Krishna river | కృష్ణానదీ వ్యవస్థ
మొత్తం పొడవు: 1440 కి.మీ.
-ప్రవహించే రాష్ర్టాలు: మహారాష్ట్ర, కర్ణాటక, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్
-పరివాహక రాష్ర్టాలు: మహారాష్ట్ర, కర్ణాటక, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్
-తెలంగాణలో కృష్ణానది మొత్తం పొడవు: 450 కి.మీ.
-జన్మస్థలం: పశ్చిమ కనుమలు/సహ్యాద్రి పర్వతాల్లోని (మహారాష్ట్ర) మహాబలేశ్వర్ వద్ద ఉన్న జోర్ గ్రామం.
-ఎత్తు: సముద్ర మట్టం నుంచి 1337 మీటర్లు.
ప్రాముఖ్యత
-కృష్ణానది దేశంలో 3వ పొడవైన నది.
-దక్షిణ భారతదేశంలో 2వ పొడవైన నది.
-కృష్ణానదిని శిల్పుల నది అని పిలుస్తారు.
పుష్కరాలు
-కృష్ణానదికి ప్రతి 12 ఏండ్లకు ఒకసారి పుష్కరాలు జరుగుతాయి.
-రాష్ట్రంలో 2016 ఆగస్టు 12 నుంచి 23 వరకు పుష్కరాలు జరిగాయి.
ప్రవాహం
-ఈ నది పశ్చిమ కనుమల్లోని మహాబలేశ్వరంలో ఉన్న జోర్ గ్రామం వద్ద జన్మించి, మహారాష్ట్ర, కర్ణాటక రాష్ర్టాల గుండా ప్రవహిస్తూ.. తెలంగాణలోకి మహబూబ్‌నగర్ జిల్లా మక్తల్ మండలం తంగడి గ్రామం వద్ద ప్రవేశించి, మహబూబ్‌నగర్, వనపర్తి, గద్వాల, నాగర్‌కర్నూల్, నల్లగొండ, సూర్యాపేట జిల్లాల గుండా తెలంగాణలో.. కర్నూలు, ప్రకాశం, గుంటూరు, కృష్ణా జిల్లాల గుండా ఆంధ్రప్రదేశ్‌లో ప్రవహిస్తుంది. ఈ సందర్భంలో నల్లగొండ జిల్లా నందికొండ వద్ద నాగార్జునసాగర్ ప్రాజెక్టును దాటి ఎడమ కాలువ (లాల్‌బహదూర్ శాస్త్రి కాలువ) సూర్యాపేట, కృష్ణా జిల్లాల గుండా.. కుడి కాలువ (జవహర్లాల్ కాలువ) గుంటూరు, కృష్ణా జిల్లాల గుండా ప్రవహిస్తూ విజయవాడ దగ్గర కలిసిపోతాయి. విజయవాడకు దిగువన (సుమారు 64 కి.మీ. దూరంలో) పులిగడ్డ వద్ద రెండు పాయలుగా చీలి, మళ్లీ ఒకటిగా కలిసి హంసల దీవి వద్ద బంగాళాఖాతంలో కలుస్తుంది.
-పులిగడ్డ వద్ద రెండు పాయల మధ్య ప్రాంతాన్ని దివి సీమ అంటారు.
-కృష్ణానదికి ఎడమవైపు జిల్లాలు (తెలంగాణలో): 1. మహబూబ్‌నగర్, 2. వనపర్తి, 3. నాగర్‌కర్నూల్, 4. నల్లగొండ, 5. సూర్యాపేట.
-కృష్ణానదికి కుడివైపుగల జిల్లా (తెలంగాణలో): 1. గద్వాల జోగుళాంబ
-రాష్ట్రంలో కృష్ణానది ప్రవహించే జిల్లాలు: 06
ఉపనదులు
ఎడమవైపు నుంచి కలిసేవి
1. భీమా నది – మహబూబ్‌నగర్
2. డిండి నది – నాగర్‌కర్నూల్
3. మూసీనది – వికారాబాద్
4. హాలియా నది – నల్లగొండ
5. పాలేరు నది – జనగామ
6. మున్నేరు నది – వరంగల్ (రూరల్)
కుడివైపు నుంచి కలిసేవి
1. తుంగభద్ర – కర్నూలు
2. బుడమేరు – ఒంగోలు
3. తమ్మిలేరు – ఒంగోలు
4. రామిలేరు – ఒంగోలు
5. ఘటప్రభ – కర్ణాటక
6. మలప్రభ – కర్ణాటక
7. దూద్‌గంగా – మహారాష్ట్ర
8. పంచ్‌గంగా – మహారాష్ట్ర
9. కొయనా – మహారాష్ట్ర
10. యెన్నా – మహారాష్ట్ర
ఉపనదుల జన్మస్థానాలు
1. భీమా నది
-మొత్తం పొడవు: 861 కి.మీ.
