సులభతర వాణిజ్య సూచీ.. అంటే ఏంటి..?
ఒక దేశ ఆర్థిక వ్యవస్థ ఆ దేశంలోని వాణిజ్యంపై ఆధారపడి ఉంటుంది. అనుకూలమైన ప్రదేశాల్లో వాణిజ్యం కొనసాగడమే ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ (సులభతర వాణిజ్యం) అంటారు. ప్రపంచంలోని ధనిక, పేద దేశాలన్నింట్లో జరిగే సులభతర వాణిజ్యంపై ప్రతి ఏటా ఓ సూచికను విడుదల చేస్తారు. సులభతర వాణిజ్య సూచికను ఎవరు ప్రకటిస్తారు?
– ఈ సూచికను ప్రపంచ బ్యాంకు 2001లో ఆర్థికవేత్త సిమియోన్ జంకోవ్ (Simeon Djankov), ప్రొఫెసర్లు ఒలీవర్ హార్ట్, ఆండ్య్రూ ష్లీఫర్ల సహాయంతో ప్రారంభించింది. 2003లో మొదటి సూచికను రూపొందించింది. ప్రస్తుతం ప్రపంచ బ్యాంకు 190 దేశాలకు ర్యాంకులను ఇస్తుంది.
– వ్యాపార ఆరంభం, నిర్మాణ అనుమతులు, రుణం పొంద డం, మైనారిటీ ఇన్వెస్టర్ల రక్షణ, పన్నుల చెల్లింపు, విద్యుత్ కనెక్షన్, ప్రాపర్టీ రిజిస్ట్రేషన్, సరిహద్దుల వాణిజ్యం, ఒప్పందాల అమలు, దివాలా పరిష్కారం వంటి పది విషయాల ఆధారంగా ప్రపంచ బ్యాంకు నిపుణులు ఈ సూచికను రూపొందిస్తారు.
వ్యాపారాన్ని ప్రారంభించడం
– కొత్తగా వ్యాపారాన్ని ప్రారంభించే వారికోసం ఆయా దేశాలు ఎలాంటి నియమాలు అనుసరిస్తున్నాయి? గత నియమాలను ఎంతవరకు సరళీకరించాయి? ప్రోత్సాహం ఎలా ఉంది? తదితర విషయాలను పరిశీలిస్తారు.
ఆస్తుల రిజిస్ట్రేషన్
– వ్యాపారాన్ని ప్రారంభించాలంటే దానికి సంబంధించిన ఆస్తుల రిజిస్ట్రేషన్ ఎలా ఉందో చూస్తారు. ఆయా దేశాల్లో భూ పరిపాలన వ్యవస్థ విధానం, ఆస్తుల రిజిస్ట్రేషన్లో అనుసరిస్తున్న విధానాలు, మౌలిక సదుపాయాలు అందించే తీరు గమనిస్తారు.
రుణం పొందడం
– వ్యాపారం ప్రారంభించాలంటే రుణం అనేది చాలా ముఖ్యమైంది. ఈ రుణ సదుపాయాలను కల్పించడంలో వివిధ దేశాలు అనుసరిస్తున్న విధానాలను పరిశీలిస్తారు. సురక్షిత లావాదేవీలకు సం బంధించి రుణదాతలు, రుణగ్రహీతల చట్టపరమైన హక్కులు ఎలా ఉన్నాయో పరిశీలిస్తారు.
నిర్మాణ అనుమతులు
– వ్యాపారాలకు సంబంధించి వివిధ నిర్మాణాలకు అనుమతులిచ్చే తీరు, నాణ్యత, సమ యం, నిధుల కేటాయింపు తదితర విషయాలను పరిశీలిస్తారు.
విద్యుత్ కనెక్షన్
– వ్యాపారాలకు సంబంధించిన కంపెనీలకు విద్యుత్ కనెక్షన్లను ఇచ్చేందుకు పట్టే సమ యం, నాణ్యత, సరఫరా ఎలా ఉన్నాయో చూస్తారు.
సరిహద్దుల వాణిజ్యం
– వివిధ దేశాల్లో అంతర్గత, సరిహద్దుల వాణిజ్య వివాదాలను ఎలా పరిష్కరిస్తున్నారు. ఇందుకు ఎంత సమయాన్ని, ఖర్చును భరిస్తున్నారు, చట్టాల అమలు తీరు ఎలా ఉందని పరిశీలిస్తారు.
మైనారిటీ ఇన్వెస్టర్ల రక్షణ
– వ్యాపార లావాదేవీల్లో వైరుధ్యం ఏర్పడినప్పుడు సంస్థలోని మైనారిటీ ఇన్వెస్టర్ల (వాటాదారులు) హక్కుల పరిరక్షణలో ప్రభుత్వాలు వ్యవహరించే తీరు ను గమనిస్తారు.
ఒప్పందాల అమలు
ఎగుమతులు, దిగుమతులు, వివిధ దేశాలకు సరకు సరఫరా తదితర ఒప్పందాల అమలుతీరును పరిశిలీస్తారు.
పన్నుల చెల్లింపు
– సూక్ష్మ, మధ్యస్థాయి కంపెనీలు ఏడాదికి ఎంత పన్ను కడుతున్నాయి, పన్నుల రేట్లు, విధానం ఎలా ఉన్నాయనే వాటి ని గమనిస్తారు.
దివాలా పరిష్కారం
– కంపెనీలు దివాలా తీసినప్పుడు ప్రభు త్వం పరిష్కరించేతీరు, రుణ వసూళ్లు, ఆర్థిక న్యాయ ప్రక్రియ విధానాలను పరిశీలిస్తారు.
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?
దేశాల అనుసంధానం.. వాణిజ్య అంతఃసంబంధం
కణ బాహ్య జీర్ణక్రియ
ఇంటి పని వద్దన్నవారు.. స్వీయ శిక్షణ ఉండాలన్నవారు
జీవావరణ వ్యవస్థకు కావలసిన మూలశక్తి దారులు?
మౌజియన్ అనే గ్రీకు పదానికి అర్థం?
సమాజ మేధో కేంద్రాలు.. నాగరికతకు చిహ్నాలు