్పడిన సంవత్సరం?
1) 2004 2) 2006 3) 2008 4) 2000
5. స్టేట్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎడ్యుకేషన్ అనేది ఎస్సీఈఆర్టీగా మార్పు చెందిన సంవత్సరం?
1) 1967 2) 1972 3) 1976 4) 1981
6. తెలంగాణ రాష్ట్ర విద్యార్థులకు మన టీవీ కార్యక్రమాలను అందిస్తున్న రాష్ట్ర సంస్థ?
1) ఎస్ఐఈటీ 2) సీఐఈటీ
3) క్లాస్ 4) స్మార్ట్
7. జిల్లా విద్యా శిక్షణా సంస్థ (డైట్) ప్రతిపాదనకు దోహదపడింది?
1) ఎన్పీఈ-68 2) ఎన్పీఈ-92
3) ఎన్పీఈ-86 4) ఎన్సీఎఫ్-2005
8. రీజినల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎడ్యుకేషన్ ప్రాంతీయ విద్యా కేంద్రాల ఏర్పాటుకు దోహదపడింది?
1) ఎన్సీటీఈ 2) ఎన్సీఈఆర్టీ
3) ఎన్పీఈ 4) ఎన్సీఎఫ్
9. ఉపాధ్యాయ వృత్యంతర శిక్షణలో భాగంగా ఆంగ్లభాష బోధనలో శిక్షణ ఇచ్చే సంస్థ?
1) సీఐఈటీ 2) ఎస్ఐఈటీ
3) ఈఎఫ్ఎల్యూ 4) డీఐఈటీ
10. P most అంటే?
1) ప్రోగ్రామింగ్ ఆఫ్ మాస్ ఓరియంటేషన్ ఫర్ స్కూల్ టీచర్స్
2) ప్రోగ్రామ్ ఆఫ్ మీడియా ఓరియంటేషన్ ఫర్ స్పెషల్ టీచర్స్
3) ప్లానింగ్ ఆఫ్ మేనేజ్మెంట్ ఆఫ్ స్కూల్ టీచర్స్
4) ఏదీకాదు
11. ఛటోపాధ్యాయ కమిషన్ (1984-85) ఉద్దేశం?
1) విద్యార్థుల హక్కుల కోసం
2) ఉపాధ్యాయుల భద్రత కోసం
3) సమాజ హక్కుల కోసం
4) గుణాత్మక విద్య కోసం
12. విద్యార్థుల్లో 3 ఆర్ఎస్ మెరుగుపడటానికి ప్రస్తుతం పాఠశాలలో అమలవుతున్న కార్యక్రమం?
1) సీఎల్ఐపీ 2) సీఎల్ఏపీఎస్
3) ఎల్ఈపీ 4) సీసీఈ
13. కింది వాటిలో సరైనదాన్ని గుర్తించండి.
1. ఎన్సీటీఈ ఎ. 1986
2. ఎన్సీఈఆర్టీ బి. 1985
3. ఎస్ఐఈటీ సి. 1995
4. ఓబీబీ డి. 1961
1) 1-ఎ, 2-సి, 3-డి, 4-బి
2) 1-డి, 2-ఎ, 3-బి, 4-సి
3) 1-సి, 2-డి, 3-బి, 4-ఎ
4) 1-బి, 2-ఎ, 3-సి, 4-డి
14. స్కూల్ కాంప్లెక్స్ అంటే..?
1) మండల ఉపాధ్యాయుల సముదాయం
2) ఉన్నత పాఠశాలకు 5 లేదా 6 ఇతర పాఠశాలలను కలిపిన సముదాయం
3) మండల విద్యార్థుల సముదాయం
4) ఒక పాఠశాలలోని ఉపాధ్యాయులు విద్యార్థుల సముదాయం
15. ఎన్సీఆర్టీ ప్రధాన ఉద్దేశం?
1) జాతీయ పాఠ్యప్రణాళికను రూపొందించడం
2) ఎన్‌సీఎఫ్‌కు సహకారం అందించడం
3) ఎస్సీఈఆర్టీకి సలహాలు, మార్గదర్శకత్వం అందించడం
4) పైవన్నీ
1
6. ఉపాధ్యాయుల ప్రేరణ కానిది?
1) ఉద్యోగ భద్రత కల్పించడం
2) సైన్స్ ఎగ్జిబిషన్స్ నిర్వహించడం
3) దూర ప్రాంతాలకు బదిలీ చేయడం
4) వర్క్‌షాప్స్ నిర్వహించడం
17. ఉపాధ్యాయ విద్యకు సంబంధించినది?
1) ఎన్సీఆర్టీ 2) ఎన్సీటీఈ
3) ఓబీబీ 4) డైట్
18. ప్రత్యేకావసరాల పిల్లలకు శిక్షణనిచ్చే ఉపాధ్యాయులను తయారుచేసే శిక్షణ సంస్థలకు అనుమతినిచ్చేది?
1) ఆర్ఐ 2) ఆర్సీఐ
3) ఆర్ఎంసీఏ 4) ఏదీకాదు
19. విద్యార్థులకు కంప్యూటర్ పరిజ్ఞాన విద్యను, సాంకేతిక విద్యను అందించే సంస్థ?
1) ఎస్ఐఈటీ 2) సీఐఈటీ 3) క్లాస్ 4) పైవన్నీ
20. సీసీఆర్టీ ఏర్పడిన సంవత్సరం?
1) 1952 2) 1958 3) 1960 4) 1954
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
తాత్వికతను తెలిపేది.. రాజ్యాంగానికి గుండెలాంటిది
ఎలకానిక్ రికార్డులు.. ప్రాథమిక సాక్ష్యాలు
శుక్రకణాలు తాత్కాలికంగా నిల్వ ఉండే ప్రాంతం?
సెకండరీ ఎడ్యుకేషన్ కమిషన్‌కు మరోపేరు?
‘వెయ్యి ఉరిల మర్రి’ గా పేరుగాంచిన ఊడలమర్రి ఏ జిల్లాలో ఉంది?
రక్షణ దుర్గాలు – నాటి పాలనా విభాగాలు
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?