-ప్రవహించే రాష్ర్టాలు: మహారాష్ట్ర, కర్ణాటక, తెలంగాణ
-జన్మస్థలం: పశ్చిమ కనుమల్లో (మహారాష్ట్ర) పశ్చిమాన ఉన్న భీమశంకర కొండలు.
-ఈ నది మహారాష్ట్ర, కర్ణాటక రాష్ర్టాల గుండా ప్రవహిస్తూ.. కర్ణాటక, తెలంగాణ సరిహద్దులో రాయచూర్‌కు ఉత్తరాన కృష్ణానదిలో కలుస్తుంది.
భీమానది ఉపనదులు
-కాగ్నా, మూల, ఇంద్రాణి
గమనిక: -కాగ్నానది: ఈ నది వికారాబాద్ జిల్లాలోని అనంతగిరి కొండల్లో పడమరవైపు జన్మించి తెలంగాణలో ప్రవహిస్తూ కర్ణాటకలో ప్రవేశించి భీమానదిలో కలుస్తుంది.
-భీమానది కృష్ణానది ఉపనదుల్లోకెల్లా అతి పొడవైనది.
2. డిండి నది (మీనాంబరం)
-మొత్తం పొడవు: 152 కి.మీ.
-ప్రవహించే జిల్లాలు: మహబూబ్‌నగర్, నాగర్‌కర్నూలు, నల్లగొండ.
-జన్మస్థలం: మహబూబ్‌నగర్ జిల్లాలోని షాబాద్ కొండలు
-ఈ నది షాబాద్ కొండల్లో జన్మించి మహబూబ్‌నగర్, నాగర్‌కర్నూలు, నల్లగొండ జిల్లాల గుండా ప్రవహిస్తూ ఏలేశ్వరం (నల్లగొండ జిల్లా దేవరకొండ సమీపంలో) వద్ద కృష్ణానదిలో కలుస్తుంది.
-ఇది కృష్ణానదికి ఎడమవైపు నుంచి కలుస్తున్న ఉపనది.
3. మూసీనది (ముచ్కుందా నది)
-మొత్తం పొడవు: 250 కి.మీ.
-ప్రవహించే జిల్లాలు: వికారాబాద్, రంగారెడ్డి, హైదరాబాద్, యాదాద్రి భువనగిరి, నల్లగొండ.
-జన్మస్థలం: వికారాబాద్ జిల్లా శివారెడ్డిపేట వద్ద ఉన్న అనంతగిరి కొండలు.
-ఈ నది వికారాబాద్, రంగారెడ్డి, హైదరాబాద్, యాదాద్రి భువనగిరి, నల్లగొండ జిల్లాల గుండా ప్రవహిస్తూ నల్లగొండ జిల్లా వాడపల్లి వద్ద కృష్ణానదిలో కలుస్తుంది.
-మూసీనది కృష్ణానదికి ఎడమవైపు నుంచి కలిసే ఉపనది.
-మూసీనది ఒడ్డున ఉన్న పట్టణం: హైదరాబాద్
-తెలంగాణలో కృష్ణానదిలో కలిసే చివరి ఉపనది: మూసీ
మూసీ ఉపనదులు
-ఈసీ, ఆలేరు, సకలవాణి.రిజర్వాయర్లు
1. ఉస్మాన్‌సాగర్
-మూసీనదిపై 1920లో 7వ నిజాం మీర్ ఉస్మాన్ అలీఖాన్ కాలంలో రంగారెడ్డి జిల్లా మొయినాబాద్ మండలం, గండిపేట వద్ద ఉస్మాన్‌సాగర్ రిజర్వాయర్‌ను నిర్మించారు. దీన్నే గండిపేట రిజర్వాయర్ అంటారు.
-ఇది హైదరాబాద్ పాత నగరానికి తాగునీటిని అందిస్తుంది.
2. హిమాయత్‌సాగర్
-మూసీ ఉపనది అయిన ఈసీ నదిపై మీర్ ఉస్మాన్ అలీఖాన్ కాలంలో (1927లో) ఆయన పెద్ద కొడుకు హిమాయత్ అలీఖాన్ పేరుమీద హిమాయత్‌సాగర్ రిజర్వాయర్‌ను (రంగారెడ్డి జిల్లా హిమాయత్‌సాగర్ గ్రామంలో) నిర్మించారు.
-ఇది కృత్రిమ రిజర్వాయర్.
-ఇది మూసీనది వరదలను నియంత్రించడంతోపాటు హైదరాబాద్ నగరానికి తాగునీటిని అందిస్తుంది. మూసీనదికి భారీ వరదలు వచ్చిన ఏడాది- 1908.
3. హుస్సేన్‌సాగర్
-మూసీ ఉపనది అయిన ఆలేరు నదిపై మీర్ హుస్సేన్షావర్ అలీఖాన్ కాలంలో (1562లో) హైదరాబాద్-సికింద్రాబాద్ జంటనగరాల సరిహద్దులో హుస్సేన్‌సాగర్ రిజర్వాయర్‌ను నిర్మించారు.
-ఇది హైదరాబాద్-సికింద్రాబాద్ జంటనగరాలను కలుపుతుంది.
-ఆలేరు నది హైదరాబాద్-సికింద్రాబాద్‌లను వేరుచేస్తుంది.
-ఆలేరు నది చింతలూరు వద్ద మూసీనదిలో కలుస్తుంది.
4. హాలియా నది
-ఈ నది నల్లగొండ జిల్లాలో జన్మించి, నల్లగొండ జిల్లాలోనే (అటవీ ప్రాంతంలో) కృష్ణానదిలో కలుస్తుంది.
5. పాలేరు నది
-మొత్తం పొడవు: 152 కి.మీ.
-ప్రవహించే జిల్లాలు: జనగామ, సూర్యాపేట, మహబూబాబాద్, ఖమ్మం, కృష్ణా.
-జన్మస్థలం: జనగామ జిల్లాలోని చాణకపురం.
-అక్కడి నుంచి ఈ నది జనగామ, సూర్యాపేట, మహబూబాబాద్, ఖమ్మం జిల్లాల గుండా ప్రవహిస్తూ.. కృష్ణా జిల్లాలోని జగ్గయ్యపేట దగ్గర కృష్ణానదిలో కలుస్తుంది.
7. తుంగభద్ర నది
-మొత్తం పొడవు: 531 కి.మీ.
-ప్రవహించే రాష్ర్టాలు: కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ.
-జన్మస్థలం: పశ్చిమ కనుమల్లోని (కర్ణాటకలో) వరాహ పర్వతాలు.
-వరాహ పర్వతాల్లో జన్మించే తుంగ, భద్ర అనే రెండు నదులు కర్ణాటకలోని చిక్‌మంగుళూరు జిల్లాలో ఒకదానితో ఒకటి కలిసి తుంగభద్ర నదిగా ఏర్పడింది.
-తదనంతరం తుంగభద్ర నది కర్ణాటక గుండా ప్రవహిస్తూ కర్నూలు జిల్లాలోని కొసిగి ప్రాంతం వద్ద ఆంధ్రప్రదేశ్‌లో ప్రవేశించి, కర్నూలు జిల్లా గుండా ప్రవహిస్తూ మంత్రాలయం ఎగువన తెలంగాణలో గద్వాల జిల్లా అలంపూర్‌లోకి ప్రవేశించి, తిరిగి కర్నూలు జిల్లాలో ప్రవేశించి నల్లమల అటవీ ప్రాంతంలో సంగెం (సంగమేశ్వరం) వద్ద కృష్ణానదిలో కలుస్తుంది.
-ఈ నది కృష్ణానది ఉపనదుల్లోకెల్లా పెద్దది.
-తుంగభద్ర తీరంలోని ముఖ్యమైన ఆలయాలు
-రాఘవేంద్రస్వామి ఆలయం – మంత్రాలయం (కర్నూలు)
-జోగుళాంబ దేవాలయం – అలంపూర్ గద్వాల
-తుంగభద్రనదిపై హోస్పేట వద్ద నీటిపారుదలకు, జల విద్యుత్ కోసం ఆనకట్టను నిర్మించారు. అదేవిధంగా కర్ణాటకలో తుంగభద్ర నదిపై ఆల్మట్టి డ్యామ్‌ను నిర్మించారు.
ఉపనదులు
-వరద, హగరి (హంద్రినీవా), వేదవతి, కుముద్వతి (కుందానది), పంపానది
-బుడమేరునదిని ఆంధ్ర దుఃఖదాయని అని పిలుస్తారు.
కృష్ణానదీ తీరంలోని ముఖ్య పట్టణాలు
1. నాగార్జునసాగర్, నల్లగొండ
2. విజయవాడ, కృష్ణ
3. శ్రీశైలం, కర్నూలు
పుణ్యక్షేత్రాలు
1. సాంగ్లి – దత్తదేవాలయం (మహారాష్ట్ర)
2. హరిపూర్ – సంగమేశ్వర శివాలయం (మహారాష్ట్ర)
3. విజయవాడ – దుర్గాదేవి ఆలయం (ఆంధ్రప్రదేశ్)
4. శ్రీశైలం – మల్లికార్జున జ్యోతిర్లింగాలయం (ఆంధ్రప్రదేశ్)
5. అమరావతి – అమరేశ్వర స్వామి దేవాలయం
(ఆంధ్రప్రదేశ్)
కృష్ణానదిపై గల బహుళార్థ సాధక ప్రాజెక్టులు
1. నాగార్జున సాగర్ ప్రాజెక్టు
-దీని నీటి నిల్వ సామర్థ్యం – 405 టీఎంసీలు
-విద్యుత్ ఉత్పాదన – 815.6 మెగావాట్లు
-కృష్ణానదిపై నల్లగొండ జిల్లా నందికొండ వద్ద నాగార్జునసాగర్ ఆనకట్టను నిర్మించారు. (124.7 మీటర్లు ఎత్తు)
-ఈ ప్రాజెక్టుకు 1955, డిసెంబర్ 10న అప్పటి ప్రధాని జవహర్లాల్ నెహ్రూ శంకుస్థాపన చేశారు.
-1967, ఆగస్టు 4న ప్రాజెక్టును జాతికి అంకితం చేశారు నాటి ప్రధాని ఇందిరాగాంధీ.
-1969లో ప్రాజెక్టు నిర్మాణం పనులు పూర్తి.
-ఇది ప్రపంచంలో అతి ఎత్తయిన, పెద్దరాతి ఆనకట్ట, ఇది స్వదేశీ పరిజ్ఞానంతో నిర్మించిన ఆనకట్ట. రివర్సబుల్ టర్బైన్లు అమర్చిన ఏకైక ఆనకట్ట
-ఈ ప్రాజెక్టులో భాగంగా నాగార్జునకొండ ఉంది. దీనిలో బౌద్ధమతస్తుల మ్యూజియం ఉంది. ఇది ప్రపంచంలో ఏకైక నది ఆధారిత మ్యూజియం.
-ఈ ప్రాజెక్టులో భాగంగా రెండు కాలవలు ఉన్నాయి.
లాల్ బహదూర్‌శాస్త్రి కాలు (ఎడమకాలు)
-ఇది నల్లగొండ, సూర్యాపేట, ఖమ్మం, కృష్ణా జిల్లాలకు సాగునీటిని అందిస్తుంది.
2. జవహర్లాల్ కాలువ (కుడి కాలువ)
-ఇది గుంటూరు, కృష్ణా జిల్లాలకు సాగునీటిని అందిస్తుంది.
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?
దేశాల అనుసంధానం.. వాణిజ్య అంతఃసంబంధం
కణ బాహ్య జీర్ణక్రియ
ఇంటి పని వద్దన్నవారు.. స్వీయ శిక్షణ ఉండాలన్నవారు
జీవావరణ వ్యవస్థకు కావలసిన మూలశక్తి దారులు?
మౌజియన్ అనే గ్రీకు పదానికి అర్థం?
సమాజ మేధో కేంద్రాలు.. నాగరికతకు చిహ్నాలు